Posts

Showing posts from August, 2024

Tirumala Varaha Swamy: తిరుమలలో ముందుగా వరాహస్వామినే ఎందుకు దర్శించుకోవాలి ?

Image
తిరుమల వరాహమూర్తి సొంతం. శ్రీవారు అక్కడ ఉండటానికి వరాహమూర్తి అనుమతి పొందాడు. అందుకు శ్రీనివాసుడు తన దగ్గర వచ్చే భక్తులు ముందుగా నిన్ను దర్శించుకుంటారు అని వరాహమూర్తికి మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం వరాహమూర్తి దర్శించుకున్న తరువాత శ్రీ వారిని దర్శించుకోవడం తిరుమల సంప్రదాయం. శ్రీ వారి పుష్కరిణికి ప్రక్కనే మనకు శ్రీ వరాహమూర్తి స్వామి వారి ఆలయం ఉంటుంది. 

Ganesh Deeksha: గణపతి దీక్ష

Image
సాధారణంగా లోకంలో ఎన్నో దీక్షలున్నాయి. కాని అన్నింటిలోనూ గణపతి దీక్ష అత్యంత సులభసాధ్యమైనది, అన్నివేళల్లో అందరూ సులభంగా ఆచరించదగినది. ఎక్కువ నియమ నిబంధనలు లేకుండా, ఏ ఇబ్బందులూ కష్టాలూ లేకుండా బాలల నుంచి వృద్ధుల వరకూ, స్త్రీ, పురుషులందరూ చేయగలిగినది. గణపతి దీక్షను వినాయకుడి ఆలయంలో ఒక శుభముహూర్తాన స్వీకరించాలి. దీక్ష తీసుకునే రోజు అభ్యంగ స్నానమాచరించి గణపతి ముందు రెండు చేతులు జోడించి, ‘ఓ గణేశా! ఈ రోజు నుంచి నీ దీక్షావ్రతాన్ని అవలంబించి యథాశక్తి నిన్ను సేవిస్తాను. దీక్షా సమయంలో ఏ విధమైన విఘ్నాలూ కలగకుండా నా కోరికను నెరవేర్చి నీ అనుగ్రహాన్ని ప్రసాదించ’మని ప్రార్థించుకోవాలి.   బంగారు రంగుతో మెరుస్తూ ఉన్న కొత్త వస్త్రాలను లేదా లేత ఎరుపురంగు వస్త్రాలు ధరించాలి   గణపతి చిహ్నంతో ఉన్న ఒక మాల,కంకణం  ధరించాలి. దీక్షను స్వీకరించే ముందు – ఆదిదేవ గణాధ్యక్ష! త్వదనుగ్రహకారకం!దీక్షాం స్వీకృత్యత్వతేవాం కరోమీప్సిత సిద్ధయే!  అనే దీక్షా మంత్రాన్ని పఠిస్తూ మాలను మెడలో ధరించాలి. చేతికి కంకణాన్ని ధరించాలి. మన కోరికను అనుసరించి 3, 5, 11, 21, 41 రోజులు లేదా శుద్ధ చవితి నుంచి బహుళ చవితి...

Ranjangaon Ganpati Temple: రంజన్ గావ్ మహాగణపతి ఆలయం

Image
  అష్టవినాయక క్షేత్రాలలో ఎనిమిదో క్షేత్రమైన రంజన్ గావ్ మహాగణపతి క్షేత్రం మహారాష్ట్రలోని పూణే జిల్లాలోని షిరూర్ తాలూకాలోని రంజన్ గావ్ అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయం 9 - 10 శతాబ్దాల మధ్య నిర్మించినట్లు తెలుస్తోంది. అయితే 18 వ శతాబ్దంలో పేష్వాలు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. గణేశ పురాణం ప్రకారం త్రిపురాసుర సంహారం చేసే సమయంలో సాక్షాత్తూ పరమశివుడు యుద్ధం ప్రారంభించేముందు విఘ్నాలు తొలగేందుకు ఇక్కడ గణపతిని ప్రతిష్ఠించి పూజించాడంట! మహాదేవుడు ప్రతిష్ఠించిన గణపతి కాబట్టి ఈ గణనాథునికి మహాగణపతి అని పేరు వచ్చిందని ఆలయ స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తోంది. రంజన్ గావ్ మహాగణపతి ఆలయంలో సిద్ధి, బుద్ధి సమేతుడై పద్మంలో కొలువు తీరి ఉంటాడు. అయితే అక్కడి స్థానికుల కథనం ప్రకారం ప్రస్తుతం ఉన్న వినాయకుని విగ్రహం క్రింద పది తొండాలు, ఇరవై చేతులు గల వినాయకుడి విగ్రహం ఉందని, దాని పేరు మహోత్కట్ గణపతి అని అంటారు. అయితే ఆలయ ధర్మకర్తలు మాత్రం అది నిజం కాదని చెబుతారు. ఈ విషయంపై మరింత లోతుగా పరిశోధనలు జరగాల్సి ఉంది. ఇక ఈ గణపతి ఆలయంలో దక్షిణాయనంలో సూర్యకిరణాలు నేరుగా స్వామిపై పడేలాగా ఆలయాన్ని నిర్మించడం ఈ ఆలయ ప్రత్యేకత. సాక్...

Kurudumale Ganapathi Temple: శ్రీ మహాగణపతి ఆలయం - కురుడుమలై

Image
  ఈ ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని  కోలూరు జిల్లా ముళబాగిలు సమీపంలో ఉంది. ఇక్కడ శక్తిగణపతిగా స్వామి వారు కొలువై ఉన్నారు. సుమారు 14అడుగుల ఎత్తున్న ఈ భారీ విగ్రహం, ఏక సాలగ్రామ శిలతో తయారుచేశారు. ఈ విగ్రహాన్ని స్వయంగా త్రిమూర్తులు (బ్రహ్మ, విష్ణు,మహేశ్వరుడు)ప్రతిష్టించారని ప్రతీతి.   ఈ ఆలయం నిత్యం భక్తులతో కళకళలాడుతుంది. కురుడుమలె గణపయ్యను దర్శించుకుని పని మొదలుపెడితే ఆ కార్యం నిర్విఘ్నంగా నెరవేరుతుందంటారు.  ఈ ఆలయం విశిష్టత ఏంటే   మనం అనుకుంటే ఇక్కడకు వెళ్లలేమట,కేవలం లంబోదరుడి అనుగ్రహం ఉంటేనే వెళ్లగలం అని చెబుతారు.  ఈ ఆలయం సమీపంలో సోమేశ్వరస్వామివారు కూడా కొలువై ఉన్నారు.   కౌండిన్య మహాముని ఈ ప్రాంతంలో నేటీకి ఉన్నారని, ప్రతిరోజూ  రాత్రిసమయంలో వచ్చి స్వామిని దర్శంచుకుంటారని, అక్కడి వారికి అపారమైన నమ్మకం.  ఎందుకంటే ఇప్పటికీ అర్థరాత్రి సమయంలో గుడిలోపలి నుంచి స్త్రోత్రాలు వినిపిస్తాయని, ఓంకారం ప్రతిధ్వనిస్తుందని, పర్వదినాలలో దేవతలంతా వచ్చి స్వామిని సేవిస్తారని చెబుతుంటారు.  స్థలపురాణం త్రిపురాసుర సంహారానికి ముందు త్రిమూర్తులు ఈ గణపతిని ...

Aja Ekadasi: అజ ఏకాదశి

Image
  శ్రావణమాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని అజ ఏకాదశి అని అంటారు  ఈ ఏకాదశి గురించి పద్మ పురాణంలో ఉంది ఈ రోజు శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు  ఈ ఏకాదశి ఆచరించడం ద్వార అనేక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది అని నమ్ముతారు  ఈ రోజు ఉపవాసం ఉండడం వల్ల అశ్వమేధ యాగం చేసిన ఫలం లభిస్తుంది, పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయి అని పురాణాల ద్వార తెలుస్తుంది. ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి, తలస్నానం చేయాలి. పూజా గదిలో శ్రీమహా విష్ణువు విగ్రహం లేదా ఫొటోను ఉంచి, తాజా పువ్వులతో అలంకరించాలి, అనంతరం దీపారాధన చేయాలి. స్వామి వారికి పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. పూజా సమయంలో లక్ష్మీదేవి కథను చదవాలి. చివరగా హారతి ఇచ్చి  ఇంట్లో తయారు చేసిన ప్రసాదాన్ని అందరికీ పంచాలి. పురాణాల ప్రకారం అజ ఏకాదశి గురించి యుధిష్టరుని అభ్యర్థన మేరకు శ్రీ కృష్ణుడు చెప్పాడు. ఈ వ్రతం పూర్వం హరిశ్చంద్ర దంపతులు ఆచరించారు. హరిశ్చంద్రుడు కొన్ని  పరిస్థితుల్లో స్మశాన వాటికను చూసుకునేవాడు. తన కుమారుడు పాము కాటుకు గురై చనిపోయాడు. తన భార్య కుమారుడిని అంత్యక్రియల కోసం తీసుకొచ్చినప్పుడు తన విధిని నిర్వర...

Kala Hanuman Temple: కాలా హనుమాన్ ఆలయం - జైపూర్

Image
   కాల హనుమాన్ జి మందిరం రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ లో ఉంది. ఈ ఆలయంలో హనుమంతుడి విగ్రహం నల్లరంగులో ఉంటుంది. అందుకే ఈ హనుమంతుడి ఆలయాన్ని కాల హనుమాన్ జి మందిరం గా ప్రసిద్ధి చెందింది.  జైపూర్ లో ఉన్నటువంటి ఈ సుప్రసిద్ధ ఆలయం 1000 సంవత్సరాల పురాతనమైనదని స్థానికులు ద్వారా తెలుస్తుంది. ఈ కాలే హనుమాన్ ఆలయానికి సంబంధించి పురాణాల్లో ఒక కథ ఉంది. హనుమంతుడు సూర్య దేవుడి వద్ద అనేక విద్యలు నేర్చుకున్నాడు. హనుమంతుడికి సూర్యుడు గురువు ఇదిలా ఉంటే సూర్యదేవుడి కుమారుడైన శని దేవుడిని వెతికి తెస్తే గురుదక్షిణ అవుతుందని హనుమంతుడికి సూర్యభగవానుడు ఆదేశించాడు.  దీంతో హనుమంతుడు శని జాడ కోసం వెతకడం ప్రారంభించాడు. అయితే శని మాత్రం హనుమంతుడిని కష్టపెట్టాడు. అంత సులభంగా లభించలేదు. అయితే హనుమంతుడి భక్తిని చూసి గురువు పట్ల అతని నిష్టను చూసి శని ఆశ్చర్యపోయాడు. అనంతరం హనుమంతుడికి శని దర్శనం ఇచ్చాడు. ఈ ప్రక్రియ హనుమంతుడు తన గురుదక్షిణ పూర్తి చేశాడు.  అయితే శని గ్రహం హనుమంతుడిని సమీపించినప్పుడు ఆయన రంగు నల్లగా మారింది. అందుకే ఈ ఆలయంలో హనుమంతుడి విగ్రహం నలుపు రంగులో ఉంటుంది. అయితే ఎవరైతే హనుమంతుడ...

Nellore Ayyappa Temple: శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం - నెల్లూరు

Image
  శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం నెల్లూరు నగరంలో వెలసింది. దేశవ్యాప్తంగా ఉన్న అయ్యప్ప స్వామి ఆలయాలలో ప్రముఖమైనది. ఈ ఆలయానికి మరో అరుదైన విశిష్టత కూడా ఉంది. సహజంగా అయ్యప్ప మాల ధరించే భక్తులు శబరిమలలో ఇరుముడి చెల్లిస్తారు. కానీ ఏపీలో కూడా ఇరుముడి సమర్పించే అతి కొద్ది ఆలయాల్లో నెల్లూరు అయ్యప్ప గుడి కూడా ఒకటి.  1987లో కేరళ తంత్రులతో అయ్యప్ప విగ్రహ ప్రతిష్ట జరిగింది. ఏటా ఇక్కడ మండల పూజలు నిర్వహిస్తారు. అయ్యప్ప మాల ధారణ సమయంలో భక్తులు జిల్లా నలుమూలల నుంచి ఇక్కడకు వస్తుంటారు. మాల ధరించిన స్వాములకు నిత్యాన్నదానం ఉంటుంది. జిల్లానుంచి బయలుదేరే అయ్యప్పస్వాములంతా ఈ ఆలయం వద్ద ఆగి, స్వామిని దర్శించుకుని తమ యాత్ర మొదలు పెట్టడం ఆనవాయితీ.  శబరిమల ఆలయంలాగే ఇక్కడ కూడా ఉపాలయాల నిర్మాణం ఉంది. పదునెట్టాంబడి కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ప్రధాన ఆలయంలో కేరళ తంత్రులు మాత్రమే పూజలు నిర్వహిస్తుంటారు. ఉపాలయాల్లో స్థానిక పూజారులుంటారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటే సంతానం లేనివారికి ఆ అదృష్టం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఆలయ వేళలు  ఉదయం 5.00 నుండి రాత్రి 8.00 వరకు.

Maa Kamakhya Temple: శ్రీ కామాఖ్యా దేవి ఆలయం - గువాహటి

Image
అష్టాదశ శక్తి ఫీఠాల్లో ఒకటి కామాఖ్యాదేవి ఆలయం. ముక్కలైన సతీదేవి శరీరం నుంచి యోనిభాగం పడిన ప్రదేశం ఇది. అసోం రాజధానికి గువాహటిలో నీలాచల పర్వతశిఖరంపైన ఉంది ఈ ఆలయం  కామాఖ్యదేవి, కామరూపిణి అని ఇక్కడ కొలువైన అమ్మవారిని పూజిస్తారు, ఇక్కడ అమ్మవారు మూడు రూపాల్లో దర్శనమిస్తుంది. ఆగ్రహంతో ఉన్నప్పుడు త్రిపురభైరవిగా..ఆనందంగా ఉన్నప్పుడు సింహవాహినిగా..  శివుడిపై అనురాగంతో ఉన్నప్పుడు త్రిపురసుందరిగా దర్శనమిస్తుంది. ఈ మూడు రూపాలను దర్శించుకున్న భక్తుల జన్మధన్యం.   గోపురాల్లో పెద్దగా ఉన్న గోపురం ఉన్న మందిరంలో కామాఖ్య దేవి కొలువుతీరి ఉంటుంది.  ప్రధాన గోపురంపై ఉన్న శిఖరంపై బంగారు కలశం ఉంటుంది..మిగిలిన గోపురాలపై త్రిశూలాలు కనిపిస్తాయి. ఇక్కడ అమ్మవారు విగ్రహరూపంలో దర్శనమివ్వదు. యోనిరూపంలో ఉంటుంది.  ఒకప్పుడు దక్షుడు యాగం తలపెట్టి అందర్నీ ఆహ్వానిస్తాడు..తనకు నచ్చని శివుడిని వివాహం చేసుకుందనే కారణంతో సతీదేవిని ఆహ్వానించడు. పిలవకపోయినా పుట్టింటికి వెళ్లిన సతీదేవి అవమానాలు ఎదుర్కొంటుంది. అదే బాధతో అగ్నిలో దూకి ప్రాణత్యాగం చేసుకుంటుంది. ఆగ్రహంతో శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేస్త...

Listening to Purana: పురాణ శ్రవణం (స్కాంద పురాణం)

Image
పురాణ శ్రవణం అనగా పురాణాలు ఎలా చదవాలి, ఎలా వినాలి వాటి యొక్క గొప్పతనం గురించి స్కాంద పురాణంలో చెప్పబడింది. పురాణాన్ని చెప్పేవాడు చిన్నవాడైన,యువకుడైన,వృద్ధుడైన అతన్ని గౌరవించాలి. పురాణాలు చెప్పేవాడిని ఎప్పుడు తక్కువగా చూడకూడదు, చులకనగా మాటలకూడదు. పురాణం చెప్పేవారు వ్యాసపీఠం మీద కూర్చుని ప్రవచనం చేస్తున్నప్పుడు ఎవరూ నమస్కరించకూడదు ముఖ్యంగా పురాణ శ్రవణం పవిత్రమైన దేవాలయాలలో కాని నదితీరాన కాని చెప్పించుకోవాలి. పురాణాన్ని వినేవారు  భక్తి శ్రద్ధలతో ఏకాగ్రంగా మనసుని లగ్నంచేసి వినాలి. భక్తి శ్రద్ధలు లేకుండా పురాణ శ్రవణాన్ని కేవలం కాలక్షేపం కోసం వినేవారికి ఎలాంటి ఫలితం దక్కదు. పురాణకథని వింటూ మధ్యలో లేచి వెళ్ళిపోయేవారికి భార్య సంపదలు నష్టమవుతాయి తుంగచాప మీద కూర్చుని పురాణం వినేవాడు కాకిగా పుడతాడు. పురాణం చెప్పే ముందు పౌరాణికుడికి నమస్కరించకుండా పురాణాన్ని వినేవాడు విషవృక్షంగా జన్మిస్తాడు. పడుకొని పురాణాన్ని వినేవాడు కొండచిలువగా జన్మిస్తాడు. పౌరాణికుడుతో  సమానంగా ఆసనం మీద కూర్చుని పురాణంవినేవాడు ఘోరమైన నరకానికి వెళతాడు. పౌరాణికుణ్ణి నిందించేవాడు, పురాణ కథల్ని దూషించేవాడు వంద జన్మల వరకూ ...

Guru Seva: గురుసేవ విధానం (పద్మ పురాణం )

Image
  గురువు దగ్గర శిష్యుడు భక్తిశ్రద్ధలతో నివసించాలి. శ్రద్ధగా ఆయన దగ్గర అధ్యయనం చేయాలి గురువు పడుకున్న తరువాతే తాను నిద్రించాలి, వారికన్నా ముందుగా మేలుకోవాలి. గురువుగారింట్లో పనులన్నీ చక్కబెట్టాలి ఇంద్రియ నిగ్రహంతో ఏమాత్రం తొందర పాటు లేకుండా గురువుని  నిత్యం గౌరవించాలి. గురువు భోజనం చేయకుండా తాను ముందుగా భుజించకూడదు. ఆయన నీళ్ళు త్రాగకుండా తాను ముందుగా త్రాగకూడుదు. గురువు నిల్చుని ఉండగా తాను కూర్చోకూడదు. గురువుకి  సాష్టాంగదండ ప్రణామం చేయాలి. గురువుకి నమస్కరించేడప్పుడు ముందుగా తన గోత్ర ప్రవరలు చెప్పి నమస్కరించాలి.  గురువు చెప్పిన పనులన్నీ శ్రద్ధగా చేయాలి. గురుభుక్త శేషాన్ని ఆరగించాలి. ఇది ధర్మ శాస్త్రంలో చెప్పిన సిద్ధాంతం. బ్రహ్మచారి ధర్మాలు శాస్త్రాలు ఏవైతే చెప్పబడ్డాయో వాటన్నిటినీ ఆచరించి శిష్యుడు గురువుకి  అత్యంత ప్రీతిపాత్రుడుగా మెలగాలి. భిక్షాన్నం స్వీకరించి, నేలమీదే పడుకుంటూ నియమపూర్వకంగా గురువునుంచి వేదార్థాల్ని అధ్యయనం చేయాలి. వేదాధ్యయనం పూర్తయిన తరువాత యథాశక్తి గురుదక్షిణ చెల్లించి సమావర్తనం చేయాలి. ఇది బ్రహ్మచర్యాశ్రమంలో నిర్వర్తించాల్సిన విధి.

Girijatmaj Ganesha Temple: శ్రీ గిరిజాత్మజ్ వినాయక ఆలయం

Image
  మహారాష్ట్ర లో వెలసిన అష్ట వినాయక క్షేత్రాలు ఒక క్రమ పద్ధతిలో దర్శిస్తేనే దర్శన ఫలం ఉంటుందని అంటారు. ఆ క్రమంలో దర్శించాల్సిన ఆరవ ఆలయం గిరిజాత్మజ్ వినాయక ఆలయం. ఈ ఆలయంలో వినాయకుని దర్శించి పూజిస్తే సంతానం లేనివారికి సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయం ఒక చిన్న కొండపై ఉన్నందున దీనిని గణేష్ గుఫా అని కూడా అంటారు. ఈ ఆలయంలో గణేష్ విగ్రహం చిన్న పిల్ల వాని రూపంలో ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణం విలక్షణమైన బౌద్ధ సంప్రదాయంలో ఉన్నందున బౌద్ధ గుహలు, హిందూ దేవాలయం కలిసి ఉన్నట్లుగా కనిపించే చిత్రమైన ఆలయంగా గిరిజాత్మజ్ గణపతి ఆలయం విరాజిల్లుతోంది. క్రీ.శ. మూడో శతాబ్దానికి చెందినదని భావించే ఈ గిరిజాత్మజ్ గణపతి దేవాలయం చేరుకోవడానికి చేరుకోవడానికి 300 పైగా మెట్లు ఉంటాయి. స్తంభాలు లేకుండా కేవలం ఏకశిలనే ఆలయంగా మలిచి మెట్లు నిర్మించారు. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏమిటంటే విద్యుద్దీపాల అవసరం లేకుండా పగటి వేళలో సూర్యకిరణాలు ఆలయంలో పడేలా నిర్మించడం వల్ల సూర్యకాంతిలో ప్రశాంతంగా గణనాధుని దర్శించుకోవచ్చు. నారద పురాణం ప్రకారం పార్వతీ దేవి సంతానం కోసం ఇక్కడ పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాతే నలుగుపిండితో చేసిన ...

Damodara Dwadasi: దామోదర ద్వాదశి

Image
  శ్రావణ శుద్ధ ద్వాదశికే దామోదర ద్వాదశి అని పేరు ఈ రోజున శ్రీ మహావిష్ణువును వివిధ రకాల పూలతో పూజించి, భక్తి శ్రద్ధలతో అభిషేకం చేయాలి. ఈ రోజున సాలగ్రామాన్ని దానం చేయడం వల్ల మోక్షం ప్రాప్తిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున సాలాగ్రామానికి అభిషేకం చేయడం వల్ల అనంతమైన పుణ్యం లభిస్తుంది. అభిషేకించిన నీటిని తీర్థంగా తీసుకుంటే అనేక రకాల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి  ఈ రోజు బియ్యం, పండ్లు, బట్టలు దానం చేయడం మంచిది. విష్ణు సహస్రనామం పారాయణ చేయాలి. 2024 తేదీ: ఆగష్టు 16. 

Donation and Benefits: దానాలు వాటి ఫలితాలు (కుర్మా పురాణం)

Image
  పూర్వం చతుర్ముఖ బ్రహ్మ, బ్రహ్మవాదులకి దానం గొప్పతనాన్ని ఏ ఏ దానం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది? దానం ఎవరికి ఇవ్వాలి అనే విషయాలు ఇలా వివరంగా ప్రబోధించాడు. సంపాదించిన ధనాన్ని వేదవేదాంగాలు పఠించిన సత్పాత్రుడికి శ్రద్ధా పూర్వకంగా సమర్పించటమే దానం. దానం భోగ మోక్షాలు రెండిటినీ ప్రసాదిస్తుంది. ఎంతో శ్రద్ధగా ఉన్నతమైన వారికి సమర్పించిన విత్తమే దానం అని చెప్పబడుతోంది. దానం నిత్యం-నైమిత్తికం-కామ్యం-విమలం అని నాలుగు విధాలుగా ఉంటుంది. 1. నిత్యదానం : తనకి ఎలాంటి ఉపకారం చేయకపోయినా ఎటువంటి ఫలాపేక్ష లేకుండా చేసేది 2. నైమిత్తికం : తాను చేసిన పాపాల పరిహారం కోసం పండితులకి చేసే దానాన్ని నైమిత్తిక దానం అంటారు 3. కామ్యదానం : సంతానం కలగటం కోసం, సంపదలు పెంపొందటం కోసం, వ్యాపారాభివృద్ధికోసం చేసే దానం 4. విమలదానం : పరమేశ్వర ప్రీత్యర్థం బ్రాహ్మణులకి ధర్మబుద్ధితో సమర్పించే దానం. ఇది సకల శుభప్రదం. తన కుటుంబానికి సరిపోయినంత ఉంచుకుని ఆ మిగిలిన దాన్నే దానం చేయాలి నిత్యాగ్ని హోత్రుడైన విప్రుడికి భూదానం చేసినవాడికి పునర్జన్మ ఉండదు. భూదానం అన్నదానాన్ని మించినవి మరొకటి లేవు. యోగ్యుడైన విప్రుడికి విద్యాదానం చేసినవాడు...

Sharavana Putrada Ekadasi: పుత్రదా ఏకాదశి (పవిత్ర ఏకాదశి)

Image
  శ్రావణ శుద్ధ ఏకాదశికి పుత్రదా ఏకాదశి అని పేరు. ఈ ఏకాదశి మహిమను శ్రీకృష్ణుడు ధర్మరాజుకు భావిషోత్తర పురాణంలో వివరించాడు  దీనికి లలిత ఏకాదశి అని కూడా పేరు ఈ రోజు ఉపవాసం వుండి, విష్ణువును పూజించి, పగలు హరినామ సంకీర్తనతోను, రాత్రి జాగరణతో గడిపి, మరునాడు ద్వాదశి గడియలు ఉండగానే మళ్లీ విష్ణు పూజ చేయాలి. పూర్వం మహాజిత్తు అనే రాజు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి, సంతానాన్ని పొందాడు అని పురాణ కధనం. ఈ ఏకాదశి మనిషి యొక్క సమస్త పాపాలను నశింపచేస్తుంది. ఈ ఏకాదశిని పాటించేవాడు సమస్త పాపాల నుండి బయటపడి ఇహపరాలలో సుఖాన్ని పొందుతాడు. ఈ ఏకాదశి మహిమను వినేవాడు ఈ జన్మలో పుత్రప్రాప్తి ఆనందాన్ని అనుభవించి తదనంతరం భగవద్దామనికి చేరుకుంటాడు. పుత్రదా ఏకాదశికి సంబంధించిన పురాణ కథనం ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం మహాజిత్ అనే రాజు మాహిష్మతి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు, అతనికి పిల్లలు లేరు. తమ సమస్య పరిష్కారం కోసం పండితలను, ఋషులను సంప్రదించాడు. కానీ ఎవరూ పరిష్కారం చెప్పలేకపోయారు. రాజు సర్వజ్ఞుడైన సాధువు లోమేశుని సంప్రదించాడు, లోమేశుడు అందుకు కారణం రాజు పూర్వ జన్మలో చేసిన పాపాలే అందుకు కారణమని చెప్పాడు. మహజిత్ రా...

Kashi Yama Aditya Temple: యమ ఆదిత్య ఆలయం - కాశీ

 కాశీ పట్టణంలో 12 సూర్యుని ఆలయాలు ఉంటాయి. ఒక్కో ఆలయంలో సూర్యభగవానుడు ఒక్కో పేరుతో పిలవబడుతూ పూజలందుకుంటున్నాడు. కాశీ క్షేత్రానికి వెళ్లిన భక్తులు, అక్కడి యమాదిత్యుడిని కూడా తప్పకుండా దర్శించుకోవాలి. శ్రీనాథుడు రచించిన కాశీ ఖండంలో యమాదిత్యుని ఆలయ విశేషాల గురించిన ప్రస్తావన ఉంది. సింధియా ఘాట్​లోని సంకట దేవి ఆలయం సమీపంలో యమాదిత్యుడు కొలువై ఉన్నాడు. సూర్యుని పుత్రుడైన యమధర్మరాజు ఒకసారి తన భటులను పిలిచి, శ్రీమహావిష్ణువును అనునిత్యం ఆరాధించే మహా భక్తుల జోలికి వెళ్లొద్దని చెప్పాడట. యమధర్మరాజు మాటలు విస్మరించిన యమ భటులు సూర్యభగవానుడి భక్తుడైన సత్రాజిత్తు దగ్గరికి వెళ్లి, సూర్యుని ఆగ్రహానికి గురవుతారు. జరిగిన విషయం తెలుసుకున్న యమధర్మరాజు, యమ భటుల అపరాధాన్ని మన్నించమని సూర్యభగవానుడిని కోరుతూ అందుకు ప్రాయశ్చిత్తంగా సూర్యభగవానుని మూర్తిని కాశీ క్షేత్రంలో ప్రతిష్ఠిస్తాడు. కాశీలో యమధర్మరాజు సూర్యుని సేవిస్తూ ఆయన అనుగ్రహానికి పాత్రుడవుతాడు. యమధర్మరాజు ప్రతిష్ఠించిన ఆదిత్యుడు కాబట్టి ఇక్కడి సూర్యభగవానుడు యమాదిత్యుడుగా పూజలు అందుకుంటున్నాడు. అలాగే యమధర్మరాజు తండ్రి ఆనతి మేరకు శ్రీ విశ్వేశ్వరుని దర్...

Kanipakam Brahmotsavams: శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2024 - కాణిపాకం

Image
చిత్తూరు జిల్లాలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం వినాయక స్వామి వారి ఆలయంలో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు వినాయక చవితితో మొదలై 21 రోజుల పాటు జరుగుతాయి. వాహన సేవల వివరాలు సెప్టెంబర్ 07 -     వినాయక చవితి,  గ్రామోత్సవం   సెప్టెంబర్ 08 -  ధ్వజారోహణం, హంస వాహనం 09 - నెమలి వాహనం 10 - మూషిక వాహనం 11 - చిన్న శేష వాహనం, పెద్ద శేష వాహనం 12 - వృషభ వాహనం, చిలుక వాహనం  13 - గజ వాహనం 14 - రథోత్సవం 15 - తిరు కళ్యాణం, అశ్వ వాహనం 16  - త్రిశుల స్నానం, ఏకాంత సేవ, వదయత్తు ఉత్సవం  ప్రత్యేక ఉత్సవాలు  సెప్టెంబర్ 17 - అధికారిక నంది వాహనం 18 - రావణ బ్రహ్మ వాహనం  19 - యాలి వాహనం  20 - విమానోత్సవం 21 - పుష్ప పల్లకి  22 - కామధేను వాహనం 23 - సూర్యప్రభ  వాహనం 24 -  చంద్రప్రభ వాహనం 25 - కల్పవృక్ష వాహనం  26 - పూలంగి సేవ 27 - తెప్పోత్సవం.

Ballaleshwar Pali Ganesh Temple: బల్లాలేశ్వర్ వినాయక ఆలయం

Image
మహారాష్ట్రలోని అష్ట వినాయక క్షేత్ర దర్శనంలో భాగంగా మూడవ క్షేత్రం బల్లాలేశ్వర్ క్షేతంలో వినాయకుడు ఆపద్భాంధవుడిగా ప్రసిద్ధి చెందాడు. ఈ స్వామిని దర్శిస్తే ఎంతటి కష్టమైనా, ఎలాంటి ఆపదలైన తొలగిపోతాయని విశ్వాసం. ఈ క్షేత్రం మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో రోహా నుండి 28 కి.మీ దూరంలో ఉన్న పాలీ గ్రామంలో ఉంది. ఇది సరస్‌గడ్ కోట అంబా నదికి మధ్యలో ఉంది. 1640లో మోరేశ్వర్ విఠల్ సింద్కర్ ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా తెలుస్తోంది. 'శ్రీ' అనే అక్షరం ఆకారంలో ఈ ఆలయంలో నిర్మించారు. ఉదయాన్నే సూర్యుని కిరణాలు నేరుగా గణపతి విగ్రహంపై ప్రసరించడం గొప్ప విశేషం. ఈ ఆలయంలో వినాయకుడు రాతి సింహాసనంపై ఆసీనుడై భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. పాలీ గ్రామాన్ని పూర్వం 'పల్లిపుర్' అనేవారు. ఈ గ్రామానికి చెందిన కల్యాణ్ అనే వ్యాపారస్థుని కుమారుని పేరు 'బల్లాల్'. చిన్న వయసు నుంచి గొప్ప వినాయక భక్తుడు. బల్లాల్ ప్రతిరోజూ స్నేహితులతో కలిసి అడవికి వెళ్లి అక్కడున్న చిన్న చిన్న రాళ్లనే వినాయకుని మూర్తులుగా భావించి పూజిస్తూ ఉండేవారు. ఆ పసిపిల్లలు పూజలే తమ ఆటలుగా ఆ అడవిలో అమాయకమైన భక్తితో వినాయకుని ఆరాధిస్తూ ఉండేవారు. ఒ...

Chintamani Ganapathi Temple: చింతామణి గణపతి ఆలయం

Image
మహారాష్ట్రలో వెలసిన అష్ట వినాయక క్షేత్రాలు ఒక క్రమ పద్ధతిలో దర్శిస్తేనే దర్శన ఫలం ఉంటుందని అంటారు. ఆ క్రమంలో దర్శించాల్సిన ఐదవ క్షేత్రం చింతామణి గణపతి క్షేత్రం.  ఈ క్షేత్రం మహారాష్ట్ర పూణే జిల్లా హవేలీ తాలూకాలోని ధేవూర్‌లో వెలసింది.  పూర్వం కపిల మహర్షి దగ్గర కోరికలు నెరవేర్చు చింతామణి ఉండేది. రాజ వంశానికి చెందిన గణరాజు ఆ చింతామణిని బలవంతంగా తన సొంతం చేసుకుంటాడు. కపిల మహర్షి అభ్యర్థన మేరకు ఆ రాజును గణపతి సంహరించి ఆ చింతామణిని కపిల మహర్షికి అప్పగించాడు. కపిల మహర్షి చింతామణిని గణపతి మెడలో అలంకరిప్తాడు. కపిల మహర్షి కోరిక మేరకు గణపతి ఇక్కడ కొలువుదీరాడు. అందువలనే ఇక్కడి స్వామిని చింతామణి స్వామిగా భక్తులు పూజిస్తుంటారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఈ ఆలయాన్ని పేష్వాల కాలంలో నిర్మించినట్లుగా తెలుస్తోంది. చింతామణి గణపతి ఆలయంలో గణపతిని దర్శించి పూజిస్తే ఎలాంటి చింతలైనా దూరమవుతాయని, కోరుకున్న కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఈ ఆలయాన్ని దర్శించడానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తారు. చింతామణి గణపతి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు, ఉత్సవాలు జరుగుతాయి...

Satyayuga to Kaliyuga: నాలుగు యుగాలు పరిమాణం (మత్స్య పురాణం)

Image
  మత్స్య పురాణంలో చెప్పిన నాలుగు యుగాలు కృతయుగం  నాలుగువేల దివ్య వర్షాలు కృతయుగం.పరిమాణం నాలుగు వందల దివ్య వర్షాలు.  ఈ యుగంలో ధర్మం నాలుగు పాదాలతో అధర్మం పావు భాగం కన్నా చాలా తక్కువగా వుంటుంది. ఈ యుగంలో మానవులందరూ స్వధర్మనిరతులుగా వుంటారు. విప్రులు విప్రధర్మాన్ని , క్షత్రియులు క్షత్రియధర్మాన్ని, వైశ్యులు వైశ్య ధర్మాన్ని, శూద్రులు శూద్ర ధర్మాన్ని ఆచరిస్తూ సజ్జనులుగా ఉంటారు . సత్యం, శౌచం, ధర్మం వృద్ధి చెందుతుంటుంది.  సజ్జనులు ఆచరించే కర్మల్ని అందరూ మెచ్చుకుని తాము కూడా ఆచరించేవారు.  నీచ కర్మలు ఆచరించేవారు కూడా తమ తప్పుల్ని తెలుసుకొని పరివర్తన పొందేవారు.  ఈ విధంగా కృతయుగంలో అందరూ సన్మార్గులు గానే వుండేవారు. త్రేతాయుగం  మూడు వేల దివ్య వర్షాల పరిమాణం కలది త్రేతాయుగం. పరిమాణం మూడువందల దివ్య వర్షాలు. ఈ యుగంలో మూడు పాదాలతో ధర్మం నడుస్తుంది.  రెండు పాదాలకన్నా కాస్త తక్కువగా అధర్మం వుంటుంది.  శాస్త్రాధ్యయనం. సత్యం బలం, క్షమ, ధర్మం అనే వాటిని ఆ యుగంలో వున్నవారు ఆచరిస్తూ ఉంటారు. వీటివల్ల ఆ యుగంలో ప్రజలు దుర్బలులుగా మారుతారు.  ఈ విధంగా త్రేతాయుగం ఉంట...

Chaturmas: చాతుర్మాస్య మహత్యం - స్కాంద పురాణం

Image
వ్రతాలలో ఎంతో గొప్పది చాతుర్మాస్య వ్రతం. చాతుర్మాస్యం ప్రారంభం కాగానే సకలతీర్థాలు, దేవతలు, దివ్యస్థలాలు విష్ణుమూర్తి శరణు పొందుతున్నాయి. పవిత్రమైన ఈ చాతుర్మాస్యం ఆషాఢ పౌర్ణమినాడు ప్రారంభమవుతుంది. నాలుగు నెలలకి ముగుస్తుంది.  చాతుర్మాస్యంలో శ్రీహరిని సేవించినవాడి జీవితం ఫలవంతంగా వుంటుంది.  చాతుర్మాస్యంలో నదీ స్నానం చేసినవాడికి సిద్ధి లభిస్తుంది. నదుల్లో అవకాశం లేకపోతే చెరువులలో జలాశయాల్లో స్నానంచేసిన వారికి పాపనివారణ జరుగుతుంది. పుష్కరక్షేత్రం, ప్రయాగ లేదా ఏదో ఒక మహాతీర్థంలో స్నానం చేస్తే అఖండమైన పుణ్యం ప్రాప్తిస్తుంది. నర్మదానదిలో మూడురోజుల పాటు నియమంగా చాతుర్మాస్య స్నానాన్ని ఆచరిస్తే పాపాలన్నీ ఛిన్నాభిన్నమైపోతాయి. పవిత్రమైన గోదావరి నదిలో ఉదయంపూట, చాతుర్మాస్యకాలంలో, కనీసం పదిహేను రోజులు స్నానం చేయాలి. అలా చేసిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. చాతుర్మాస్యంలో నీళ్ళలో నువ్వులు లేక ఉసిరి రసం లేక బిల్వ పత్రాలు వేసి, ఆ నీళ్ళతో స్నానం చేస్తే వారు చేసిన ఘోరమైన పాపాలన్నీ నశిస్తాయి. చాతుర్మాస్యంలో గంగానదీ స్నానం ఎంతో పుణ్యప్రదం. చాతుర్మాస్యంలో నారాయణ క్షేత్రాల్లో ఉన్న తీర్థాల్లో స్నాన...

Sleeping Rules: పురాణాలలో చెప్పిన నిద్ర నియమాలు

Image
  మన హిందూ స్మృతులు, పురాణాలలో చెప్పిన శయన నియమాలు  నిర్మానుష్యంగా, నిర్జన గృహంలో ఒంటరిగా పడుకోవద్దు. దేవాలయం మరియు స్మశానవాటికలో కూడా పడుకోకూడదు.( మనుస్మృతి) పడుకోని ఉన్న వారిని అకస్మాత్తుగా నిద్ర లేపకూడదు. ( విష్ణుస్మృతి) విద్యార్థి,నౌకరు,మరియు ద్వారపాలకుడు వీరు అధిక సమయం నిద్రపోతున్నచో,వీరిని మేల్కొలపవచ్చును.( చాణక్య నీతి) ఆరోగ్యవంతులు ఆయురక్ష కోసం బ్రహ్మా ముహూర్తం లో నిద్ర లేవాలి.( దేవీ భాగవతము) పూర్తిగా చీకటి గదిలో నిద్రించవద్దు.( పద్మ పురాణము) తడి పాదములతో నిద్రించవద్దు. పొడి పాదాల తో నిద్రించడం వలన లక్ష్మి (ధనం)ప్రాప్తిస్తుంది.( అత్రి స్మృతి)  విరిగిన పడకపై,ఎంగిలి మొహం తో పడుకోవడం నిషేధం.( మహాభారతం) నగ్నంగా, వివస్త్రలులై పడుకోకూడదు.( గౌతమ ధర్మ సూత్రం) తూర్పు ముఖంగా తల పెట్టి నిద్రించిన విద్య,పశ్చిమ వైపు తల పెట్టి నిద్రించిన ప్రబల చింత,ఉత్తరము వైపు తల పెట్టి నిద్రించిన హాని,మృత్యువు,ఇంకా దక్షిణ ముఖంగా తల పెట్టి నిద్రించినచో ధనము,ఆయువు ప్రాప్తిస్తుంది. పగటిపూట ఎపుడు కూడా నిద్రించవద్దు. కానీ జ్యేష్ఠ మాసంలో 1 ముహూర్తం(48నిమిషాలు) నిద్రిస్తారు.(పగటిపూట నిద్ర రోగహేతువు,మ...

Dharma to be learn: నిత్యజీవితంలో నేర్చుకోవాల్సిన ధర్మాలు

Image
  1. మీ శక్తిని మాట్లాడడంలో వృధా చెయ్యకుండా మౌనంగా ధ్యానం చెయ్యండి. 2. భక్తి కలిగిన సత్పురుషులు ఇతరుల బాధలను తమవిగానే పరిగణిస్టారు. 3..అన్నింటికీ దేవుడే సృష్టికర్త. ఆయనే అన్నింటికీ నివాసం. 4. మూలసత్యమే భగవంతుడు.జ్ఞానులు ఆ మూల సత్యాన్నే చూస్తారు. 5. భగవంతుని కృపవల్లనే మనం ప్రకృతిని జయించగలుగుతాం. మాయను, మొహాన్ని చేదించగలుగుతాం.. ఆధ్యాత్మిక సందేశం - ఆది శంకరాచార్య కాలోగచ్చతి నశ్యత్యాయు: యావద్దేహే తిష్ఠతి వాయు:తావద్గేహే సృచ్చతివార్తా ......భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూడమతే. కాలం గడచిపోతుంది. మృత్యువు దగ్గర పడుతుంది. సూర్యోదయం అయ్యటప్పటికి ఇంకొక కొత్తరోజు వస్తుందని సంతోషిస్తున్నాము. కానీ, నిజానికి జీవితంలో ఒక రోజు తగ్గుతుంది. ఒక్కొక్క రోజు తగ్గిపోతోందని విచారించాలి. "సర్వేజనా స్సుఖినో భవంతు".

Peepal Tree: రావి చెట్టు విశిష్టత

Image
  రావిచెట్టును ప్రతి నిత్యం పూజించేవారికి దారిద్య్రం తొలగిపోతుంది. మనసులోని కోరికను చెప్పుకుని రావి చెట్టుకు అనునిత్యం ప్రదక్షిణలు చేసి పూజి చాలి. ఇలా చేస్తే కోరిన కోరికలు నెరవేరుతుంది  నమ్మకం. సంతానయోగం కలుగుతుంది. రావిచెట్టును ఎప్పుడు పడితే అప్పుడు తాకకూడదు. ఏ రోజున పడితే ఆ రోజు రావిచెట్టును తాకడం వల్ల దోషం కలుగుతుంది. అందువలన కేవలం శనివారం రోజున మాత్రమే ఈ వృక్షాన్ని తాకడం ద్వారా శుభఫలితాలు ఉంటాయి. ఎందుకంటే రావిచెట్టు దేవతావృక్షంగా, సాక్షాత్తు విష్ణు స్వరూపంగా పూజింపబడుతోంది అందుకే శనివారం మాత్రమే ఆ చెట్టును తాకాలి.

Bhagavan Venkaiah Swamy: శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆరాధన 2024 - గొలగమూడి

Image
  శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు 1982 సంవత్సరం లో  మహా సమాధి చెందినారు. ఆగష్టు 18 - సర్వభూపాల వాహనం, కల్పవృక్ష వాహనం ఆగష్టు 19 - హనుమంత సేవ , చంద్రప్రభ వాహనం ఆగష్టు 20 - చిన్న శేష వాహనం, హంస వాహనం ఆగష్టు 21 - సూర్యప్రభ వాహనం, గజ వాహనం ఆగష్టు 22 - అశ్వ వాహన సేవ, పెద్దశేష వాహన సేవ  ఆగష్టు 23 - సింహ వాహనం, గరుడ వాహనం ఆగష్టు 24 - రథోత్సవం, తెప్ప మహోత్సవం ఆగష్టు 24 న ఆరాధన మహోత్సవం

Ekadasi: 24 ఏకాదశీలు వాటి ఫలితాలు

Image
  చైత్ర శుక్ల ఏకాదశి - కామదా ఏకాదశి - కోరికలు తీరుస్తుంది చైత్ర బహుళ ఏకాదశి - వరూధిని ఏకాదశి - సహస్ర గోదాన ఫలితం వైశాఖ శుద్ధ ఏకాదశి - మోహిని ఏకాదశి - దరిద్రుడు ధనవంతుడు అవుతాడు వైశాఖ బహుళ ఏకాదశి - అపరా - రాజ్యప్రాప్తి జ్యేష్ట శుక్ల ఏకాదశి - నిర్జల ఏకాదశి - ఆహార సమృద్ధి జ్యేష్ట బహుళ ఏకాదశి - యోగినీ ఏకాదశి - పాపాలను హరిస్తుంది ఆషాడ శుద్ధ ఏకాదశి - దేవశయని ఏకాదశి - సంపత్ ప్రాప్తి ఆషాడ బహుళ ఏకాదశి - కామికా ఏకాదశి - కోరిన కోరికలు ఫలిస్తాయి. శ్రావణ శుక్ల ఏకాదశి - పుత్రదా ఏకాదశి - సత్ సంతాన ప్రాప్తి శ్రావణ బహుళ ఏకాదశి - అజా ఏకాదశి - రాజ్యపత్ని పుత్రప్రాప్తి ఆపన్నివారణం భాద్రపద శుద్ధ ఏకాదశి - పరివర్తన ఏకాదశి - యోగసిద్ధి భాద్రపద బహుళ ఏకాదశి - ఇందిరా ఏకాదశి - సంపదలు రాజ్యము ప్రాప్తిస్తాయి. ఆశ్వయుజ శుక్ల ఏకాదశి - పాపాంకుశ ఏకాదశి - పుణ్యప్రదం ఆశ్వయుజ బహుళ ఏకాదశి - రామా ఏకాదశి - స్వర్గప్రాప్తి కార్తీక శుక్ల ఏకాదశి - ప్రబోధిని ఏకాదశి - జ్ఞానసిద్ధి కార్తీక కృష్ణ ఏకాదశి - ఉత్పత్తి ఏకాదశి - దుష్టసంహారం మార్గశిర శుక్ల ఏకాదశి - మోక్షద ఏకాదశి - మోక్షప్రాప్తి మార్గశిర కృష్ణ ఏకాదశి - విమలా (సఫల) ఏకాదశి -...

Khammam Temples: ఖమ్మం జిల్లాలో ప్రధాన ఆలయాలు

Image
 ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దర్శించవలసిన ఆలయాలు శ్రీ సీతారామచంద్ర వారి ఆలయం - భద్రాచలం హిందువుల పుణ్యక్షేత్రాలలో ప్రముఖమైనది. శ్రీరాముల వారి విగ్రహం సనాతనమైనది అని భక్తుల విశ్వాసం ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి రోజున శ్రీరామనవమి సందర్భంలో కళ్యాణమహోత్సవం కనుల పండుగగా జరుగుతుంది.  రాత్రిపూట ఈ ఆలయం వైకుంఠంగా ప్రకాశిస్తుంది. పర్ణశాల రామాలయం  శ్రీరాముడు వనవాసకాలంలో ఇక్కడ పర్ణశాల వేసుకొని ఉన్నట్టు వాల్మీకి రామాయణం చెబుతుంది. పెద్దమ్మ గుడి - పాల్వంచ  రుక్మిణి సత్యభామ ఆలయం - ఇరవెండి. బ్రహ్మాండ పురాణంలో ఆలయం గురించి ప్రస్తావన ఉంది. సాయిబాబా గుడి - ఖమ్మం నరసింహ క్షేత్రం - మల్లూరు   వైశాఖ శుద్ధపూర్ణిమ నాడు స్వామివారికి కల్యాణోత్సవం జరుగుతుంది. వీరభద్ర క్షేత్రం - మోతెగడ్డ  బ్రహ్మాండ పురాణంలో ఈ ఆలయ ప్రస్తావన కలదు మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. సంగమేశ్వర ఆలయం - తీర్దాల   తెలంగాణకే తలమానికం ఈ ఆలయం  భ్రమరాంబ సహిత సంగమేశ్వర స్వామితో పాటు, శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువైవున్నారు శివరాత్రి సందర్భంగా శ్రీ సంగమేశ్వర స్వామి వారి కళ్యాణం  వైభవంగా జరుగు...

Srisailam: శ్రీశైలం ప్రాశస్త్యం

Image
  శ్రీశైల క్షేత్రంలో పంచాక్షరీ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. శ్రీశైల క్షేత్రం ఒక్క భూమండలానికేకాక సర్వ జగత్తుకు గరిమానాభి అని వేదోక్తి. శ్రీశైల క్షేత్రంలో నలభై నదులు, అరవై కోట్ల తీర్థరాజాలు, పరశురా, భరద్వాజ మహర్షుల తపోవన సీమలు ఉన్నాయి. చందా కుండ, సూర్య కుండాది పుష్కరిణులు, వృక్ష సంతతలు, అనేక లింగాలు, అద్భుత ఔషదాలు ఉన్నాయి. బ్రహ్మగిరి, విష్ణుగిరి, రుద్రగిరి అనే మూడు పర్వతాలకు పాదాభివందనం చేస్తూ వేదఘోషను స్ఫురింపచేస్తూ కృష్ణవేణి నది పాతాళ గంగ పేరుతో ఇక్కడ ఉత్తరవాహినిగా ప్రవహిస్తోంది. అష్ఠాదశ పురాణాలలో, రామాయణ భారతాది, ఇతిహాసాలలో శ్రీశైల వైభవం స్తుతుల్ని అందుకుంది. కృతయుగంలో హిరణ్యకశిపుడు  శ్రీశైలాని తన పూజామందిరంగా చేసుకున్నాడు. ఈ క్షేత్రంలో సీతారాముల ప్రతిష్టించిన సహస్రలింగాలు, పాండవులు సంస్థాపించిన సద్యోజాత లింగం, పంచపాండవ లింగాలు పూజలు అందుకుంటున్నాయి. అరవై నాలుగు అధ్యయాలు ఉన్న స్కందపురాణంలోని శ్రీశైల ఖండం, ఈ క్షేత్ర మహిమను వివరిస్తోంది. ఆదిశంకరులు కొంతకాలం ఇక్కడ తపస్సు చేసి శివానంద లహరిని రచించాడు. భ్రమరాంబ సన్నిధిలో శ్రీ చక్రాన్ని ప్రతిష్టించారు. దత్తావతారమైన నృసింహసరస్వతి స్వామి...

Kerala Anantha Padmanabha Temple: శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం - తిరువనంతపురం

Image
  శ్రీ పద్మనాభస్వామివారి ఆలయం కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం నగరంలో ఉంది తిరు అంటే శ్రీ అని అనంతపురం అంటే పద్మనాభ స్వామి కొలువుతీరిన ఊరు అని అర్ధం ఈ ఆలయం 108 దివ్య తిరుపతులలో ఒక్కటిగా ప్రసిద్ధి చెందిది. ప్రస్తుతం ఉన్న ఆలయం 13 , 14 శతాబ్దాలలో నిర్మించారు  పురాణకాలంలో ఈ ఆలయాన్ని బలరాముడు దర్శించినట్లు ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయాన్ని ఇంకా రామానుజాచార్యులవారు, శ్రీ రాఘవేంద్రస్వామి వారు, యమునాచార్యులు, పురందరదాసు వంటి వారెందరో ఈ ఆలయాన్ని దర్శించారు. ఈ ఆలయం కేరళ,తమిళ, దక్షిణాది సంప్రదాయంలో నిర్మించారు. ప్రధాన గోపురం ద్వారా లోపలికి ప్రవేశించగానే వివిధ మండపాలు, ధ్వజస్తంభం దర్శనమిస్తాయి. ముఖమండపం నుండి మూడు ద్వారాల గుండా స్వామివారిని దర్శించాలి, కుడివైపున ద్వారం ద్వారా తల భాగాన్ని, ఎడమవైపు ద్వారం ద్వారా స్వామివారి పాదాలను, మధ్యలో ఉన్న ద్వారం గుండా స్వామివారి నాభిని దర్శించాలి. శ్రీ అనంత పద్మనాభస్వామివారు ఐదు శిరస్సులు ఉన్న శేషతల్పంపై శయనించి అర్ధనిమీలిత నేత్రాలతో ద్విభుజాలతో కొలువుదీరి ఉన్నారు. ఒక చేతితో పద్మాన్ని పట్టుకొని ఉండగా మరో చేతిని కిందకు వదిలి శివలింగంపై చేయి ఉంచిన ...

Pampanur Subramanya Swamy: శ్రీ సుబ్రమణేశ్వర స్వామి ఆలయం - పంపనూరు

Image
  ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి  ఆలయం అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలోని పంపనూరు గ్రామంలో కొలువై ఉంది. ఇక్కడ ధన ధాన్యాలనూ, జ్ఞానాన్నీ, ఆరోగ్యాన్నీ అందించే వరప్రదాతగా అక్కడ స్వామి ప్రసిద్ధిచెందాడు. ఇక్కడి మూలవిరాట్టును ఒకే శిలతో ఐదు రూపాలు స్ఫురించేలా మలిచారు.  విగ్రహం పీఠం నుంచి శిరసు వరకూ ఒక్కో రూపం ఒక్కో దేవతను సూచిస్తుంది.  ఇందులో పీఠం భాగంలో శ్రీచక్రం పార్వతీదేవికీ, ఆపై భాగంలో చుట్టలు చుట్టేసినట్లుగా కనిపించే సర్పం నాగేంద్రుడికీ, సర్పరూపంలోని చివరి భాగం వక్రతుండుడి ఆకారంలో, మూలవిరాట్టు మధ్యభాగం శివలింగంగా దర్శనమిస్తుంది. సర్పం శిరస్సు భాగం ఏడు తలలతో పడగవిప్పిన నాగేంద్రుడిగా దర్శనమిస్తాడు. ఈ రూపమే సుబ్రహ్మణ్యేశ్వరుడిగా పూజలందుకుంటోంది.  శివుడూ పార్వతి, గణపతి, షణ్ముఖుడు, నాగేంద్రుడు ఇలా శివుడి పరివారమంతా ఒకే చోట, ఒకే విగ్రహంలో దర్శనమివ్వడం ఇక్కడి ఆలయంలో విశేషం. పూర్వం యోగులూ, మహర్షులూ తపస్సును ఆచరించిన ఈ తపోవనంలో ఏడు కోనేర్లు ఉండేవని చెబుతుంటారు. ప్రస్తుతం వీటిలో ఆరు కోనేర్లు శిథిలం కాగా, దేవాలయం తూర్పు దిక్కున ఒకకోనేరు మాత్రమే మిగిలి ఉంది. ప్రతి శ్రావణ, కార్తీక, ...

Nandikotkur Suryanarayana Temple: శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం - నందికొట్కూరు

Image
శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయం నందికొట్కూరు మండలం , కర్నూల్ జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొలువైవుంది.  ఈ ఆలయం రెండవ అరసవిల్లిగా ప్రసిద్ధి చెందింది. పూర్వం ఈ ప్రాంతమంతా దట్టమైన అడవిగా వుండేది. కాకతీయ చక్రవర్తులు ప్రసిద్ధ శైవక్షేత్రమైన శ్రీశైలానికి వెళ్ళే సమయంలో ఈ ప్రాంతం నుంచే వెళ్ళేవారు. దారిలో ఈ ప్రాంతంలో అనేక సార్లు విశ్రాంతి కూడా తీసుకుంటూ వుండేవారట, కాకతీయ ఉద్యోగులు, సామంతులుగా ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూ వుండిన వెలనాటి చోళుల్లో ఒకరైన సిరిసింగరాయలు గొప్ప దైవభక్తుడు. ఒకసారి సిరిసింగరాయలు వేటకు బయలుదేరి, వేటాడుతూ మధ్యాహ్న సమయానికి ప్రస్తుత ఆలయ ప్రాంతానికి చేరుకుని అలసిపోయి ఒక చెట్టు క్రింద విశ్రమించాడు. అలసివున్న రాయలకు నిద్ర పట్టింది. ఈ సమయంలో స్వప్నంలో సూర్యభగవానుడు సాక్షాత్కరించి తనకు ఆలయం నిర్మించి ప్రతిష్టించి పూజలు జరిగే ఏర్పాట్లు చేయమని ఆదేశించాడు. నిద్రనుంచి మేల్కొన్న రాయలు ఈ విషయాన్ని తన సార్వభౌములైన కాకతీయులకు తెలిపి అనుమతి తీసుకుని ఆలయాన్ని నిర్మింపజేసి స్వామివారిని ప్రతిష్ఠించి నిత్యం పలు జరిగే ఏర్పాట్లు చేశాడు. ఈ ఆలయాన్ని 13 వ శతాబ్దంలో నిర్మించారు. వందలాది సంవత్స...

Garuda Panchami: గరుడ పంచమి

Image
శ్రావణ మాసంలో వచ్చే శుద్ధ పంచమిని గరుడ పంచమిగా జరుపుకుంటారు  తన తల్లి దాస్య విముక్తి కోసం గరుడుడు ఈ పంచమి రోజున అమృత భాండాన్ని పొందాడు. అందుకే యిది గరుడ పంచమి అయింది.  నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనంద దాయకంగా ఉండాలని, స్త్రీలు తమకు పుట్టిన పిల్లలు బలంగా ఉండాలని కోరుతూ గరుడ పంచమి పూజ చేస్తారు. ఈ వ్రతాన్ని తమకు పెద్దల నుంచి ఆనవాయితీగా వస్తున్న వారు మాత్రమే చేయాలి. గరుడుడు తల్లి దాస్యాన్ని విముక్తి చేసిన శ్రావణ శుద్ధ పంచమినాడు గరుడ పంచమి పర్వదినంగా జరుపుకోవడం ఆచారం.  కృష్ణా గోదావరి జిల్లాల్లోని వారు, సాగర తీర వాసులు ఈ పర్వాన్ని విశేషంగా జరుపుకుంటారు.  వ్రతరత్నాకరం, గరుడు పురాణం ఈ రెండు గ్రంథాల్లోనూ గరుడు పంచమి వ్రత విధానం గురించి ప్రస్తావన ఉంది.  ఆగమ గ్రంథాలు, తంత్రశాస్త్రాల్లో కూడా ఈ వ్రతం గురించి విలక్షణంగా కనిపిస్తుంది వ్రత విధానం సోదరులున్న స్త్రీలందరూ గరుడపంచమి వ్రతం చేసుకోవచ్చు. పంచమి రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి శుచిగా కొయ్యతో చేసిన చతురస్రాకారంలో ఉన్న పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అయిదు రంగులతో ముగ్గు పెట్టాలి. పీటపై ముగ్గుమధ్యలో బియ్యం పొయ్యాల...

Naga Panchami: నాగ పంచమి

Image
  శ్రావణ శుద్ధ పంచమిని నాగపంచమిగా పిలుస్తారు. ఈరోజు  గరుడ పంచమిని కూడా జరుపుకుంటారు . తన తల్లి దాస్య విముక్తి కోసం గరుడుడు ఈ పంచమి రోజున అమృత భాండాన్ని పొందాడు. అందుకే యిది గరుడ పంచమి అయింది.  అయితే ఈ రోజున జరిగే పూజంతా నాగ సంబంధమైంది కావడం విశేషం. ఈ కారణంగానే ఈ పర్వదినానికి నాగపంచమి అనే పేరే ప్రాచుర్యంలో ఉంది. ఈ  రోజున ఇంటి ద్వారానికి రెండు వైపులా ఆవుపేడతో సర్పాలు వేసి ఇంట్లో బంగారంతో కాని, వెండితో కాని, కొయ్యతో కాని, మట్టితో కాని చేసిన నాగ ప్రతిమను పంచామృతాలతోను, లేత గరిక, దర్భ, సువాసనగల జాజి, సంపెంగలాంటి పూలు గంధం మొదలైన వాటితో పూజించాలి. నాగపూజ వల్ల సర్పదోషాలు నశిస్తాయి.సర్పభయం ఉండదు  కండ్లకు, చెవులకు సంబంధించిన వ్యాధులు కూడా రావని చెబుతారు. కొన్ని చోట్ల నాగుల చవితి, నాగపంచమి రోజులలో భూమి దున్నటం లాంటి పనులు చేయరు. ఈ రోజు ఏమి చేయాలి ? ఈరోజున ముందుగా ఇల్లూ వాకిలీ శుభ్రం చేసుకుని తలంటుకుని, నిత్య పూజ పూర్తి చేయాలి. ఆపైన దగ్గర్లో ఉన్న పుట్ట వద్దకు వెళ్ళి నీళ్ళు జల్లి ముగ్గు వేసి, పసుపు, కుంకుమ గంధ, పుష్ప, అక్షతలతో పూజించి, దీపం, అగరొత్తులు వెలిగించి అనంత, వాసుక...

Naga Chandreswara Temple:శ్రీ నాగచంద్రేశ్వర ఆలయం (ఏడాదిలో శ్రావణ పంచమి రోజు మాత్రమే స్వామి వారి దర్శనం) - ఉజ్జయిని

Image
  జ్యోతిర్లింగ క్షేత్రాలలో దక్షిణాభిముఖుడైన శివుడు వెలిసిన ఏకైక క్షేత్రం ఉజ్జయిని. దక్షిణాభిముఖుడు, పశ్చిమాభిముఖుడు అయిన స్వామిని సేవిస్తే వెనువెంటనే సత్ఫలితాలు కలుగుతాయని మనకు పురాణాల ద్వార తెలుస్తుంది.  ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామి ఆలయం మూడు అంతస్తుల్లో ఉంటుంది. మొదటి అంతస్తులో తూర్పుకు అభిముఖంగా ఓంకారేశ్వర మహాదేవుడు ఉంటాడు. దానికి కింది అంతస్తులో దక్షిణాభిముఖుడై మహాకాళేశ్వరుడు ఉంటాడు. పై అంతస్తులో అంటే మూడో అంతస్తులో నాగచంద్రేశ్వరస్వామి పశ్చిమాభిముఖుడై సద్యోజాతునిగా సపరివారంగా దర్శనమిస్తాడు. కానీ ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే ఆయన దర్శనం ఉంటుంది. శ్రావణ శుద్ధపంచమినాడు ఉత్తరాదివారు నాగపంచమి పర్వదినాన్ని పాటిస్తారు. ఆరోజునే ఉజ్జయినిలో నాగచంద్రేశ్వరుని ఆలయం తెరుస్తారు. లక్షలాది భక్తులు నాగపంచమి రోజున ఉజ్జయినికి పోటెత్తుతారు. అద్వితీయం స్వామిస్వరూపం సాధారణంగా పరమేశ్వరుడు లింగాకారంలోనే దర్శనమిస్తాడు. కానీ నాగచంద్రేశ్వరుడు మాత్రం ఐదుపడగల తక్షకుణ్ణి ఆసనంగా చేసుకుని ఉంటాడు. ఒకచేతిలో నాగం ఉంటుంది. మరోచేత పార్వతిని పట్టుకుని ఉంటాడు. గణపతి, షణ్ముఖుడు కూడా పక్కనే దర్శనమిస్తారు. శివపార్వతుల పా...

Mangala Gowri Vratam: మంగళగౌరి వ్రతం

Image
  శ్రావణంలో ప్రతీ మంగళవారం కొత్తగా పెళ్ళైన స్త్రీలు మంగళగౌరీ వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని పెళ్ళయినప్పటి నుండి అయిదు సంవత్సరాలు ఆచరించాలి.మధ్యలో ఏదైనా కారణాల వల్ల ఆటంకం ఏర్పడితే ఆ తదుపరి సంవత్సరం నుండి వ్రతాన్ని కొనసాగించాలి. చివరగా ఉద్యాపన చేసి వ్రతాన్ని ముగించాలి. ఈ వ్రతాన్ని నారదుడు సావిత్రీదేవికి, శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఉపదేశించినట్లుగా చెప్పబడింది. ఈ వ్రతంలో  పగలు విధివిధానంగా మంగళ గౌరీ దేవిని పూజించాలి.  పూజలో ఉత్తరేణి దళాలతోనూ, గరికతోనూ గౌరీదేవిని అర్చించడం తప్పనిసరి.  మహా నివేదనలో పూర్ణపు కుడుములు, పులగం, బియ్యంతో చేసిన పరమాన్నాన్ని నివేదించాలి. వ్రతం నాటి సాయంకాలం ముత్తైదువులను పిలిచి నానబెట్టిన శనగలు వాయనంగా ఇవ్వాలి. ఈ వ్రతం తోర పూజ కూడా ప్రత్యేకంగా చెప్ప బడింది. తోరను తయారు చేసుకునేందుకు పసుపు పూరి దారాన్ని మూడు పొరలుగా తీసుకొని, దాన్ని తొమ్మిది ముళ్ళు వేయాలి. తరువాత ఆ దారానికి పూలను కాని, దవనాన్ని కాని, మాచిపత్రి కాని కట్టాలి ఈ విధంగా మూడు తోరలను తయారు చేసుకొని, గౌరీ పూజలో తోరలను కూడా పూజించాలి.  పూజానంతరం ఒక తోరను గౌరీదేవికి సమర్పించి, తక్కిన రెండిం...

Kapilatheertham Temple: శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయం - కపిలతీర్థం

Image
కపిల తీర్థం ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో ప్రసిద్ధ శైవక్షేత్రం, పుణ్యతీర్థం. ఈ ఆలయంలోని శివలింగం కపిల ముని ప్రతిష్టించారని స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తుంది. అందుకే ఇక్కడ స్వామివారిని శ్రీ కపిలేశ్వర స్వామిగా పిలుస్తారు. ఆలయ స్థల పురాణం ప్రకారం కృతయుగంలో కపిల మహర్షి ఇక్కడ ఈశ్వరుని కోసం ఘోర తపస్సు చేశాడట. ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు పాతాళం నుంచి భూమిని చీల్చుకుని ఇక్కడ వెలిశాడని స్థలపురాణం.ఇక్కడి లింగాన్ని కూడా కపిల లింగం అంటారు. ఆ తరవాత త్రేతాయుగంలో అగ్నిదేవుడు ఈ క్షేత్రంలో ముక్కంటిని పూజించాడట. అందువల్ల, ఈ లింగాన్ని ఆగ్నేయ లింగమని కూడా పిలుస్తారు. ఇక్కడ కపిలేశ్వరుడు కామాక్షీదేవి సమేతంగా కొలువయ్యాడు. ఈ ఆలయానికి నలువైపులా కనిపించే తిరుమల కొండలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయండంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఆ కొండల మీద నుంచి దాదాపు 20 అడుగుల ఎత్తునుంచి ఆలయ పుష్కరిణిలోకి దూకి ప్రవహించే ఆకాశగంగను కపిల తీర్థం అంటారు. ఈ తీర్థాన్ని శైవులు కపిల తీర్థమనీ, వైష్ణవులు ఆళ్వార్‌ తీర్థమనీ పిలుస్తారు. కోనేటికి నలువైపులా మెట్లు నిర్మించి ఉండటం వలన ఇక్కడ భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తారు...