Kala Hanuman Temple: కాలా హనుమాన్ ఆలయం - జైపూర్

 

 కాల హనుమాన్ జి మందిరం రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ లో ఉంది.

ఈ ఆలయంలో హనుమంతుడి విగ్రహం నల్లరంగులో ఉంటుంది. అందుకే ఈ హనుమంతుడి ఆలయాన్ని కాల హనుమాన్ జి మందిరం గా ప్రసిద్ధి చెందింది. 

జైపూర్ లో ఉన్నటువంటి ఈ సుప్రసిద్ధ ఆలయం 1000 సంవత్సరాల పురాతనమైనదని స్థానికులు ద్వారా తెలుస్తుంది.

ఈ కాలే హనుమాన్ ఆలయానికి సంబంధించి పురాణాల్లో ఒక కథ ఉంది. హనుమంతుడు సూర్య దేవుడి వద్ద అనేక విద్యలు నేర్చుకున్నాడు. హనుమంతుడికి సూర్యుడు గురువు ఇదిలా ఉంటే సూర్యదేవుడి కుమారుడైన శని దేవుడిని వెతికి తెస్తే గురుదక్షిణ అవుతుందని హనుమంతుడికి సూర్యభగవానుడు ఆదేశించాడు. 

దీంతో హనుమంతుడు శని జాడ కోసం వెతకడం ప్రారంభించాడు. అయితే శని మాత్రం హనుమంతుడిని కష్టపెట్టాడు. అంత సులభంగా లభించలేదు. అయితే హనుమంతుడి భక్తిని చూసి గురువు పట్ల అతని నిష్టను చూసి శని ఆశ్చర్యపోయాడు. అనంతరం హనుమంతుడికి శని దర్శనం ఇచ్చాడు. ఈ ప్రక్రియ హనుమంతుడు తన గురుదక్షిణ పూర్తి చేశాడు. 

అయితే శని గ్రహం హనుమంతుడిని సమీపించినప్పుడు ఆయన రంగు నల్లగా మారింది. అందుకే ఈ ఆలయంలో హనుమంతుడి విగ్రహం నలుపు రంగులో ఉంటుంది. అయితే ఎవరైతే హనుమంతుడిని పూజిస్తారో వారికి శని గ్రహం ప్రభావం నుంచి బయటపడవచ్చు అని పురాణాల్లో పేర్కొన్నారు. అందుకే ఈ ఆలయంలో హనుమంతుడిని దర్శించుకోవడం ద్వారా శని ప్రభావం నుంచి బయటపడవచ్చని భక్తుల నమ్మకం ఈ ఆలయంలో దర్శించుకునేందుకు నవజాత శిశువులను ఎక్కువగా తీసుకొని వస్తారు. ఎందుకంటే నరదృష్టి బారిన పడకుండా హనుమంతుడి ఆశీర్వాదం తోడ్పడుతుందని భక్తుల నమ్మకం.

ఎవరైతే శనిదోషంతో ఇబ్బంది పడుతూ ఉంటారు వారు హనుమంతుడిని ఆరాధించడం ద్వారా శని దోషం నుంచి బయటపడవచ్చు.  ఈ కాల హనుమాన్ మందిరంలో హనుమంతుడికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు ముఖ్యంగా హనుమాన్ జయంతి రోజున ఇక్కడ ప్రత్యేకమైన పూజలు చేస్తారు.

జైపూర్ విమానాశ్రయం నుంచి ఈ దేవాలయం 30 కిలోమీటర్ల దూరంలో ఉంది.

No comments