Kokilavan Shani Temple: కోకిలా వన్ శని దేవాలయం

ఉత్తరప్రదేశ్ లోని మథుర సమీపంలో కోసికలాన్ లో ప్రసిద్ధ శని దేవ్ దేవాలయం ఉంది. దీనిని కోకిలవన్ ధామ్ అని కూడా పిలుస్తారు.

శని దోషం నుంచి బయటపడేందుకు అత్యంత ప్రభావవంతమైన కోకిలవన్ శనిదేవ్ ని దర్శిస్తారు.

ఈ దేవాలయాన్ని బాబా బర్ఖండికి అకింతం చేశారు. దట్టమైన అడవుల్లో ఈ దేవాలయం ఉంది. ఈ ఆలయం బర్సానాకు సమీపంలో ఉంది. పురాణాల ప్రకారం, ఈ ప్రాంతంలో శ్రీక్రిష్ణుడు కోకిల రూపంలో శనికి దర్శనమివ్వడంతో ఈ ఆలయాన్ని కోకిల వనం అని పిలుస్తారు.

బ్రిజ్మండల్ లో జన్మించిన శ్రీకృష్ణుడిని దేవతలందరూ అభినందించారు. ఈ దేవతల్లో శనిదేవుడు కూడా ఉన్నారు. అయితే కృష్ణుడి తల్లి యశోద శనిదేవుడిని చూడకుండా అడ్డుకుంటుంది. శనిదేవుడి వక్రదృష్టితో శ్రీకృష్ణుడిపై పడుతుందేమోనని యశోద ఆందోళనపడుతుంది. యశోద ప్రవర్తనతో నిరాశ చెందిన శనిదేవుడు కృష్ణుడిని శాంతింపజేయడానికి ద్వాపరయుగంలో కఠోర తపస్సు చేశారు.

శనిదేవుడి తపస్సుకు సంతోషించిన కృష్ణుడు కోకిల రూపంలో ప్రత్యక్షమయ్యాడు. నందగావ్ పక్కనే ఉన్న కోకిల వనమే తన వనమని కృష్ణుడు చెప్పాడు. కోకిలవనంకు వచ్చిన శనిదేవుడిని మొక్కుకునే ప్రతిఒక్కరికి శనిదేవుడితోపాటు కృష్ణుడు అనుగ్రహం లభిస్తుందని కృష్ణుడు చెబుతాడు. ఈ కారణంగా కోకిలవనం శనిదేవుడి ఆలయంగా ప్రస్దిద్ధి చెందిందని పురాణాలు చెబుతున్నాయి. కోకిల ధామ్ లోని ప్రసిద్ధ దేవాలయంలో శనిదేవుడు, గోకులేశ్వర్ మహదేవ్, గిరిరాజ్, బాబా బాంఖండి, దేవ్ బిహారీలు కొలువుదీరి ఉన్నారు. 


ఈ కోకిలవన్ కు వచ్చిన మొక్కిన భక్తుల కోరికలు నెరవేరుతాయని చాలామంది భావిస్తారు. శనివారం ఈ ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. దేశం నలుమూలల నుంచే కాదు ప్రపంచంలో పలు దేశాల నుంచి వందలాది మంది భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు. కృష్ణుడి ఆశీస్సుల కోసం వేలాది మంది యాత్రికులు మధురకు వెళ్తుంటారు.

అంతేకాదు కోకిలవన్ ధామ్ దగ్గర 1.25 కిలోమీటర్ల మేర ప్రదక్షిణలు చేస్తారు. తర్వాత భక్తులు సూర్య కుండ్ లో స్నానమాచరించి ఆవాల నూనెను నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా ఆవాల నూనెను సమర్పిస్తే శనిదోషం తొలగిపోతుందని నమ్ముతుంటారు. కేవలం తైలం సమర్పించిన కూడా కొన్ని రకాల దోషాలు తొలగిపోతాయి. ఏడు శనివారాలు శనీశ్వరుడికి ఆవాల నూనెను నైవేద్యంగా  సమర్పిస్తే కోరిక కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల నమ్మకం. 

Comments

Popular posts from this blog

Puri Ratha Yatra: పూరీ జగన్నాధుని రథయాత్ర

Skanda Panchami: స్కంద పంచమి

Adi Krittika: ఆడి కృత్తిక

Ashada Navratri 2025: ఆషాడ నవరాత్రి, వారాహి నవరాత్రి

Theerthams in Tirumala: తిరుమలగిరులలో 66 కోట్ల తీర్థాలు..

Kamakshi Deepam: కామాక్షీ దీపం దాని వైశిష్ట్యం

Srisailam Temple: శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయం - శ్రీశైలం

Donation and Benefits: దానాలు వాటి ఫలితాలు (కుర్మా పురాణం)

Chaitra Masam 2025: చైత్రమాసంలో పండుగలు, విశేషమైన తిధులు

Tirumala Japali Theertham: జపాలి తీర్థం - తిరుమల