- మోక్షద ఏకాదశిని మార్గశిర మాసం శుక్ల పక్షం పదకొండవరోజు జరుపుకుంటారు
- దీనిని మౌన ఏకాదశి అని కూడా పిలుస్తారు.అదే రోజు గీత జయంతి.
- గీత జయంతి అంటే భాగవతం ప్రకారం శ్రీకృష్ణుడు అర్జనుడికి గీతాసారం బోధించింది ఈ రోజే.
- మోక్షద ఏకాదశి గురించి శ్రీకృష్ణుడు ధర్మరాజుకి చేపినట్టు బ్రహ్మాండ పురాణంలో వుంది.
- మోక్షద ఏకాదశి రోజు ఉదయం నుంచి ఉపవాసం ఉంటారు, వైష్ణవ ఆలయం దర్శిస్తారు.
- ఉపవాసం ఉందా లేని వారు పాలు, పండ్లు తింటారు.
పూర్వం ఈ వ్రతం వైఖాసనుడు అనే రాజు ఆచరించి మోక్షాన్ని పొందినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. ప్రతి సంవత్సరం ఈ వ్రతం నియమ నిష్టలతో పాటిస్తున్న వారికి మరణం తరువాత మోక్షం లభిస్తుందని విశ్వసిస్తారు. పూర్తిగా ఉపవాసం పాటించలేని వారు పాలు, పండ్లు సేవించవచ్చు. మోక్షదా ఏకాదశి రోజున వ్రతం పాటించని వారు కూడా బియ్యం, ధాన్యాలు, ఉల్లిపాయ, వెల్లుల్లి తినకూడదు. విష్ణుమూర్తిని పూజించడం వలన లక్ష్మిదేవి కరుణా కటాక్షాలు కూడా లభిస్తాయని పండితులు చెబుతున్నారు.
మోక్షద ఏకాదశి రోజున పవిత్ర గ్రంథమైన భగవద్గీతను కూడా పూజిస్తారు. సాయంత్రం వైష్ణవాలయాలను దర్శిస్తారు. ఈ రోజున భగవద్గీతతో పాటు, విష్ణు సహస్రనామం, ముకుందాష్టకం చదవడం శుభప్రదమని శాస్త్ర వచనం.
2024 తేదీ: డిసెంబర్ 11.
Comments
Post a Comment