Hanumad Vratam: హనుమద్ వ్రతం

  • హనుమద్ వ్రతం మార్గశిర మాసంలో శుక్ల పక్షం పదమూడవ (త్రయోదశి) రోజు జరుపుకుంటారు.
  • ముఖ్యంగా దక్షిణ భారతదేశం లో ఈ పండుగ జరుపుకుంటారు.
  • ఇంట్లో ఎవరు అయిన ఈ వ్రతం ఆచరించవచ్చు.
  • ఉదయానే లేచి ఇంటిని శుభ్రం చేసి, స్నానం చేసిన తరువాత అంజనేయ స్వామి పూజ చేయాలి.
  • హనుమాన్ చాలీసా, సుందరకాండ, హనుమాన్  అష్టోత్తరం, వంటివి పఠించాలి.
  • హనుమంతుడికి నైవేద్యం సమర్పించాలి.
  • ఈ వ్రతం ఆచరించిన వారికీ ఆరోగ్యం, ఐశ్వర్యం, తోపాటు అని రకాల భయాలు కూడా తొలగిపోతాయి.
విభీషణుడి కుమారుడు నీలుడు. ఇతనికి స్వర్గలోకంలో ఉన్న చింతామణి, కల్పవృక్షం, కామధేనువు పొందాలని కోరిక కలుగుతుంది. తండ్రి సూచన మేరకు కులగురువైన శుక్రాచార్యుణ్ణి సేవించి, పంచముఖ హనున్మహా విద్య ఉపదేశం పొందుతాడు. ఆ మంత్రోపాసనతో గురుసమక్షంలోనే హనుమద్ర్వతం చేస్తాడు. వెంటనే, స్వామి ప్రత్యక్షమై నీలుడికి పంచముఖ హనుమత్కవచాన్ని అనుగ్రహిస్తాడు. అంతేకాదు, ఇంద్రుడితో జరగబోయే సంగ్రామంలో తోడుండి విజయం సాధించిపెడతానని మాటఇస్తాడు. ఈ విధంగా చింతామణి, కల్పవృక్షం, కామధేనువుతో పాటు ఇంద్ర కుమార్తె వనసుందరి కూడా నీలునికి భార్యగా లభిస్తుంది. 

భారతకాలంలో అరణ్యవాసం చేస్తున్న ధర్మరాజు భార్య, తమ్ముళ్లతో హనుమద్ర్వతం చేసి జూదంలో కోల్పోయిన రాజ్యం, సకల సంపదలు పొందుతాడు. ఈ వ్రత ఫలితంగానే ఆంజనేయుడు జెండాపై కపిరాజుగా అర్జున రథంపై ఉండి, హుంకార నాదంతోనే శత్రువుల గుండెలు బద్దలు చేస్తాడు. శత్రురాజుల దుర్మార్గాల కారణంగా రాజ్యాన్ని కోల్పోతాడు చంద్రవంశ రాజు సోమదత్తుడు. గురువైన గర్గాచార్యుని ఉపదేశంతో పంచముఖాంజనేయోపాసన చేసి, హనుమద్ర్వతం చేస్తాడు. ఫలితంగా హనుమదనుగ్రహాన్ని పొందుతాడు. పోయిన రాజ్యం మొత్తం అతనికి లభిస్తుంది. వేయి సంవత్సరాల పాటు ప్రజారంజకంగా, ధర్మమార్గంలో రాజ్యాన్ని పరిపాలిస్తాడు.

వ్రత విధానం

హనుమద్ర్వతం చేయదలచుకున్న వారు శుభముహూర్తంలో సకల సంబారాలు సమకూర్చుకోవాలి. ముందురోజు ఉపవాసం చేసి బ్రహ్మచర్యం పాటించాలి. మర్నాడు సంధ్యాది విధులు పూర్తిచేసుకుని, గురుసమక్షంలో విధివిధానంగా వ్రతం చేసుకోవాలి. పూజా కార్యక్రమాలు పూర్తి చేసి హారతి, నివేదన ఇవ్వాలి. అనంతరం బ్రాహ్మణులను పూజించాలి. ప్రత్యేకించి బ్రహ్మచారులను హనుమత్ స్వరూపంగా అర్చించాలి. అప్పాలు వాయనం ఇవ్వాలి. తర్వాత దంపతి పూజ చేయాలి. అనంతరం అన్నసమారాధన చేసి, బంధు మిత్రాదులతో కలసి భోజనం చేయాలి.

పూజాకలశంతో పాటు మరో కలశంలో కూడా నీరు తీసుకోవాలి. అందులోకి పంపానదీ దేవతను ఆహ్వానించి పూజ చేయాలి. ఆ కలశోదకంతోనే ఆంజనేయునికి పూజలు నిర్వహించాలి. మంటపారాధనలో ఆవాహిత దేవతలతో పాటు హనుమత్పరివారాన్ని (నలుడు, నీలుడు,
సుగ్రీవుడు, జాంబవంతుడు, అంగదుడు, సుషేణుడు,తార, మైందుడు, ద్వివిదుడు తదితరులు) కూడా ఆవాహన చేయాలి. వారికి కూడా అర్చనలు చేయాలి. వ్రతం చివరలో తోర పూజ చేసి ధరించాలి. గురూపదేశం ప్రకారం సాధన చేస్తున్న హనుమద్ర్వతంలో బీజాక్షరాల సంఖ్యతో ముడులు వేయాలి. కాబట్టి, హనుమద్ర్వతాన్ని కేవలం గురూపదేశం ప్రకారమే చేసుకోవాలి. తోరానికి ఎన్ని ముళ్ళు వేస్తామో అన్ని సంవత్సరాలు వ్రతం చేసుకుని, చివరగా కల్పోక్తంగా ఉద్యాపన చేసుకోవాలి. ఈవిధంగా సమంత్రకంగా, గురూపదేశం ప్రకారం హనుమద్ర్వతాన్ని ఆచరించటం వల్ల సకల కార్యసిద్ధి కలుగుతుందని పరాశర సంహిత చెబుతుంది. కేవలం వ్రతం
చేస్తామని, త్రికరణశుద్ధిగా సంకల్పం చేసుకుంటేనే స్వామి భక్తుల కోరికలు నెరవేరుస్తారని సంహిత చెబుతోంది." మార్గశిర శుక్ల త్రయోదశినాడు హనుమద్ర్వతం చేసుకోవటం సకల శుభఫలితాలను ఇస్తుందని పరాశర సంహిత వచనం. సీతాన్వేషణలో భాగంగా సముద్రలంఘనం చేసింది, లంకకు చేరుకుని అశోకవనంలో ఉన్న సీతమ్మను హనుమ మొదటగా దర్శించింది ఈ రోజే. అందుకే ఈ రోజున హనుమద్ర్వతం చేసుకుంటే సకల దుఃఖాలు తొలగి కార్యసిద్ధి కలుగుతుంది. సంవత్సరంలో ఎప్పుడైనా ఆదివారం, హస్త నక్షత్రం కలిసిన రోజు కూడా వ్రతం చేసుకోవచ్చు.

2024 తేదీ:  డిసెంబర్ 13.  

Comments

Popular posts from this blog

Magha Puranam Telugu: మాఘ పురాణం 4వ అధ్యాయం- ఓ శునకం విష్ణుమూర్తిని పూజించి చక్రవర్తిగా మారిన కథ

Yadagirigutta Brahmotsavam 2025: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - యాదగిరిగుట్ట

Jubilee hills Venkateswara Temple: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - జూబ్లీహిల్స్

Sri Raghavendra Swamy Jayanti: శ్రీ రాఘవేంద్ర స్వామి జయంతి 2025

Magha Puranam Telugu: మాఘ పురాణం 24వ అధ్యాయం - సహవాస దోషంతో అష్టకష్టాలు పడిన విప్రుని కథ

Bhojana Niyamalu: నిత్యం తినే ఆహారంలో దోషాలు

Ganagapur Datta Swamy Temple: శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయం - గాణగాపురం

Bhadrapada Masam: భాద్రపద మాసం 2024

Pournami Garuda Seva: తిరుమల పౌర్ణమి గరుడ సేవ 2024 తేదీలు

Govatsa Dwadasi: గోవత్స ద్వాదశి