Aja Ekadasi: అజ ఏకాదశి

 

  • శ్రావణమాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని అజ ఏకాదశి అని అంటారు 
  • ఈ ఏకాదశి గురించి పద్మ పురాణంలో ఉంది
  • ఈ రోజు శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు 
  • ఈ ఏకాదశి ఆచరించడం ద్వార అనేక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది అని నమ్ముతారు 
  • ఈ రోజు ఉపవాసం ఉండడం వల్ల అశ్వమేధ యాగం చేసిన ఫలం లభిస్తుంది, పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయి అని పురాణాల ద్వార తెలుస్తుంది.
  • ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి, తలస్నానం చేయాలి. పూజా గదిలో శ్రీమహా విష్ణువు విగ్రహం లేదా ఫొటోను ఉంచి, తాజా పువ్వులతో అలంకరించాలి, అనంతరం దీపారాధన చేయాలి.
  • స్వామి వారికి పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. పూజా సమయంలో లక్ష్మీదేవి కథను చదవాలి. చివరగా హారతి ఇచ్చి  ఇంట్లో తయారు చేసిన ప్రసాదాన్ని అందరికీ పంచాలి.

పురాణాల ప్రకారం అజ ఏకాదశి గురించి యుధిష్టరుని అభ్యర్థన మేరకు శ్రీ కృష్ణుడు చెప్పాడు. ఈ వ్రతం పూర్వం హరిశ్చంద్ర దంపతులు ఆచరించారు. హరిశ్చంద్రుడు కొన్ని  పరిస్థితుల్లో స్మశాన వాటికను చూసుకునేవాడు. తన కుమారుడు పాము కాటుకు గురై చనిపోయాడు. తన భార్య కుమారుడిని అంత్యక్రియల కోసం తీసుకొచ్చినప్పుడు తన విధిని నిర్వర్తించాడు. ఆ సమయంలో ఆకాశంనుంచి పూల వర్షం కురిసింది.

హరిశ్చంద్ర రాజు కష్టకాలంలో ఉండి, కష్టాలనుండి ఎలా బయటపడాలని ఆలోచిస్తున్నప్పుడు, గౌతమ ముని వచ్చి శ్రావణ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి రోజున వ్రతం ఆచరించి, ఉపవాసం ఉండటం వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయని చెబుతాడు. గౌతమ ముని చెప్పిన విధంగా హరిశ్చంద్ర రాజు అజ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి కష్టాలనుండి బయటపడ్డాడు.

2024: ఆగష్టు 29.

No comments