Sharavana Putrada Ekadasi: పుత్రదా ఏకాదశి (పవిత్ర ఏకాదశి)

 

  • శ్రావణ శుద్ధ ఏకాదశికి పుత్రదా ఏకాదశి అని పేరు.
  • ఈ ఏకాదశి మహిమను శ్రీకృష్ణుడు ధర్మరాజుకు భావిషోత్తర పురాణంలో వివరించాడు 
  • దీనికి లలిత ఏకాదశి అని కూడా పేరు
  • ఈ రోజు ఉపవాసం వుండి, విష్ణువును పూజించి, పగలు హరినామ సంకీర్తనతోను, రాత్రి జాగరణతో గడిపి, మరునాడు ద్వాదశి గడియలు ఉండగానే మళ్లీ విష్ణు పూజ చేయాలి.
  • పూర్వం మహాజిత్తు అనే రాజు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి, సంతానాన్ని పొందాడు అని పురాణ కధనం.
  • ఈ ఏకాదశి మనిషి యొక్క సమస్త పాపాలను నశింపచేస్తుంది.
  • ఈ ఏకాదశిని పాటించేవాడు సమస్త పాపాల నుండి బయటపడి ఇహపరాలలో సుఖాన్ని పొందుతాడు.
  • ఈ ఏకాదశి మహిమను వినేవాడు ఈ జన్మలో పుత్రప్రాప్తి ఆనందాన్ని అనుభవించి తదనంతరం భగవద్దామనికి చేరుకుంటాడు.
పుత్రదా ఏకాదశికి సంబంధించిన పురాణ కథనం ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం మహాజిత్ అనే రాజు మాహిష్మతి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు, అతనికి పిల్లలు లేరు. తమ సమస్య పరిష్కారం కోసం పండితలను, ఋషులను సంప్రదించాడు. కానీ ఎవరూ పరిష్కారం చెప్పలేకపోయారు. రాజు సర్వజ్ఞుడైన సాధువు లోమేశుని సంప్రదించాడు, లోమేశుడు అందుకు కారణం రాజు పూర్వ జన్మలో చేసిన పాపాలే అందుకు కారణమని చెప్పాడు. మహజిత్ రాజు తన పూర్వ జన్మలో వ్యాపారవేత్త అని లోమేశుడు చెప్పాడు. వ్యాపార నిమిత్తం ప్రయాణిస్తున్నప్పుడు, వ్యాపారి ఒకసారి చాలా దాహం వేసి చెరువు వద్దకు చేరుకున్నాడు. అక్కడ ఒక ఆవు, అతని దూడ నీళ్లు తాగుతున్నాయి. వ్యాపారి వాటిని వెళ్లగొట్టి తాను నీళ్లు తాగాడు, ఆ పాపంవల్ల సంతానం లేకుండా పోయింది, అయితే అతను చేసిన మంచి పనులవల్ల రాజుగా జన్మించాడు. శ్రావణ ఏకాదశి వ్రతం ఆచరించి పాపాలను పోగొట్టుకోవాలని రాజు, రాణిలకు ఋషి లోమేశుడు సలహా ఇచ్చాడు. ఆ సలహా ప్రకారం, రాజ దంపతులు, వారి పౌరులు ఉపవాసం ఉండి, విష్ణువును ప్రార్థించారు. రాత్రంతా జాగారంవుండి విష్ణు నామాలను పఠించారు. తరువాత బంగారం, నగలు, బట్టలు, ధనం దానం చేశాడు. కొంతకాలం తర్వాత అతనికి అందమైన కుమారుడు జన్మించాడు.

2024: ఆగష్టు  16.

No comments