Chaturmas: చాతుర్మాస్య మహత్యం - స్కాంద పురాణం

వ్రతాలలో ఎంతో గొప్పది చాతుర్మాస్య వ్రతం. చాతుర్మాస్యం ప్రారంభం కాగానే సకలతీర్థాలు, దేవతలు, దివ్యస్థలాలు విష్ణుమూర్తి శరణు పొందుతున్నాయి. పవిత్రమైన ఈ చాతుర్మాస్యం ఆషాఢ పౌర్ణమినాడు ప్రారంభమవుతుంది. నాలుగు నెలలకి ముగుస్తుంది. 

  • చాతుర్మాస్యంలో శ్రీహరిని సేవించినవాడి జీవితం ఫలవంతంగా వుంటుంది. 
  • చాతుర్మాస్యంలో నదీ స్నానం చేసినవాడికి సిద్ధి లభిస్తుంది.
  • నదుల్లో అవకాశం లేకపోతే చెరువులలో జలాశయాల్లో స్నానంచేసిన వారికి పాపనివారణ జరుగుతుంది.
  • పుష్కరక్షేత్రం, ప్రయాగ లేదా ఏదో ఒక మహాతీర్థంలో స్నానం చేస్తే అఖండమైన పుణ్యం ప్రాప్తిస్తుంది.
  • నర్మదానదిలో మూడురోజుల పాటు నియమంగా చాతుర్మాస్య స్నానాన్ని ఆచరిస్తే పాపాలన్నీ ఛిన్నాభిన్నమైపోతాయి.
  • పవిత్రమైన గోదావరి నదిలో ఉదయంపూట, చాతుర్మాస్యకాలంలో, కనీసం పదిహేను రోజులు స్నానం చేయాలి. అలా చేసిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది.
  • చాతుర్మాస్యంలో నీళ్ళలో నువ్వులు లేక ఉసిరి రసం లేక బిల్వ పత్రాలు వేసి, ఆ నీళ్ళతో స్నానం చేస్తే వారు చేసిన ఘోరమైన పాపాలన్నీ నశిస్తాయి.
  • చాతుర్మాస్యంలో గంగానదీ స్నానం ఎంతో పుణ్యప్రదం.
  • చాతుర్మాస్యంలో నారాయణ క్షేత్రాల్లో ఉన్న తీర్థాల్లో స్నానం చేయాలి. తద్వారా శ్రీహరి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది.
  • చాతుర్మాస్యంలో రాత్రిపూట, సంధ్యాకాలంలో, గ్రహణం కాని సమయాల్లో స్నానం చేయకూడదు. అలాగే వేడినీళ్ళతో కూడా స్నానం చేయకూడదు.
  • చాతుర్మాస్యంలో అందరికీ, అన్నివిధాలా ఉత్కృష్టమైన కాలం. అందుకే ఈ కాలంలో పవిత్ర కర్మల్ని ఆచరించాలి.
  • సత్సంగం, బ్రాహ్మణభక్తి, గురు, దేవ, పితృతర్పణాలు, గోదానం, వేదపఠనం, సత్కర్మాచరణ, సత్యభాషణ, గోభక్తి, దానాలు చేయటం మీద ప్రీతి కలిగి వుండటం ఇవన్నీ చాతుర్మాస్యంలో అందరూ ఆచరించాల్సిన ప్రధాన ధర్మాలు.

Comments

Popular posts from this blog

Magha Puranam Telugu: మాఘ పురాణం 4వ అధ్యాయం- ఓ శునకం విష్ణుమూర్తిని పూజించి చక్రవర్తిగా మారిన కథ

Yadagirigutta Brahmotsavam 2025: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - యాదగిరిగుట్ట

Jubilee hills Venkateswara Temple: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - జూబ్లీహిల్స్

Sri Raghavendra Swamy Jayanti: శ్రీ రాఘవేంద్ర స్వామి జయంతి 2025

Magha Puranam Telugu: మాఘ పురాణం 24వ అధ్యాయం - సహవాస దోషంతో అష్టకష్టాలు పడిన విప్రుని కథ

Bhojana Niyamalu: నిత్యం తినే ఆహారంలో దోషాలు

Ganagapur Datta Swamy Temple: శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయం - గాణగాపురం

Bhadrapada Masam: భాద్రపద మాసం 2024

Pournami Garuda Seva: తిరుమల పౌర్ణమి గరుడ సేవ 2024 తేదీలు

Govatsa Dwadasi: గోవత్స ద్వాదశి