Singirikona Temple: శ్రీ నరసింహ స్వామి ఆలయం - సింగిరికోన - HINDU DHARMAM

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Tuesday, July 2, 2024

demo-image

Singirikona Temple: శ్రీ నరసింహ స్వామి ఆలయం - సింగిరికోన

Responsive Ads Here
singirikona%20temple

చిత్తూరు జిల్లాలో సింగిరికోనలొ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం అడవి ప్రాంతమైన చిన్నకొండమీద ఉంటుంది. ఇది అతి పురాతనమైన ఆలయం.

ఈ స్వామి స్వయంభూ అని చెబుతారు. ఆరు అడుగుల ఎత్తులో నల్లరాతి విగ్రహాలు భక్తులకు కనువిందు చేస్తాయి. స్వామి, ఇరుపక్కల శ్రీదేవి, భూదేవి కొలువుదీరి ఉంటారు. ఇక్కడ శ్రీనరసింహస్వామి విగ్రహం నోరు తెరుచుకున్నట్లు ఉంటుంది. దానికి ఓ కథనం ఉంది. స్వామి వేటకు వచ్చి కొంచెం సేపు. అక్కడ విశ్రాంతి తీసుకున్నారట. కళ్ళు తెరిచేసరికి తెల్లవారిందిట. అప్పుడే తెల్లవారిందా అని ఆశ్చర్యంగా నోరు తెరుచుకుని అలాగే శిలలా ఉండిపోయారట. 

రోజూ ఉదయం స్వామికి పంచామృతాలతో అభిషేకం. గోపూజ మొదలైన నిత్య సేవలన్నీ చేస్తారు. ప్రతి నెలా స్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజు విశేష తిరుమంజనం, సుదర్శన నారసింహ మహా యాగం శాస్త్ర ప్రకారం నిర్వహిస్తారు.

singirikona%20temple.%201

ఇక్కడ పూజలు ఉదయం మంత్ర సహిత కార్యక్రమాలతో ప్రారంభం అవుతాయి.తర్వాత అర్చనలు, స్వామికి పాట రూపంలో జరుగుతాయి. అర్చక స్వామి పూజ చేయించుకునే భక్తులను కూర్చోబెట్టి చక్కగా పాడతారు. భక్తులు ఎక్కడెక్కడినుంచో, ఎన్నో ప్రయాసలు పడి నీ దర్శనానికి వచ్చారు. వారి ఇబ్బందులు తొలగించి, సంతోషంగా ఉండేలా చెయ్యవయ్యా. ఎన్నో అవతారాలెత్తి ఎంత మందినో కాపాడినవాడివి నువ్వు అంటూ,పాట ద్వారా అర్చక స్వామి వేడుకుంటారు.

నారాయణవనం నుండి 08 కి.మీ దూరం 

తిరుపతి నుండి 46 కి.మీ దూరంలో ఉంది ఈ ఆలయం 

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages