Guru Seva: గురుసేవ విధానం (పద్మ పురాణం )

 

  • గురువు దగ్గర శిష్యుడు భక్తిశ్రద్ధలతో నివసించాలి.
  • శ్రద్ధగా ఆయన దగ్గర అధ్యయనం చేయాలి
  • గురువు పడుకున్న తరువాతే తాను నిద్రించాలి, వారికన్నా ముందుగా మేలుకోవాలి.
  • గురువుగారింట్లో పనులన్నీ చక్కబెట్టాలి
  • ఇంద్రియ నిగ్రహంతో ఏమాత్రం తొందర పాటు లేకుండా గురువుని  నిత్యం గౌరవించాలి.
  • గురువు భోజనం చేయకుండా తాను ముందుగా భుజించకూడదు.
  • ఆయన నీళ్ళు త్రాగకుండా తాను ముందుగా త్రాగకూడుదు.
  • గురువు నిల్చుని ఉండగా తాను కూర్చోకూడదు. గురువుకి  సాష్టాంగదండ ప్రణామం చేయాలి.
  • గురువుకి నమస్కరించేడప్పుడు ముందుగా తన గోత్ర ప్రవరలు చెప్పి నమస్కరించాలి. 
  • గురువు చెప్పిన పనులన్నీ శ్రద్ధగా చేయాలి. గురుభుక్త శేషాన్ని ఆరగించాలి. ఇది ధర్మ శాస్త్రంలో చెప్పిన సిద్ధాంతం.

బ్రహ్మచారి ధర్మాలు శాస్త్రాలు ఏవైతే చెప్పబడ్డాయో వాటన్నిటినీ ఆచరించి శిష్యుడు గురువుకి  అత్యంత ప్రీతిపాత్రుడుగా మెలగాలి. భిక్షాన్నం స్వీకరించి, నేలమీదే పడుకుంటూ నియమపూర్వకంగా గురువునుంచి వేదార్థాల్ని అధ్యయనం చేయాలి. వేదాధ్యయనం పూర్తయిన తరువాత యథాశక్తి గురుదక్షిణ చెల్లించి సమావర్తనం చేయాలి. ఇది బ్రహ్మచర్యాశ్రమంలో నిర్వర్తించాల్సిన విధి.

No comments