నవ అంటే తొమ్మిది అని అర్థం. సంవత్సరంలో నాలుగుసార్లు నవరాత్రి దీక్ష చేయవచ్చు. అవే చైత్రం, ఆషాఢం, భాద్రపదం, ఆశ్వయుజ నవరాత్రులు. ఆశ్వయుజ మాసంలో వచ్చేవాటిని దేవీ నవరాత్రులు అంటారు. ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుంచి నవమి వరకూ శరన్నవరాత్రులను పాటిస్తారు.
శరన్నవరాత్రులు హస్తా నక్షత్రం తో ఆరంభమై శ్రవణ నక్షత్రం పూర్తి కావడం విశేషం. ఈ తొమ్మిది రోజుల్లో ఆచార సంప్రదాయాల మేరకు అమ్మవారిని యధాశక్తి పూజించవచ్చు. అమ్మవారిని తొమ్మిది రోజులూ అర్చించడంతో పాటు తొమ్మిది అలంకారాలతో తొమ్మిది రూపాల్లో దర్శింప చేస్తారు.
Comments
Post a Comment