Jyestha Suddha Trayodashi: దౌర్భాగ్య నాశక త్రయోదశి

జ్యేష్ఠ మాసంలో వచ్చే త్రయోదశినే దౌర్భాగ్య నాశక త్రయోదశి అంటారు. ఇది జ్యేష్ఠ పౌర్ణమికి ముందు వస్తుంది. ఈ సంవత్సరం ఈ తిథి జూన్ 9 వ తేదీన వస్తుంది. వివాహం కాకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, చెడు వ్యసనాలకు బానిస కావడం, మానసిక, శారీరక ఆరోగ్య పరిస్థితి బాగుండకపోవడంలాంటి వాటిని దౌర్భాగ్యాలని అంటారు. ఈ త్రయోదశినాడు కొన్ని నియమాలు పాటించడం వలన దౌర్భాగ్యాలు నాశనమైపోతాయి. కాబట్టే దీనిని దౌర్భాగ్య నాశన త్రయోదశి అంటారు.

శివునికి అభిషేకాలు

ఆర్థిక సమస్యలున్నవారు ఈ త్రయోదశినాడు శివాలయంలో శివలింగానికి పంచదారతో అభిషేకం చేయాలి. వివాహ సమస్యలున్నవారు చెరుకురసంతో అభిషేకం చేయాలి. సంతానంకానివారు తేనెతో అభిషేకం చేయాలి. అప్పుల బాధలు ఉన్నవారు పంచామృతాలతో అభిషేకం చేయాలి. శివాలయంలో ఈ త్రయోదశి రోజున జాగారం చేస్తే తప్పకుండా మానవులు ఎదుర్కునే అనేక సమస్యలు శీఘ్రంగా తొలగిపోతాయి. జాగారం చేయడం వీలుకానివారు ఈ రోజున శివాభిషేకాలు చేసుకొని ఉపవాసం పాటించినా మంచి ఫలితాలుంటాయి.

లక్ష్మీదేవి ఆరాధన

శివాభిషేకాలే కాకుండా జ్యేష్ట త్రయోదశి రోజున లక్ష్మీదేవిని ఆరాధించడం వలన కూడా అనేక సమస్యలు తొలగిపోతాయి. శ్రీమహాలక్ష్మి దేవి చిత్రపఠం దగ్గర ఆవునెయ్యి గాని మవ్వులనూనెగాని పోసి తామర వత్తులతో దీపారధన చేయాలి. బెల్లం పొంగళి వివేదించాలి. ఇలా చేస్తే శ్రీమహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా శ్రీమహాలక్ష్మికి ప్రీతిపాత్రమైన కొబ్బరికాయ ముక్కలు సమర్పించిన శుభఫలితాలుంటాయి. ఓం హ్రీం శ్రీం క్లీం లక్ష్మి ఆగచ్చ ఆగచ్ఛ మమ మందిరే తిష్ఠ తిష్ఠ స్వాహా అనే మంత్రాన్ని శ్రేష్టా లక్ష్మి మంత్రం అంటారు. ఈ మంత్ర జపం ఈ త్రయోదశి రోజున 21 సార్లు జపిస్తే లక్ష్మీ కటాక్షం లభించి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు సులభంగా తొలగిపోతాయి.

పై నియమాలన్నీ పాటించి సత్ఫలితాలు పొంది నిరూపణ అయిన తర్వాతే జ్యోతిషశాస్త్రం జ్యేష్ఠ త్రయోదశికి దౌర్భాగ్య నాశక త్రయోదశి అని పేరు పెట్టింది.

2025: జూన్ 9

Comments

Popular posts from this blog

Snana Purnima: స్నాన పూర్ణిమ

Jyestha Purnima: జ్యేష్ట పూర్ణిమ

SKANDAGIRI SUBRAMANYA SWAMY TEMPLE: స్కందగిరి సుబ్రమణ్యస్వామి ఆలయం - సికింద్రాబాద్

Sri Raghavendra Swamy Jayanti: శ్రీ రాఘవేంద్ర స్వామి జయంతి 2025

Tirumala Suprabatha Seva: శ్రీవారి సుప్రభాత సేవ

Margashira Vratam: మార్గశిర లక్ష్మివార వ్రతం

Tholi Ekadasi: తొలి ఏకాదశి | శయన ఏకాదశి

Vaishaka Puranam Telugu: వైశాఖ పురాణం 19 వ అధ్యాయం

Lord Shiva Darshan: శివదర్శనం ఏయే వేళల్లో చేయాలి? శివదర్శన ఫలం ఏమిటి?