పురాణ శ్రవణం అనగా పురాణాలు ఎలా చదవాలి, ఎలా వినాలి వాటి యొక్క గొప్పతనం గురించి స్కాంద పురాణంలో చెప్పబడింది.
- పురాణాన్ని చెప్పేవాడు చిన్నవాడైన,యువకుడైన,వృద్ధుడైన అతన్ని గౌరవించాలి.
- పురాణాలు చెప్పేవాడిని ఎప్పుడు తక్కువగా చూడకూడదు, చులకనగా మాటలకూడదు.
- పురాణం చెప్పేవారు వ్యాసపీఠం మీద కూర్చుని ప్రవచనం చేస్తున్నప్పుడు ఎవరూ నమస్కరించకూడదు
- ముఖ్యంగా పురాణ శ్రవణం పవిత్రమైన దేవాలయాలలో కాని నదితీరాన కాని చెప్పించుకోవాలి.
- పురాణాన్ని వినేవారు భక్తి శ్రద్ధలతో ఏకాగ్రంగా మనసుని లగ్నంచేసి వినాలి.
- భక్తి శ్రద్ధలు లేకుండా పురాణ శ్రవణాన్ని కేవలం కాలక్షేపం కోసం వినేవారికి ఎలాంటి ఫలితం దక్కదు.
- పురాణకథని వింటూ మధ్యలో లేచి వెళ్ళిపోయేవారికి భార్య సంపదలు నష్టమవుతాయి
- తుంగచాప మీద కూర్చుని పురాణం వినేవాడు కాకిగా పుడతాడు.
- పురాణం చెప్పే ముందు పౌరాణికుడికి నమస్కరించకుండా పురాణాన్ని వినేవాడు విషవృక్షంగా జన్మిస్తాడు.
- పడుకొని పురాణాన్ని వినేవాడు కొండచిలువగా జన్మిస్తాడు.
- పౌరాణికుడుతో సమానంగా ఆసనం మీద కూర్చుని పురాణంవినేవాడు ఘోరమైన నరకానికి వెళతాడు.
- పౌరాణికుణ్ణి నిందించేవాడు, పురాణ కథల్ని దూషించేవాడు వంద జన్మల వరకూ కుక్కగానే జన్మిస్తారు.
- ఎప్పుడూ పురాణ కథల్ని విననివారు ఎన్నోనరకాలు అనుభవించి పందులుగా జన్మిస్తారు.
- పురాణ కథలు చెప్పేవారికి, వినేవారికి, చదివేవారికి విఘ్నాలు కలిగించేవారు కోటి సంవత్సరాలు నరకబాధలనుభవించి ఊరపందులుగా పుడతారు.
- పురాణ కథల్ని వినలేకపోయినప్పటికీ అవి చెప్పటానికి సహాయ సహాకారాలందించే వారు శాశ్వతమైన ముక్తిని పొందుతారు.
- పురాణాల్ని రసరంజకంగా ప్రవచనం చేసేవారు వందకోట్ల కల్పాలవరకూ బ్రహ్మలోకంలో నివసిస్తారు.
- పురాణం చెప్పే పౌరాణికుడికి కంబళిగానీ, ఆసనంగానీ, వస్త్రాల్ని గానీ ఏర్పాటుచేసేవారు స్వర్గలోకంలో సుఖభోగాలనుభవించి చివరికి ముక్తిని పొందుతారు.
- పౌరాణికుడికి శ్రేష్ఠమైన కొత్తసూత్రాన్ని (బంగారు గొలుసు)ఇచ్చేవారు ప్రతిజన్మలో ధనవంతులుగా పుడతారు.
- మహాపాతకాలు ఉపపాతకాలు ఆచరించినవారు పురాణ శ్రవణం వల్ల తమ పాపాలు పోగొట్టుకుంటారు.
Comments
Post a Comment