Radha Ashtami: రాధాష్టమి

శ్రీకృష్ణాష్టమి తర్వాత 15 రోజులకు వచ్చే భాద్రపద శుక్ల అష్టమి రాధాష్టమి పర్వదినం. ఆమె ఆరాధనకు ఇదొక అపురూప సమయం. లోకంలో పవిత్రమైన ప్రేమకు ప్రతిరూపాలుగా మొట్టమొదట రాధాకృష్ణులనే పేర్కొంటాం. రాధ అంటే ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణుని ఆంతరంగిక శక్తి స్వరూపమే. పరమాత్మ అనేకానేక శక్తులలో రాధాదేవి ఒకరు. శ్రీకృష్ణ పరమాత్మ కటాక్షాన్ని పొందడానికి అత్యంత దగ్గరి దారి ఆయన హృదయాంశ అయిన రాధమ్మ అనుగ్రహం పొందడమే. హరేకృష్ణ మంత్రంలోని హరే అన్న పదంకూడా ఆమెను సూచించేదే. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా రాధాకృష్ణులను ఇద్దరినీ కలిపి ఆరాధిస్తున్నట్టే లెక్క.

రాధా దేవి ఆవిర్భవించిన తిథిని రాధాష్టమిగా జరుపుకుంటాము.ఉత్తర భారతదేశంలో రాధాష్టమి పండుగను అత్యంత ఘనంగా జరుపుకుంటారు. అమ్మవారికి కుంకుమార్చలను నిర్వహిస్తారు. షోడశోపచార పూజలు  చేస్తారు రంగులు చల్లుకుంటారు..ఈ రోజు కూడా కృష్ణాష్టమి లానే ఉట్టి కొడతారు. రాధా అష్టమి రోజు పేదలకు  అన్నదానం, వస్త్రదానం   చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే కష్టాలు తొలగిపోతాయని భావిస్తారు.

సమస్త సిరిసంపదలకు, ఐశ్వర్యానికి అధిదేవత రాధాదేవి అని చెబుతారు సప్తరుషులు. పూజామందిరంలో రాధాకృష్ణుల ఫొటోని ఉంచి భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.  యోగశక్తికి, అష్టసిద్ధిలకు అధిపతి అయిన రాధాదేవిని పరమాత్ముడి  హృదయేశ్వరిగా వర్ణించారు వ్యాసమహర్షి.

దేవీ భాగవతం ప్రకారం రాధాదేవి.. సకల చరాచర జగత్తుకు తల్లి. సృష్టి, స్తితి, లయములకు కారణం. త్రిమూర్తులు ఆమెను స్తుతించిన గొప్ప గొప్ప స్తుతులు బ్రహ్మ వైవర్త పురాణంలో ఉన్నాయి.

2024 తేదీ: సెప్టెంబర్ 11.

No comments