- భాద్రపద బహుళ పాడ్యమి మొదలు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి వరకు పదహారు రోజులకు మహాలయపక్షం అని పేరు.
- మహాలయం అంటె గొప్ప వినాశనం లేదా ప్రళయం సంభవించిన రోజు అని అర్ధం, లేదా ప్రళయకాలం వరకు నిలిచిఉంది ఎప్పుడు లయమైయేది, గొప్పది.
- మహాలయ పక్షాలలో మన పెద్దవారిని స్మరించి,ఆరాధించటం వల్ల సుఖ సమృద్ధి, సంతోషం కలుగుతాయి.
- దైవగుణాలకూ సంబంధించి దక్షిణాయనం రాత్రికాలం. ఇది ఆషాడ మాసం శుక్లపక్షం నుండి ప్రారంభవుతుంది.
- దైవబలం తక్కువగా వున్నా సమయంలో పితృగణాలకు తిరిగి జన్మ పొందాలన్న కాంక్ష పెరుగుతుంది, కర్మాధికారం కలిగిన మనవైపు అవి చూస్తుంటాయి అని పురాణాలు చెబుతున్నాయి.
- మనుస్మృతి ప్రకారం ఆషాఢమాసంలోని కృష్ణపక్షం నుంచి అయిదు పక్షాల కాలం వరకు అంటె భాద్రపద కృష్ణపక్షం పితరులు మన నుంచి అన్నాదులు కోరుకుంటారు.
- ఈ విషయాన్ని స్కాందపురాణంలోని నాగరఖండంలో కూడా చెప్పబడింది.
- సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించింది మొదలు పితృదేవతలకు శ్రాద్ధం పెట్టాలని మహాభారతం నిర్దేశించింది.
- సూర్యుడు కన్యారాశిలో సంచారం చేసే, పదహారు పగటి కాలాలు పితృయజ్ఞం చేయాలి అని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. ఇలా చేయడం వల్ల ప్రతిరోజు గయాశ్రాద్ధం చేసిన ఫలితం లభిస్తోంది.
- అగ్నిముఖం, బ్రాహ్మణ భోజనం, పిండ ప్రదానం, ఉపవాసం అనే నాలుగు పద్దతులలో శ్రాద్ధం పెట్టవచ్చు.
- ఈ రోజులలో కనీసం ఒక్క రోజైన పితరులకు తద్దినం పెట్టాలంటుంది శాస్త్రం.
ఎవరు అర్హులు :
- తండ్రి మరణించినవారే మహాలయపక్షం చేయడానికి అర్హులు.
- ఒక వేళ తండ్రి జీవించి, తల్లి మరణిస్తే శ్రాద్ధం చేయవచ్చు కాని, నువ్వులతో తర్పణం మాత్రం విడవకూడదు.
- కుమారులు లేని పక్షంలో కూతురి కొడుకుకి అధికారం ఉంటుంది.
- భార్య గర్భిణిగా ఉంటే సంకల్ప శ్రాద్ధం మాత్రమే ఆచరించాలి.
ఎవరికి ఏ రోజు ..
- ద్వాదశి నాడు సన్యాసులకు
- విషప్రయోగాలతో, బలవంతంగా మరణించినవారికి చతుర్దశి రోజు
- భర్త వున్నా మరణించిన స్త్రీకి నవమి నాడు
- కూతురు తన కొడుకు చేత తల్లితండ్రులకు శ్రాద్ధం చేస్తే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు
తిధి - ఫలితం
పాడ్యమి - ధన సంపద
విదియ - రాజయోగం , సంపద
తదియ - శత్రునాశనం
చతుర్థి - ధర్మ గుణం, ఇష్ట కామ్యప్రాప్తి
పంచమి - లక్ష్మి ప్రాప్తి
షష్ఠి - గౌరవం
సప్తమి - యజ్ఞం చేసిన పుణ్యఫలం
అష్టమి - బుద్ధి ప్రాప్తి
నవమి - విస్తారంగా సంపద
దశమి - ధాన్య, పశుసంపద
ఏకాదశి - సర్వశ్రేష్ఠ దానఫలం
ద్వాదశి - ఆహారభద్రత
త్రయోదశి - ఐశ్వర్యం, ఆరోగ్యం
చతుర్దశి - శత్రుభయం నుంచి విముక్తి
అమావాస్య - అన్ని కోరికలు నెరవేరుతాయి.
2024 తేదీలు : సెప్టెంబర్ 18 నుండి అక్టోబరు 02 వరకు
Comments
Post a Comment