Arunachala Giri Pradakshina: అరుణాచల గిరిప్రదక్షిణ మహత్యం (స్కాంద పురాణం )

 

ప్రదక్షిణ అంటే

ప్ర - బలంగా పాపాల్ని కొట్టి తరిమేసేది
ద - సకల కోరికలనీ తీర్చేది
క్షి - కర్మ ఫలితాలని క్షీణింప చేసేది
ణ - ముక్తి ప్రదాయకమైనది అని అర్థం.

  • కైలాసవాసుడైన పరమేశ్వరుడు అగ్నిలింగంగా అరుణాచలం రూపంలో భూమిమీద వెలిసాడు.
  • ఆ దివ్య పర్వతం చుట్టూ ఎంతో మంది దేవతలు పరివేష్టించి ఉన్నారు.
  • జన్మాంతరాల్లో చేసిన పాపాలు అన్ని కూడా ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తే నశించిపోతాయి.
  • కోటి అశ్వమేధయాగాలు, కోటి వాజపేయ యాగాలు చేస్తే వచ్చే ఫలితం, సర్వతీర్థాలలో స్నానం చేస్తే వచ్చే ఫలితం, కేవలం ఒక్కసారి అరుణగిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే కలుగుతుంది. 
  • ఎంత నికృష్ట జన్మ ఎత్తిన వారికైనా సరే, అరుణగిరి ప్రదక్షిణ ముక్తిని ప్రసాదిస్తుంది.ఆ గిరికి భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ చేసేవారు, సకల యజ్ఞాలు చేసిన ఫలం పొందుతారు.
  • అరుణాచల ప్రదక్షిణ కోసం వెళ్ళేవారు ఒక్క అడుగు వేసినంత మాత్రాన్నే భూలోకాన్ని, రెండో అడుగుతో అంతరిక్షాన్ని, మూడో అడుగుతో స్వర్గాన్ని పొందుతారు.
  • అలాగే మొదటి అడుగుతో మానసికంగా చేసిన పాపం, రెండవ అడుగుతో వాక్కుద్వారా చేసిన పాపం, మూడో అడుగుతో శరీరం ద్వారా చేసిన పాపం తొలగిపోతుంది. ఒక్కడుగుతో సకల పాపాలూ నశిస్తాయి.
  • రెండో అడుగు వేస్తే సర్వతపస్సుల ఫలితం వస్తుంది.
  • పరమపవిత్రమైన ఈ అరుణగిరి చుట్టూ ఎన్నో సిద్ధాశ్రమాలున్నాయి.ఈ శిఖరం మీదే సర్వేశ్వరుడు సిద్దేశ్వర రూపంతో, దేవతలంరిచేతా పూజించబడుతుంటాడు.
  • “ఈ దివ్య పర్వతం అగ్ని మయమని, ఈ పర్వతం అంతర్భాగంలో సర్వభోగాలతో కూడిన ఒక గుహ ఉందని భావిస్తూ ధ్యానిస్తూ ఈ గిరికి ప్రదక్షిణ చేయాలి. అలా చేసిన వారి పాపాల్ని దోషాల్ని తొలగిస్తానని పరమేశ్వరుడు స్వయంగా చెప్పాడు.
  • ఈ గిరికి నిత్యం ప్రదక్షిణ చేసేవారికి నిత్యత్వం లభిస్తుంది.ఈ గిరికి ప్రదక్షిణ చేసేవాడి పాదధూళితో భూమి పవిత్రమవుతుంది.

ప్రదక్షిణ ఎలా చేయాలి ?

  • ప్రదక్షిణ చేసేవాళ్ళు ఎవరు చేతిని పట్టుకోకుండా నెమ్మదిగా నడవాలి
  • పరుగులు తీస్తూ హడావుడిగా గిరిప్రదక్షిణ చేయకూడదు,నడిచేవారి అడుగుల చప్పుడు కూడా వినపడకూడదు.
  • స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి, భస్మాన్ని, రుద్రాక్షల్ని ధరించి పవిత్రంగా ప్రదక్షిణ చేయాలి.
  • ఈ పవిత్రమైన గిరిప్రదక్షిణని మనువులు, సిద్ధులు, మహర్షులు, దేవతలు అదృశ్యరూపంలో చేస్తారు. ఇది గ్రహించి వారి దారికి తాము అడ్డులేకుండా నడవాలని భావిస్తూ తమ ప్రదక్షిణ కొనసాగించాలి.
  • శివనామ సంకీర్తన చేస్తూ భక్తులతో కలిసి వెళ్ళాలి.
  • మనసులో ఓం అరుణాచలేశ్వరాయ నమః అన్న నామాన్ని నిరంతరాయంగా జపిస్తూ ముందుకి సాగాలి.
  • కృతయుగంలో అగ్నిమయం, త్రేతాయుగంలో మణిమయం, ద్వాపర యుగంలో బంగారుమయం, కలియుగంలో మరకతాచలంగా ఈ అరుణగిరి వుండేదని భావించాలి.
  • పవిత్రమైన అరుణాచలం స్ఫటిక మయమని, స్వయంప్రభామయమైనదని ధ్యానిస్తూ ప్రదక్షిణ చేయాలి.
పరమేశ్వరుని అగ్నిమయ స్వరూపుడిగా  భావిస్తూ ప్రదక్షిణ చేసేవారిని అయన సర్వదా రక్షిస్తాడు.

ఈ గిరిప్రదక్షిణ చేసేవాడి పాదాలు మోయటానికి దేవతలా వాహనాలు పోటీపడుతుంటాయి.

ఈ గిరిప్రదక్షిణ చేసినవారికి దృఢమైన శరీరం ఏర్పడుతుంది. వారి వ్యాధులు నశిస్తాయి.

అదృశ్యంగా ఈ గిరిప్రదక్షిణ చేసే దేవతలు తమతో పాటు ప్రదక్షిణ చేస్తున్న భక్తులకు వరాల్ని ప్రసాదిస్తారు.

దుర్బలులు, కృశించిన శరీరం కలిగిన వారు ఎలాగో శ్రమపడి ఈ గిరి ప్రదక్షిణ చేస్తే, సకల దోషాల నుంచీ పాపాల నుండి విముక్తులవుతారు.

అరుణగిరి ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే, ముల్లకాలకీ ప్రదక్షిణ చేసిన ఫలితం లభిస్తుంది.

ఉత్తరాయణ పుణ్యకాలంలో (మకర సంక్రమణం) పరమేశ్వరుడు స్వయంగా తన ప్రమధగణాలతో, ఋషి ముని సమూహాలతో ఈ గిరికి ప్రదక్షిణ చేస్తాడు.

ఉత్తరాయణ పుణ్యకాలంలో అరుణగిరికి ప్రదక్షిణ చేసే వారిని, జగన్మాత పార్వతీదేవి కరుణించి కాపాడుతుంది.

పవిత్రమైన అరుణగిరి ప్రదక్షిణని రథాలు, గుర్రాలులాంటి వాహనాలతో చేయకూడదు. కేవలం కాలినడకతోనే చేయాలి.

Comments

Popular This Week

Sri Raghavendra Aradhana: శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన 2024

Shani Shinganapur Temple: శని శింగణాపూర్ ఆలయం

Shunya Masam: శూన్యమాసం అంటే ఏంటి

Lord Shiva Pradaskhina: శివాలయంలో ప్రదక్షిణ చేయడానికి కొన్ని నియమాలు

Navagraha: నవగ్రహాలు - మానవ శరీరం

Pancha Kedar Temples: శివుడి శరీరభాగాలు పడిన ఐదు క్షేత్రాలివి

Subramanya Swamy Temple: మట్టిని ప్రసాదంగా ఇచ్చే సుబ్రమణ్య స్వామి ఆలయం

Nagasadhu: నాగ సాధువుల జీవన విధానం

Varjyam: వర్జ్యం అంటే ఏమిటి ?

Human Duties: మానవ ధర్మములు

Random posts