Srisailam: శ్రీశైలం ప్రాశస్త్యం

 

  • శ్రీశైల క్షేత్రంలో పంచాక్షరీ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది.
  • శ్రీశైల క్షేత్రం ఒక్క భూమండలానికేకాక సర్వ జగత్తుకు గరిమానాభి అని వేదోక్తి.
  • శ్రీశైల క్షేత్రంలో నలభై నదులు, అరవై కోట్ల తీర్థరాజాలు, పరశురా, భరద్వాజ మహర్షుల తపోవన సీమలు ఉన్నాయి.
  • చందా కుండ, సూర్య కుండాది పుష్కరిణులు, వృక్ష సంతతలు, అనేక లింగాలు, అద్భుత ఔషదాలు ఉన్నాయి.
  • బ్రహ్మగిరి, విష్ణుగిరి, రుద్రగిరి అనే మూడు పర్వతాలకు పాదాభివందనం చేస్తూ వేదఘోషను స్ఫురింపచేస్తూ కృష్ణవేణి నది పాతాళ గంగ పేరుతో ఇక్కడ ఉత్తరవాహినిగా ప్రవహిస్తోంది.
  • అష్ఠాదశ పురాణాలలో, రామాయణ భారతాది, ఇతిహాసాలలో శ్రీశైల వైభవం స్తుతుల్ని అందుకుంది.
  • కృతయుగంలో హిరణ్యకశిపుడు  శ్రీశైలాని తన పూజామందిరంగా చేసుకున్నాడు.
  • ఈ క్షేత్రంలో సీతారాముల ప్రతిష్టించిన సహస్రలింగాలు, పాండవులు సంస్థాపించిన సద్యోజాత లింగం, పంచపాండవ లింగాలు పూజలు అందుకుంటున్నాయి.
  • అరవై నాలుగు అధ్యయాలు ఉన్న స్కందపురాణంలోని శ్రీశైల ఖండం, ఈ క్షేత్ర మహిమను వివరిస్తోంది.
  • ఆదిశంకరులు కొంతకాలం ఇక్కడ తపస్సు చేసి శివానంద లహరిని రచించాడు.
  • భ్రమరాంబ సన్నిధిలో శ్రీ చక్రాన్ని ప్రతిష్టించారు.
  • దత్తావతారమైన నృసింహసరస్వతి స్వామి శ్రీశైల మహత్యాన్ని వివరిస్తూ తన పాదుకలు పట్టుకున్న తంతుడు అనే భక్తుడికి ఈ క్షేత్ర దర్శన భాగ్యాన్ని కలిగించినట్లు గురు చరిత్ర చెబుతోంది.
  • నృసింహసరస్వతి స్వామి ఇప్పటికి కదళీవనంలో ఉన్నట్లు భక్తులు విశ్వసిస్తారు. 
  • శ్రీశైలంలో పంచ మఠాలు ప్రాచీనమైనవి. అవి ఘంటా మఠం, విభూతి మఠం, రుద్రాక్ష మఠం, సారంగ మఠం, నది మఠం.

Comments

Popular posts from this blog

Magha Puranam Telugu: మాఘ పురాణం 4వ అధ్యాయం- ఓ శునకం విష్ణుమూర్తిని పూజించి చక్రవర్తిగా మారిన కథ

Yadagirigutta Brahmotsavam 2025: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - యాదగిరిగుట్ట

Jubilee hills Venkateswara Temple: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - జూబ్లీహిల్స్

Sri Raghavendra Swamy Jayanti: శ్రీ రాఘవేంద్ర స్వామి జయంతి 2025

Magha Puranam Telugu: మాఘ పురాణం 24వ అధ్యాయం - సహవాస దోషంతో అష్టకష్టాలు పడిన విప్రుని కథ

Bhojana Niyamalu: నిత్యం తినే ఆహారంలో దోషాలు

Ganagapur Datta Swamy Temple: శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయం - గాణగాపురం

Bhadrapada Masam: భాద్రపద మాసం 2024

Pournami Garuda Seva: తిరుమల పౌర్ణమి గరుడ సేవ 2024 తేదీలు

Govatsa Dwadasi: గోవత్స ద్వాదశి