Varanasi Importance: ఆలయాల నగరి కాశీ విశిష్టత

 

  • కాశీ అంటే నిత్యం ప్రకాశించే నగరమని అర్ధం.
  • కాశీలో మరణిస్తే పునర్జన్మ ఉండదు అని విశ్వసిస్తారు.
  • కాశీక్షేత్రం కైలాస సమానం అని భక్తుల నమ్మకం.
  • గంగలో పుణ్యస్నానంలో చేసిన వెంటనే కాశీవిశ్వనాధుని దర్శించుకుంటారు.
  • కాశీలో పురాణ, చారిత్రిక నేపథ్యం కలిగిన 87 ఘాట్లు ఉన్నాయి.
  • బ్రహ్మ దేవుడు శివానుగ్రహం కోసం పది అశ్వమేధయాగాలు నిర్వహించింది దశాశ్వమేధ ఘాట్.
  • శివుడి కర్ణకుండలాలు పడిన ప్రదేశం మణికర్ణికా ఘాట్. ఈ ఘాట్ లోనే ఎక్కువ దహన సంస్కరాలు జరుగుతాయి.
  • అత్యధిక ఆలయాలు కలిగిన ఘాట్ సింధియా ఘాట్.
  • అస్సి ఘాట్, అహల్య ఘాట్, బద్రినారాయణ ఘాట్, దుర్గ ఘాట్, హనుమాన్ ఘాట్, హరిశ్చంద్ర ఘాట్, కేదార్ ఘాట్, లలిత ఘాట్, తులసి ఘాట్, వేణి మాధవ ఘాట్ వాటిలో ప్రముఖమైనవి మరియు ఎన్నో తీర్దాలు దర్శనమిస్తాయి.
  • ప్రసిద్ధమైన దశాశ్వమేధ ఘాట్ లో ఇచ్చే గంగ హారతి కన్నుల పండుగగా ఉంటుంది.
  • రుద్రా, నాగ ,త్రిశుల, ధూప, పంచ, నక్షత్ర హారతులు సమర్పిస్తారు.
  • కాశీవిశ్వనాధుని ఆలయంకి సమీపంలోనే అన్నపూర్ణాదేవి దర్శనమిస్తుంది. ఈ అమ్మవారిని దర్శించుకుంటే అన్నపానాలకు లోటు ఉండదు అని భక్తుల విశ్వాసం.
  • దీపావళి తరువాత రోజు బంగారు అన్నపూర్ణాదేవిని దర్శించవచ్చు.
  • అష్ఠాదశ శక్తిపీఠాలలో ఒక్కటైనా విశాలాక్షి అమ్మవారి మందిరం దర్శించవచ్చు. ఇక్కడ అమ్మవారు స్వయంభు. 
  • విశ్వభుజ గౌరీ, సౌభాగ్య గౌరీ, శృంగార గౌరీ , ముఖనిర్మల గౌరీ, మంగళ గౌరీ, మహాలక్ష్మి గౌరీ, లలిత గౌరీ, జ్యేష్ఠా గౌరీ, మణికర్ణికా దేవి, వింద్యాదేవి, వారాహిదేవి, త్రిపురభైరవి, త్రిలోకసుందరి, సిద్దేశ్వరి, దుర్గాదేవి, నవదుర్గల ఆలయాలు దర్శించవచ్చు.
  • పాలరాతితో నిర్మించిన బెనారస్ విశ్వనాథ మందిరం వారణాసి క్షేత్రంలోనే అతి ఎత్తైన ఆలయం.
  • ఈ నగరంలో 57 గణపతులని దర్శించవచ్చు. వాటిలో చింతామణి గణపతి దుండి గణపతి ప్రముఖమైనవి.
  • కాశీలో సూర్య భగవానుడికి 12 ఆలయాలు ఉన్నాయి. 
  • శ్రీ మహావిష్ణువుకు 27 ఆలయాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది బింధుమాధవస్వామి ఆలయం.
  • క్షేత్రపాలకుడైన కాలభైరవుడికి 8 ఆలయాలు ఉన్నాయి.
  • ఇక్కడ సంకట మోచన్ హనుమాన్ ఆలయం విశిష్టమైనది. ఇక్కడ తులసీదాస్ రామచరితమనస్ రాసినట్లు చారిత్రిక కధనం.
  • తిలబండేశ్వర్ మహాదేవ ఆలయం, కేదారేశ్వర మందిరం కూడా తప్పనిసరిగా దర్శించవచ్చు.

Comments

Popular This Week

Sri Raghavendra Aradhana: శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన 2024

Shani Shinganapur Temple: శని శింగణాపూర్ ఆలయం

Shunya Masam: శూన్యమాసం అంటే ఏంటి

Lord Shiva Pradaskhina: శివాలయంలో ప్రదక్షిణ చేయడానికి కొన్ని నియమాలు

Navagraha: నవగ్రహాలు - మానవ శరీరం

Pancha Kedar Temples: శివుడి శరీరభాగాలు పడిన ఐదు క్షేత్రాలివి

Subramanya Swamy Temple: మట్టిని ప్రసాదంగా ఇచ్చే సుబ్రమణ్య స్వామి ఆలయం

Nagasadhu: నాగ సాధువుల జీవన విధానం

Varjyam: వర్జ్యం అంటే ఏమిటి ?

Human Duties: మానవ ధర్మములు

Random posts