- సూర్యోదయానికి పూర్వమే లేచి కాలకృత్యాలు తీర్చుకుని, స్నానాదికాలు పూర్తి చేయాలి.
- పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి... జగదంబను దుర్గ తదితర రూపాల్లో నెలకొల్పుకుని, ఆరాధించాలి.
- అమ్మవారి చిత్రపటం లేదా విగ్రహం లేదా కలశానికి పసుపుకుంకుమ, పుష్పమాలలతో పూజించాలి.
- దేవీ అష్టోత్తర శతనామ స్తోత్రాలు, సహస్రనామ స్తోత్రాలు పారాయణ చేయడం మంచిది. శ్రీచక్రార్చన విశేష ఫలితాలనిస్తుంది, చండీహోమం, శాకదానం వంటివి చేయడం కూడా శుభప్రదమే.
- దసరా నాడు జమ్మిపూజ చేయాలి. ఆనాటి సూర్యాస్తమయంలో ఉండే కాలానికి విజయ ముహూర్త కాలం అని పేరు. ఈ ముహూర్తంలో ఎవరైనా పరిశుద్ధమైన మనసుతో ఏ కార్యాన్ని తలపెట్టినా అది పరిపూర్ణంగా సిద్ధిస్తుంది.
- తెలంగాణ ప్రాంతంలో పాలపిట్టను చూస్తారు.
Comments
Post a Comment