Pancha Kedar Temples: శివుడి శరీరభాగాలు పడిన ఐదు క్షేత్రాలివి

శివుడి శరీర భాగాలు పడిన ప్రదేశాలను పంచకేదార క్షేత్రాలు అని పిలుస్తారు. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు బ్రహ్మహత్యా పాతకం, దాయాదులు, బంధువులను చంపిన పాపాన్ని పోగొట్టుకోవడానకి శివుడి దర్శనానికి వెళ్లారు. అయితే భోళాశంకరుడు మాత్రం పాండవులకు తన దర్శనభాగ్యం కల్పించడు. కాశీని వదిలి ఉత్తరదిశగా హిమాలయాలకు వెళ్లిపోతాడు. పట్టువదలని పాండవులు..శివుడి దర్శనార్థం వెళతారు. అలా తిరుగుతూ తిరుగుతూ నందిరూపంలో ఉన్నాడని గుర్తిస్తారు. అప్పుడు ఆ నందిని పట్టుకునేందుక భీముడు ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో పరమేశ్వరుడి శరీర భాగాలు పడిన ప్రదేశాలు పుణ్యక్షేత్రాలుగా వెలిశాయి. వీటినే శివ పురాణంలో పంచ కేదారాలుగా చెప్పారు.

1.కేదార్నాథ్

2.తుంగనాథ్

3.రుద్రనాథ్

4.మహేశ్వర్

5.కల్పనాథ్

కేదార్నాథ్

పంచకేదారాల్లో మొదటిది, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి కేథార్నాథ్. పాండవులకు అందకుండా పోయి నందిగా మారిన శివుడి మూపురభాగం పడిన చోటు ఇది. ఇక్కడి లింగం 8 గజాల పొడవు, 4 గజాల ఎత్తు, 4 గజాల వెడల్పు ఉంటుంది. ఇక్కడి శివలింగం త్రిభుజాకారంలో ఉంటుంది. పాండవులు స్వర్గలోకానికి మార్గం ఇక్కడే ప్రారంభించారని పురాణకథనం. 

తుంగనాథ్

పంచ కేదారాల్లో రెండో పుణ్యక్షేత్రం తుంగనాథ్. శివుడి రెండు చేతులు పడిన ప్రాంతాన్ని తుంగానాథ్ అని అంటారు. అందుకే శివుడి చేతుల అడుగు ఎత్తులో లింగరూపంలో వెలసిన క్షేత్రం ఇది. ఆలయానికి కుడివైపు పార్వతీ దేవి ఆలయం ఉంటుంది. ఈ పంచకేదార నమూనాలను అర్జునుడు నిర్మించారని స్థల పురాణం

రుద్రనాథ్

పంచ కేదారాల్లో మూడో క్షేత్రం రుద్రనాథ్. శివుని ముఖ భాగం వెలసిన పుణ్యక్షేత్రం ఇది. ఇక్కడ శివలింగం నంది ముఖ రూపంలో ఉంటుంది. నిత్యం తెల్లవారు జాము స్వామికి వెండి తొడుగును తొలగిస్తారు. ఈ ఆలయానికి వెనుక వైతరిణీ నది ప్రవహిస్తుంది. ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే పూర్వీకులకు మోక్షం కలుగుతందని విశ్వాసం.

మహేశ్వర్

పంచ కేదారాల్లో నాల్గవది మహేశ్వర్ పుణ్యక్షేత్రం. విశ్వనాథుడి నాభి భాగం పడిన ప్రాంతమే  మహేశ్వర్. ఇది గుప్తకాశీకి 24 మైళ్ల దూరంలో ఉంది.  భీముడు నిర్మించిన ఈ ఆలయం దర్శించుకోవడం వల్ల కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.

కల్పనాథ్

పంచ కేదారాల్లో చివరిది కల్పనాథ్ పుణ్యక్షేత్రం. ఇక్కడ శివుడి ఝటాజూటం లింగ రూపంలో వెలిశాడిని స్థలపురాణం. దట్టమైన అడవుల మధ్య చిన్న గుహల్లో వెలిసిన ఈ స్వామిని ఝుటేశ్వర్ మహదేవ్ అని పిలుస్తారు.

Comments

Popular This Week

Sri Raghavendra Aradhana: శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన 2024

Bedi Anjaneya Temple: శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం - తిరుమల

Shani Shinganapur Temple: శని శింగణాపూర్ ఆలయం

Narayanavanam Venkateswara Swamy Temple: శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారు ఆలయం - నారాయణవనం

Singotam Narasimha Swamy Temple: శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం - సింగోటం

Bhadrachalam Temple: శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం - భద్రాచలం

Lord Shiva Pradaskhina: శివాలయంలో ప్రదక్షిణ చేయడానికి కొన్ని నియమాలు

Mehandipur Balaji Temple: మెహందీపూర్ బాలాజీ ఆలయం - రాజస్థాన్

Palani Subramanya Swamy Temple: శ్రీ సుబ్రమణ్య స్వామి వారి ఆలయం - పళని

Random posts