- తెలుగు సంవత్సరంలో ఐదో మాసం శ్రావణ మాసం.
- పట్నం నుంచి పల్లె వరకు పండుగ శోభ సంతరించుకుంటుంది.
- శ్రావణ మాసం రాకతోనే పండుగలు మొదలవుతాయి.
- శ్రావణం చంద్రుడికి ప్రీతిపాత్రమైన మాసం.
- శ్రావణ పౌర్ణమి రోజున చంద్రుడు తన స్వనక్షత్రమైన శ్రవణంపై సంచరిస్తాడు. అందుకే ఈ మాసానికి శ్రావణం అన్న పేరు వచ్చింది.
- శ్రవణం నక్షత్రం వేంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనది. శ్రీహరి జన్మనక్షత్రం కూడా శ్రవణమే.
- ఈ నెలలో వేదాధ్యయనం మొదలవుతుంది.
- శ్రావణ పౌర్ణమి రోజున నూతన యజ్ఞోపవీతములు ధరించి వేదాధ్యయనానికి శ్రీకారం చుడతారు.
- శ్రావణ సోమవారాలు పరమేశ్వరుడిని కొలిచే సంప్రదాయం కనిపిస్తుంది.
- శ్రావణ మంగళవారాలు తమ కాపురం పదికాలాలు చల్లగా సాగాలని కోరుతూ నవ వధువులు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తుంటారు.
- శ్రావణ శుక్రవారాలు లక్ష్మీదేవిని కొలుస్తారు. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకుంటారు.
- ఇక శ్రావణ శనివారాలు వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, కైంకర్యాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
- నాగుల పంచమి మొదలు ఈ నెలలో ఎన్నో విశిష్టమైన తిథులు కనిపిస్తాయి. శ్రావణ శుద్ధ ద్వాదశి రోజున దామోదర ద్వాదశి సందర్భంగా విష్ణుమూర్తిని పూజిస్తారు.
- దేశవ్యాప్తంగా రక్షాబంధన్‌గా ఘనంగా జరుపుకునే శ్రావణ పౌర్ణమికి పౌరాణిక, చారిత్రక ప్రాశస్త్యం ఉంది.
- శ్రావణ పౌర్ణమి నాడే విష్ణు అవతారంగా భావించే హయగ్రీవుడి జయంతి జరుపుకుంటారు.
- శ్రావణ బహుళ విదియ రోజున రాఘవేంద్రస్వామి జన్మతిథిని నిర్వహిస్తారు. శ్రావణ బహుళ అష్టమి.. శ్రీకృష్ణాష్టమిగా భారతావనిలో అంగరంగ వైభవంగా జరుగుతుంది.
- ఇలా శ్రావణ మాసంలో ఎన్నో పండుగలు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతాయి.
2024: శ్రావణ మాసం ఆగష్టు 05 నుండి సెప్టెంబర్ 04 వరకు
Comments
Post a Comment