పదహారు ఫలాల నోములో ఏ పళ్లను వినియోగించాలి?
దేవుడికి నివేదన చేసే పళ్లు సహజమైనవి అయివుండాలి. యాపిల్, రేగు, మేడి వంటి పళ్లు పనికి రావు. పురుగులు పట్టడానికి ఎక్కువ అవకాశం ఉన్నపళ్లు పనికిరావు. అలాగే గింజ లేని పళ్ళు పనికి రావు. గింజ వంశాభివృద్ధికి దోహదం చేసేది. అందుకే నోముల్లో గింజలేని పండు ఇవ్వరు. సీతాఫలం, సపోటా, పుచ్చకాయ వంటివి నల్లని గింజలతో ఉంటాయి కనుక అవికూడా పనికి రావు. కొబ్బరి, మామిడి, నారింజ, దోస, ద్రాక్ష, దబ్బ, నిమ్మ, రామాఫలం, పనస, పంపర పనస, దానిమ్మ, మాదీఫలం, జామ, వెలగ, ఖర్జూరం, గుమ్మడి వంటివి పదహారు ఫలాల నోములో వినియోగించ వచ్చు. పండు ఏదైనా చక్కనిది కావాలి. పచ్చిది, పుచ్చిపోయినది, కుళ్లినది, దెబ్బతిన్నది, సరైన ఆకారం లేక కుక్క మూతి పిందెలాగా ఉన్నది ఉపయోగించ కూడదు అని పదహారు ఫలాల నోము కథలో ఉంది. పదహారుపళ్లతో పాటు అరటిపండు అదనంగా నివేదించాలి. ఆ పదహారు పళ్లలో దీన్ని కలుపరాదు.
Comments
Post a Comment