Maha Kumbha Mela Dates 2025: మహా కుంభమేళా రాజ స్నానం తేదీలు
2025లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనున్న ఈ మహా కుంభమేళాకు దేశవ్యాప్తంగా కోట్లమంది యాత్రికులు భారీగా తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తారు.
సాధారణ కుంభ మేళా నాలుగేళ్లకోసారి జరుగుతుంది
ఆరేళ్లకోసారి జరిగేదాన్ని అర్థకుంభమేళా అంటారు. ఇది హరిద్వారా లేదా ప్రయాగలో జరుగుతుంది.
పూర్ణ కుంభమేళా అనేది పన్నెండేళ్లకోసారి జరుగుతుంది. ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ లో జరుగుతుంది
12 పూర్ణ కుంభమేళాలు పూర్తిచేసిన తర్వాత అంటే 144 సంవత్సరాలకు ఓసారి అలహాబాద్ లో మహాకుంభమేళా నిర్వహిస్తారు.
ప్రస్తుతం జరుగుతున్న పూర్ణ కుంభమేళానే మహాకుంభమేళా అని అంటున్నారు. వాస్తవానికి మహా కుంభమేళా చూసే అదృష్టం ప్రతి మూడు తరాల్లో ఓ తరం వారికి మాత్రమే చూసే అదృష్టం దక్కుతుంది.
సూర్యుడు, బృహస్పతి సింహ రాశిలో ఉన్నప్పుడు కుంభ మేళా నాసిక్ త్రయంబకేశ్వర్ లో నిర్వహిస్తారు
సూర్యుడు మేష రాశిలో ఉన్నప్పుడు హరిద్వార్ లో కుంభమేళా నిర్వహిస్తారు
గురుడు వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగలో కుంభ మేళా నిర్వహిస్తారు
బృహస్పతి, సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో నిర్వహిస్తారు
2025 జనవరి 13 పౌర్ణమి రోజు నుంచి ఫిబ్రవరి 26 త్రయోదశి బుధవారం మహాశివరాత్రి వరకూ కుంభమేళా జరుగుతుంది. గంగ, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమ క్షేత్రం అయిన ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ మేళా జరుగుతుంది. దాదాపు 45 రోజుల పాటూ సాగే ఈ ఆధ్యాత్మిక ఉత్సవంలో స్నానం ఆచరించేందుకు ముఖ్యమైన తిథులేంటో ప్రత్యేకంగా చెబుతారు. ఆ విశేష తిథుల్లో స్నానమాచరించడాన్ని రాజస్నానం అంటారు. కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరిస్తే సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయని, సమస్త పాపాలు తొలగి మోక్షం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం.
2025 జనవరి 13 పుష్య పూర్ణిమ కుంభమేళాల్లో చేసే స్నానాల్లో అత్యంత పవిత్రమైన రాజ స్నానం ఈ రోజు చేస్తారు
రెండో రాజ స్నానం- 2025 జనవరి 14 మకర సంక్రాంతి
మూడో రాజ స్నానం - 2025 జనవరి 29 మౌని అమావాస్య
నాలుగో రాజ స్నానం - 2025 ఫిబ్రవరి 3 వసంత పంచమి
ఐదో రాజ స్నానం - 2025 ఫిబ్రవరి 4- అచల నవమి
ఆరో రాజ స్నానం - 2025 ఫిబ్రవరి 12 మాఘ పూర్ణిమ
చివరి రాజ స్నానం - 2025 ఫిబ్రవరి 26 మహా శివరాత్రి
మహా కుంభమేళాకు సంబంధించి పురాణాల ప్రకారం ఓ కథ ప్రచారంలో ఉంది. అమృతం కోసం క్షీరసాగర మథనం చేసినతర్వాత వెలువడిన అమృత భాండం కోసం దేవతలు, రాక్షసుల మధ్య 12 రోజుల పాటూ భీకరమైన యుద్ధం జరిగింది...అంటే ఈ 12 రోజులు భూమిపై 12 ఏళ్లతో సమానం. ఈ సమయంలో అమృత భాండం నుంచి కొన్ని చుక్కలు భూమిపై పడ్డాయి. అలా అమృతం ఒలికిన ఆ నాలు ప్రదేశాలే ప్రయాగరాజ్, ఉజ్జయిని, హరిద్వార్, నాసిక్. అందుకే ఈ ప్రదేశాలను అత్యంత పవిత్రమైనవిగా పరిగణిస్తారు. అందుకే ఈ ప్రదేశాల్లో 12 ఏళ్లకు ఓసారి కుంభమేళా నిర్వహిస్తారు.
Comments
Post a Comment