Kerala Anantha Padmanabha Temple: శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం - తిరువనంతపురం
- శ్రీ పద్మనాభస్వామివారి ఆలయం కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం నగరంలో ఉంది
- తిరు అంటే శ్రీ అని అనంతపురం అంటే పద్మనాభ స్వామి కొలువుతీరిన ఊరు అని అర్ధం
- ఈ ఆలయం 108 దివ్య తిరుపతులలో ఒక్కటిగా ప్రసిద్ధి చెందిది.
- ప్రస్తుతం ఉన్న ఆలయం 13 , 14 శతాబ్దాలలో నిర్మించారు
- పురాణకాలంలో ఈ ఆలయాన్ని బలరాముడు దర్శించినట్లు ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తుంది.
- ఈ ఆలయాన్ని ఇంకా రామానుజాచార్యులవారు, శ్రీ రాఘవేంద్రస్వామి వారు, యమునాచార్యులు, పురందరదాసు వంటి వారెందరో ఈ ఆలయాన్ని దర్శించారు.
- ఈ ఆలయం కేరళ,తమిళ, దక్షిణాది సంప్రదాయంలో నిర్మించారు.
- ప్రధాన గోపురం ద్వారా లోపలికి ప్రవేశించగానే వివిధ మండపాలు, ధ్వజస్తంభం దర్శనమిస్తాయి.
- ముఖమండపం నుండి మూడు ద్వారాల గుండా స్వామివారిని దర్శించాలి, కుడివైపున ద్వారం ద్వారా తల భాగాన్ని, ఎడమవైపు ద్వారం ద్వారా స్వామివారి పాదాలను, మధ్యలో ఉన్న ద్వారం గుండా స్వామివారి నాభిని దర్శించాలి.
- శ్రీ అనంత పద్మనాభస్వామివారు ఐదు శిరస్సులు ఉన్న శేషతల్పంపై శయనించి అర్ధనిమీలిత నేత్రాలతో ద్విభుజాలతో కొలువుదీరి ఉన్నారు. ఒక చేతితో పద్మాన్ని పట్టుకొని ఉండగా మరో చేతిని కిందకు వదిలి శివలింగంపై చేయి ఉంచిన భంగిమలో స్వామివారు దర్శనం ఇస్తారు.
- ఈ ఆలయంలో పుష్కరిణికి పద్మతీర్థం అని పేరు
- ఈ ఆలయంలో నరసింహ స్వామి, శ్రీకృష్ణ స్వామి ఉపాలయాలు వున్నాయి.
- మకర మాసంలో జరిగే దీపోత్సవం, అరట్టు ఉత్సవం, ఓనం పండుగతో పాటు వివిధ ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి.
స్థల పురాణం :
పూర్వం దివాకర మహర్షి అనే ముని పుంగవుడు ఈ ప్రాంతంలో ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు మహర్షి వద్దకు ఒక చిన్న పిల్లవాడు రాగా ముచ్చటపడిన మహర్షి ఆ పిల్లవాడిని తన వద్దనే ఉండమని కోరాడు. అందుకు నేను ఏం అల్లరి చేసినా ఏమీ అనకూడదు. ఒకవేళ ఏమైనా అంటే నేను వెళ్ళిపోతాను. అని షరతు విధించాడు. మహర్షి అందుకు అంగీకరించగా . బాలుడు మహర్షి వద్దనే ఉండిపోయాడు. ఎంత అల్లరి చేసినా, తన తపస్సుకు భంగం కలిగించినా మహర్షి కోప్పడేవాడు. కాదు. ఇలా ఉండగా ఒకనాడు మహర్షి పూజ చేసుకుంటూ ఉండగా బాలుడు అక్కడికి వచ్చి పూజలో ఉన్న సాలగ్రామాలను చెల్లాచెదురుగా పడవేశాడు. దీనితో కోపోద్రిక్తుడైన మహర్షి బాలుడిని కొట్టాడు. ఫలితంగా ఆ పిల్లవాడు ఆశ్రమం వదిలి వెళ్ళిపోతూ - "నీవు నన్ను మళ్లీ చూడాలి అనుకుంటే అనంత అడవులకు రా అని పలికాడు". కొంతసేపటికి తేరుకున్న మహర్షి తాను పొరపాటు చేశానని గ్రహించి ఆ బాలుని వెతుక్కుంటూ చివరకు అడవికి చేరాడు. అడవిలో వెతుకుతుండగా పిల్లవాడు కనిపించాడు.
ఆ పిల్లవాడి వద్దకు మహర్షి చేరుకునేలాగా ఆ పిల్లవాడు ఒక పెద్దచెట్టు తొర్రలో దూరి మాయమయ్యాడు. వెంటనే ఆ చెట్టు రెండుగా చీలిపోగా శ్రీమహావిష్ణువు శేషతల్పంపై శయనించి అనంతశయనుడిగా దర్శనమిచ్చాడు. ఈ విధంగా దర్శనమిచ్చిన స్వామి అనేక యోజనాల పొడవు ఉండడంతో స్వామివారి రూపాన్ని దర్శించడం కష్టమని భావించిన మహర్షి స్వామివారి రూపాన్ని తగ్గించుకోమని కోరాడు. ఈ కోరికను మన్నించిన స్వామి మహర్షి చేతిలో ఉన్న తపోదండానికి మూడు రెట్లు పొడవుగా ఉండేటట్టుగా పొడవును తగ్గించి దర్శనం ఇవ్వగా అనేకరకాలుగా మహర్షి స్వామిని స్తుతించి, కీర్తించి కొబ్బరిచిప్పలో మామిడిపిందెలు, ఉప్పు నీటిని కలిపి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తాడు. ఈ విధంగా అనంతపద్మనాభస్వామివారు తిరువనంతపురంలో కొలువుదీరినట్లు అనంతశయనమహత్యం వల్ల తెలుస్తోంది. ఇప్పటికీ స్వామివారికి బంగారు కొబ్బరిచిప్పలో మామిడిపిందెల నైవేద్యం ప్రతిదినం సమర్పిస్తారు.
ఆలయ వేళలు
ఉదయం 3.15 నుండి మధ్యాహ్నం 12.00 వరకు
సాయంత్రం 5.00 నుండి రాత్రి 7.20 వరకు
ఎలా వెళ్ళాలి
కేరళ రాష్ట్ర రాజధాని అయిన తిరువనంతపురంలో ఉంది ఈ ఆలయం
Comments
Post a Comment