Adi Krittika: ఆడి కృత్తిక

 

  • ఆషాడ మాసంలో కృత్తికా నక్షత్రం వచ్చే రోజుని ఆడి కృత్తికగా జరుపుకుంటారు.
  • ఇది సుబ్రమణస్వామికి  అత్యంత ప్రీతికరమైన రోజు.
  • ఇది తమిళనాడులో ఎంతో విశేషంగా జరుపుకునే పండుగ. 
  • తమిళులకు ఏ మాసమైన పౌర్ణమి రోజుతో మొదలవుతుంది, కనుక ఆషాడ పౌర్ణమి నుండీ వారికి ఆషాడ మాసం మొదలు అవుతుంది.
  • దక్షిణాయనానికి ముందు వచ్చే కృత్తిక గనుక దీనిని ఆది కృత్తిక అనీ, ఆషాడ మాసంలో వచ్చేది కనుక ఆడి కృత్తిక అనీ కూడా అంటుంటారు.
  • ఈ రోజు సుబ్రమణ్యస్వామి ఆరాధనకు అత్యంత శ్రేయస్కరమైనది. 
ఏమి చేయాలి ?
  • ఈ రోజున సుర్యోదయానికంటే ముందే నిద్ర లేచి శుచియైన తరువాత చలిమిడితో ఆవు నేతితో దీపారాధన చేయాలి.
  • స్వామికి ప్రసాదం నివేదించాలి.
  • సుబ్రహ్మణ్యుని స్తోత్రాలు, సుబ్రహ్మణ్య జన్మ వృతాంతం చదువుకుని, సాయంత్రం వరకూ ఉపవసించి,సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని తరువాత ప్రసాదం స్వీకరించాలి.
  • ఈ రోజు సుబ్రమణ్య స్వామి ఆలయాన్ని దర్శించాలి.
  • ఈ రోజు మనకు వున్నంతలో దానం చేసిన మంచిది.
ఈ రోజు సుబ్రహ్మణ్యుని ఆలయాలలో విశేష అభిషేకాలు, అర్చనలు జరుగుతాయి. సంతానం కోరుకునే వారు ఈ రోజు సుబ్రహ్మణ్యుని మొక్కి కావిళ్లు ఎత్తుతారు. కావిళ్లు ఎత్తలేని వారు ఈ కావిళ్ల కిందనుంచి వెళ్లినా సంతానం ప్రాప్తిస్తుందని శాస్త్ర వచనం.

అరుణాచలంలో ఉన్న శ్రీరమణ మహర్షి సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్య స్వామి స్వరూపమని భక్తుల విశ్వాసం. ఆడికృత్తిక రోజు శ్రీ రమణుల ఆశ్రమంలో విశేషమైన పూజలు, అన్నదానాలు జరుగుతాయి. ఆడి కృత్తిక రోజు అరుణాచలానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గిరి ప్రదక్షిణలు కూడా చేస్తారు.

ఆడికృత్తిక రోజు బాలబ్రహ్మచారికి షడ్రసోపేతమైన భోజనం పెట్టి, ఎర్రటి పంచ, కండువా సమర్పించి శక్తిమేరకు దక్షిణ, తాంబూలం, అరటి పండ్లు, గొడుగు, పాదరక్షలు, రాగి పంచపాత్ర ఉద్దరిణ, అర్ఘ్య పాత్ర సమర్పించి, ఆ బాలబ్రహ్మచారిని సుబ్రహ్మణ్యునిగా భావించి ఆశీర్వచనం తీసుకుంటే విశేష ఫలితం కలుగుతుందని భక్తుల నమ్మకం.

2024: ఆగష్టు 29/30

No comments