భవాని దీక్ష విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ కోసం స్వీకరిస్తారు. ఈ దీక్ష కార్తీక మాసంలోని ఉత్థాన ఏకాదశి రోజు లేదా కార్తీక పౌర్ణమి రోజు నుండి దీక్ష స్వీకరిస్తారు.ఈ దీక్ష మండలం( 41 రోజులు) లేదా అర్ధ మండలం( 21 రోజులు) కొనసాగుతుంది.
- ఈ దీక్షలో వున్నా వారిని "భవాని" అని పిలుస్తారు.
- ఎర్ర రంగు వస్త్రాలు ధరిస్తారు.
- ఈ దీక్ష ఇంట్లో లేదా గుడిలో స్వీకరించవచ్చు.
- సాధారణంగా అన్ని దీక్షలలో వున్నా నియమాలు ఇక్కడ కూడా వర్తిస్తాయి.
- దీక్ష విరమణ రోజున కృష్ణ నదిలో స్నానం చేసి దుర్గమ్మ వారిని దర్శించి దీక్ష విరమిస్తారు.
2024 దీక్ష తేదీలు
మండల దీక్ష - నవంబర్ 11 నుండి నవంబర్ 15 వరకు
అర్ధ మండల దీక్ష - డిసెంబర్ 01 నుండి డిసెంబర్ 05 వరకు
కలశ జ్యోతి - డిసెంబర్ 14.
దీక్ష విరమణ - డిసెంబర్ 21 నుండి డిసెంబర్ 25 వరకు
Comments
Post a Comment