వ్రతం, నోము రెండింటికీ భేదం ఏమిటి?


జీవితాంతం పాటించే దీక్షగా ఏదైతే చేస్తామో అది వ్రతం అంటారు. ఉదాహరణకి ఏకపత్నీవ్రతం, బ్రహ్మచర్య వ్రతం ఇలాంటివి. 

నోము అనేది నియమిత కాలానికి సంబంధించిన దీక్షతో చేసేది. ఉదాహరణకు పదహారు ఫలాల నోము. ముత్తెదువలకు పదహారు రకాల పళ్లు వాయినం ఇవ్వడం పూర్తయ్యాక ఉద్యాపన చేయడంతో నోము పూర్తయిపోతుంది. 

కానీ వ్రతం అటువంటిది కాదు. జీవితాంతం కొనసాగించవలసింది. ఏడాదికొకసారి వినాయకచవితినాడు వరసిద్ధి వినాయక వ్రతం చేసినట్లే పౌర్ణమి వంటి తిథుల్లో ప్రతి సంవత్సరం సత్యనారాయణ వ్రతం చేస్తారు కొందరు. 

అలాగే ఎప్పుడు జీవితంలో సంకటాలు, ఇబ్బందులు తలెత్తుతాయో అప్పుడు వ్రతం చేయమని పెద్దల నిర్దేశం.

No comments