Hamsaladeevi Venugopala Temple: శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం - హంసలదీవి

కృష్ణానది సముద్రంలో కలిసే పవిత్ర సాగరసంగమ ప్రదేశం హంసలదీవి. ఈ పవిత్ర సాగర సంగమ ప్రదేశంలో స్నానం చేస్తే కాకులు కూడా హంసలుగా మారిపోతాయన్న కథనం ఈ ప్రాంతంలో ఉంది.


పూర్వకాలంలో కలుషహారిణి అయిన గంగామాత తనలో స్నానం చేసిన వారందరి పాపాలను నశింపచేస్తుండటం వలన తనకు అంటిన పాప పంకి లాన్ని పోగొట్టుకొనే మార్గం చెప్పవలసిందిగా శ్రీహరిని ప్రార్ధిం చింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన అంశతో ఉద్భ వించిన కృష్ణానది సముద్రంలో కలిసే సంగమ ప్రదేశం లో కాకి రూపంలో వెళ్లి స్నానం చెయ్యి. నీపాప తమస్సు పోయి హంసవలె మారతావని వరమిచ్చాడు. గంగాదేవి తన యందలి పాప తమస్సును కాకి వలె ధరించి కృష్ణా సాగ రసంగమ పవిత్ర ప్రదేశం లో మునిగింది. పాపప్రక్షాళన పొంది హంస వలె స్వఛ్ఛతను పొందింది. అంతటి మహిమ గల క్షేత్రం ఈ హంసల దీవి. ఎందరో మునులు ఈ ప్రాంతంలో తపస్సు చేసుకుంటూ సంచరించేవారని, అటువంటి పరమహం సలు సంచరించిన ప్రదేశం కాబట్టే ఈ ప్రాంతాన్ని హంసలదీవి అన్నారని ఒక కథనం.

ఈ తీర్థక్షేత్రంలో వెలసిన దైవం రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామి. ఈ ఆలయం ఒక రాత్రిలో దేవతలు నిర్మించిందిగా స్థలపురాణం. దేవాలయ నిర్మాణం పూర్త యి, గాలిగోపురం నిర్మిస్తుండగా తెల్లవారిపోయిందని, దేవ తలు వెళ్లి పోయారని, అందువల్ల అది అసంపూర్తిగా మిగిలి పోయిందని చెప్పేవారు. ఆ తరువాత దానిని ఐదంతస్తుల గాలిగోపురంగా నిర్మించారు.మౌర్య చక్రవర్తుల కాలంలో ఆలయ నిర్మాణం జరిగి ఉండ వచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు. ఆలయ ముఖమండపం స్తంభాలమీద అనేక శాసనాలు మనకు కన్పిస్తాయి.

పూర్వకాలం ఈ ప్రాంతంలో ఒక పెద్ద పుట్ట ఉండేదట. స్వామి దానిలో ఉండేవాడట. మేతమేసిన ఆవులు ఆ పుట్ట దగ్గరకు వచ్చి స్వామికి పుట్టలోకి పాలు కార్చేవట. సాయంత్రం ఆవులు పాలు ఇవ్వకపోవడంతో అనుమానమొచ్చి, మాటువేసి కారణం కనిపెట్టారు గోపాలురు. ఆవులు పుట్ట పైకి వెళ్లి పాలుకార్చడం చూచి, కోపం ఆపుకోలేక, చెత్తంతా పోగు చేసి పుట్టమీద వేసినిప్పుపెట్టారట. పుట్టలోని స్వామికి వేడితగలడం, ఇంతలో ఒకరికి పూనకం వచ్చి స్వామి ఉన్న విషయాన్ని చెప్పడం, క్షమాభిక్ష కోరుకున్న భక్తులు స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు నిర్వహించడం జరిగిపోయింది.కాలాంతరంలో ఆ విగ్రహం భిన్నమైపోగా, స్వామి గ్రామస్తులకు కలలో కన్పించి కాకరపఱ్ఱు మునసబు గారి దొడ్లో ఉన్నానని చెప్పడంతో గ్రామస్తులు వెళ్లి ఊరేగింపుగా స్వామి వారిని తీసుకొచ్చి ప్రతిష్టించారట. ఆ విగ్రహమే ఇప్పుడు పూజలందుకుంటున్నది. భిన్నమైన విగ్రహం ఇప్పటిక్కూడా అలంకరించబడిన మూలవిరాట్‌ ప్రక్కనే మనకు దర్శనమిస్తోంది.

ఈ ఆలయంలో వివాహం చేసుకొని, సాగరసంగమ ప్రదే శంలో సరిగంగ స్నానాలు చేస్తే ఆ జంటలు సుఖంగా నూరే ళ్ళు జీవిస్తారనేది భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో నిద్ర చే స్తే సంతానం లేనివారికి సంతానభాగ్యం కలుగు తుందని చెపుతారు.

మాఘపౌర్ణమికి స్వామివారి కళ్యాణోత్సవం, కృష్ణాష్టమి, ధనుర్మాసం, ప్రత్యేక ఉత్సవాలు. కార్తీకమాసంలో సముద్ర స్నానం చేసిన వేలాదిమంది భక్తులు తప్పనిసరిగా స్వామిని దర్శిస్తారు.

శ్రీజనార్ధనస్వామి, శ్రీ రాజ్యలక్ష్మి, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాలయాలు కూడా ఈ ఆలయంలో ఉన్నాయి. ఈ ఆలయానికి సమీపంలోనే బాలాత్రిపుర సుందరి, అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరాలయం కూడా ఉంది. ఆలయ ప్రాంగణం లో అక్కడక్కడ పడి ఉన్న కొన్ని శిథిల శిల్పాలు చెదిరిన మన చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా కనబడతాయి.

ఈ ఆలయం తుపానులు, ఉప్పెనల నుండి గ్రామస్తులను కాపాడుతూ వస్తోంది. 1864, 1977 ఉప్పెనల నుండి ఎందరో గ్రామస్తుల ప్రాణాలను కాపాడిన ఘనచరిత్ర ఈ ఆలయానిది. సుమారు 6, 7 వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయమే అయినా ఉప్పెనలకు చెక్కుచెదరకుం డా నిలబడటమే కాకుండా, కొన్నివందల ప్రాణాలను నిల బట్టిన ఘనత ఈ ఆలయ సొంతం.

కృష్ణాజిల్లా కోడూరు నుండి 15 కి.మీ దూరం లోనూ, మోపిదేవి నుండి 28 కి.మీ దూరం లోను బంగాళాఖాతం అంచున ఈ పుణ్యక్షేత్రం ఉంది.

Comments

Popular This Week

Sri Raghavendra Aradhana: శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన 2024

Shani Shinganapur Temple: శని శింగణాపూర్ ఆలయం

Shunya Masam: శూన్యమాసం అంటే ఏంటి

Lord Shiva Pradaskhina: శివాలయంలో ప్రదక్షిణ చేయడానికి కొన్ని నియమాలు

Navagraha: నవగ్రహాలు - మానవ శరీరం

Pancha Kedar Temples: శివుడి శరీరభాగాలు పడిన ఐదు క్షేత్రాలివి

Subramanya Swamy Temple: మట్టిని ప్రసాదంగా ఇచ్చే సుబ్రమణ్య స్వామి ఆలయం

Nagasadhu: నాగ సాధువుల జీవన విధానం

Varjyam: వర్జ్యం అంటే ఏమిటి ?

Human Duties: మానవ ధర్మములు

Random posts