Shani Shinganapur Temple: శని శింగణాపూర్ ఆలయం


మహారాష్ట్రలోని ఆహ్మద్ నగర్ జిల్లాలో ఉంది శింగనాపూర్ గ్రామం.

ఇక్కడ శనిశ్చరుని ఆలయం చాలా ప్రాచూర్యం పొందింది. అది కాకుండా ఈ ఊరిలోని ఏ ఇంటికీ కూడా ప్రధాన ద్వారానికి తలుపులు ఉండవు. ఇళ్లకే కాదు షాపులకు కూడా తలుపులు, గొళ్లాలు ఉండవు. అలాగే ఇక్కడి ఆలయాలకు కూడా తలుపులు ఉండవు. అక్కడి శనిశ్వరుడి ఆలయానికైతే ఏకంగా పైకప్పే ఉండదు.

ఇక్కడ శనీశ్వరుడు స్వయంభూగా నల్లనిరాయి రూపంలో వెలిశాడని నమ్మకం

గొర్రెల కాపరులు ఈ శనీశ్వరుని కనుగొన్న రోజు రాత్రి ఒక గొర్రెల కాపరి కలలో శనీశ్వరుడు కనిపించి తనను ఎలా సంతుష్టుడిని చెయ్యాలో, ఎలా ఆరాధించాలో విధివిధానాలను వివరించడాడని చెబుతారు. కొన్ని ప్రత్యేక నియమాలను, విధులను శనీశ్వరుడు స్వయంగా ఆ గొర్రెల కాపరికి వివరించాడట. అప్పుడు ఆ కాపరి ’మరి ఆలయ నిర్మాణం చేపట్టాలా‘ అని శనీశ్వరుని అడిగినపుడు ఆలయానికి పైకప్పు అవసరం లేదని ఆయన చెప్పాడట. ఈ అనంత నీలాకాశమే తనకు పైకప్పు అని చెప్పినట్టు స్థల పురాణం. అందుకే ఇక్కడి మూలవిరాట్టు తలమీద పై కప్పు లేకుండా ఆవరణలో ఉంటుంది.

ఈ ఆలయానికి కిలోమీటరు పరిధిలో ఉన్న ఏ వ్యాపారస్థలానికైనా, ఇంటికైనా సరే ప్రధాన ద్వారానికి తలుపులు గడియలు ఉండవు. ఎందుకంటే శనీశ్వరుని మీద భయభక్తులతో ఇక్కడి నుంచి ఏ వస్తువు తీసుకునేందుకు కూడా ఎవరూ సాహసించరు. 

Comments

Popular This Week

Sri Raghavendra Aradhana: శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన 2024

Bedi Anjaneya Temple: శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం - తిరుమల

Narayanavanam Venkateswara Swamy Temple: శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారు ఆలయం - నారాయణవనం

Singotam Narasimha Swamy Temple: శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం - సింగోటం

Bhadrachalam Temple: శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం - భద్రాచలం

Lord Shiva Pradaskhina: శివాలయంలో ప్రదక్షిణ చేయడానికి కొన్ని నియమాలు

Mehandipur Balaji Temple: మెహందీపూర్ బాలాజీ ఆలయం - రాజస్థాన్

Palani Subramanya Swamy Temple: శ్రీ సుబ్రమణ్య స్వామి వారి ఆలయం - పళని

Pancha Kedar Temples: శివుడి శరీరభాగాలు పడిన ఐదు క్షేత్రాలివి

Random posts