Singotam Narasimha Swamy Temple: శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం - సింగోటం

తెలంగాణ రాష్ట్రంలో నరసింహస్వామి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో సింగోటం శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఒకటి. మహబూబ్నగర్ జిల్లాలోని కొల్లాపూర్ మండల కేంద్రానికి 10 కి.మీ. దూరంలో ఉన్న సింగవట్నం అనే గ్రామంలో శ్రీలక్ష్మీనృసింహస్వామిదేవాలయం ఎంతో ప్రఖ్యాతిగలది. సింగవట్నమే ఇప్పుడు సింగోటం. శ్రీలక్ష్మీనరసింహస్వామివారు ఈ క్షేత్రంలో లింగాకారంలో స్వయంభువుగా వెలిసారు. శివకేశవులకు భేదం లేదన్నట్టుగా రాతిలింగంపై త్రిపుండ్రాలు, ఊర్ధ్వపుండ్రం గుర్తులు ఉండడం ఇక్కడివిశేషం. శ్రీ లక్ష్మీనరసింహస్వామివారు సింగోటంలో వెలియడానికి 600 సంవత్సరాలక్రితం నాడు జరిగిన ఒక చారిత్రకగాథ ప్రచారంలో ఉంది. జటప్రోలును పరిపాలిస్తున్న సురభి వంశీయులపాలనలో ఈ గ్రామం ఉండేది. సురభి వంశీయులలో పదకొండవతరంవాడైన సింగమ భూపాలుడు పాలిస్తున్నకాలంలో జరిగినకథ ఇది. ఒకరోజు సింగవట్నం గ్రామానికి చెందిన ఒక యాదవుడు తనపొలంలో నాగలిదున్నుతూ ఉండగా ఆ నాగలి కొనకు ఒకరాయి తగిలింది. ఎంతప్రయత్నించినా నాగలి ముందుకు కదలలేదు. అప్పుడు అతడు ఆ రాయిని తీసి, ఒడ్డున పెట్టి, తిరిగి వచ్చి, నాగలితో పొలం దున్నుతూన్నాడు. ఆ రాయి దొర్లుకుంటూ వచ్చి, మళ్లీ నాగలికి అడ్డు పడింద...