Skip to main content

Karthika Puranam: కార్తీక పురాణం 4వ అధ్యాయము - దీపదానమాహాత్మ్యము, కార్తికపూర్ణిమ, సోమవారఫలం

దీపదానమాహాత్మ్యము, కార్తికపూర్ణిమ, సోమవారఫలం

జనకుడిట్లడిగెను. వసిష్ఠమునీంద్రా! నీయొక్క వాక్సుధారసమును పానము చేయుచున్న నాకు తృప్తితీరలేదు. కాన తిరిగి కార్తిక వ్రతపుణ్యమును దెలుపుము. ఆ కార్తికమందు ఏదానమునుజేయవలెనో దేనినిగోరి వ్రతము ఆచరించవలయునో చెప్పుము.

వసిష్ఠుడు ఇట్లు పలికెను. పాపములను నశింపజేయునదియు, పుణ్యమును వృద్ధిబొందించునదియు అయిన కార్తికవ్రతమును ఇంకా చెప్పెదను వినుము. కార్తికమాస మందు సాయంకాలమున శివాలయమందు దీపారాధన చేసినచో అనంతఫలము కలుగును.

కార్తికమాసమందు శివాలయములో గోపురద్వారమందును, శిఖర మందును ఈశ్వర లింగసన్నిధియందును దీపారాధన చేసిన యెడల సమస్త పాపములు నశించును. ఎవ్వడు కార్తికమాసమందు శివాలయంలో ఆవునేతితోగాని నేతితో గాని నువ్వులనూనెతో గాని విప్పనూనెతో గాని నారింజనూనెతోగాని భక్తితో దీపసమర్పణముచేయునో వాడే ధన్యుడు. వాడు ధర్మజ్ఞుడు ధర్మాత్ముడును అగును. పూర్వోక్తములయిన నూనెలు సంభవించి నచో ఆముదముతో నయినా దీపమును సమర్పించిన యెడల పుణ్యవంతుడగును.

కార్తికమాసమందు శివాలయములో మోహముచేతగాని, బదాయిక్లీగాని భక్తితో గాని దీపమిచ్చువాడు శివప్రియుడగును. సందే హములేదు. పూర్వకాలమందు పాంచాల దేశమందు కుబేరునితో సమానమైన యొకరాజుగలదు. సంతానము లేక గోదావరి తీరమందు తపస్సుచేసెను. గోదావరీస్నానార్ధమై పైప్పలమహాముని అచ్చటికి వచ్చి చూచి రాజా, ఎందుకు తపస్సు చేయుచున్నావని యడిగెను. ఆ మాటవిని రాజు మునీశ్వరా, నాకు సంతానము లేదుగాన సంతానము కొరకు తపస్సు చేయుచున్నానని చెప్పెను.

బ్రాహ్మణుడు రాజుతో ఇట్లువచ్మెను. రాజా! భక్తితో బ్రాహ్మణులను శివుని సంతోషపెట్టుము. అట్లయిన యెడల నీకు పుత్ర సంతానము కలుగును. ఇట్లు పైప్పలముని చెప్పగా ఆ రాజు విని ఆనంద సాగరమగ్నుడై సమస్కరించి ఇంటికి వెళ్ళిస్తానము జేసి అలంకృతుడై శివప్రీతిగా దీప దానములను జేసెను. పిమ్మట ఆ పుణ్యముచేతనే రాజుభార్య గర్భవతియై పదియవమాసమున రెండవ సూర్యుడువలె ప్రకాశించెడి ఒక పుత్రుని గనెను. ఆ రాజు విని అధికానందమును బొంది కార్తికమాహాత్మ్యము సత్యమైనది ఈ కార్తికవ్రతము ధర్మార్థకామమోక్షములనిచ్చును. సమస్తభూతములకు కార్తికమాసము శుభప్రదము అని వచించెను.

తరువాత రాజు కుమారునకు "శత్రుజిత్" అను నామకరణము చేసి బ్రాహ్మణులను గోభూదానాదులతో పూజించెను. తరువాత బాలుడు క్రముగా వృద్ధినొంది యౌవనవంతుడై శూరుడై సుందరుడై వేశ్యాసంగ లోలుడై అంతట తృప్తిలేక పరస్త్రీలయందు ఆసక్తిగలిగి ధనాదికమునిచ్చి వారిని లోబరచుకుని సంభోగించెడివాడు. ఇది తగదని చెప్పిన గురువు లను బ్రాహ్మణులను ధిక్కరించి జాతినివిడిచి జాతిసంకరకారకుడై దేవప్రతి మను నిందిం చుచు కఠినముగా మాట్లాడుచు నిరంతరము కత్తిని చేతధరించి అద్దమువచ్చి వారిని హింసించుచు అన్యాయమార్గవర్తనుడై యుండెను.

ఇట్లుండగా ఆ గ్రామమందొక బ్రాహ్మణోత్తముని భార్య బహు చక్కనిది సింహము యొక్క నడుమువంటి నడుముగలది. పెద్దకన్నులు గలది. పెద్దవైన పిఱుదులును, కుచములును గలదియు, అరటిస్తంభముల వంటి తొడలు గలదియు, చిలుకకువలె సుస్వరమైన వాక్కు గలదియు, మన్మధోద్రేకముగలదై యుండెను.

ఆ రాజకుమారుడు అట్టి విప్రభార్యనుజూచి దాని సౌందర్యమునకు సంతోషించి దానియందాసక్తిగలవాడాయెను. బ్రాహ్మణుని భార్యయు రాజకుమారునందా సక్తిగల దాయెను. తరువాత ఆ బ్రాహ్మణుని భార్య అర్థరాత్రియందు భర్తను విడిచి రాజకుమారుని యెద్దకుబోయి అతనితో రాత్రి శేషమంతయు సంభోగించి ఉదయానికి బూర్వమే తిరిగి ఇంటికివచ్చెను. ఈ ప్రకారముగా అనేక దినములు జరిగినవి.

ఆ సంగతిని బ్రాహ్మణుడు తెలిసికొని నిందితమైన నడతగల భార్యను దానిని మరిగిన రాజకుమారుని చంపుటకుగాను కత్తినిచేత ధరించి ఎప్పుడు చంపుటకు వీలుదొరుకునా యని కాలమును ప్రతీక్షించుచుండెను.

ఇట్లు కొంతకాలము గడచిన తరువాత యొకప్పుడు శివాలయాన కార్తికపూర్ణిమా సోమవారమునాడు బ్రాహ్మణి తన చీరె అంచును చింపి వత్తిని చేసెను. రాజకుమారుడు ఆముదము తెచ్చెను. ఆ వత్తితో ఆ చిన్నది దీపము వెలిగించి అరుగుమీద పెట్టెను. అచ్చటే వారిద్దరు కామశాస్త్రప్రకారము సంభోగమును అత్యుత్సాహముతో చేసి సుఖించిరి.

అంత ఆ బ్రాహ్మణుడు కత్తినిధరించి వెళ్ళి మాఱువేషముతో జీర్ణ శివాలయమందు దూరి తలుపులు గట్టిగా బిగించి కత్తితో ముందుగా రాజకుమారుని పొడిచి తరువాత భార్యను నరికెను. అంతలో రాజకుమా రుడు కొంచెము జ్ఞప్తి తెచ్చుకొని కత్తితో బ్రాహ్మణుని నరికెను. ఇట్లు పరస్పర వ్యాఘాతములచేత ఆ జీర్ణదేవాలయమందు ముగ్గురు మృతి నొందిరి. ఆ దినము కార్తిక పూర్ణిమ సోమవారము, దైవవశముచేత అట్టి పర్వమందు ముగ్గుఱికి శివుని సన్నిధియందు మరణము గల్గినది.

అంతలో పాశహస్తులై యమకింకరులు వచ్చిరి. అంతలోనే రుద్రుని నేత్రాలతో భయమునిచ్చువారై శివకింకరులును వచ్చిరి. తరువాత శివదూతలు రాజకుమారుని, బ్రాహ్మణ భార్యను విమానము మీద నెక్కించిరి. యమదూతలు బ్రాహ్మణుని కాళ్ళుగట్టి తీసికొనపోవ ప్రయత్నించిరి.

ఇట్లు తన భార్యకు రాజకుమారునకు కైలాసగమనమును, తనకు యమలోక గమనము జూచి బ్రాహ్మణుడు శివదూతలారా! ఈ నా భార్య జారిణి, ఈ రాజకుమారు దును జారుడుగదా, నేను బ్రాహ్మణుడను సదాచారవంతుడును గదా, ఇట్లుండ నాకీగతి యేమి, వారికాగతియేమి అని యడిగెను.

శివదూతలిట్లనిరి. బ్రాహ్మణోత్తమా! నీవన్నమాట సత్యమేగాని అందొక విశేష మున్నది చెప్పెదము వినుము. ఈ నీ భార్య పాపాత్ము రాలును జారిణీయు అయినప్పటికి కామమోహముచేత కార్తిక పూర్ణిమా సోమవారమునాడు శివాలయమందు దీపారాధనకు గాను తన చీరెను చించివత్తిని చేసి ఇచ్చినదిగాన దీని పాపములన్నియు భస్మములయినవి. ఈ రాజకుమారుడును దీపార్థమై ఆముదమును దెచ్చి పాత్రలోనుంచి ఇచ్చినందున క్షీణపాపుడాయెను. కాబట్టి కామమోహముచేతనయినా శివా లయమందు దీపదానము చేసినవాడు ధన్యుడు సర్వయోగులందు అధికు డగును. కనుక దీపార్పణము చేత నీ భార్యకు రాజకుమారునకు కైలాసమును, దీపదానము చేయనందుకు నీకు నరకము సిద్ధించినది. ఇదివరకు నీవెంత శుద్ధముగానున్నను వారితో సమానుడవుగాలేదు. ధర్మ సూక్ష్మమిదియని చెప్పిరి.

శివదూతలు ఈ ప్రకారముగా చెప్పిన మాటలను విని రాజకుమా రుడు దయా వంతుడై అయ్యో ఈ బ్రాహ్మణుని భార్యతో రమించి ఈ బ్రాహ్మణునిచేత శివాలయమందు హతుడనైన నాకు కైలాసము- ఇతనికి నరకము గలుగుట చాలా దుఃఖకరముగా ఉన్నది. కాబట్టి నా దీపదాన పుణ్యమును కొంత ఈ బ్రాహ్మణునకు ఇచ్చెదను. ఏకకాలమందు మృతి నొందిన మాముగ్గుఱికి సమానగతియే ఉండవలెను. ఇట్లని ఆలోచించి తన దీపదాన పుణ్యమును బ్రాహ్మణునకు కొంత ఇచ్చెను. ఆ పుణ్యముచేత బ్రాహ్మణుడు దివ్యమైన విమానమెక్కి కైలాసమునకు పోయెను. అజ్ఞాన ముతో చేయబడిన యొక దీపదానముచే ముగ్గురు కైలాసమునకుబోయిరి.

కాబట్టి తప్పక కార్తికమాసమందు ధర్మమును జేయవలెను. అట్లు చేయని వాడు రౌరవ నరకమును బొందును. కార్తిక మాసమందు నిత్యము శివాలయమందుగాని, విష్ణ్వాలయమందుగాని దీపమాలను సమర్పించిన యెదల దీదానపుణ్యముతో జ్ఞానమును బొంది తద్వారా పునరావృత్తిరహిత మగు మోక్షమునొందును. సందేహములేదు.

కార్తికమాసమందు హరిసన్నిధిలో స్త్రీలుగాని, పురుషుడుగాని తన శక్తి కొలది దీపార్పణముచేసిన యెడల సర్వపాపనాశనము కలుగును. కాబట్టి నీవును శివాలయ మందు కార్తీకమాసమున దీపములపంక్తి సమర్పించుము.

Comments

Popular posts from this blog

Utthana Ekadasi: ప్రబోధిని ఏకాదశి, ఉత్తాన్న ఏకాదశి

  కార్తీక మాస శుద్ధ ఏకాదశినే ప్రబోధ ఏకాదశి, బృందావన ఏకాదశి, భోధన ఏకాదశి. దేవ-ప్రబోధిని ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అనికూడా అంటారు. తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీమహావిష్ణువు ఈ ఏకాదశి రోజునే యోగనిద్రనుంచి మేల్కొనే రోజు కాబట్టి ఇది ఉత్థాన ఏకాదశి అయ్యింది. దీనినే హరి-భోధిని ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశినాడు ప్రారంభమైన చాతుర్మాస్యవ్రతం ఈ ఏకాదశితో ముగుస్తుంది. మహాభారత యుద్ధంలో బీష్ముడు ఈ ఏకాదశినాడే అస్త్ర సన్యాసం చేసి, అంపశయ్య మీద శయనించాడు. ఈ రోజున ఉపవాసం ఉండి, విష్ణువును పూజించి, రాత్రి జాగరన చేయాలి. మర్నాడు ద్వాదశి ఘడియలు ఉండగానే విష్ణుపూజ చేసి, పారణ చేసి, ఉపవాస దీక్ష విరమించి వ్రతం ముగించాలి. కార్తీక మాసంలో ప్రతి రోజూ పవిత్రమైనదే. ఈ మాసంలో వచ్చే ఏకాదశి మరింత ప్రత్యేకత సంతరించుకుంది. కార్తీక ఏకాదశి మహత్మ్యం గురించి స్కందపురాణంలో వివరించారు. పాపాలను హరించే ఈ ఏకాదశి వ్రతం పాటిస్తే 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాలు చేసిన పుణ్యం లభిస్తుందని పురాణ వచనం. ఈ రోజు ఏ చిన్న పుణ్యకార్యం చేసినా, అనంతమైన పుణ్య ఫలం లభిస్తుంది. ఈ ఏకాదశి వ్రతం చేసినవారికి సాధించలేనివి ఏమి ఉండవని సాక్షాత్తు బ్రహ్మదేవ

Akshaya Navami: అక్షయ నవమి

  కార్తీక మాస శుక్లపక్ష నవమిని ఆక్షయ నవమి అంటారు. ఈ తిథికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సత్య యుగం ప్రారంభమైంది ఈ రోజునేనని చెబుతారు. ఈ రోజున ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించడం శ్రేష్టం. ఈ రోజున వేకువజామునే లేచి, నదీస్నానం ఆచరించడం, పితృదేవతలకు అర్ఘ్యమివ్వడం, దానం ఇవ్వడం శుభ ఫలితాలనిస్తుంది.  ఈ రోజున చేసే దానాలు, పూజలు రెట్టింపు ఫలితాలను ఇస్తుందని శాస్త్ర వచనం. ఈ రోజున ప్రత్యేకించి పండ్ల దానం, ముఖ్యంగా ఉసిరి కాయలను దానం చేయాలి.  అక్షయ నవమి రోజున ఏ కార్యం చేపట్టిన విజయవంతం అవుతుందని విశ్వసిస్తారు. అక్షయ నవమి రోజున త్రికరణశుద్ధిగా పూజలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని పురాణ వచనం. ఈ రోజున విష్ణు విజయ స్తోత్రం, కనకధారా స్థవం, దుర్గా స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తరం వంటి స్తోత్రాలు పఠించాలి.  దైవానికి చక్కెర పొంగళి, దద్ధోజనం నైవేద్యంగా సమర్పించాలి.  ఉసిరి చెట్టులో శివకేశవులు కొలువై ఉంటారు కనుక ఈ రోజున ఉసిరి చెట్టుకు పూజచేయడం, దీపం వెలిగించడం ఉసిరి చెట్టుకింద భోజనాలు చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ముందుగా ఉసిరి చెట్టు కింద శుభ్రపరిచి తూర్పు దిశగా నిలబడి పూజ చేయాలి. ఆ చెట్టుకు నీరు, పాలను అందించాలి.  పూ

Gopashtami: గోపాష్టమి

కార్తీక మాస శుక్ల పక్ష అష్టమిని గోపాష్టమి అంటారు. ఈ రోజు కృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఇది కృష్ణుడు గోవును పూజించిన శుభదినం. ఈ పవిత్ర దినం దీపావళి అమావాస్య ఎనిమిదో రోజున వస్తుంది. శ్రీకృష్ణుడు ఈ రోజున గోవుకు పూజ చేయడం మంచిదని తెలిపినట్టు పురాణాలు చెబుతున్నాయి. చెప్పడమే కాదు శ్రీకృష్ణుడు కూడా ఈ రోజున గోపూజలు చేసేవాడట. గోవు పరదేవతా స్వరూపము. గోవులకు అధిష్ఠాన దేవత సురభీదేవి. కామధేనువు పరాశక్తియైన లక్ష్మీస్వరూపం. ఆవులో 33 కోట్ల దేవతలు కొలువైవుంటారు. గోవుకే 'మాత' అనే హోదాను ఇచ్చారు. అలాంటి అమ్మలాంటి గోమాతను పూజించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పెద్దలు చెబుతారు.  గోపాష్టమి రోజున గోవులను శుభ్రమైన నీటితో కడిగి, పసుపు, కుంకుమలతో అలంకరించుకోవాలి. గోమాతకు అరటిపండ్లు నైవేద్యంగా పెట్టాలి. హారతులిచ్చి గోవు చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేయాలి. గోవు తోక భాగాన్ని స్పృశించి నమస్కరించాలి. ఈ రోజున కృష్ణుడి వెంట ఆవులను అడవికి పంపినట్లు అనేక పురాణగాధలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజున ఆవులను ప్రత్యేకంగా పూజించుకుంటారు. గోవు సకల దేవతా స్వరూపం కనుక గోవును పూజిస్తే సకల దేవతలు తృప్తి చెందుతా

Koti Somavaram 2024: కోటి సోమవారం

  కార్తీక మాసంలో పౌర్ణమి కన్న ముందు శ్రావణ నక్షత్రం వచ్చిన రోజు కోటి సోమవారంగా పిలుస్తారు. కోటి సోమవారం అంటే ఒక కోటి సోమవారాలతో సమానం. ఈ రోజు శివుడికి అభిషేకం చేసి దీపం వెలిగిస్తే మంచిది అని నమ్ముతారు. కార్తీక మాసంలో అన్ని సోమవారాలు వ్రతం చేయలేని వారు ఈ ఒక రోజు ఉపవాసం ఉంటే మంచిది. ఈ రోజు విధివిధానంగా శివుడిని పూజించడం వల్ల మోక్షం లాభిస్తుంది అన్ని నమ్ముతారు. కార్తిక మాసంలోనే ప్రత్యేకంగా వచ్చే కోటి సోమవారం రోజు చేసే స్నానం, దానం, ఉపవాసాలకు కోటి రెట్ల అధిక ఫలం ఉంటుందని శాస్త్రవచనం. ఈ రోజు సూర్యోదయాన్నే నిద్రలేచి శుచియై నదీస్నానం చేయడం అత్యుత్తమం. ఎందుకంటే కార్తిక మాసంలో శ్రీమహా విష్ణువు నదులు, చెరువుల్లో నివసిస్తాడని అంటారు. అందుకే ఈ మాసంలో నది స్నానానికి అంతటి ప్రాముఖ్యం ఉంది. ఉపవాసం సాధారణంగా కార్తిక మాసంలో సోమవారాలు, ఏకాదశి, కార్తిక పౌర్ణమి వంటి విశిష్ట తిథుల్లో భక్తులు ఉపవాసాలు ఉంటారు. అలాగే ఒక్క కోటి సోమవారం రోజు చేసే ఉపవాసం కోటి కార్తిక సోమవారాలు ఉపవాసాలతో సమానమని పురాణాల ద్వారా తెలుస్తోంది. అందుకే ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి ఆహరం తీసుకోకుండా రాత్రి నక్షత్ర దర్శనం అనంతరం

Karthika Puranam: కార్తీక పురాణం 10వ అధ్యాయము - అజామిళ పూర్వజన్మ వృత్తాంతము

  జనకుడు  తిరిగి ఇట్లు అడిగెను. ఓమునీశ్వరా! ఈ అజామిళుడు పూర్వజన్మ మందెవ్వడు? ఏమిపాపమునుజేసెను? విష్ణుదూతలు చెప్పిన మాటలనువిని యమభటులు ఎందుకు యూరకుడిరి? యముని వద్దకు పోయి యమునితో ఏమనిచెప్పిరి ? వసిష్ఠుడు ఇట్లు చెప్పెను. యమదూతలు విష్ణుదూతలమాటలు విని శీఘ్రముగా యమునివద్దకుబోయి సర్వవృత్తాంతమును యమునితో జెప్పిరి. అయ్యా! పాపత్ముడును, దురాచారుడును, నిందితకర్మలను ఆచరించు వాడును నగు అజామిళుడు తోడితెచ్చుటకు పోయినంతలో విష్ణుదూతలు వచ్చి మమ్ములను ధిక్కరించి అతనిని విడిపించిరి. మేము వారిని ధిక్కరించు టకు అశక్తులమైవచ్చితిమి అని చెప్పిది. ఆ మాటను వినికోపించి యముడు జ్ఞానదృష్టితో చూచి యిట్లనియె. ఈ అజా మిళుడు దుర్మార్గుడైనను అంత్యకాలమందు హరినామస్మరణ చేయుట చేత పాపములు నశించి వైకుంఠప్రియుడాయెను. అందువలననే అతనిని విష్ణుదూతలు స్వీకరించిరి. దుష్టాత్ములై మహిమను తెలిసికొనక హరినామస్మరణ చేసినను పాపములు నశించును. తెలియక తాకినను అగ్నికాల్చునుగదా! భక్తితో నారాయణ స్మరణను జేయువాడు జీవన్ముక్తుడై అంతమందు మోక్షము నొందును. యముడిట్లు విచారించి యూరకుండెను. అజామిళుడు పూర్వజన్మమున సౌరాష్ట్రదేశమందు బ్రాహ్మణుడై శివార్చకుడుగా ఉండ

Dhanurmasam: ధనుర్మాసంలో శివుడికి పాశురాలు

సూర్యుడు ఏడాదిలో ప్రతినెలా ఒక్కో రాశిలో సంచరిస్తుంటాడు. సౌరమానం ప్రకారం సూర్యుడు ఏ రాశిలో ఉంటే.. ఆ నెలను ఆ రాశి పేరుతో పిలుస్తారు. ఆదిత్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించి.. మళ్లీ మకర రాశిలోకి వెళ్లే వరకూ ఉన్న సమయమే ధనుర్మాసం. దక్షిణాయనం దేవతలకు రాత్రి. ఉత్తరాయణం పగలు. ఉత్తరాయణం ముందు వచ్చే ధనుర్మాసం దేవతలకు బ్రాహ్మీ సమయం. ధనుర్మాసంలో వైష్ణవాలయాల్లో గోదాదేవి విరచిత తమిళ పాశురాలు వినిపిస్తుంటాయి. శ్రీరంగనాథుడి భక్తురాలైన గోదాదేవి నెల రోజుల పాటు రోజుకో పాశురం చొప్పున కృష్ణలీలల్ని కీర్తిస్తూ శ్రీవ్రతం ఆచరించింది. ఈ 30 పాశురాలు ‘తిరుప్పావై’ పేరుతో ప్రఖ్యాతి గాంచాయి.ధనుర్మాసంలో విష్ణుభక్తులే కాదు, శివభక్తులు కూడా పాశురాలు పాడుకుంటారు. తమిళనాడులోని శివాలయాల్లో తిరువెంబావై పాశురాలు వినిపిస్తాయి. శైవ సిద్ధాంత కర్త మాణిక్య వాచకర్‌ ఈ పాశురాలను రాశారు. శివ తత్వాన్ని తెలిపే ఈ పాశురాల సంఖ్య కూడా 30. మదురై నగరానికి సమీపంలోని ఓ గ్రామంలో ఉండేవాడు మాణిక్య వాచకర్‌. చిన్ననాటి నుంచి శివ భక్తుడు. ధనుర్మాసంలో ప్రతిరోజూ తెల్లవారు జామునే మదురైలోని సుందరేశ్వరుడి దర్శనానికి వచ్చేవాడు మాణిక్య వాచకర్‌. నగర వీధుల్లో నడ

Lord Shiva: శివ భగవానుని విశేషాలు

శివుడిని చూడగానే మనకి కొన్ని గుర్తుకు వస్తాయి. అవి ఏంటి అంటే చేతిలో త్రిశూలం, మెడలో పాము, డమరుకం, అర్ధచంద్రాకార నెలవంక, నంది. త్రిశూలం: శివుడు ఎంచుకున్న ఆయుధమే త్రిశూలం. దీని మూడు కొనలు కోరిక, చర్య, జ్ఞానం అనే మూడు శక్తులను సూచిస్తాయి. నెలవంక: నెలవంక చంద్రుడు శివుడిని తరచుగా తన ‘జటా’ ఒక అర్ధ చంద్రాకార చంద్రుని కళా రూపాలతో చిత్రీకరించారు. చంద్రుడు వృద్ధి చెందటం, తగ్గిపోవటం అనేది ప్రకృతి అత్యంత శాశ్వతమైన చక్రాన్ని సూచిస్తుంది. హిందూ మతం క్యాలెండర్‌ ఈ ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది. పాము: శివుడు ఆయన మెడ చుట్టూ 3 సార్లు చుట్టబడిన ఒక పామును ధరిస్తారు. పాము యొక్క 3 చుట్టలు భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలను సూచిస్తాయి. పాము హిందువులు పూజించే పవిత్రమైన ప్రాణిగా చెప్ప వచ్చు. డమరుకం: శివునితో సంబంధం కలిగిన ఒక చిన్న డ్రమ్‌ వంటి వాయిద్యం. శివ కళాత్మక అభివృద్ధి స్వాధీన సమయంలో డమరుకం లయతో నాట్యం చేస్తారు. నంది: శివునికి అతి దగ్గరలో ఉన్న ఆప్తమిత్రులలో ఒకటి. ఎందుకంటే నంది అన్ని శివాలయాల వెలుపల వుంటుంది. శివ భక్తులు తమ కోరిక లను శివునికి విన్నవించమని నంది చెవు ల వద్ద గుసగుసగా చెప్పుకుంటారు. మూడో కన్ను: శివు

Bhavani Deeksha 2024: విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో భవాని దీక్ష తేదీలు 2024

  భవాని దీక్ష విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ కోసం స్వీకరిస్తారు. ఈ దీక్ష కార్తీక మాసంలోని ఉత్థాన ఏకాదశి రోజు లేదా కార్తీక పౌర్ణమి రోజు నుండి దీక్ష స్వీకరిస్తారు.ఈ దీక్ష మండలం( 41 రోజులు) లేదా అర్ధ మండలం( 21 రోజులు) కొనసాగుతుంది. ఈ దీక్షలో వున్నా వారిని "భవాని" అని పిలుస్తారు. ఎర్ర రంగు వస్త్రాలు ధరిస్తారు. ఈ దీక్ష ఇంట్లో లేదా గుడిలో స్వీకరించవచ్చు. సాధారణంగా అన్ని దీక్షలలో వున్నా నియమాలు ఇక్కడ కూడా వర్తిస్తాయి. దీక్ష విరమణ రోజున కృష్ణ నదిలో స్నానం చేసి దుర్గమ్మ వారిని దర్శించి దీక్ష విరమిస్తారు. 2024 దీక్ష తేదీలు మండల దీక్ష - నవంబర్ 11 నుండి నవంబర్ 15 వరకు అర్ధ మండల దీక్ష - డిసెంబర్  01  నుండి డిసెంబర్  05  వరకు  కలశ జ్యోతి  - డిసెంబర్ 14. దీక్ష విరమణ - డిసెంబర్  21  నుండి డిసెంబర్  25  వరకు 

Karthika Puranam: కార్తీక పురాణం 8వ అధ్యాయము - సూక్ష్మధర్మనిరూపణము, అజామిళోపాఖ్యానము

  సూక్ష్మధర్మనిరూపణము, అజామిళోపాఖ్యానము వసిష్ఠమునీంద్రా ! నా మనస్సులో గొప్ప సందేహము గలిగినది. ఆ సందేహమును దెలిపెదను, దానిని నశింపజేయుము. మీరు నాకు ధర్మసూక్ష్మమును జెప్పితిరి, పాతకము లలో గొప్పవానిని జెప్పినారు. వర్ణసంకర కారకములైన మహాపాపములు చేసిన దుర్జనులు వేదత్రయోక్తములయిన ప్రాయశ్చిత్తములను జేసికొని పరిశుద్ధులగుదురని ధర్మశాస్త్రము అందు చెప్పబడియుండగా మీరు ధర్మలేశముచేతనే పరిశుద్ధులై విష్ణులోకమును పొందు దురని చెప్పినారే, అదియెట్లు సంభవమగును? ఓ మునీశ్వరా ! అనంత పాతకములు చేసి ఈ పాపములు గొప్పవనియు వీటికి ప్రాయశ్చిత్తములు చేయించుకొనవలెననియు తెలిసియు అట్లు చేయక దైవవశము చేత సంభవించి కార్తికదీపదానాది పుణ్యముల వలన వైకుంఠమునకు బోవుట ఎట్లు సంభవించును. వజ్రపర్వతమును గోటికొన చివరిభాగముచేత చూర్ణముచేయుటకు శక్యమగునా? తాను లోపలనుండి గృహమునకు అగ్నినిముట్టించి మందు చుండగా తెలియనివానివలె ఉండి పుడిసెదు నీల్బు అనగా చేతికివచ్చినన్ని జలము అగ్నిమీద చల్లినయెడల ఆ అగ్నిచల్లాజునా? మహానదీ ప్రవాహములో స్వయముగా పడికొట్టుకొనిపోవుచు గడ్డిపరకను ఆధారముగాచేసి కొనిన దరికిజేరునా? స్వయముగా గొప్ప పర్వతమునెక్కి అక్కడనుండి క్రింద

Ekadasi: కార్తీక శుద్ధ ఏకాదశి ప్రాముఖ్యత

కార్తిక శుద్ధ ఏకాదశిని పరివర్తన ఏకాదశిగా వ్యవహరిస్తారు. దీనికి దామోదర ఏకాదశి, మోక్షప్రద ఏకాదశి అని కూడా పేరు. ఆషాఢ శుద్ధ ఏకాదశికి చాతుర్మాస్య వ్రతం ప్రారంభమైతే కార్తిక శుద్ధ ఏకాదశికి ముగుస్తుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శ్రీమన్నారాయణుడు యోగనిద్రలో శయనిస్తాడు. కార్తిక శుద్ధ ఏకాదశినాడు మరోపక్కకు తిరుగుతాడు. అందువల్లనే దీనికి పరివర్తన ఏకాదశి అని పేరు. శ్రీరంగాది క్షేత్రాలు, కావేరాది నదులు స్వామికి అభిముఖంగా ఉంటాయి. కృష్ణ, గోదావరి, తుంగభద్ర, కృతమాల, పయోద అనే నదులు స్వామికి పృష్టభాగంలో ఉంటాయి. అధర్మం నశించాలనుకునేవారు కార్తిక శుద్ధ ఏకాదశి అనంతరం కృష్ణ గోదావరి నదులలో స్నానం ఆచరించాలి. స్వామికటాక్షం, మోక్షం కావాలనుకునే వారు గంగా, కావేరాది నదులలో స్నానమాచరించాలని విష్ణుధర్మం ద్వారా తెలుస్తుంది. కార్తీక శుద్ధ ఏకాదశినాడు నదీ స్నానం చేసి ఉపవసించి తులసీ, ధాత్రీలను యధాశక్తి ఆరాధించి అభీష్టసిద్ధిని పొందవచ్చును. కార్తిక శుద్ధ ఏకాదశినాడు కేశవునికి లక్ష తులసీ పూజార్చన చేస్తే ప్రతి తులసీదళంతో ముక్తి లభిస్తుంది. ఎన్ని తులసి దళాలతో అర్చన చేస్తే అన్ని కోట్ల ముత్యాలు లభిస్తాయి. ముత్యాలు అనగా మోక్షలక్షణాలు అన