Subramanya Swamy Temple: మట్టిని ప్రసాదంగా ఇచ్చే సుబ్రమణ్య స్వామి ఆలయం

మృత్తికా ప్రసాదం అంటే ప్రసాదరూపంగా మట్టిని ఇచ్చే దేవాలయం మన దేశంలో ఒక్కటే ఉంది. అన్ని దేవాలయాల్లో ప్రసాదంగా భక్తులకు విభూది, కుంకుమ, చందనం తదితరాలను ఇస్తే, కర్నాటకలోని కుక్కే శ్రీ సుబ్రహ్మణ్యస్వామి దేవాలయానికి వెళ్ళితే అక్కడి దేవాలయంలో భక్తులకు వల్మీక మృత్తిక (పుట్టమన్ను) ను ప్రసాదరూపంలో అందిస్తారు. ఉడిపి సమీపంలో ఉన్న నాగబనగహళ్లి పట్టణంలో ఉండే ఈ దేవాలయంలో ఇచ్చే మృత్తికా ప్రసాదం అత్యంత పవిత్రమైంది. మహిమాన్వితమైంది. 

  • మృత్తికా ప్రసాదాన్ని ఎవరు ధరిస్తారో వారికి నాగుల భయం ఉండదు. నాగ దేవతల అనుగ్రహం ఉంటుంది.
  • ఎవరైతే పాములను చూసి భయపడతారో, ఎవరికైతే కలలో పాములు ఎక్కువగా కనబడుతుంటాయో అటువంటి వారు మృత్తికా ప్రసాదాన్ని ధరిస్తే సర్పాల భీతి తొలగిపోతుంది.
  • ఆడపిల్లలు ఒక చిటిక మృత్తికను మరో చిటికెడు పసుపును స్నానం చేసే నీటిలో వేసి స్నానం చేసి, తరువాత శ్రీ సుబ్రహ్మణ్యుడికి నేతి దీపాన్ని వెలిగిస్తే వివాహం త్వరగా అవుతుంది. నోటిపళ్ళను కొరుకుతూండటం, కిందపడి కొట్టుకోవడం, ఒకేవైపు తదేకంగా చూస్తూండటం, అదే పనిగా ఏడుస్తూండటం చేసే
  • చిన్నపిల్లల నుదుటన మృత్తికను బొట్టుగా పెడితే వారు ఆరోగ్యంగా ఎదుగుతారు.
  • అనారోగ్యంతో బాధపడే పిల్లలను స్నానం చేయించే సమయంలో వేడినీటిలో చిటికెడు మృత్తికను కలపాలి. స్నానానంతరం దేవునికి నేతి దీపాన్ని వెలిగించి, ప్రార్థిస్తే వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
  • పరీక్షల కాలంలో చదివిందంతా మరిచిపోయే విద్యార్థుల చేత ఒక గ్లాసు నీటిలో చిటికెడు మృత్తికను వేసి ఉంచి, రాత్రంతా నానబెట్టి, ఉదయంపూట అ గ్లాసు నీటిని తాగుతూ వుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. సంతానభాగ్యం లేని దంపతులు మంగళవారం నాడు శ్రీ సుబ్రమణ్యస్వామి పూజించిన అనంతరం దేవునికి ప్రసాదంగా పెట్టిన
  • పాలలో ఒక చిటికెడు మృత్తికను వేసి, తాగితే స్వామి అనుగ్రహంతో ఖచ్చితంగా సంతానభాగ్యం కలుగుతుంది. ఎవరింట్లో అయితే తులసిమొక్క తమలపాకు ఆకుల తీగలు వడలి పోతుంటాయో అటువంటివారు నీటిలో మృత్తికను కలిపి, ఆ చెట్ల మొదళ్లలో పోస్తే మొక్కలు బాగా పెరుగుతాయి.
  • చర్మం పొడి బారేవారు, నిస్సత్తువగా ఉండేవారు ఒక చిటికెడు పుట్టమన్ను ప్రసాదాన్ని నీటిలో వేసి, ఆ నీటితో సాయంకాలం స్నానం చేస్తే ఎటువంటి రోగాలు రాకుండా ఆరోగ్యవంతులుగా, భాగ్యవంతులుగా విలసిల్లుతారు.

Comments

Popular This Week

Sri Raghavendra Aradhana: శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన 2024

Shani Shinganapur Temple: శని శింగణాపూర్ ఆలయం

Shunya Masam: శూన్యమాసం అంటే ఏంటి

Lord Shiva Pradaskhina: శివాలయంలో ప్రదక్షిణ చేయడానికి కొన్ని నియమాలు

Navagraha: నవగ్రహాలు - మానవ శరీరం

Pancha Kedar Temples: శివుడి శరీరభాగాలు పడిన ఐదు క్షేత్రాలివి

Nagasadhu: నాగ సాధువుల జీవన విధానం

Varjyam: వర్జ్యం అంటే ఏమిటి ?

Human Duties: మానవ ధర్మములు

Random posts