- కార్తీకశుద్ధ చవితి నాడు నాగులచవితి జరుపుకోవటం ఆచారం.
- నాగులచవితి నాటి రాత్రి నుంచి స్వచ్ఛమైన నీలాకాశంలో అనంతశయనాకృతి పాలపుంతగా స్పష్టంగా కనిపిస్తుంది.
- ఇది ఉత్తాన ఏకాదశి వరకు ఎనిమిది రోజుల పాటు ఆకాశంలో కనిపించే అద్భుత దృశ్యం.
- కార్తీక మాసంలో సూర్యుడు కామానికి , మృతువుకు స్థానమైన వృశ్చిక రాశిలో సంచరిస్తాడు , ఆ సమయంలో నాగారాధన వల్ల కామాన్ని, మృత్యువుని జయించే సిద్ధి కలుగుతుంది.
- కార్తీకమాసంలో నాగారాధన చేసేవారి వంశం వర్ధిలుతుంది అని భవిష్య పురాణం చెబుతుంది.
- పెళ్లికైనా మహిళలకు మంచి సంతానం, పెళ్లి కానీ అడ వారికీ మంచి భర్త లబిస్తాడు అని విశ్వాసం.
- పుట్టమట్టి బంగారం అని అంటారు , పుట్టమట్టిని చెవి దెగ్గర పెట్టుకుంటే వినికిడి సమస్యలు పోతాయి.
- నాగులచవితి రోజు తిరుమలలో శ్రీవారు పెద్దశేష వాహనం మీద ఊరేగుతూ దర్శనం ఇస్తారు.
కార్తీక మాస శుద్ధ ఏకాదశినే ప్రబోధ ఏకాదశి, బృందావన ఏకాదశి, భోధన ఏకాదశి. దేవ-ప్రబోధిని ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అనికూడా అంటారు. తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీమహావిష్ణువు ఈ ఏకాదశి రోజునే యోగనిద్రనుంచి మేల్కొనే రోజు కాబట్టి ఇది ఉత్థాన ఏకాదశి అయ్యింది. దీనినే హరి-భోధిని ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశినాడు ప్రారంభమైన చాతుర్మాస్యవ్రతం ఈ ఏకాదశితో ముగుస్తుంది. మహాభారత యుద్ధంలో బీష్ముడు ఈ ఏకాదశినాడే అస్త్ర సన్యాసం చేసి, అంపశయ్య మీద శయనించాడు. ఈ రోజున ఉపవాసం ఉండి, విష్ణువును పూజించి, రాత్రి జాగరన చేయాలి. మర్నాడు ద్వాదశి ఘడియలు ఉండగానే విష్ణుపూజ చేసి, పారణ చేసి, ఉపవాస దీక్ష విరమించి వ్రతం ముగించాలి. కార్తీక మాసంలో ప్రతి రోజూ పవిత్రమైనదే. ఈ మాసంలో వచ్చే ఏకాదశి మరింత ప్రత్యేకత సంతరించుకుంది. కార్తీక ఏకాదశి మహత్మ్యం గురించి స్కందపురాణంలో వివరించారు. పాపాలను హరించే ఈ ఏకాదశి వ్రతం పాటిస్తే 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాలు చేసిన పుణ్యం లభిస్తుందని పురాణ వచనం. ఈ రోజు ఏ చిన్న పుణ్యకార్యం చేసినా, అనంతమైన పుణ్య ఫలం లభిస్తుంది. ఈ ఏకాదశి వ్రతం చేసినవారికి సాధించలేనివి ఏమి ఉండవని సాక్షాత్తు బ్రహ్మదేవ
Comments
Post a Comment