Three days of Sankranti: మూడు రోజుల సంక్రాంతి పండుగ

  • సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రోజుతో దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. 
  • సంక్రాంతి పండుగ పుష్య మాసంలో వస్తుంది.ఇది మూడు రోజుల పండుగ.దీనిని పెద్ద పండుగగా పరిగణిస్తాము. 
  • మార్గశిర మాసం, పుష్య మాసాలు హేమంత ఋతువులో వస్తాయి. ఇది చలి కాలం. చలి గజ గజా వణికిస్తూ ఉంటుంది .
మొదటి రోజు "భోగి"

ఉదయాన్నే లేచి ఇంటి ముందు ముగ్గులు వేస్తారు. "స్వర్గ వాకిళ్లు" అనే ముగ్గును వేస్తారు. ముగ్గుమధ్యలో "గొబ్బెమ్మలు" పెడతారు. వీధులలో "భోగి మంటలు" వేస్తారు. కుటుంబంలోని వారందరూ తలస్నానాలు చేసి "సంక్రాంతి లక్ష్మి" ని పూజిస్తారు. కొత్త బట్టలు కట్టుకుంటారు. సాయంత్రము చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోసి పేరంటము జరుపుతారు. బొమ్మల కొలువును ఏర్పరచడం కూడ వుంటుంది. బొమ్మలకు హారతి యిచ్చి, పేరంటం చేస్తారు.

రెండవ రోజు "సంక్రాంతి" 

ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రోజుతో దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ రోజున స్వర్గ వాకిళ్లు తెరుస్తారని హిందువుల నమ్మకం.  పితృదేవతలకు "తర్పణాలు" వదులుతారు.
ఈ రోజున కూడ ఇంటి ముందు ముగ్గులు వేస్తారు. "రథం" ముగ్గు వేయటం సాంప్రదాయం. ఈరోజు కూడ "గొబ్బెమ్మలు" పెడతారు. బొమ్మల కొలువు, పేరంటం చేస్తారు.

మూడవ రోజు "కనుమ పండగ": 

ఈ రోజును "పశువుల పండుగ" అని కూడ అంటారు. వ్యవసాయదారులు పశువులను నీళ్ళతో కడిగి శుభ్రం చేస్తారు.పసుపు కుంకుమలతో, పూలతో అలంకరిస్తారు. పశువులను పూజిస్తారు. పశువుల కొట్టంలో "పొంగలి" వండి అందులో పసుపు, కుంకుమ కలిపి పొలాలలో చల్లుతారు. చీడ-పీడలు సోకకుండా కాపాడమని దేవతలను ప్రార్ధిస్తారు.

గుమ్మడి కాయలు పగులకొట్టి పోలి (బలి) వేస్తారు.పూల దండలు గుచ్చి పశువుల మెడలో వేస్తారు. దూడల మెడలకు, కాళ్ళకు చిరుగంటలు కడతారు. ఎద్దు కొమ్ములకు వారి వారి అభిరుచిని బట్టి పసుపు, కుంకుమలు, రంగులతో తీర్చి దిద్దుతారు. గంగిరెద్దులను అలంకరిస్తారు. కొన్నిప్రాంతాలలో పశువుల ఊరేగింపు, కోడి పందెములు, గొర్రె పొట్టేళ్ళ పందెములు కనుమ నాటి సాయంత్రము జరుపుతారు.

"కనుమ" రోజు "మినుము" తినాలని "గారెలు" చేసుకొని తింటారు. పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు, అత్తింటికి వెళ్ళిన అల్లుళ్ళు కూడ కనుమ రోజు తిరుగు ప్రయాణమవ్వరు. కనుమ నాడు కాకి కూడ కదలదని సామెత.మాంసాహారం తినేవాళ్ళు కనుమనాడు తప్పక మాంసం వండుకుంటారు.

Comments

Popular posts from this blog

Bhojana Niyamalu: నిత్యం తినే ఆహారంలో దోషాలు

Sri Raghavendra Swamy Jayanti: శ్రీ రాఘవేంద్ర స్వామి జయంతి 2025

Yadagirigutta Brahmotsavam 2025: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - యాదగిరిగుట్ట

Magha Puranam Telugu: మాఘ పురాణం 4వ అధ్యాయం- ఓ శునకం విష్ణుమూర్తిని పూజించి చక్రవర్తిగా మారిన కథ

Jubilee hills Venkateswara Temple: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - జూబ్లీహిల్స్

Tirumala Brahmotsavam: తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలు 2024

Magha Puranam Telugu: మాఘ పురాణం 15వ అధ్యాయం - వెయ్యేళ్ల పాటు సాగిన బ్రహ్మమహేశ్వరుల కలహం- విశ్వరూపంతో శాంతింపజేసిన శ్రీహరి

Magha Puranam Telugu: మాఘ పురాణం 24వ అధ్యాయం - సహవాస దోషంతో అష్టకష్టాలు పడిన విప్రుని కథ

Srisailam Brahmotsavam 2025: శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 2025 - శ్రీశైలం

Margashira Masam: మార్గశిర మాసం (స్కాంద పురాణం)