Kamakshi Deepam: కామాక్షీ దీపం దాని వైశిష్ట్యం

 

  • కామాక్షీ దీపం అంటే దీపపు ప్రమిదకు గజలక్ష్మీ చిత్రం ఉంటుంది. 
  • ఈ దీపాన్ని గజలక్ష్మీ దీపం అనికూడా అంటారు. దీపాన్ని వెలిగించినపుడు ఆ దీపపు వెలుగులో కామాక్షీ దేవి నిలిచి ఉంటుంది. కాబట్టే దీన్ని కామాక్షీ దీపం అంటారు.
  • ఇక కామాక్షి దేవి ప్రత్యేకత గురించి చెప్పుకుంటే సర్వదేవతలకూ శక్తినిచ్చే శక్తి కామాక్షిదేవికి ఉంటుందని ప్రతీతి. 
  • కామాక్షీ దేవి కోవెల లేదా గుడి తెల్లవారుఝామున అన్ని దేవాలయాలకన్నా ముందే తెరుస్తారు. ఆ తరువాత రాత్రి పూట దేవాలయాలన్నీ మూసిన తరువాత మూసివేస్తారు. 
  • ఇకపోతే ఈ కామాక్షి దీపం స్వయానా అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తారు. 
  • అలాంటి కామాక్షీ దీపం వెలిగే ఇల్లు అఖండ ఐశ్వర్యాలతో తులతూగుతుంది.
  • కామాక్షి దీపం వెలకట్టలేనిది, పవిత్రమైనది.
  • అఖండ దీపాన్ని పెట్టదలచుకున్నప్పుడూ గృహప్రవేశం చేస్తున్నప్పుడూ తప్పనిసరిగా కామాక్షి దీపాన్ని ఉపయోగిస్తారు. 
  • కామాక్షీ దీపము కేవలం ప్రమిదను మాత్రమేకాకుండా అమ్మవారి రూపునూ కలిగి ఉంటుంది. అంటే అమ్మవారి ప్రతిమ  ఈ దీపం మీద ఉంటుంది. 
  • ప్రతిష్టలలో, గృహప్రవేశాలలో కామాక్షీ దీపాన్ని దీపారాధనకు ఉపయోగించడం ఎంతో శ్రేష్టమని శాస్త్రం. 
  • కామాక్షీ దీపం వెలిగించినప్పుడు తప్పనిసరిగా పాటించవలసిన నియమం ఒకటుంది. దీపారాధన చేసినప్పుడు దీపానికి కుంకుమ పెట్టడం ఆచారం.
  •  కామాక్షీ దీపాన్ని ఉపయోగించినప్పుడు ప్రమిదకు కుంకుమ పెట్టిన చేతితోనే ఆ ప్రమిదకు ఉన్న అమ్మవారి రూపానికీ కుంకుమ పెట్టి, పువ్వుతో అలంకరించి, అక్షింతలు వేసి నమస్కరించుకోవాలి.అలా చేస్తే నేరుగా అమ్మవారికి కుంకుమ పెట్టి, అమ్మ ఆశీర్వాదం తీసుకున్నంత పుణ్యఫలం లభిస్తుంది.

Comments

Popular This Week

Sri Raghavendra Aradhana: శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన 2024

Shani Shinganapur Temple: శని శింగణాపూర్ ఆలయం

Shunya Masam: శూన్యమాసం అంటే ఏంటి

Lord Shiva Pradaskhina: శివాలయంలో ప్రదక్షిణ చేయడానికి కొన్ని నియమాలు

Navagraha: నవగ్రహాలు - మానవ శరీరం

Pancha Kedar Temples: శివుడి శరీరభాగాలు పడిన ఐదు క్షేత్రాలివి

Subramanya Swamy Temple: మట్టిని ప్రసాదంగా ఇచ్చే సుబ్రమణ్య స్వామి ఆలయం

Nagasadhu: నాగ సాధువుల జీవన విధానం

Varjyam: వర్జ్యం అంటే ఏమిటి ?

Human Duties: మానవ ధర్మములు

Random posts