Guru Moudyami: గురుమౌఢ్యమి

విశ్వావసునామ సంవత్సరంలో  గురుమౌఢ్యమి జూన్ 9 వ తేదీనుండి జూలై 9 వ తేదీ వరకు ఉంటుంది. అనగా జ్యేష్ఠ శుద్ధ త్రయోదశినుండి ఆషాఢ శుద్ధ చతుర్ధశి వరకు గురుమౌఢ్యమి ఉంటుంది. గ్రహాలు సూర్యునికి అతి దగ్గరగా ఉండే కాలాన్ని మౌఢ్యమి అంటారు. గురుగ్రహం సూర్యునికి దగ్గరగావుంటే గురుగ్రహం అంటారు. ఇది అన్ని గ్రహాలకు జరుగుతుంది. కాని జ్యోతిషశాస్త్రం మాత్రం గురు, శుక్ర గ్రహాల మౌఢ్యమిలను మాత్రమే దోషంగా పరిగణిస్తుంది. దీనిని వాడుక భాషలో మూఢం అంటారు. మౌఢ్యమి కాలంలో గ్రహ కిరణాలు భూమిపై ప్రసరించుటకు సూర్యుడు అడ్డంగా ఉంటాడు. అందువల్ల మౌఢ్య కాలంలో గ్రహాలు బలహీనంగా ఉంటాయి. గ్రహాలు వక్రించినప్పటికంటే అస్తంగత్వం చెందినప్పుడే బలహీనంగా ఉంటాయి. మౌఢ్యమి అంటే చీకటి అని అర్థం. ఈ కాలం శుభకార్యాలకు పనికిరాదని జ్యోతిషశాస్త్రం చెబుతోంది.

మౌఢ్యమిలో చేయకూడనవి

పెళ్ళిచూపులు, వివాహం, ఉపనయనం, గృహారంభం,గృహప్రవేశం, యజ్ఞాలు చేయుట, మంత్రానుష్టానం, విగ్రహా ప్రతిష్టలు, వ్రతాలు, నూతన వధువు ప్రవేశం, నూతన వాహనం కొనుట, బావులు, బోరింగులు, చెరువులు తవ్వటం, పుట్టువెంట్రుకలకు, వేదవిధ్యా ఆరంభం, చెవులు కుట్టించుట, నూతన వ్యాపార ఆరంభాలు మొదలగునవి చేయరాదు.

చేయదగిన పనులు

జాతకం రాయించుకోవడం, నవగ్రహశాంతులు, జప, హోమాది శాంతులు, గండనక్షత్ర శాంతులు, ఉత్సవాలు, సీమంతం, నామకరణం, అన్నప్రాసనాది కార్యక్రమాలు ఏ మౌఢ్యమి వచ్చినా చేయవచ్చు. గర్భిని స్త్రీలు, బాలింతలు తప్పనిసరి పరిస్థితితులలో మూఢాలలో ప్రయాణం చేయవలసి వస్తే శుభ తిథులలో అశ్వని, రేవతి నక్షత్రాలలో, శుభ హోరలో భర్తతో కలిసి ప్రయాణం చేస్తే దోషం వర్తించదని శాస్త్రం సూచిస్తుంది.

Comments

Popular posts from this blog

Yogini Ekadasi: యోగిని ఏకాదశి

Jyestha Amavasya: జ్యేష్ఠ అమావాస్య

Bikkavolu Ganapati Temple: శ్రీ లక్ష్మి గణపతి ఆలయం - బిక్కవోలు

Magha Puranam Telugu: మాఘ పురాణం 4వ అధ్యాయం- ఓ శునకం విష్ణుమూర్తిని పూజించి చక్రవర్తిగా మారిన కథ

Magha Puranam Telugu: మాఘ పురాణం 10వ అధ్యాయం - ఇంద్రుని శాపానికి ఉపశమనం చెప్పిన శ్రీహరి- విశ్వామిత్రునికి వానర రూపం

Magha Puranam Telugu: మాఘ పురాణం 24వ అధ్యాయం - సహవాస దోషంతో అష్టకష్టాలు పడిన విప్రుని కథ

Jubilee hills Venkateswara Temple: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - జూబ్లీహిల్స్

Angaraka Chaturdasi: కృష్ణ అంగారక చతుర్దశి

Bhojana Niyamalu: నిత్యం తినే ఆహారంలో దోషాలు

Vengamamba Perantalu 2025: శ్రీ వెంగమాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాలు (పేరంటాలు) - 2025