Posts

Showing posts from December, 2024

Devuni Kadapa Brahmotsavams: శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - దేవుని కడప

Image
టిటిడికి అనుబంధంగా ఉన్న కడప నగరంలోని దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో జనవరి 29 నుండి ఫిబ్రవరి 07వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి.  బ్రహ్మోత్సవ సేవలు  2025 జనవరి 28  - దీక్ష తిరుమంజనం, సేనాధిపతి ఉత్సవం , అంకురార్పణం. జనవరి 29  - తిరుచ్చి ధ్వజారోహణం, చంద్రప్రభ వాహనం. జనవరి 30  - సూర్యప్రభ వాహనం, పెద్దశేష వాహనం జనవరి 31  - చిన్నశేష వాహనం, సింహ వాహనం. ఫిబ్రవరి 01 - కల్పవృక్ష, హనుమంత వాహనం ఫిబ్రవరి 02 - ముత్యపు పందిరి వాహనం, గరుడ వాహనం ఫిబ్రవరి 03 - కల్యాణోత్సవం, గజ వాహనం ఫిబ్రవరి 04 - రథోత్సవం, ధూళిఉత్సవం ఫిబ్రవరి 05 - సర్వభూపాల వాహనం, అశ్వ వాహనం ఫిబ్రవరి 06 - వసంతోత్సవం, చక్రస్నానం, ధ్వజావరోహణం, హంస వాహనం ఫిబ్రవరి 07 - ఫుష్పయాగం (రాత్రి).

Chittaramma Jatara 2025: శ్రీ చిత్తారమ్మ జాతర 2025

Image
  హైదరాబాద్ లోని  కుత్బుల్లాపూర్‌ గాజులరామారంలో కొలువైన శ్రీ చిత్తారమ్మ అమ్మవారి జాతర జనవరి 17 నుండి ప్రారంభంకానుంది. ఈ జాతర తెలంగాణ రాష్ట్రంలో జరిగే ముఖ్యమైన జాతరగా ప్రసిద్ధి చెందింది. రాష్ట్ర నలుమూలల నుండి కాక ఇతర రాష్ట్రాల ప్రజలు జాతర సమయంలో అమ్మవారిని దర్శించుకుంటారు. ప్రతి ఏటా సంక్రాంతి సమయంలో అమ్మవారి జాతర జరుగుతుంది  తేదీలు   జనవరి 17 - గణపతి పూజ, దీక్ష ధారణ, అగ్ని ప్రతిష్ట జనవరి 18 - చండి హోమం, పూర్ణాహుతి  జనవరి 19 - జాతర లో ముఖ్యమైన రోజు( అభిషేకం, విజయ దర్శనం, బోనాలు, గ్రామోత్సవం) జనవరి 20 - రంగం, దివ్యవాణి  జనవరి 21, 22, 23, 24 - కుంకుమార్చన  జనవరి 25 - అన్నదానం, జాతర ముగింపు 

Pushya Masam: పుష్యమాసంలో ఆదివారం సూర్యాస్తమయానికి ముందే భోజనాలు చేస్తారెందుకు?

Image
పుష్యమాసాన్ని శూన్యమాసం అంటారు. ఈ నెలలో గ్రహసంచారం శుభకార్యాలకు, సుముహూర్తాలకు అనువుగా ఉండదనే కారణంగా అలా అంటారు. ఈ మాసంలో గ్రహానుకూలత కోసం, గ్రహరాజు అయిన సూర్యుని అనుగ్రహం కోసం ఆయనకు ప్రీతిపాత్రమైన ఆదివారం నాడు సూర్యారాధన చేస్తారు. ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యునికి ప్రత్యేక నివేదన చేస్తారు. ఆ ప్రసాదాన్ని సూర్యాస్తమయానికి ముందే భోజనంగా స్వీకరిస్తారు. ఈ సంప్రదాయం కొన్ని ప్రాంతాల్లోనే కనిపిస్తుంది.

Pushya Month 2025: పుష్య మాస విశిష్టత

Image
  చంద్రుడు పుష్యమి నక్షత్రం లో ఉండగా వచ్చే మాసం పుష్య మాసం. “పుష్య”అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్ధం.  పుష్యమాసం   తెలుగు మాసాల్లో పదోది. హేమంత రుతువులో రెండవది. పుష్యపౌర్ణమి వేదాధ్యయానికి చాలా విశిష్టమైనది గా చెప్పబడింది. శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు, మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయం గా చెప్పబడింది. విష్ణువుకు ఇష్టమైన మాసం మార్గశిరం . శివుడికి కార్తీకం. అలాగే పుష్య మాసం శనీశ్వరుడికి పరమ ప్రీతికరం. ఎందుకంటే ఆయన జన్మనక్షత్రం పుష్యమి. ఏలినాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో రోజూ ఉదయానే శుచిగా స్నానం చేసి శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్థిస్తారు. పౌర్ణమినాడు శనికి తైలాభిషేకం జరిపించి నవ్వులు దానమిస్తారు. ఆయనకు ఇష్టమైన నువ్వులు, బెల్లం ఆహారంలో భాగం చేసుకుంటారు.  ఈ నెలలో లక్ష్మీదేవిని విశేషంగా ఆరాధించే సంప్రదాయం ఉంది. అందుకే దీనిని సౌభాగ్య లక్ష్మీ మాసం అని కూడా అంటారు. లక్ష్మీదేవిని ధనలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా పూజిస్తారు. ఈ నెలలోని మంగళవారాలలో లక్ష్మీదేవిని ప్రతిమలోగాని, కలశంలోగాని ఆవాహన చేసి ఆరాధిస్తే అరిష్టాలు తొలగి, కోరిన కోరికలు తీరుతాయని పం...

Gajendra Varadaraja Perumal Temple: శ్రీ గజేంద్ర వరదరాజ పెరుమాళ్ ఆలయం - తిరుకపిస్థలం

పరమపురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుడు శాపగ్రస్తులైన ఇంద్రద్యుమ్నునికి, హూహూ అనేటువంటి ఒక రాక్షసునికి శాపవిమోచనాన్ని కలిగించి మోక్షాన్ని ప్రసాదించినటు వంటి దివ్యదేశమే ఈ 'తిరుకపిస్థలం'. అలాగే కపివానరం. హనుమంతునికి ఈ దేవదేవుడు రాముడిలాగా దర్శనభాగ్యాన్ని కల్గించినందువల్ల ఈ స్థలాన్ని 'కపిస్థలమ్' అని కూడా వ్యవహరిస్తారు. గజేంద్రమోక్షవృత్తాంతం ఎన్నోపురాణాలలో, ఆళ్వారుల యొక్క శ్రీసూక్తములో కూడా కన్పిస్తూంటాయి. ఈ కపిస్థలక్షేత్రాణ్ణి ఒకే ఒక ఆళ్వారు అంటే తిరుమళిశైఆళ్వారు వారు మాత్రమే మంగళాశాసనం చేసి ఉన్నారు. ఈ క్షేత్రం కావేరీనదీతీరంలో దాదాపు 0.35 ఎకరా స్థలంలో పెద్దప్రాకారంతో, రాజగోపురంతో, శిల్పకళానైపుణ్యంతో విరాజిల్లుతున్నది. కుంభకోణం నుండి తిరువైయ్యార్ వెళ్లేటు వంటి మార్గంలో పాపనాశం రైల్వేస్టేషన్కి మూడుకిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. 'తిరుకపిస్థలమ్', 'కృష్ణా రణ్యక్షేత్రమ్' అని కూడా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్వామి 'గజేంద్రవరదుడు'. 'కణ్ణన్' అని కూడా ఈ స్వామిని కీర్తిస్తూంటారు. అమ్మవారు 'రమామణివల్లి'. ఈ ఆలయం యొక్క విమానం గగనాకారవిమాన...

Mantra Importance: మంత్రస్మరణ వైశిష్ట్యం

Image
మననం చేసే కొలదీ రక్షించేది మంత్రం, మనస్సును రక్షిస్తుంది. కనుకనే మంత్రం అని  అన్నారు. స్పష్టాక్షరమైన పలుకే మంత్రం. దేవతలు మంత్రాలకు అధీనులు. మంత్రాలన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి. మంత్రాన్ని ఉచ్చరించేటప్పుడు స్వరపేటిక, దానికి సంబంధించి నరాలు ఒక నిర్ణీతరీతిలో పనిచేస్తాయి. ఇందువల్ల ఉచ్చారణ సరిగ్గా ఉంటుంది. నాలుక స్పష్టంగా చలిస్తుంది. ఒక శబ్దాన్ని ఉచ్చరించాలంటే 72 స్నాయువులు పని చేస్తాయి. ఏయే రీతిలో స్నాయువులు పనిచేస్తే ఆయా శబ్దాలవల్ల ఆయానరాలు ఉత్తేజితాలవుతాయి. ఇవి సంస్కృతభాష వల్లనే సాధ్యం. మంత్రోచ్చారణతో జనించే శబ్దతరంగాలు చెవిపైనా, దాని ద్వారా ఇతర నరాల పైనా మంచి ప్రభావం చూపుతాయి. మంత్రనాదం వింటుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇందువల్ల వాక్శక్తి పెరుగుతుంది. అనువాదాలు మంత్రాలు లేవు. మంత్రాల్లోని ఒక్కొక్క అక్షరమూ ఒక దేవతాశక్తికి బీజమే! మంత్రాల అర్థం ఏదైనా కావచ్చు. కానీ వాటిల్ని ఆపద్ధతి ప్రకారం ఉచ్చరిస్తూంటే దేహంలో విద్యుత్తు ఉత్పాదనం జరుగుతుంది. ఇందువల్ల శరీరం మిక్కిలి చైతన్యవంతమై- పవిత్రవంతమవుతుంది. కనుక మంత్రతస్మరణవల్ల మనస్సు, బుద్ధి, చిత్తం, హృదయం, ముఖం, శరీరం పరిశుద్ధమవుతాయి. వాళ్ళు శక్తిమంత...

Somavati Amavasya: సోమావతి అమావాస్య

Image
సోమవారం నాడు వచ్చే అమావాస్యను  సోమావతి అమావాస్య అని పిలుస్తారు. చాల అరుదు వస్తుంది ఈ పుణ్య తిధి. ఈ రోజు చేసే చిన్న పుణ్యకార్యం అయిన రెట్టింపు అవుతుంది అని విశ్వాసం. ద్వాపర యుగం లో పాండవులు ఈ తిధి కోసం చాల సార్లు ఎదురు చూసారు అని చెపుతుంది భారతం. జాతకరీత్యా చంద్రగ్రహ స్థితి సరిగా లేని వారు పరిహారాలు చేసుకోవాలి శివునికి అభిషేకాలు, అర్చనలు చేస్తారు, పవిత్ర నదులలో స్నానాలు చేయడం, తులసి కోట వద్ద విష్ణు పూజ చేయడం మంచిది. బియ్యం , పాలు, నెయ్యి, పెరుగు వంటి వాటిని దానం చేయాలి. రావిచెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు  చేయాలి. ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో స్నానమాచరించి, దానం చేసి నైవేద్యాలు సమర్పిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వసిస్తారు. సోమావతి అమావాస్య రోజున నదీ స్నానం ఆచరించి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి.  ఈ రోజున పితృదేవతలకు నైవేద్యాలు సమర్పించడంవల్ల జీవితంలో ఆనందం కలుగుతుంది.  శివుని మహామృత్యుంజయ మంత్రంకూడా పఠించాలి. అలాగే శివుని ఆరాధన ప్రత్యేక ప్రయోజనాలను ఇస్తుంది.  అరుదుగా వచ్చే ఈ అమావాస్య రోజు చేసే శివారాధన ఇంట్లో ప్రతికూల శక్తుల కారణంగా కలిగే అశ...

Srirangam Temple: శ్రీరంగం ఆలయం

Image
కావేరీ విరజానదిగాగ, వైకుంఠం రంగమందిరంకాగా, ఆ వాసుదేవుడు స్వయంగా రంగేశుడు కాగా సాక్షత్తు పరమపదమై అలరారుతున్న దివ్యదేశం శ్రీరంగం. ఈ గుడిని తిరువరంగం అని కూడా పిలుస్తారు. ఇక్కడ తెంగలైసంప్రదాయంలో పూజాదికాలు జరుగుతాయి. మనదేశంలోని అతి పెద్ద, అతిముఖ్య, అతిపురాతన ఆలయాలలో ఒకటి శ్రీరంగం. ప్రపంచంలోనే అతి పెద్ద మత ప్రదేశంగా ఈ ఆలయానికి ప్రసిద్ది ఉంది. ఈ ఆలయం అద్భుత కళాఖండంగా ఈ ఆలయం 7 ప్రాకారాలతో, 21 గోపురాలతో, 6,31,000 చదరపు మీటర్లు (156 ఎకరాలు) స్థలంలో నిర్మితమైంది. దీని ప్రాకారం పొడవు 4 కిలోమీటర్లు (10,710 అడుగులు). ఆసియాలోనే అతిపెద్ద రాజగోపురం ఈ ఆలయానికి ఉంది. దీన్ని13 సెంట్ల భూమిలో 236 అడుగుల (72 మీటర్లు) ఎత్తుతో, 11 అంతస్తులతో నిర్మించారు. ఈ ఆలయంలోరంగనాథ స్వామి సన్నిధితో పాటు, 53 ఉప-సన్నిధులూ ఉన్నాయి. ధన్వంతరి సన్నిధి, గరుడాళ్వార్ సన్నిధి, ఉడయవర్ సన్నిధి, తాయారు సన్నిధి, హయగ్రీవార్ సన్నిధి, చక్రధ్వజ్వర్ సన్నిధి, వేయి స్తంభాల మండపం, చిన్న నీటి కొలనులు ప్రధానమైనవి. ఈ ప్రహరీలు దృఢమైన, భారీ బురుజులున్న గోడలతో నిర్మించబడ్డాయి. ఆలయ గర్భగుడి చుట్టూ ఇవి ఆవరించి ఉంటాయి. అన్ని ప్రాకారాల్లో ఉన్న 21 బ్రహ్...

Saphala Ekadasi: సఫల ఏకాదశి

Image
  మార్గశిర మాసంలో వచ్చే కృష్ణ పక్ష ఏకాదశిని సఫల ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ ఏకాదశి గురించి బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది. ఈ ఏకాదశి గురించి శ్రీ కృష్ణభగవానుడు, ధర్మరాజుకు వివరించాడు. మాహిస్మతుడనే రాజు ఈ ఏకాదశిని ఆచరించినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ ఏకాదశిని ఆచరించేవారు ధన్యులు. ఈ రోజున ఉపవాసం, జాగారం చేసి శ్రీమన్నారాయణుని అనుగ్రహం కోసం పూజిస్తారు. చేపట్టిన పనులు సఫలం కావాలంటే సఫల ఏకాదశి రోజు లక్ష్మీనారాయణులను పూజించడం సహా దానాలు చేయడం మంచిది. సఫల ఏకాదశి రోజున జాగరణ చేసి ఆలయాల్లో దీపాలను వెలిగిస్తే ఐదువేల సంవత్సరాలు తపస్సు చేసిన ఫలితం దక్కుతుందని అంటారు. ఈ రోజున శ్రీ మహా విష్ణువును లక్ష్మీ సమేతంగా పూజిస్తారు. ఈ ఏకాదశి రోజున చేసే ఉపవాసం, లక్ష్మీనారాయణుల పూజ, జాగారం వలన చేపట్టిన పనులు సఫలం అవుతాయని విశ్వాసం. సఫల ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వాళ్లు ఉదయాన్నే తలస్నానం చేసి, ఇంటినీ, పూజా మందిరాన్ని శుభ్రపరిచి లక్ష్మీనారాయణుల చిత్ర పటాలు గంధం, కుంకుమ, పసుపు రంగు పుష్పాలతో అలంకరించాలి. ఏకాదశి పూజలో తులసి తప్పనిసరి. ఆవునేతితో దీపారాధన చేయాలి. లక్ష్మీనారాయణులకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు చ...

Kashi Visalakshi Temple: శ్రీ విశాలాక్షీదేవి- వారణాసి

Image
సప్తమోక్షపురాల్లో ఒకటిగా, శివుడి కన్నుల్లో ఒకటిగా పేరు పొందిన కాశీక్షేత్రం జగన్మాత శ్రీవిశాలాక్షీదేవిగా కొలువుదీరిన మహిమాన్విత క్షేత్రం అష్టాదశశక్తిపీఠాలలో పదిహేడవ క్షేత్రం వారణాసి జ్యోతిర్లింగాలలో శ్రీ విశ్వేశ్వరమహాలింగానికి, అష్టాదశ శక్తిపీఠాల్లో శ్రీ విశాలాక్షీదేవికి నిలయమైన వారణాసికే కాశీ క్షేత్రం అని పేరు. సప్తమోక్షపురాల్లో ఒకటిగా, శివుడి కన్నుల్లో ఒకటిగా పేరు పొందిన కాశీక్షేత్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గంగానదీ తీరాన ఉంది. సంస్కృతంలో 'కస్' అంటే ప్రకాశించునది లేదా వెలుగును విరజిమ్మునది. 'అ' అంటే మోక్షసాధనకు అవసరమైన వెలుగును (జ్ఞాన మనే వెలుగు) ప్రసాదించునది కనుక ఈ క్షేత్రానికి 'కాశి' అనే పేరు ఏర్పడినట్లు కథనం. ఈ క్షేత్రాన్ని బెనారస్ అని కూడా పిలుస్తారు. ఈ పేర్లతో పాటు ప్రాచీనకాలంలో కాశీని వివిధ పేర్లతో పిలిచేవారు. త్రినేత్రుడైన శివుడికి ఈ క్షేత్రంలో ఉండటం మహాఇష్టం కనుక ఈ క్షేత్రానికి 'ఆనందకాననం' అనీ, ఈ క్షేత్రంలో ఏ విధమైన పాపాలు, దోషాలు దరిచేరవు కనుక 'అవిముక్తక’ అనే పేర్లు ఉన్నట్లుగానూ, వీటికి తోడూతీరస్థలి, ముక్తిభూమి,క్షేత్రపురి, ముక్తిపురి, మహాస...

Srivilliputhur Andal Temple: శ్రీ ఆండాళ్ అమ్మవారి ఆలయం - శ్రీవిల్లిపుత్తూర్

Image
ధనుర్మాసంలో జరిగే తిరుప్పావై సందర్భంగా మహిమాన్వితమైన శ్రీవిల్లిపుత్తూర్ ఆండాళ్ ఆలయ క్షేత్ర విశేషాలను తెలుసుకుందాం. చూపరులను అబ్బురపరిచే శిల్పకళా సౌందర్యం, ఎత్తైన రాజ గోపురాలు, భక్తులను ఆధ్యాత్మిక అనుభూతిలో ముంచే ఆండాళ్, రంగనాయక స్వామి విగ్రహం ఇవన్నీ ఈ ఆలయ ప్రత్యేకతలు. ఈ ఆలయంలో మరో విశేషమేమిటంటే ఇక్కడ వటపత్రశాయి శ్రీదేవి భూదేవితో కలిసి కొలువు తీరి ఉండడం. ఈ ఆలయాన్ని దర్శిస్తే అవివాహితులకు శీఘ్రంగా వివాహం జరుగుతుందని విశ్వాసం. ఆలయ స్థల పురాణం నారాయణుని రాక్షస సంహారం పూర్వం మార్కండేయ మహర్షి, భృగు మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేసారంట! అప్పుడు ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులతో ఉండేది. ఆ అరణ్యంలో ఉండే 'కాలనేమి' అనే రాక్షసుడు తరచూ మహర్షుల తపస్సుకు ఆటంకం కలిగిస్తుంటే ఆ మునులు శ్రీ మహా విష్ణువును ప్రార్ధించారు. అప్పుడు నారాయణుడు ఆ రాక్షసులను అంతమొందించి శ్రీదేవి, భూదేవి సమేతంగా అక్కడే మర్రిచెట్టు నీడలో విశ్రాంతి తీసుకున్నాడంట! అందుకే అక్కడ స్వామికి వటపత్రశాయి అని పేరు వచ్చింది. శ్రీవిల్లిపుత్తూర్ పేరు ఇలా వచ్చింది రాక్షస సంహారం తర్వాత ఈ ప్రాంతాన్ని 'మల్లి' అనే రాణి పరిపాలించేది. ఆమెకు వి...

పదహారు ఫలాల నోములో ఏ పళ్లను వినియోగించాలి?

దేవుడికి నివేదన చేసే పళ్లు సహజమైనవి అయివుండాలి. యాపిల్, రేగు, మేడి వంటి పళ్లు పనికి రావు. పురుగులు పట్టడానికి ఎక్కువ అవకాశం ఉన్నపళ్లు పనికిరావు. అలాగే గింజ లేని పళ్ళు పనికి రావు. గింజ వంశాభివృద్ధికి దోహదం చేసేది. అందుకే నోముల్లో గింజలేని పండు ఇవ్వరు. సీతాఫలం, సపోటా, పుచ్చకాయ వంటివి నల్లని గింజలతో ఉంటాయి కనుక అవికూడా పనికి రావు. కొబ్బరి, మామిడి, నారింజ, దోస, ద్రాక్ష, దబ్బ, నిమ్మ, రామాఫలం, పనస, పంపర పనస, దానిమ్మ, మాదీఫలం, జామ, వెలగ, ఖర్జూరం, గుమ్మడి వంటివి పదహారు ఫలాల నోములో వినియోగించ వచ్చు. పండు ఏదైనా చక్కనిది కావాలి. పచ్చిది, పుచ్చిపోయినది, కుళ్లినది, దెబ్బతిన్నది, సరైన ఆకారం లేక కుక్క మూతి పిందెలాగా ఉన్నది ఉపయోగించ కూడదు అని పదహారు ఫలాల నోము కథలో ఉంది. పదహారుపళ్లతో పాటు అరటిపండు అదనంగా నివేదించాలి. ఆ పదహారు పళ్లలో దీన్ని కలుపరాదు.

Katyayani Vratam: కాత్యాయని వ్రతం

Image
పరమశివుని అర్ధాంగి పార్వతికి మరో పేరు కాత్యాయని. శ్రీ కాత్యాయని వ్రతాన్ని మార్గశిర మాసంలో చేస్తారు. ముఖ్యంగా మార్గశిర మాసంలో వచ్చే మంగళవారం రోజు ఈ వ్రతాన్ని ఆరంభించాలి. కృత్తికా నక్షత్రంతో కానీ, షష్టి తిథితో కానీ కూడిన మంగళవారం అయితే మరీ మంచిది. కాత్యాయని వ్రత విధానం కాత్యాయని వ్రతాన్ని మార్గశిర మాసంలో మంగళవారం రోజు మొదలుపెట్టి 7 మంగళవారాలు భక్తితో ఆచరించాలి. మధ్యలో ఏ వారమైన ఆటంకం వస్తే ఆపై వారము చేసుకొని 8వ మంగళ వారము ఉద్యాపన చేసుకోవాలి. పూజ విధానం కాత్యాయని వ్రతం ఆచరించే వారు సూర్యోదయంతో నిద్ర లేచి తలారా స్నానం చేసి పూజామందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ వ్రతాన్ని రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం సమయంలో ఆచరించాలి. ముందుగా ఒక పీటపై ఎర్రని వస్త్రాన్ని పరిచి, దానిపై బియ్యాన్ని పోసి, బియ్యం పైన రాగి చెంబు గాని, ఇత్తడి చెంబు గాని ఉంచి, దానిపై టెంకాయను ఉంచి కలశం సిద్ధం చేసుకోవాలి. కలశాన్ని ఎర్రని వస్త్రం అలంకరించాలి. పీటపై శివపార్వతుల చిత్రపటాన్ని ఉంచి గంధం, కుంకుమ, ఎరుపు రంగు పుష్పాలతో అలంకరించాలి. దీపారాధన చేసుకోవాలి. ముందుగా పసుపుతో గణపతిని చేసి పూజించాలి. ఎర్రని అక్షింతలతో పార్వతి పరమేశ్వరులకు...

Pallikondeswara Swamy Temple: శ్రీ పళ్ళికొండేశ్వర స్వామి వారి ఆలయం - సురుటుపల్లి

Image
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా నాగలాపురం మండలంలో సురుటుపల్లి అనే గ్రామంలోని పల్లి కొండేశ్వర క్షేత్రంలో శివుడు పార్వతి ఒడిలో పడుకున్న రూపంలో కనిపిస్తాడు. దేశంలో ఇటువంటి విగ్రహం ఇదొక్కటే ఉండడం విశేషం. శ్రీ మరగదాంబిక సమేత పల్లి కొండేశ్వర స్వామి క్షేత్రంగా ప్రసిద్ది చెందిన ఈ క్షేత్రంలో వెలసిన శివుని శయన భంగిమకు సంబంధించి ఓ ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉన్నది. పల్లి కొండేశ్వర స్వామి క్షేత్రం వెనుక పౌరాణిక గాథ ఉంది. వ్యాస మహర్షి రచించిన శివ మహాపురాణం ప్రకారం, దేవదానవులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేసినప్పుడు ముందుగా హాలాహలం పుట్టింది. ఆ హాలాహలం లోకాలను దహించి వేస్తుండగా, భీతావహులైన సురాసురులు లోకాలను కాపాడాలంటూ పరమేశ్వరుడికి మొరపెట్టుకున్నారు. లోకాలను రక్షించుకోవడానికి శివుడు ఆ కాలకూట విషాన్ని మింగి తన కంఠంలో దాచుకొన్నాడు. ఆ తరువాత శివుడు కైలాసానికి తిరిగి వెళ్లే సమయంలో సురుటుపల్లి ప్రాంతానికి వచ్చేసరికి కాలకూట విష ప్రభావం వలన కొన్ని క్షణాల పాటు ఒక రకమైన మైకాన్ని పొంది పార్వతి ఒడిలో తల పెట్టుకొని శయనించాడట. దేవతల ఉపచారాలు నారదుని ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న దేవతలు, మహర్షులు అక్కడకు హుటాహుటి...

Karvetinagaram Sri Krishna Temple: శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం - కార్వేటినగరం

Image
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో తిరుపతి పట్టణంనుంచి 58 కిలో మీటర్ల దూరంలో కార్వేటినగరం ఉంది. నారాయణవనంను పరిపాలించిన సూర్యవంశరాజులు ఒకసారి వేటకు ఈ ప్రాంతానికి రాగా కుక్కలను కుందేళ్ళ తరుముతుండడం వారి కంటపడింది. దీనిని చూసి ఆశ్చర్యానికి లోనైన వారు ఈ ప్రాంతంలో ఉన్న అడవిని నరికి ఒక ఊరు నిర్మింపజేశారు. అడవిని నరికి కట్టిన ఊరు కనుక ఈ ఊరికి 'కాడువెట్టి నగరం' అనే పేరు ఏర్పడింది. అది కాల క్రమంలో కార్వేటినగరంగా మార్పు చెంది. నట్లు స్థలపురాణం వెల్లడిస్తోంది. 1541వ సంవత్సరంనాటి శాసనం ఈ ఊరిని 'కార్వేడు' అని పేర్కొంది. కార్వేటి అనే దేవత ఈ ప్రాంతంలో కొలువుదీరడం వల్ల ఆమె పేరు మీదే కార్వేటినగరం అని ఈ క్షేత్రానికి పేరు వచ్చినట్లు కూడా ప్రచారంలో ఉంది. శ్రీకృష్ణభగవానుడు ఈ క్షేత్రంలో కొలువుదీరడం వెనుక ఆసక్తికరమైన స్థల పురాణం ప్రచారంలో ఉంది. పూర్వం ఈ ప్రాంతం నారాయణవనం రాజ్యంలో భాగంగా ఉండేది. ఈ రాజ్యాన్ని సూర్య వంశానికి చెందిన కరికాల చోళుడు పరిపాలించాడు. ఆయన కుమారుడు తొండమాన్చక్రవర్తి. తొండమాన్చక్రవర్తి మునిమనవడు నారాయణరాజు. తన పూర్వీకుల మాదిరే నారాయణరాజు కూడా దైవభక్తి పరాయణుడు. ప్...

Maha Kumbha Mela Dates 2025: మహా కుంభమేళా రాజ స్నానం తేదీలు

2025లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనున్న ఈ మహా కుంభమేళాకు దేశవ్యాప్తంగా కోట్లమంది యాత్రికులు భారీగా తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తారు.   సాధారణ కుంభ మేళా  నాలుగేళ్లకోసారి జరుగుతుంది ఆరేళ్లకోసారి జరిగేదాన్ని అర్థకుంభమేళా అంటారు. ఇది హరిద్వారా లేదా ప్రయాగలో జరుగుతుంది.  పూర్ణ కుంభమేళా అనేది పన్నెండేళ్లకోసారి జరుగుతుంది. ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ లో జరుగుతుంది 12 పూర్ణ కుంభమేళాలు పూర్తిచేసిన తర్వాత అంటే 144 సంవత్సరాలకు ఓసారి అలహాబాద్ లో మహాకుంభమేళా నిర్వహిస్తారు.  ప్రస్తుతం జరుగుతున్న పూర్ణ కుంభమేళానే మహాకుంభమేళా అని అంటున్నారు. వాస్తవానికి మహా కుంభమేళా చూసే అదృష్టం ప్రతి మూడు తరాల్లో ఓ తరం వారికి మాత్రమే చూసే అదృష్టం దక్కుతుంది.   సూర్యుడు, బృహస్పతి సింహ రాశిలో ఉన్నప్పుడు కుంభ మేళా నాసిక్ త్రయంబకేశ్వర్ లో నిర్వహిస్తారు సూర్యుడు మేష రాశిలో ఉన్నప్పుడు హరిద్వార్ లో కుంభమేళా నిర్వహిస్తారు గురుడు వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు  ప్రయాగలో కుంభ మేళా నిర్వహిస్తారు బృహస్పతి, సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో  ని...

Tiruppavai Vratam: సిరినోము (తిరుప్పావై వ్రతం) చేసేవారు పూలు ధరించకూడదా? నెయ్యి వాడకూడదా?

Image
  తిరుప్పావై అంటే శ్రీవ్రతం అని అర్ధం. జానుతెనుగులో సిరినోము అంటున్నారు. ఈ వ్రతంలో పాటించాల్సిన నియమాల గురించి ఆండాళ్ తల్లి స్వయంగా చెప్పింది. తెల్లవారుజామున లేచి స్నానం చేయాలి. తలలో పూలు ముడుచుకోకూడదు. కాటుక పెట్టుకోకూడదు. ఆభరణాలు అలంకరించుకోరాదు. పాలు తాగకూడదు. నెయ్యి ఉపయోగించకూడదు. ఇవన్నీ కావ్యాల్లో అలక గృహాన్ని తలపిస్తాయి. పరమాత్మ పతిగా కావాలని నోముపట్టిన గోదాదేవి ఇలాంటి చర్యల ద్వారా 'నీ మీద నేను అలిగాను' అనే సంకేతాన్ని ఆయనకు తెలియచేసింది. 'నేనెలా ఉంటే నీకు నచ్చుతానో అలా నన్ను దిద్దుకో' అని చెబుతూ రంగనాథుని వశం చేసుకుందని కవిపండితుల భావన. అందుకే సిరినోములో భోగవస్తువులను విసర్జించడం సంప్రదాయంగా మారింది. సృష్టిలో ప్రతిదీ పరమాత్మ సృష్టి. ఆయనకు చెందినవే. ఆయనకు సమర్పించవలసినవే అన్నీ. మనం అనుభవించవలసినవి కావు అనే భావన పెంచుకోవాలి. వస్తువులపై వ్యామోహాన్ని విడిచిపెట్టి, పరమాత్మ ధ్యానంలో గడిపితే ఆయన భక్తసులభుడు కనుక నోముఫలాన్ని సంపూర్ణంగా అనుగ్రహిస్తాడు.

Dhanurmasam Importance: ధనుర్మాస విశిష్టత

Image
ధనుర్మాసానికి ప్రతి ఏడాది అత్యంత విశేష ప్రాధాన్యమిస్తారు. ఎందుకంటే దీని పౌరాణిక వైశిష్టం అలాంటిది.  ఇది దేవతలకు బ్రాహ్మీ ముహూర్తం వంటిదనీ అంటారు.  సమస్త విష్ణు ఆలయాలూ, సూర్య దేవాలయాలు ఈ నెల రోజులూ విశేష పూజలతో కళకళలాడుతుంటాయి.  ప్రత్యేకించి అశేష సంఖ్యలో వైష్ణవ భక్తులు ధనుర్మాస వ్రతం ఆచరిస్తారు.  తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో అయితే ఏకంగా ఈ మాసమన్ని రోజులు ప్రత్యేకించి తిరుప్పావై గానం చేస్తారు.  భూదేవి అవతారంగా చెప్పే ఆండాళ్ రచించిన దివ్యప్రబంధమే తిరుప్పావై.  ద్రావిడంలో తిరు అంటే పవ్రితమని, పావై అంటే వ్రతం అని అర్థం.  ఆయా విష్ణు దేవాలయాలలో ఉదయమే అర్చనతో నివేదనలు చేసి ప్రసాదాలను పిల్లలకు పంచుతారు. దీనినే బాలభోగం అంటారు.  ఆండాళమ్మ పూజ, తిరుప్పావై పఠనం, గోదా కళ్యాణం వంటి కార్యక్రమాలన్నీ ఈ మాసంలోనే నిర్వహిస్తారు.  అన్ని రోజులూ ఉదయం, సాయంత్రం దీపారాధనలు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుందంటారు.  ప్రతి రోజూ బ్రాహ్మీ ముహూర్తంలో పారాయణాలు అత్యంత పుణ్యప్రదమనీ అంటారు.

Tiruppavai: తిరుప్పావై - శ్రీ వ్రతము

Image
తిరుప్పావై అంటే శ్రీ వ్రతము. శ్రీ అంటే సంపద. అన్ని సంపదలను ఇచ్చే ఈ నోమునే ధనుర్మాస వ్రతం అంటారు. డిసెంబర్ మధ్యలో ధనూరాశిలో సూర్యుడు ప్రవేశించినప్పటి నుండి జనవరి 14న మకరంలోకి వచ్చేవరకు ధనుర్మాసం అంటారు. మృగశిర నక్షత్రంతో కూడిన పూర్ణిమ ఉన్న మాసాన్ని మార్గశీర్షం అంటారు. ఈ రెండూ ఒకటే. చాంద్రమానమును బట్టి మార్గశీర్షం అయితే, సౌరమానాన్ని బట్టి ధనుర్మాసం అవుతుంది. మార్గము అనగా దారి లేదా ఉపాయం. శీర్షం అంటే శిరసువలె ప్రధానమైంది. అందుకే భగవానుని పొందడానికి శ్రేష్ఠమైన ఉపాయమే ఈ వ్రతం అని ఉపనిషత్ సిద్ధాంతం. భగవానుడే ఉపాయం. ఇతరములేవీ కావు అనే విశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది ఈ వ్రతం. ఉపనిషత్తు భాషలో ధనుస్సు అనగా ప్రణవం. అంటే ఓంకారం. ఇదే భగవంతుని తెలియజేసే శబ్దం. ఆ ప్రణవాన్ని ఉపాసించడం ద్వారా పరమాత్మను చేరు మార్గము ధనుర్మాస వ్రతం.  దేవదేవుడితో భక్తహృదయాల చెలిమి దివ్యమైన వూహలకు హేతువుగా మారుతుంది. ఆ అనుభవాల్ని రామాయణంలో హనుమంతుడు, లక్ష్మణుడు; భారత భాగవతాల్లో అర్జునుడు, సుదాముడు సొంతం చేసుకున్నారు. గోప గోపికలు కృష్ణభగవానుడి సాన్నిహిత్యంలో ఓలలాడారు. అలాంటి శుద్ధ భక్తికి ఆద్యులైనవారి జాబితాలో ఆళ్వార్ల...

Dhanurmasa Vratam: ధనుర్మాస వ్రతం

Image
  ధనుర్మాస వ్రతం గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం. ధనుర్మాస వ్రతానికి సంబంధించిన అంశాలు బ్రహ్మాండ, ఆదిత్య పురాణాలు, భాగవతం, నారాయణ సంహితాల్లోనూ కనిపిస్తాయి. ధనుర్మాసంలో గోదాదేవి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణుని భర్తగా పొందింది. ఈ మాసమంతా శ్రీ మహా విష్ణువును మధుసూధనుడు పేరుతో పూజించి, మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత పదిహేను రోజులు దద్యోజనం నివేదించాలి. మార్గళి వ్రతం పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలు తమ ఇంటి ముందు ముగ్గులు, గొబ్బెమ్మలతో పూజ చేయడం వలన కోరిన వరుడు లభిస్తాడు. గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది. రోజూ ఒక కీర్తనతో ఆమె స్వామిని కీర్తించేది. ఈ వ్రతం వల్ల మోక్షం సిద్ధిస్తుంది. ధనుర్మాసంలో రోజూ శ్రీకృష్ణుడికి తులసి మాల సమర్పించే మహిళలకు నచ్చిన వరుడితో వివాహం జరుగుతుంది. తిరుప్పావై విశిష్టత గోదాదేవిగా జన్మించిన ఆండాళ్ భగవంతుడినే భర్తగా భావించి, ఆయన్ను చేరుకోవడానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పావై. 'తిరు' అంటే శ్రీ అని, ''పావై'' అంటే పాటలు లేదా వ్రతం అని అర...

Dhanurmasam: ధనుర్మాసంలో శుభకార్యాలు ఎందుకు చేయరు?

ఏడాది పొడవునా నిత్య దైనందిన కార్యక్రమాలతో ఉంటూ భగవంతుని కోసం సమయం కేటాయించలేని వారి కోసమే ఈ ధనుర్మాసం. అందుకే ఈ నెలలో ఎలాంటి శుభకార్యాలు చేయరు. శుభకార్యాలు ఉండవు కాబట్టి ఈ మాసాన్ని శూన్యమాసం అంటారు. ఎందుకంటే రవి ధనస్సు రాశిలోకి ప్రవేశించి మకరంలోకి వెళ్ళే సమయమే ధనుర్మాసం. ధనుస్సు, మీనంలో రవి ఉన్నప్పుడు, సూర్యుని రాశి అయిన బృహస్పతిలో ఉన్నప్పుడు ఏ శుభకార్యాన్ని నిర్వహించకూడదు. కేవలం పండుగ వాతావరణంతో అంతా సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ మాసంలో ఎక్కువగా సూర్య నమస్కారాలు చేస్తారు. ఇంకా విష్ణుముర్తిని నిత్యం వేకువనే పూజించడం శుభం.

Ganagapur Datta Swamy Temple: శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయం - గాణగాపురం

Image
కర్ణాటకలోని గుల్బర్గా జిల్లాలో గాణగాపురం క్షేత్రం ఉంది. ఆలయ స్థల పురాణం అత్రి మహర్షి భార్య మహా సాధ్వి అనసూయమ్మ పాతివ్రత్యాన్ని పరీక్షించడానికి వచ్చిన త్రిమూర్తులను అనసూయ పసి బాలురుగా మార్చి వేయగా లక్ష్మి సరస్వతి పార్వతి అనసూయను ప్రార్ధించి తమ పతులను తిరిగి పొందగా అప్పుడు త్రిమూర్తుల అనుగ్రహంతో అత్రి అనసూయలకు త్రిమూర్తుల అంశగా దత్తుడిగా జన్మిస్తాడు. ఆ దత్తాత్రేయుని రెండవ అవతారమే శ్రీ నరసింహ సరస్వతిగా అవతరించినట్లుగా కథనం. అలా అవతరించిన శ్రీ నరసింహ సరస్వతి కాశీకి వెళ్ళి కృష్ణ సరస్వతి స్వామి దగ్గర సన్యాస దీక్షను చేపట్టి దేశమంతా తీర్ధ యాత్రలు చేస్తూ చివరకు కర్ణాటకలోని గాణగాపురంకు వచ్చి 23 సంవత్సరాలు అక్కడే ఉండి చివరకు తన పాదుకలను అక్కడే వదిలేసి శ్రీశైలంలోని కదళీ వనంలో అవతార పరిసమాప్తి గావించాడని పురాణగాథ. పాదుకలకు పూజ అలా నరసింహ సరస్వతి స్వామి వారు గాణగాపురంలో విడిచి వెళ్లిన పాదుకలను నిర్గుణ పాదుకలు అని అంటారు. నిర్గుణం అంటే ఎలాంటి ఆకారం లేనిదని అర్ధం. ఇలాంటి నిర్గుణ పాదుకలు ఒక్క గాణగాపురంలో తప్ప ప్రపంచంలో ఎక్కడ చూడలేం. ఈ పాదుకలనే స్వామిగా భావించి పూజలు జరుపుతారు. గాణగాపురం లోని స్వామి పాద...

Kuladevata Puja: కులదేవతలు అని ఎవరిని అంటారు? వారిని తప్పక పూజించాలా?

Image
రఘువంశరాజులకి కులదేవత సూర్యుడు. సూర్యుని పూజించిన తరువాతనే వారు ఇతర దేవతలను ఆరాధన చేసేవారు.  కులం అనే మాటకి సమాన లక్షణాలున్న సముదాయం, గుంపు అని అర్థం.  ఈ కాలంలో అది వర్ణభేదం అనే అర్ధంలో వాడుకలోకి వచ్చింది.  కానీ కులం అంటే వంశం అనే అర్థం సరైనది. ఒక వంశంలో తరతరాలుగా పూజలందుకునే దైవాన్ని కులదేవత అంటారు. ప్రతివంశానికి ఒకకులదేవత ఉంటుంది. ఇష్టదేవతారాధనకు ముందు కులదేవతారాధన చేయడం తప్పనిసరి.

Sri Vari Darshan: శ్రీవారి దర్శనం సమగ్ర సమాచారం | తిరుమలలో వివిధ రకాల దర్శనాలు

Image
తిరుమల కొండకు ప్రణాళికాబద్ధంగా వచ్చే భక్తులకు శ్రీనివాసుడి దర్శనం కష్టమేమి కాదు. ప్రస్తుతం టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాల గురించి తెలుసుకుంటే భక్తులు వ్యయప్రయాసలను తప్పించుకోవచ్చు. గంటల తరబడి క్యూలైన్లు, కంపార్టుమెంట్లలో నిరీక్షణ కష్టాలు లేకుండ దూరం కావచ్చు. దర్శనాన్ని సులభతరం చేసుకోవచ్చు. శ్రీవారి సర్వదర్శనం తిరుమలకు వచ్చే భక్తులు ఎలాంటి టికెట్లు లేకుండా ఆ శ్రీవారిని దర్శించుకోవచ్చు. వీరందరిని క్యూలైన్ల నుంచి వైకుంఠం-2లోని 32 గదుల గుండా (ఒక్కో గదిలో 450 మంది వరకు) పంపిస్తారు. అక్కడినుంచి స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ గదులు నిండితే నారాయణగిరి గార్డెన్స్‌ వద్ద ఏర్పాటుచేసిన మరో తొమ్మిది కంపార్టుమెంట్లలో (ఒక్కో దానిలో 900 మంది) దర్శనానికి వేచి చూసే అవకాశం ఉంటుంది. చివరికి అవీ కూడా నిండితే క్యూలైన్లలో నిల్చోవాల్సి వస్తుంది. క్యూలైన్‌ నుంచి వైకుంఠం-2లోకి ప్రవేశించే సమయంలో దర్శనం ఎన్ని గంటలకు ఉంటుందో సూచిస్తూ ఓ టోకెన్‌ ఇస్తారు. దర్శనానికి ఎక్కువ సమయం ఉంటే అక్కడినుంచి బయటకు వచ్చి కేటాయించిన దర్శన సమయానికి గంట ముందు పశ్చిమ మాడ వీధి నుంచి మ్యూజియం వెళ్లే దారిలో ఉన్న మార్గంలో కంపార్టుమెంటు...

Dattatreya Jayanti: దత్త జయంతి

Image
మార్గశిర శుద్ధ చతుర్దశి దత్తజయంతిగా చెప్పబడింది.  అత్రిమహర్షి, అనసూయలకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశతో దత్తాత్రేయుడు ఈ చతుర్దశినాడే జన్మించాడు. ఆధ్యాత్మిక సాధనకు మూలమైన యోగవిద్యకు ఈ దత్తాత్రేయుడే పరమగురువు. ఈ రోజున దత్తాత్రేయుల వారిని విశేషంగా పూజించాలి. ఈ స్వామిని పూజించడంవల్ల జ్ఞానం లభించడమే కాకుండా, ఆయురారోగ్యాలు కూడా లభిస్తాయి. అంతేకాకుండా కష్టాలన్నీ తొలగిపోయి ఎంతటి జటిల సమస్యలైనా పరిస్కారాలు లభిస్తాయి. ఇంకా భూత,ప్రేత, పిశాచాల పీడ కూడా తొలగిపోతుంది. ఈ రోజున దత్తాత్రేయుని పూజించడంతో పాటు, గురుగీత పారాయణం చేయడం కూడా ఎంతో మంచిది. ఈ దత్తజయంతిని కొన్ని ప్రాంతాలలో మార్గశిర పౌర్ణమి రోజున ఆచరించే సంప్రదాయం కూడా ఉంది.  వ్యాస మహర్షి రచించిన నారద పురాణం, భవిష్యోత్తర పురాణం ప్రకారం దత్తాత్రేయుడు ముక్కోటి దేవతల అవతారమని తెలుస్తోంది. మూడు తలలు, ఆరు చేతులు, శంఖం, చక్రం, త్రిశూల ఆయుధాలు, తన వెంట నాలుగు శునకాలు, గోమాతతో కూడిన దత్త స్వరూపాన్ని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే త్రిమూర్తులను ఆరాధించేనట్టేనని విశ్వాసం. దత్తాత్రేయుని బ్రహ్మచారి, సన్యాసిగా కూడా పూజిస్తారు. దత్తాత్రేయ స్వామి ప్రదోష కాల...

Hanumad Vratam: హనుమద్ వ్రతం

Image
హనుమద్ వ్రతం మార్గశిర మాసంలో శుక్ల పక్షం పదమూడవ (త్రయోదశి) రోజు జరుపుకుంటారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశం లో ఈ పండుగ జరుపుకుంటారు. ఇంట్లో ఎవరు అయిన ఈ వ్రతం ఆచరించవచ్చు. ఉదయానే లేచి ఇంటిని శుభ్రం చేసి, స్నానం చేసిన తరువాత అంజనేయ స్వామి పూజ చేయాలి. హనుమాన్ చాలీసా, సుందరకాండ, హనుమాన్  అష్టోత్తరం, వంటివి పఠించాలి. హనుమంతుడికి నైవేద్యం సమర్పించాలి. ఈ వ్రతం ఆచరించిన వారికీ ఆరోగ్యం, ఐశ్వర్యం, తోపాటు అని రకాల భయాలు కూడా తొలగిపోతాయి. విభీషణుడి కుమారుడు నీలుడు. ఇతనికి స్వర్గలోకంలో ఉన్న చింతామణి, కల్పవృక్షం, కామధేనువు పొందాలని కోరిక కలుగుతుంది. తండ్రి సూచన మేరకు కులగురువైన శుక్రాచార్యుణ్ణి సేవించి, పంచముఖ హనున్మహా విద్య ఉపదేశం పొందుతాడు. ఆ మంత్రోపాసనతో గురుసమక్షంలోనే హనుమద్ర్వతం చేస్తాడు. వెంటనే, స్వామి ప్రత్యక్షమై నీలుడికి పంచముఖ హనుమత్కవచాన్ని అనుగ్రహిస్తాడు. అంతేకాదు, ఇంద్రుడితో జరగబోయే సంగ్రామంలో తోడుండి విజయం సాధించిపెడతానని మాటఇస్తాడు. ఈ విధంగా చింతామణి, కల్పవృక్షం, కామధేనువుతో పాటు ఇంద్ర కుమార్తె వనసుందరి కూడా నీలునికి భార్యగా లభిస్తుంది.  భారతకాలంలో అరణ్యవాసం చేస్తున్న ధర్మరాజు భార్...