Posts

Showing posts from June, 2025

Amrutha Lakshmi Vrat: అమృత లక్ష్మీ వ్రతం

Image
ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో శుక్ల పక్ష విదియ రోజున జరుపుకుంటారు. ఈ వ్రతం సంపదలకు ప్రతిరూపమైన లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం ఆచరిస్తారు. ఈ వ్రతం చేసేవారు ఈ రోజు ఉపవాసం ఉంటారు. ఈ రోజున అన్నదానం, వస్త్రదానం వంటి వివిధ రకాల దానాలను చేయడం శ్రేష్ఠం. భౌతిక, ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం అమృత లక్ష్మీ వ్రతం చేస్తారు. ఈ వ్రతం ఆచరించడం వలన లక్ష్మీదేవి శీఘ్రంగా అనుగ్రహిస్తుందని పండితులు చెబుతారు. అమృత లక్ష్మీ వ్రతం ఆచరించేవారు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానాదులు ముగించుకొని పూజా స్థలాన్ని శుభ్రం చేసుకోవాలి. ఒక పీఠంపై ముగ్గులు పెట్టి లక్ష్మీదేవి చిత్రపటం లేదా విగ్రహం ఉంచి పసుపు కుంకుమ, పూలతో అలంకరించుకోవాలి. మొదట గణపతిని ప్రార్థించి లక్ష్మీపూజ ప్రారంభించాలి.లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి, శ్రీ సూక్తం లేదా లక్ష్మీదేవికి సంబంధించిన ఇతర స్తోత్రాలను పారాయణం చేయాలి. కొబ్బరికాయ కొట్టి పండ్లు, తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. వీలయితే బంగారం, వెండి నాణేలు సమర్పించాలి. ఇవి సమర్పించడం వలన లక్ష్మీదేవి సంతుష్టురాలై మనకు మరిన్ని సంపదలు ప్రసాదిస్తుంది. చివరగా హారతి ఇచ్చి పూజ ముగించాలి. 2025: జూన్ 27.

Puri Ratha Yatra: పూరీ జగన్నాధుని రథయాత్ర

Image
  జగన్నాథ రథయాత్ర ఏటా ఆషాఢ శుక్ల విదియ రోజున జరుగుతుంది.  అయితే, రథయాత్ర వేడుక కోసం సన్నాహాలు మాత్రం వైశాఖ శుక్ల తదియ నాడు జరిగే అక్షయ తృతీయ పర్వదినం నుంచే మొదలవుతాయి. వేసవి వల్ల విగ్రహాలకు చందన లేపనాన్ని పూస్తారు. దీనినే ‘గంధలేపన యాత్ర’ అని అంటారు. అక్షయ తృతీయ రోజున పూరీ క్షేత్రంలో రథాల తయారీ మొదలవుతుంది. అదే రోజు నుంచి జగన్నాథుని చందనయాత్ర కూడా మొదలవుతుంది. ఈ యాత్ర 42 రోజుల పాటు కొనసాగుతుంది. మొదటి 21 రోజులను ‘బాహొరొ చందనయాత్ర’ (బహిర్‌ చందనయాత్ర) అంటారు.ఈ యాత్రలో ఉత్సవ విగ్రహాలను మాత్రమే నరేంద్రతీర్థంలో పడవలో ఊరేగిస్తారు. తరువాత 21 రోజులను ‘భితొరొ చందనయాత్ర’ (అంతర్‌ చందనయాత్ర) అంటారు.ఈ యాత్రలో మాత్రం కేవలం నాలుగు రోజులు మాత్రమే (అమావాస్య,  షష్టి, ఏకాదశి, పౌర్ణమి) ఉత్సవ విగ్రహాలను బయటకు తీసుకొస్తారు. జ్యేష్ఠ పౌర్ణమి నాడు జరిగే ‘స్నానయాత్ర’తో చందనయాత్ర వేడుకలు పూర్తవుతాయి.ఈ రోజు ఆలయ పూజారులు మంత్రోక్తంగా జగన్నాథునికి స్నాన వేడుకను నిర్వహిస్తారు. అందుకే జ్యేష్ఠపౌర్ణమిని ‘స్నానపూర్ణిమ’గా వ్యవహరిస్తారు. స్నానపూర్ణిమ రోజు ‘సునా కువొ’ (బంగారు బావి) నుంచి తెచ్చిన 108 కుండల పవిత...

Bonalu Dates 2025: బోనాల పండుగ తేదీలు 2025

Image
  ఆషాఢ మాసం పరాశక్తిని ఆరాధించే మాసం. ఈ మహాశక్తియే గ్రామగ్రామాన జగదాంబికగా, మహంకాళిగా, ఎల్లమ్మతల్లి, పోచమ్మతల్లి, నూకాలమ్మ, పెద్దమ్మతల్లి, మైసమ్మ, బాలమ్మ, ముత్యాలమ్మలుగా ఆయా చోట్ల కొలువుదీరి, ఆ జగన్మాత అందరిచేత ఆరాధనలందుకుంటోంది. పేర్లు వేరైనా తల్లి ఒక్కటే. తెలంగాణలో అత్యంత గొప్ప పండుగలలో బోనాల పండుగ ఒకటి. బోనాల పండుగ: వెయ్యేళ్ల చరిత్ర, తెలంగాణ సంస్కృతి బోనాల పండుగ వైభవానికి వెయ్యేళ్ళ చరిత్ర ఉంది. తెలంగాణలోని ప్రతి ఇంటి ఆడపడుచు అమ్మవారి అవతారంగా మారి ఈ పండుగలో పాల్గొంటుంది. ఆషాఢ మాసంలో నాలుగు ఆదివారాలు నాలుగు విభిన్న ప్రాంతాలలో జరిగే ఈ పండుగ, తెలంగాణ అంతటా జరిగినా, ముఖ్యంగా జంట నగరాలు (హైదరాబాద్-సికింద్రాబాద్) బోనాల పండుగకు కేంద్ర బిందువుగా మారుతాయి. ఈ మహత్తర పండుగ సంబరానికి శ్రీకారం చుట్టేది మాత్రం గోల్కొండ కోటలో వేంచేసి ఉన్న జగదంబిక బోనాలు. ఆ తల్లికే తొలి బోనం సమర్పిస్తారు. వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉన్న జగదంబికా తల్లికి తొలి బోనం అందించే ఆచారాన్ని మహావీరుడైన ప్రతాపరుద్రుడే స్వయంగా ప్రారంభించాడు. స్వయంగా జగదంబికా తల్లికి పూజలు చేసి అమ్మ అనుగ్రహంతో తమ సామ్రాజ్యాన్ని సుభిక్షం చేసుకున...

Ashada Navratri 2025: ఆషాడ నవరాత్రి, వారాహి నవరాత్రి

Image
వారాహి దేవి హిందూ ధర్మంలో ఒక శక్తివంతమైన దేవత, ఆమె గురించి అనేక ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. "వారాహి" అనే పదానికి భూమి అని కూడా అర్థం ఉంది. ఆమె విష్ణుమూర్తి యొక్క యజ్ఞవరాహ అవతారం యొక్క శక్తి స్వరూపం. వరాహ ముఖంతో దర్శనమిచ్చే ఈ తల్లి అన్నప్రదాయిని. ఆమె చేతిలో ధరించే నాగలి, రోకలి వంటి ఆయుధాలు అన్నోత్పత్తిని, అన్నపరిణామాన్ని సూచిస్తాయి. దేవతలకు హవ్యం, మానవాది జీవులకు యోగ్యమైన అన్నాన్ని అందించే ఆహార శక్తి ఆమె. వారాహి దేవి - ఒక పరిచయం 'సర్వం శక్తిమయం' అనే భావనే భక్తి, అదే ముక్తి అవుతుంది. ఇది మానవ జీవిత సార్థకతకు మార్గం. వారాహి దేవి అనుగ్రహమే అసలైన వరం, అందరూ దానినే కోరాలి. ఆమె శివుడికి పరిచర్యలు చేసే దేవతలలో ఒకరు, సప్త మాతృకలలో ఒక శక్తి. ఆమె భూసంబంధ దేవత. ఈమెకు ప్రత్యంగిరాదేవి అని కూడా పేరు ఉంది. భూ సంపాదన, భూ సంబంధ వివాదాల పరిష్కారానికి మార్గనిర్దేశనం చేసే దేవత ఈమె. కాశీ క్షేత్రాన్ని రక్షించే దేవతగా ప్రసిద్ధి చెందారు. ఆమె రాత్రంతా కాశీలో సంచరిస్తుందని నమ్ముతారు. కాశీలో అమ్మవారు గ్రామ దేవతగా ప్రసిద్ధి. ఈ అమ్మవారి దర్శనం వేకువన మాత్రమే లభిస్తుంది. వారాహి దేవిని శైవులు, వైష్...

Ashada Month Significance: ఆషాఢ మాసం: ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ఆరోగ్యపరమైన ప్రాముఖ్యత

ఆషాఢ మాసం, తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకతో సహా భారతదేశంలోని పలు ప్రాంతాలలో విశేషమైన సాంస్కృతిక, మతపరమైన, సాంప్రదాయక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది వేసవి (గ్రీష్మ ఋతువు) తీవ్రత నుండి రుతుపవనాల (వర్ష ఋతువు) ఆరంభానికి వారధిగా పరిగణించబడుతుంది. ఆషాఢ మాసం ప్రాముఖ్యత ఆషాఢ మాసం మొదటి రోజు, పాడ్యమి, తొలి మేఘాల ఆగమనంతో రుతుపవనాలను ఆహ్వానిస్తుంది. మండు వేసవి నుండి ఉపశమనాన్ని కలిగించినప్పటికీ, ఆషాఢ మాసాన్ని శూన్య మాసం అని కూడా పిలుస్తారు. దీని అర్థం కొత్త కార్యక్రమాలు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం కాదు. అందుకే, ఈ నెలలో క్రింది ముఖ్యమైన కార్యక్రమాలను వాయిదా వేస్తారు: * వివాహాలు * గృహప్రవేశాలు * ఆస్తి కొనుగోళ్లు * కొత్త వ్యాపారాలు ప్రారంభించడం * కొత్త వాహనాల కొనుగోలు సాంప్రదాయ పద్ధతులు, నమ్మకాలు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకలో ముఖ్యంగా పాటించే ఒక సంప్రదాయం ఏమిటంటే, కొత్తగా పెళ్లయిన దంపతులను, అత్తా-కోడళ్లను ఈ మాసంలో దూరంగా ఉంచడం. ఆషాఢ మాసంలో గర్భం దాల్చితే, వేసవిలో ప్రసవం అవుతుందని, తల్లీ-బిడ్డలకు ఆరోగ్య సమస్యలు రావచ్చని పూర్వం భావించేవారు. సరైన వైద్య సదుపాయాలు లేని ఆ రోజుల్లో, ఈ సంప్రదాయం ఆరోగ్యపరమైన...

Pandharpur Yatra 2025: పండరీపుర్ యాత్ర – భక్తి, ఐక్యతకు ప్రతిరూపం

Image
ప్రతి ఏడాది మహారాష్ట్రలో జరిగే పండరీపుర్ యాత్ర అనేది కేవలం ఒక ఆధ్యాత్మిక ప్రయాణం కాదు – అది వేలాది మంది భక్తుల అనురాగం, ఆత్మీయత, భగవంతుని పట్ల నిబద్ధతకు నిదర్శనం. శ్రీమహావిష్ణువు అవతారమైన విఠోబా (విఠల్) ఆలయంలో భక్తులు ఆషాఢ ఏకాదశి రోజున దర్శనానికి చేరుకునే ఈ యాత్ర, భక్తి, సంగీతం, సమానత్వం, సేవా దృక్పథాల సమ్మేళనం. యాత్ర ప్రారంభం & ముగింపు : తేదీలు (2025) తుకారాం మహారాజ్ పాల్కీ: జూన్ 18, 2025 → జూలై 5, 2025 జ్ఞానేశ్వర్ మహారాజ్ పాల్కీ: జూన్ 19, 2025 → జూలై 5, 2025   దర్శనం: జూలై 6, 2025 (ఆషాఢ శుద్ధ ఏకాదశి) యాత్ర విశేషాలు: మొత్తం దూరం: సుమారు 250 కిలోమీటర్లు వ్యవధి: సుమారు 20 రోజులు ఆరంభం: దేహు గ్రామం నుంచి తుకారాం మహారాజ్ పల్లకీ అలంది పట్టణం నుంచి జ్ఞానేశ్వర్ మహారాజ్ పల్లకీ ఈ పల్లకీలలో వారి పాదుకలు ఊరేగింపుగా తీసుకెళ్లడం, వారి ఆధ్యాత్మిక ఉనికిని గుర్తుచేస్తుంది. తుకారాం మహారాజ్ బోధనలు – ఆదర్శాల దారిదీపం: భక్తి మేకు మార్గం: హృదయపూర్వకమైన భక్తి ద్వారా మాత్రమే భగవంతుని చేరుకోవచ్చు. సమానత్వం: దేవుని ముందు అందరూ సమానమే – కుల, వర్గ, లింగభేదం తలవించకూడదు. సరళత జీవితం: తక్కువలో తృప్తిగా ఉం...

Ashada Month 2025: ఆషాడ మాసం

Image
  చాంద్రమానంలో నాల్గవ మాసం ఆషాడ మాసం. ఈ మాసంలోని పౌర్ణమి నాడు చంద్రుడు పూర్వాషాఢ నక్షత్రంలో కాని లేదా ఉత్తరాషాఢ నక్షత్రంలో కాని కలిసివుండటం చేత ఈ మాసం ఆషాఢంగా పేరుపొందింది. ఈ మాసం శుభకార్యాలకు అంతగా అనువుకానప్పటికీ, ఆధ్యాత్మికంగా ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది. ఈ మాసంలో ఒంటిపూట భోజన నియమాన్ని పాటించడం వల్ల ఐశ్వర్యం లభించి మంచి సంతానం కలుగుతుంది అని శాస్త్రం. ఈ నెలలో గృహనిర్మాణాన్ని ఆరంభించడం వల్ల గోసంపద లభిస్తుంది అని మత్య్స పురాణం చెబుతోంది. ఈ నెలలో ఆడవారు కనీసం ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకోవాలంటారు, అలాగే ఆహారంలో మూలగాకు ఎక్కువగా వాడాలి. జపపారాయణలకు ఈ మాసం అనువైనది. కొన్ని ప్రాంతాలలో ఈ మాసంలో కూడా పుణ్య స్నానాలు చేస్తారు. ఈ మాసంలోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది.సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించి నప్పటినుండి మకరరాశిలోకి ప్రవేశించే అంత వరకు గల కాలం దక్షిణాయనం. దక్షిణాయన ప్రారంభసమయంలో పుణ్యస్నానాలను, ధాన్యజపాదులను చేయడం ఎంతో మంచిది. ఈ సంక్రమణ సమయంలో చేసే పుణ్య స్నానాల వల్ల రోగాలు నివారించడమే కాక దారిద్య్రం నిర్ములింపబడుతుంది. ఈ మాసంలో చేసే దానాలు విశేష ఫలితాలు ఇస్తాయి. పాదరక్షలు, గొడు...

Jyestha Amavasya: జ్యేష్ఠ అమావాస్య

జ్యేష్ఠ మాసంలో లో కృష్ణ పక్షంలో వచ్చే అమావాస్యను  జ్యేష్ఠ అమావాస్య అంటారు. జ్యేష్ఠ అమావాస్య పూర్వీకులను స్మరించుకోవడానికి, గౌరవించుకోవడానికి, వారి నుండి ఆశీస్సులు పొందడానికి మంచి రోజు. పూజలు, దానం మొదలైన అనేక కార్యక్రమాలతో పాటు పిండ ప్రదానం లేదా తర్పణం ఇవ్వడం జ్యేష్ఠ అమావాస్య నాడు పితృదేవతల పట్ల గౌరవాన్ని ప్రదర్శించడానికి చేస్తారు. ఇలా చేయడం వలన పితృదేవతలు ప్రశాంతంగా ఉండగలుగుతారు. జ్యేష్ఠ అమావాస్య రోజు శివుడిని పూజించడం వలన ప్రతికూలతలు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక ప్రగతి కలుగుతుంది. ఈరోజున ఉపమా కలుగుతుంది. ఉపవాసం ఆత్మ శుద్ధి కలుగుతుంది. కోరికలు నెరవేరుతాయి. ఈ రోజున పవిత్ర నదులు, జలాశయాలలో స్నానం చేయాలి. ఇలా చేస్తే పాపాలు తొలగిపోతాయి. జ్యేష్ఠ అమావాస్య రోజున వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయువు కోసం, ఆనందకరమైన వైవాహిక జీవితం గడపడానికి అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటారు. పెళ్లికాని అమ్మాయిలు కూడా తాము కోరుకున్న వరుడిని పొందడానికి ఈ రోజున రావి చెట్టును పూజించడం, సావిత్రి కథను చదువుతారు లేదా వింటారు. ఈ రోజున పవిత్ర నది లేదా ఆలయ ప్రాంతాన సంధ్యా సమయంలో దీప దానం చేయాలి. రావి చెట్టు ముందు దీపం...

Angaraka Chaturdasi: కృష్ణ అంగారక చతుర్దశి

బహుళ పక్షంలో వచ్చే  చతుర్దశి తిథి మంగళవారంతో కలిసి వస్తే దానిని కృష్ణ అంగారక చతుర్దశిగా వ్యవహరిస్తారు. ఈ తిథికి సూర్యగ్రహణంతో సమానమైన శక్తి ఉంటుంది. సూర్యగ్రహణం రోజు స్నానం, దానం, పితృ కార్యాలు చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ తిథి రోజున స్నానం, దానం చేస్తే అలాంటి ఫలితాలే కలుగుతాయని పంచాంగకర్తలు చెబుతున్నారు. కృష్ణ అంగారక చతుర్దశి రోజు రుణ విమోచన అంగారక స్తోత్రం చదివితే తీవ్రమైన అప్పులతో బాధపడుతున్నవారు ఆ బాధలనుండి ఉపశమనం పొందుతారు. చదవలేనివారు ఎవరితోనైన చదివించుకొని విన్నాకూడా ఎంత పెద్ద అప్పులైనా తీరిపోతాయి. “ఓం అం అంగారకాయ నమః" అనే మంత్రాన్ని స్మరించుకున్నా మంచి ఫలితాలుంటాయి. ఇవి పాటించినా శుభమే : కృష్ణ అంగారక చతుర్దశి రోజు స్నానం చేసే నీటిలో గంగాజలం కలిపి చేస్తే మంచిది. గంగాజలం లేకపోతే స్నానం చేసేటప్పుడు గంగను ఆవాహన చేసి స్నానం చేసినా మంచిదే. దానం చేసినా మంచి మంచి ఫలితాలుంటాయి. గ్రహ దోష తీవ్రత కూడా తగ్గుతుంది. ఆరోజున గోధుమలను దానం చేస్తే మరీ మంచిది. ఈ తిథి రోజున యమధర్మరాజుకు తర్పణం ఇచ్చినా మంచి జరుగుతుంది. సూర్యునికైనా తర్పణం ఇవ్వవచ్చు. ఈ రోజు కందులు దానం ఇస్తే సొంతింటి కల నెర...

Skanda Panchami: స్కంద పంచమి

Image
ఆషాడ శుద్ధ పంచమి రోజున స్కంద పంచమి జరుపుకుంటారు.  దేవతలు కుమారస్వామిని దేవసేనానిగా చేసింది ఈ పంచమి రోజునే  ఈ పంచమి తరువాత షష్ఠి కూడా కుమార షష్ఠిగా పిలవబడుతుంది. స్కందపంచమి రోజున ఉపవాసం ఉంది కుమార షష్ఠి రోజున కుమారస్వామిని షోడశోపచారాలతో పూజించాలి. ఈ రోజున బ్రహ్మచారికి భోజనం పెట్టి వస్త్రదానం చేయడం మంచిది. స్కంద పంచమి రోజున ఉపవాసం ఉండి, కుమారషష్టి రోజున స్వామిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ రెండు రోజుల్లో వల్లీదేవసేన సమేతంగా ఉన్నా స్వామి ఆలయానికి వెళ్లి వారిని దర్శించుకుంటే సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది. ఈ రోజుల్లో స్వామికి అభిషేకం చేయించినా, సుబ్రహ్మణ్య అష్టకం చదువుకున్నా కూడా ఆయన అనుగ్రహం లభిస్తుంది. వీలైతే దగ్గరలో ఉన్న నాగరాళ్లు లేదా పుట్ట దగ్గర చిమ్మిలి ప్రసాదాన్ని ఉంచి నమస్కరించినా మంచిదే. స్కందపంచమి, కుమారషష్టి రోజులలో కుమారస్వామిని ఆరాధిస్తే జాతకపరంగా ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి. సంపదలు రావాలన్నా ఈ రోజు స్వామిని పూజించాలి. కోర్టు లావాదేవీలలో విజయం సాధించాలన్నా, పరీక్షలలో మంచి మార్కులు రావాలన్నా ఈ స్కందపంచమి, షష్టి తిథులలో స్వామిని ఆరాధించాలి. 2025:...

Shrinkhala Devi Temple: శ్రీ శృంఖలాదేవి ఆలయం - ప్రద్యుమ్నం

ఈ చరాచర సృష్టికంతటికీ తల్లి అయిన ఆ జగన్మాత నిత్యం బాలింతరాలుగా నడికట్టుతో కొలువుదీరి, తన బిడ్డలను రక్షించే తల్లిగా పేరుపొందిన దేవి-'శృంఖలాదేవి', శృంఖలాదేవి కొలువుదీరిన దివ్యక్షేత్రం ‘ప్రద్యుమ్నం.’ ప్రద్యుమ్నం అష్టాదశ శక్తిపీఠాలలో మూడవది. అష్టాదశ శక్తులలో తృతీయశక్తి అయిన 'శృంఖలాదేవి' ఆలయం హుగ్లీ జిల్లాలోని 'పాండుపా' అనే గ్రామంలో వుంది. 'పాండుపా' కలకత్తా నగరం నుంచి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. పురాణగాధ ఇక్కడ శ్రీ శృంఖలాదేవి కొలువుదీరడానికి సంబంధించినపురాణ గాథలు, స్థలపురాణాలు అనేకం ప్రచారంలో వున్నాయి. త్రేతాయుగంలో 'ఋష్యశృంగ మహర్షి' శృంఖలాదేవిని ప్రతిష్ఠించినట్లు తెలుస్తోంది. ఋష్యశృంగుడి తండ్రి విభాండకుడు. తల్లి చిత్రరేఖ, చిత్రరేఖ ఒక అప్సరస. ఒకనాడు ఇంద్రసభలో చిత్రరేఖ నాట్యం చేస్తున్న సమయంలో కొన్ని 'లేళ్ళు' సభామండపంలోకి వచ్చాయి. నాట్యం చేస్తూ ఉన్న చిత్రరేఖ వాటిని చూస్తూ తనను తాను మైమరచి ఇంద్రుడిని గురించి పట్టించుకోలేదు. దీనితో కోపోద్రిక్తుడైన ఇంద్రుడు చిత్రరేఖను ‘మృగి జన్మించు' అని శపించాడు. తేరుకున్న చిత్రరేఖ శాపవిమోచనమునకై ఇంద్రుడి...

Kolhapur Mahalaxmi Temple: శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం - కొల్హాపూర్

Image
శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన కొల్హాపూర్ లోని ఒక శక్తి పీఠం. ఒకనాడు పాలసముద్రంలో విష్ణుమూర్తి శేషతల్పంపై శయనించి ఉండగా, శ్రీలక్ష్మి నారాయణుని పాదసేవ చేస్తోంది. ఆ సమయంలో భృగు మహర్షి వచ్చాడు. ఈ మహర్షికి అరికాలిలో కన్ను ఉంటుంది. ఇతనికి తాను అందరికంటే గొప్పవాడినని అహంకారం ఎక్కువ. పరధ్యానంలో ఉన్న శ్రీ మహావిష్ణువు భృగు మహర్షి రాకను గుర్తించలేదు. అందుకు ఆగ్రహించిన మహర్షి విష్ణుమూర్తి వక్షస్థలంపై తన పాదాన్ని ఉంచాడు. శ్రీమహావిష్ణువు వక్షస్థలం లక్ష్మీస్థానం అన్న సంగతి తెలిసిందే కదా! తన నివాస ప్రదేశాన్ని భృగు మహర్షి అవమానించడాన్ని కోపంతో అలిగి లక్ష్మీదేవి వైకుంఠాన్ని వీడి భూలోకాన్నిచేరుకుంటుంది. భృగు మహర్షి గర్వాన్ని అణిచిన విష్ణువు తన వక్షస్థలంపై పాదంతో తన్నిన భృగు మహర్షిని శాంతింపజేయడానికి విష్ణువు ఆయనకు పాదసేవ చేస్తున్నట్లుగా నటిస్తూ ఋషి అరికాలిలో ఉన్న కన్ను నలిపివేసి మహర్షి గర్వాన్ని అణిచివేస్తాడు. వైకుంఠాన్ని వీడి భూలోకం చేరిన లక్ష్మీదేవి సహ్యాద్రి పర్వత ప్రాంతంలోని కొల్హాపూర్‌లో వెలిసిందని విష్ణు పురాణం, బ్రహ్మాండ పురాణం ద్వారా మనకు తెలుస్తుంది. లక్ష్మీదేవికి ...

Yogini Ekadasi: యోగిని ఏకాదశి

Image
జ్యేష్ట బహుళ ఏకాదశికే యోగిని ఏకాదశి అని పేరు. ఈ ఏకాదశి మహిమ బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పబడింది. ఈ ఏకాదశి మహిమను శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుకు వివరించాడు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆరోగ్యం చేకూరుతుంది. భయాలు తొలగిపోయి దైర్యం సిద్ధిస్తుంది. కొన్ని వేలమంది బ్రాహ్మణులకు సంతర్పణ చేయగా వచ్చే ఫలం కేవలం ఈ యోగిని ఏకాదశి వ్రతం వలన కలుగుతుంది. ఇది మనిషి యొక్క సమస్తపాపాలను నశింపచేసి అమిత పుణ్యాన్ని చేకూరుస్తుంది. యోగిని ఏకాదశి మహిళ పురుష భేదం లేకుండా పిల్లలు, పెద్దలు అందరూ ఆచరించవచ్చు. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ వ్రతం ఆచరించడం వలన మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చునని శాస్త్రవచనం. యోగిని ఏకాదశి పూజా విధానం యోగిని ఏకాదశి రోజు సూర్యోదయానికి పూర్వమే తలారా స్నానం చేసి శుచియై పూజా మందిరం శుభ్రం చేసుకొని లక్ష్మీనారాయణుల విగ్రహాలకు కానీ చిత్రపటాలకు కానీ గంధం కుంకుమలతో బొట్లు పెట్టి సుందరంగా అలంకరించాలి. ఆవు నేతితో దీపారాధన చేయాలి. చామంతి, గులాబీ, మల్లెపూలతో లక్ష్మీనారాయణులను అర్చించాలి. ఏకాదశి పూజలో ముఖ్యంగా తులసి దళాలను సమర్పించాలి. తులసి లేని పూజ అసంపూర్ణం అవుతుంది. ఆవు నేతి...

Vat Savitri Vrat: వట సావిత్రి వ్రతం

Image
ఈ వ్రతాన్ని జ్యేష్ట పూర్ణిమ రోజు చేస్తారు. కొన్ని ప్రాంతాలలో త్రయోదశి నుండి ప్రారంభించి మూడు రోజుల పాటు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. జ్యేష్ట పౌర్ణమి రోజు చేయలేనివారు జ్యేష్ట అమావాస్య రోజు ఈ వ్రతాన్ని చేసుకుంటారు  ఈ వ్రతాన్ని ఆచరించేవారు ముందు రోజు ఉపవాసం ఉండాలి. తరువాత రోజు వేకువజామునే నిద్రలేచి, స్నానం చేసి గృహదేవత అర్చన చేసిన తరువాత సమీపంలోని వట వృక్షానికి చేరుకోవాలి. వట వృక్షం మొదలు వద్ద అలికి, ముగ్గులు పెట్టాలి సావిత్రి, సత్యవంతుల ప్రతిమలు, త్రిమూర్తుల ప్రతిమలు  పెట్టి అలంకారం చేయాలి. వ్రతం ముగిసిన తరువాత వటవృక్షానికి 108 ప్రదక్షిణాలు చేయాలి  ఇలా ప్రదక్షిణాలు చేసే సమయంలో వృక్షానికి నూలు దారం చుడుతూ ఉండాలి. ప్రదక్షిణాలు తరువాత త్రిమూర్తి స్వరూపమైన వృక్షానికి నమస్కరించి ముత్తైదువులకు వాయనం ఇచ్చి భోజనం పెట్టాలి.  పూర్వం అశ్వపతి, మాళవి దంపతులకు ‘సావిత్రి’ అనే కుమార్తె వుండేది. యుక్తవయస్కురాలెైన సావిత్రికి నీకు ఇష్టమైనవాడిని వరించమని తల్లిదండ్రులు అనుమతినిచ్చారు. రాజ్యం శత్రువులపాలు కావడంతో అరణ్యంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని జీవిస్తోన్న ద్యుమత్సేనుడి కుమారుడెైన సత్య వంతు...

Jyestha Purnima: జ్యేష్ట పూర్ణిమ

Image
జ్యేష్ట మాసం శుక్ల పక్ష పౌర్ణమి విశిష్టమైన విశిష్టమైన రోజు. ఈ రోజుకు ప్రత్యేకత ఉంది. ఈ రోజున నదుల్లో స్నానం చేయడం, దానాలు చేయడం మంచిది. అంతేకాకుండా ఈ రోజు వట పూర్ణిమ ఉపవాసం కూడా పాటిస్తారు. జ్యేష్ఠ పూర్ణిమ అనేక శుభాలు చేకూరుస్తుందని శాస్త్ర వచనం. ఈ శుభ తిథిన కొన్ని పద్దతులు పాటిస్తే ఆనందంతో పాటు శాంతి, శ్రేయస్సు కలుగుతాయి. అంతేకాకుండా లక్ష్మీ దేవి అనుగ్రహం కూడా పొందవచ్చని జ్యోతిషశాస్త్రం పేర్కొంది. పౌర్ణమి రాత్రి మహాలక్ష్మీ, విష్ణువులను ఆరాధించాలి. అంతేకాకుండా రాత్రిపూట ఇంటి ప్రధాన ద్వారం వద్ద నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని విశ్వసిస్తారు. జ్యేష్ఠ పూర్ణిమను అదృష్ట తిథిగా పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున లక్ష్మీ స్తోత్రాలు, కనకధార స్తోత్రాలు పఠించడం వలన సంపద పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. స్తోత్రాలు,మంత్రాలు పఠించడం ద్వారా లక్ష్మీదేవి సంతృప్తి చెందుతుంది. సాయంత్రం లక్ష్మీదేవిని ధ్యానించడం వల్ల ఎన్నో శుభాలు కలుగుతాయి. ఆర్థిక పరమైన సమస్యలనుంచి బయటపడటానికి పౌర్ణమి తిథినాడు చంద్రోదయం తర్వాత ముడిపాలు, బియ్యం, చక్కెరను నీటిలో కలపి, అనంతర...

Snana Purnima: స్నాన పూర్ణిమ

Image
జ్యేష్ట పౌర్ణమి తిథి సందర్భంగా పూరీ జగన్నాథునికి వార్షిక స్నానోత్సవం జరుగతుంది. ఈ తిథి ఈ సంవత్సరం జూన్ 11 వ తేదీన వస్తుంది. రథయాత్రకు ముందు జరిగే ఈ ఉత్సవంలో భాగంగా శ్రీ మందిరం రత్న వేదిక నుంచి మూల విరాట్లు (సుదర్శనుడు, బలభద్రుడు, దేవీ సుభద్ర, శ్రీ జగన్నాథుడు) ఒక్కోక్కటిగా బహిరంగ స్నాన మండపానికి తరలిస్తారు. దీనినే పొహండి కార్యక్రమం అంటారు. ఇది రెండురోజులపాటు జరుగుతుంది. మూల విరాట్లకు 108 కలశాలతో సుగంధ జలాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం గజానన అలంకారంతో ముస్తాబు చేస్తారు. అశేష భక్త జనానికి బహిరంగ వేదికపై దర్శనం ఇవ్వడం స్నానోత్సవ విశిష్టత. మహా రాష్ట్ర నుంచి 15వ శతాబ్దంలో విచ్చేసిన గణపతి భక్తుని అభీష్టం మేరకు ఏటా స్వామి గజానన అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నట్లు పండితులు చెబుతారు. అనంతరం తిరుగు పొహండి స్నాన మండపం నుంచి శ్రీ మందిరం లోనికి మూల విరాట్లను తరలిస్తారు. శ్రీజగన్నాథునికి జరిగే సేవలు పరిశీలిస్తే కొంత ఆశ్చర్యం కలుగుతుంటుంది. స్వామివారికి జరిగే కొన్ని క్రతువులు సామాన్య మానవులకు జరిగినట్టుగానే నిర్వహిస్తుంటారు. జగన్నాథుడు యాత్ర ప్రియుడు. ఈ యాత్రకు ముందు భారీగా స్నానం ఆచరించడంతో శారీరక ప...

Guru Moudyami: గురుమౌఢ్యమి

విశ్వావసునామ సంవత్సరంలో  గురుమౌఢ్యమి జూన్ 9 వ తేదీనుండి జూలై 9 వ తేదీ వరకు ఉంటుంది. అనగా జ్యేష్ఠ శుద్ధ త్రయోదశినుండి ఆషాఢ శుద్ధ చతుర్ధశి వరకు గురుమౌఢ్యమి ఉంటుంది. గ్రహాలు సూర్యునికి అతి దగ్గరగా ఉండే కాలాన్ని మౌఢ్యమి అంటారు. గురుగ్రహం సూర్యునికి దగ్గరగావుంటే గురుగ్రహం అంటారు. ఇది అన్ని గ్రహాలకు జరుగుతుంది. కాని జ్యోతిషశాస్త్రం మాత్రం గురు, శుక్ర గ్రహాల మౌఢ్యమిలను మాత్రమే దోషంగా పరిగణిస్తుంది. దీనిని వాడుక భాషలో మూఢం అంటారు. మౌఢ్యమి కాలంలో గ్రహ కిరణాలు భూమిపై ప్రసరించుటకు సూర్యుడు అడ్డంగా ఉంటాడు. అందువల్ల మౌఢ్య కాలంలో గ్రహాలు బలహీనంగా ఉంటాయి. గ్రహాలు వక్రించినప్పటికంటే అస్తంగత్వం చెందినప్పుడే బలహీనంగా ఉంటాయి. మౌఢ్యమి అంటే చీకటి అని అర్థం. ఈ కాలం శుభకార్యాలకు పనికిరాదని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. మౌఢ్యమిలో చేయకూడనవి పెళ్ళిచూపులు, వివాహం, ఉపనయనం, గృహారంభం,గృహప్రవేశం, యజ్ఞాలు చేయుట, మంత్రానుష్టానం, విగ్రహా ప్రతిష్టలు, వ్రతాలు, నూతన వధువు ప్రవేశం, నూతన వాహనం కొనుట, బావులు, బోరింగులు, చెరువులు తవ్వటం, పుట్టువెంట్రుకలకు, వేదవిధ్యా ఆరంభం, చెవులు కుట్టించుట, నూతన వ్యాపార ఆరంభాలు మొదలగునవి చే...

Vengamamba Perantalu 2025: శ్రీ వెంగమాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాలు (పేరంటాలు) - 2025

Image
అమ్మవారి బ్రహ్మోత్సవాలు జూన్ నెలలో ప్రారంభం కానున్నాయి. ఈ ఆలయం నర్రవాడ గ్రామం నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలో ఉంది  ప్రతి సంవత్సరం జ్యేష్ట మాసంలో పౌర్ణమి తరువాత వచ్చే ఆదివారం నుండి గురువారం వరకు అమ్మవారి పేరంటాలు జరుగుతాయి. టన్నుల కొద్దీ ఎండుకొబ్బరి అగ్నిగుండంలో వేయడం ప్రత్యేక ఆకర్షణ. ముఖ్యమైన తేదీలు 2023  : జూన్ 15 - నిలుపు, పసుపుదంచు కార్యక్రమం జూన్ 16 - రథోత్సవం జూన్ 17 - రథోత్సవం జూన్ 18 - కల్యాణోత్సవం (పగలు), పసుపు కుంకుమ ఉత్సవం ప్రదానోత్సవం(రాత్రి) జూన్ 19  - పొంగళ్లు, ఎడ్ల ప్రదర్శన జూన్ 20 - మొదటి గురువారం జులై 03 - రెండవ గురువారం (అమ్మవారి పదహారు రోజుల పండుగ) జులై 10 - మూడవ గురువారం జులై 17 - నాలుగవ గురువారం (నెల పొంగళ్ళు) జులై 24 - అయిదవ గురువారం

Eruvaka Punnami: ఏరువాక పున్నమి

Image
జ్యేష్ఠపౌర్ణమి ఏరువాక పున్నమిగా చెప్పబడుతోంది. ఈ ఏరువాక పున్నమి పూర్తిగా రైతుల పండుగ. ఈనాడు రైతులు ఉదయాన్నే ఎద్దులను కడిగి, వాటి కొమ్ములకు రంగులను పూసి వాటిని గంటలు, గజ్జెలతో అలంకరింప జేస్తారు. తరువాత ఎద్దులను కట్టివేసే గాడిని ధూప, దీప, నివేదనలతో పూజించి, ఎద్దులకు పొంగలిని పెడతారు. ఈనాటి సాయంకాలం నాగలిని ఎర్రమట్టి పట్టెలతో అలంకరించి, ఎద్దులను ఊరేగింపుగా పొలం వద్దకు తీసుకొని వెళ్ళి, దుక్కిని అంటే పొలం దున్నటాన్ని ప్రారంభిస్తారు. పొలం దున్నటానికి వెళ్ళేముందు ఊరి వాకిలిలో గోగునారతో చేసిన తోరణాన్ని కట్టి, దానిని చేరుకోలలతో కొడుతూ, ఎవరికి దొరికినంత నారపీచును వారు తీసుకుంటారు. ఈ విధంగా చేయటంవల్ల పశువులకు మేలు కలుగుతుందని రైతులు నమ్ముతారు. కాగా ఈ వ్యవసాయ ప్రారంభ పండుగను గురించి వ్రత గ్రంథాలలో చెప్పకపోవడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే వేదకాలంలోనే ఈ రైతుల పండుగ ఆచరణలో వుండేదని చెప్పేందుకు కొద్ది పాటి ఆధారాలున్నాయి. వర్ష ఋతువు ప్రారంభమైన వెంటనే పూజాదికాలతో రైతులు దుక్కిని ప్రారంభించేవారని ఋగ్వేదం  చెబుతోంది. విష్ణుపురాణంలో  కూడా ఈ రైతుల పండుగ సీతయజ్ఞంపేర పిలువబడేదని పేర్క...

Pavagada Shani Temple: శ్రీ శనీశ్వరుడి ఆలయం - పావగడ

Image
  ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దులోని పావగడలో వెలిసిన శనీశ్వరాలయం ఎంతో ప్రసిద్ధి చెందినది. పావగడలో వెలసిన శనీశ్వరుని దర్శనం కోసం ప్రతిరోజు ఎంతోమంది భక్తులు తరలి వస్తుంటారు. ఈ ఆలయంలో స్వామి వారిని దర్శనం చేసుకున్న భక్తులకు ఏలినాటి శని ప్రభావం తొలగిపోతుందని, ఆగిపోయిన పనులు పూర్తవుతాయని విశ్వాసం. ఆలయ చరిత్ర పావగడను హొయసులు, మొఘలులు, మైసూర్ రాజులు ఇలా ఎందరో పాలించారు. సుమారు 400 సంవత్సరాల క్రితం ఈ ఊరికి ఒక పెద్ద కరువు సంభవించింది. ఆ కరువు నుంచి గట్టెక్కేందుకు ఆ ఊరి ప్రజలంతా కలిసి సమీపాన అరణ్యంలో ఉన్న సిద్ధులు, మునుల వద్దకు వెళ్లి తమ గోడు చెప్పుకున్నారు. అప్పుడు ఆ మునులు ఒక నల్లరాతిని తీసుకొని, శీతలాదేవి మహాబీజాక్షర యంత్రాన్ని రాశారు. అందులో అమ్మవారిని ఆవాహనం చేసి భూమిపై ప్రతిష్టించారు. తీరిన కరువు భూమిని కాపాడే ఆ తల్లి చల్లని చూపుల ఫలితంగా ఆ ఊర్లో వర్షాలు బాగా కురిసి కరువు కాటకాల నుంచి ప్రజలకు విముక్తి లభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చుట్టుపక్కల ఏ ఊరిలో కరువు వచ్చినా అమ్మవారి యంత్రాన్ని పూజించడం మొదలుపెట్టారు. అలాగే వర్షాలు సమృద్ధిగా కురవాలని వరుణ యాగాలు జరిపిస్తుంటారు. శనీశ్వరుని వ...

Jyestha Suddha Trayodashi: దౌర్భాగ్య నాశక త్రయోదశి

Image
జ్యేష్ఠ మాసంలో వచ్చే త్రయోదశినే దౌర్భాగ్య నాశక త్రయోదశి అంటారు. ఇది జ్యేష్ఠ పౌర్ణమికి ముందు వస్తుంది. ఈ సంవత్సరం ఈ తిథి జూన్ 9 వ తేదీన వస్తుంది. వివాహం కాకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, చెడు వ్యసనాలకు బానిస కావడం, మానసిక, శారీరక ఆరోగ్య పరిస్థితి బాగుండకపోవడంలాంటి వాటిని దౌర్భాగ్యాలని అంటారు. ఈ త్రయోదశినాడు కొన్ని నియమాలు పాటించడం వలన దౌర్భాగ్యాలు నాశనమైపోతాయి. కాబట్టే దీనిని దౌర్భాగ్య నాశన త్రయోదశి అంటారు. శివునికి అభిషేకాలు ఆర్థిక సమస్యలున్నవారు ఈ త్రయోదశినాడు శివాలయంలో శివలింగానికి పంచదారతో అభిషేకం చేయాలి. వివాహ సమస్యలున్నవారు చెరుకురసంతో అభిషేకం చేయాలి. సంతానంకానివారు తేనెతో అభిషేకం చేయాలి. అప్పుల బాధలు ఉన్నవారు పంచామృతాలతో అభిషేకం చేయాలి. శివాలయంలో ఈ త్రయోదశి రోజున జాగారం చేస్తే తప్పకుండా మానవులు ఎదుర్కునే అనేక సమస్యలు శీఘ్రంగా తొలగిపోతాయి. జాగారం చేయడం వీలుకానివారు ఈ రోజున శివాభిషేకాలు చేసుకొని ఉపవాసం పాటించినా మంచి ఫలితాలుంటాయి. లక్ష్మీదేవి ఆరాధన శివాభిషేకాలే కాకుండా జ్యేష్ట త్రయోదశి రోజున లక్ష్మీదేవిని ఆరాధించడం వలన కూడా అనేక సమస్యలు తొలగిపోతాయి. శ్రీమహా...

SKANDAGIRI SUBRAMANYA SWAMY TEMPLE: స్కందగిరి సుబ్రమణ్యస్వామి ఆలయం - సికింద్రాబాద్

Image
దక్షిణ భారతంలో సుబ్రహ్మణ్యేశ్వరుని కార్తికేయుడు, మురుగన్, స్కందుడు, కుమారస్వామి, ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో స్వామివారిని అర్చిస్తారు. కుమార స్వామి కారణజన్ముడనీ తారకాసురుణ్ణి వధించడం కోసమే పుట్టాడనేది పురాణ కథనం. పేరులోనే స్కందుని నిలుపుకున్న స్కందగిరి సుబ్రహ్మణ్యుని ఆలయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో గల పద్మారావు నగర్​లో వెలసి ఉంది. అత్యంత మహిమాన్వితమైన ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యుడు శ్రీవల్లీదేవసేన సమేతంగా కొలువై ఉన్నాడు. ఆలయ స్థల పురాణం స్కందగిరి ఆలయ స్థల పురాణం పరిశీలిస్తే ఇక్కడ స్థానికంగా ఉండే ఓ భక్తుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కలలోకి కనబడి గుడిని కట్టాలని ఆదేశించారు. ఆయన సికింద్రాబాద్​లోని పద్మారావునగర్​లో ఆంజనేయుడి విగ్రహం సమీపంలో ఉన్న ఎత్తైన కొండ మీద స్కందుడి ఆలయానికి దాతల సహాయంతో శ్రీకారం చుట్టారు. సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి ఉన్న సహస్ర నామాలలో ఒకటైన 'స్కంద' అనే పేరు ఏర్పడగా, కొండమీద ఆలయాన్ని నిర్మించిన కారణంతో 'గిరి 'అన్న పదం చేర్చి 'స్కందగిరి'గా ఈ ఆలయానికి సార్ధక నామధేయం ఏర్పడింది. ఆలయ సముదాయం స్కందగిరి ఆలయంలో ప్రధాన మూలవిరాట...

Kamakhya Devi Temple: శ్రీ కామాఖ్యాదేవి ఆలయం

Image
కామాఖ్యాదేవి క్షేత్రంలో అమ్మవారికి విగ్రహ రూపం ఉండదు. యోని ఆకారంలో ఉన్న శిలనే విగ్రహంగా భావించి కొలుస్తారు. దశ మహావిద్యలకు ప్రతీకగా పూజిస్తారు. భక్తుల కోర్కెలను తీర్చడానికి కామాఖ్యాదేవి అనేక రూపాలను ధరించిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయం వెనుక పురాణగాథను తెలుసుకుందాం. ఆలయ పురాణ గాథ సతీదేవి తండ్రి దక్షప్రజాపతి. దక్షుడు పరమేశ్వరుణ్ని ఆహ్వానించకుండా యాగం చేస్తాడు. ఎందుకిలా చేశావని ప్రశ్నించిన సతీదేవిని అవమానిస్తాడు. యజ్ఞంలో శివనింద జరగడం సహించలేని సతీదేవి యజ్ఞ గుండంలో దూకి అగ్నికి ఆహుతై పోతుంది. ఆగ్రహోదగ్రుడైన పరమేశ్వరుడు వీరభద్రుణ్ని సృష్టించి యాగాన్ని భగ్నం చేయిస్తాడు. శివుడు విరాగిలా మారి సతీదేవి మృతదేహాన్ని భుజాన వేసుకొని తిరుగుతుంటాడు. సుదర్శన చక్రంతో ఖండించిన విష్ణువు ఈశ్వరుడు తన కర్తవ్యాన్ని మరచి బాధతో అలా తిరుగుతుండటం వల్ల సృష్టి లయ తప్పుతుందని భావించిన శ్రీ మహావిష్ణువు సతీదేవి దేహాన్ని సుదర్శన చక్రంతో ఖండిస్తాడు. ఆ ముక్కలన్నీ వివిధ ప్రాంతాల్లో చెల్లాచెదురుగా పడతాయి. ఆలా అమ్మవారి శరీరభాగాలు పడిన ప్రాంతాలన్నీ అష్టాదశ శక్తిపీఠాలుగా విరాజిల్లుతున్నాయి. అత్యంత మహిమాన్విత కామాఖ్యా ...

Govindaraja Swamy Brahmotsavam: శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - తిరుపతి

Image
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 02 నుండి జూన్ 10వ తేదీ వరకు వైభవంగా జరుగనున్న నేపథ్యంలో టిటిడి విస్తృత ఏర్పాట్లు చేప్టటింది. జూన్ 01వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 7 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు : జూన్ 02 ఉదయం – ధ్వజారోహణం రాత్రి – పెద్దశేష వాహనం జూన్ 03 ఉదయం – చిన్నశేష వాహనం రాత్రి – హంస వాహనం జూన్ 04 ఉదయం – సింహ వాహనం రాత్రి – ముత్యపుపందిరి వాహనం జూన్ 05 ఉదయం – కల్పవృక్ష వాహనం రాత్రి – సర్వభూపాల వాహనం జూన్ 06 ఉదయం – మోహినీ అవతారం రాత్రి – గరుడ వాహనం జూన్ 07 ఉదయం – హనుమంత వాహనం రాత్రి – గజ వాహనం జూన్ 08 ఉదయం – సూర్యప్రభ వాహనం రాత్రి – చంద్రప్రభ వాహనం జూన్ 09 ఉదయం – రథోత్సవం రాత్రి – అశ్వవాహనం జూన్ 10 ఉదయం – చక్రస్నానం రాత్రి – ధ్వజావరోహణం

Appalayagunta Brahmotsavam 2025: శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు 2025 - అప్పలాయగుంట

Image
అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 07  నుండి జూన్ 14వ తేదీ వ‌రకు జ‌రుగ‌నున్నాయి.జూన్ 06వ తేదీ సాయంత్రం అంకురార్పణ నిర్వ‌హిస్తారు. వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి. జూన్ 07 -   ధ్వజారోహణం -పెద్దశేష వాహనం జూన్ 08   - చిన్నశేష వాహనం   హంస వాహనం జూన్ 09  -  సింహ వాహనం  ముత్యపుపందిరి వాహనం జూన్ 10 -   కల్పవృక్ష వాహనం కల్యాణోత్సవం, సర్వభూపాల వాహనం జూన్ 11 -   మోహినీ అవతారం గరుడ వాహనం జూన్ 12 -   హనుమంత వాహనం  గజ వాహనం జూన్ 13 -  సూర్యప్రభ వాహనం   చంద్రప్రభ వాహనం జూన్ 14 -   రథోత్సవం   అశ్వవాహనం జూన్ 15 -   చక్రస్నానం  ధ్వజావరోహణం బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు, రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.