Mahalaya Amavasya: మహాలయ అమావాస్య

భాద్రపద బహుళ అమావాస్యని మహాలయ అమావాస్య అంటారు. చనిపోయినవారందరి స్మృతికోసం చేసే ఈ అమావాస్యను సర్వ పితృ అమావాస్య అని కూడా అంటారు. చనిపోయిన తమ పెద్దల జ్ఞాపకార్ధం ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ వర్గం వారైనా పాటించే కార్యక్రమం ఇది. 

హిందువులు తర్పణలు వదులుతారు. కొందరు పెద్దలకి బియ్యమిస్తారు. ఏ జాతి వారైనా, ఏ కులం వారైనా, వాళ్ళెక్కడవున్నా, వారి వారి సంప్రదాయాన్నిబట్టి, ఇంటి ఆచారాల్నిబట్టి, వాళ్ల వాళ్ల అనుకూలతనుబట్టి పితృ దేవతలను సంస్మరించుకునే రోజు ఇది. లేకపోతే రౌరవాది నరకాలకి పోతారంటారు. ఈ కార్యక్రమంలో కేవలం చనిపోయిన తండ్రి, తల్లులనే కాదు వారి ముందు ఇంకో రెండు తరాల వారిని కూడా సంస్మరిస్తారు 

ఈ  రోజున శివున్ని భక్తిశ్రద్దలతో కొలుస్తారు, ఇలా చేస్తే కీర్తి ప్రతిష్టలు పొందుతారు అని నమ్మకం ఉంది. అంతే కాదు భక్తి శ్రద్దలతో పూజిస్తే జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. శనిదేవుడిని కూడా ఈ అమావాస్య వేళ పూజిస్తే జీవితంలో ఎదుర్కొంటోన్న కష్టాలన్నీ తీరిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

ఈ  రోజు పెద్దలకు తర్పణలు వదలాలి. వారిని తలచుకుని బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. అలాగే పేదలకు అన్నదానం చేయాలి. లేకపోతే బ్రాహ్మణులకు స్వయంపాకం ఇవ్వాలి.

ఈ రోజు  విష్ణుమూర్తిని కూడా ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ అమావాస్య రోజు విష్ణువుని పూజిస్తే మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం, ఆర్థికంగా మెరుగైన ఫలితాలు పొందుతారు.

చనిపోయిన కుటుంబ సభ్యులకు ఈ అమావాస్య రోజు పూజలు చేయడం వల్ల వాళ్లు ప్రశాంతత పొందుతారు. చనిపోయిన వాళ్ల కోసం ఉపవాసం ఆచరిస్తే వాళ్ల ఆత్మ శాంతిస్తుంది. అలాగే, శాస్త్రాల ప్రకారం పితృ దేవతలకు అమావాస్య ప్రత్యేకం. అందుకే అమావాస్య రోజులలో చనిపోయిన వాళ్ల పేరు మీద పూజలు నిర్వహించాలి. ఇక సంవత్సరానికి ఒకసారి వచ్చే మహాలయ అమావాస్య నాడు తప్పనిసరిగా పితృ దేవతల్ని ఆరాధించాలి. శ్రద్ధగా శ్రాద్ధ క్రియ చేయటంతో పాటూ నువ్వుల నీటితో తర్పణాలు విడవాలి. అప్పుడే వాళ్లు సంతోషించి మనకు రక్షణ, శుభాలు కలిగిస్తారు.

ఈ అమావాస్య రోజు హోమం చేయడం కూడా చాలా మంచి పలితాలను ఇస్తుంది. జీవితంలో అన్ని సమస్యలు దూరమవుతాయి. 

2024 అక్టోబరు 02 

Comments

Popular posts from this blog

Puri Ratha Yatra: పూరీ జగన్నాధుని రథయాత్ర

Skanda Panchami: స్కంద పంచమి

Adi Krittika: ఆడి కృత్తిక

Ashada Navratri 2025: ఆషాడ నవరాత్రి, వారాహి నవరాత్రి

Theerthams in Tirumala: తిరుమలగిరులలో 66 కోట్ల తీర్థాలు..

Kamakshi Deepam: కామాక్షీ దీపం దాని వైశిష్ట్యం

Srisailam Temple: శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయం - శ్రీశైలం

Donation and Benefits: దానాలు వాటి ఫలితాలు (కుర్మా పురాణం)

Chaitra Masam 2025: చైత్రమాసంలో పండుగలు, విశేషమైన తిధులు

Kokilavan Shani Temple: కోకిలా వన్ శని దేవాలయం