Lord Shiva Pradaskhina: శివాలయంలో ప్రదక్షిణ చేయడానికి కొన్ని నియమాలు

శివాలయంలో చేసే ప్రదక్షిణకు కూడా కొన్ని నియమాలున్నాయి. శివాలయంలో చేసే ప్రదక్షిణ చేసే విధానం శివ పురాణంలో పేర్కొన్నారు.మన సంప్రదాయంలో ఆలయంలో దర్శనం కోసం వెళ్లిన అంతరం ఖచ్చితంగా ప్రదక్షిణ చేస్తారు. అయితే శివాలయంలో చేసే ప్రదక్షిణ అన్ని దేవాలయాల్లో చేసే ప్రదక్షిణకి భిన్నంగా ఉంటుంది. ఓ ప్రత్యేకత ఉంటుంది. 

శివాలయంలో ఏ విధంగా ప్రదక్షణ చేయాలో  లింగపురాణంలో స్పష్టంగా పేర్కొన్నారు.శివాలయంలో చేసే ప్రదక్షిణ చండి ప్రదక్షిణ లేదా సోమసూత్ర ప్రదక్షిణ అని అంటారు. చండి ప్రదక్షిణ అంటే ఏమిటి ఈ ప్రదక్షిణ చేయడం వలన ఎలాంటి ఫలితాలు పొందవచ్చు పురాణాల్లో వివరంగా పేర్కొన్నారు

శివాలయంలో ధ్వజస్తంభం నుంచి ప్రదక్షిణ ప్రారంభించి చండీశ్వరుని వరకు వెళ్లి.. అక్కడ చండీశ్వరుని దర్శించుకొని తిరిగి మళ్ళీ    ధ్వజస్తంభం దగ్గరకు చేరుకోవాలి. అనంతరం  ధ్వజస్తంభం ఒక్క క్షణం ఆగి మరలా ప్రదక్షిణ మొదలుపెట్టి సోమసూత్రం అభిషేక జలం వెళ్లే దారి వరకూ అక్కడ నుంచి తిరిగి మళ్ళీ నందీశ్వరుని చేరుకుంటే ఒక శివ ప్రదక్షిణ పూర్తి చేసినట్లవుంటుంది.  ఈ విధం చేసే ప్రదక్షిణ చండి ప్రదక్షిణ లేదా సోమసూత్ర ప్రదక్షిణ అని అంటారు.

ఇలా ప్రదక్షిణ చేసే సమయంలో సోమసూత్రాన్ని దాటి వెళ్ళకూడదు. సోమసూత్రం నుంచి ఆలయంలో చేసిన అభిషేకం జలం బయటకు వెళ్తుంది. అంతేకాదు అక్కడ శివ ప్రమధగణాలు ఉంటారని విశ్వాసం. ఈ జలం దాటి చేసే ప్రదక్షిణ ఫలితం ఇవ్వదని పురాణాలు పేర్కొన్నాయి. చండి ప్రదక్షిణం సాధారణ ప్రదక్షణాలు కంటే.. పదివేల ప్రదక్షణాలుతో సమానమని లింగా పురాణంలో పేర్కొన్నారు. మూడు ప్రదక్షణాలు చేయాలి.

తెలిసి తెలియక శివాలయంలో శివయ్యకు, నందికి మధ్య నడవకూడదు. నందీశ్వరుడు శివయ్యను చూస్తూనే ఉంటాడు. కనుక ఆయన  దృష్టికి ఎవరూ అడ్డు వెళ్ళరాదు. నందీశ్వరుడి వెనుక నుంచి వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాదు.. విగ్రహానికి ఎదురుగా నిలబడి దర్శనం చేసుకోకూడదు. విగ్రహం నుండి వెలువడే శక్తి తరంగాలు నేరుగా మన మీద పడతాయి వాటిని వాటి శక్తి మనం భరించలేం కనుక దైవాన్ని ప్రక్కన నిలబడి దర్శనం చేసుకోవాలి.

Comments

Popular This Week

Sri Raghavendra Aradhana: శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన 2024

Bedi Anjaneya Temple: శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం - తిరుమల

Shani Shinganapur Temple: శని శింగణాపూర్ ఆలయం

Narayanavanam Venkateswara Swamy Temple: శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారు ఆలయం - నారాయణవనం

Singotam Narasimha Swamy Temple: శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం - సింగోటం

Bhadrachalam Temple: శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం - భద్రాచలం

Mehandipur Balaji Temple: మెహందీపూర్ బాలాజీ ఆలయం - రాజస్థాన్

Palani Subramanya Swamy Temple: శ్రీ సుబ్రమణ్య స్వామి వారి ఆలయం - పళని

Pancha Kedar Temples: శివుడి శరీరభాగాలు పడిన ఐదు క్షేత్రాలివి

Random posts