Tiruppavai Vratam: సిరినోము (తిరుప్పావై వ్రతం) చేసేవారు పూలు ధరించకూడదా? నెయ్యి వాడకూడదా?
తిరుప్పావై అంటే శ్రీవ్రతం అని అర్ధం. జానుతెనుగులో సిరినోము అంటున్నారు. ఈ వ్రతంలో పాటించాల్సిన నియమాల గురించి ఆండాళ్ తల్లి స్వయంగా చెప్పింది. తెల్లవారుజామున లేచి స్నానం చేయాలి. తలలో పూలు ముడుచుకోకూడదు. కాటుక పెట్టుకోకూడదు. ఆభరణాలు అలంకరించుకోరాదు. పాలు తాగకూడదు. నెయ్యి ఉపయోగించకూడదు. ఇవన్నీ కావ్యాల్లో అలక గృహాన్ని తలపిస్తాయి. పరమాత్మ పతిగా కావాలని నోముపట్టిన గోదాదేవి ఇలాంటి చర్యల ద్వారా 'నీ మీద నేను అలిగాను' అనే సంకేతాన్ని ఆయనకు తెలియచేసింది. 'నేనెలా ఉంటే నీకు నచ్చుతానో అలా నన్ను దిద్దుకో' అని చెబుతూ రంగనాథుని వశం చేసుకుందని కవిపండితుల భావన. అందుకే సిరినోములో భోగవస్తువులను విసర్జించడం సంప్రదాయంగా మారింది. సృష్టిలో ప్రతిదీ పరమాత్మ సృష్టి. ఆయనకు చెందినవే. ఆయనకు సమర్పించవలసినవే అన్నీ. మనం అనుభవించవలసినవి కావు అనే భావన పెంచుకోవాలి. వస్తువులపై వ్యామోహాన్ని విడిచిపెట్టి, పరమాత్మ ధ్యానంలో గడిపితే ఆయన భక్తసులభుడు కనుక నోముఫలాన్ని సంపూర్ణంగా అనుగ్రహిస్తాడు.
Comments
Post a Comment