- విజయ ఏకాదశి ఫిబ్రవరి లేదా మార్చి నెలలో వస్తుంది
- ఈ ఏకాదశి గూర్చి స్కంద పురాణంలో వివరించబడింది
- ఈ ఏకాదశి యొక్క ఆచరణ గురించి బ్రహ్మ, నారదుడికి వివరించాడు
- శ్రీ రాముడు ఈ ఏకాదశిని ఆచరించిన తరువాతే సముద్రం దాటి లంకకు వెళ్లి రావణుడిని వధించాడు అని చెబుతారు.
- ఈ రోజు ఏకాదశి వ్రతం ఆచరించిన వారికీ తప్పక విజయం లభిస్తుంది అని చెబుతారు.
- ఈ ఏకాదశి ముందు రోజు రాగి లేదా మట్టికుండలో నీరు నింపి దానిని మామిడాకులతో అలంకరించాలి. తరువాత దాన్ని సప్తధాన్యాలతో అలంకరించిన వేదిక పై ఉంచి దానిపై నారాయణుని నిలపాలి.
- ఏకాదశి రోజు తెల్లవారుజామునే స్నానము చేసి తులసీదళాలు, గంధాన్ని, పూలను, పూలమాలను ధూపదీపాలను, నైవేద్యాన్ని సమర్పించి నారాయణుని పూజించాలి. ఆ రాత్రి జాగరణ చేయాలి.
- బ్రహ్మచర్యం పాటించాలి
- మరునాడు ఆ పాత్రను నదీతీరంలో యధావిధంగా పూజించాలి , తరువాత దానిని బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి.
- ఈ ఏకాదశి మహత్యాన్ని చదివేవాడు, వినేవాడు వాజపేయ యజ్ఞఫలాన్ని పొందుతాడు.
- సాధారణంగా ఏకాదశి రోజు చేయవలసిన నియమాలు ఈరోజు చేస్తారు.
విజయ ఏకాదశి వ్రత కథ
శ్రీరామ చంద్రుడు ఆచరించిన విజయ ఏకాదశి వ్రత కథని చదవడం వలన ఏకాదశి వ్రతమాచరించిన పుణ్యం లభిస్తుందంటారు. రావణుడి చెరలో ఉన్న సీతాదేవిని విడిపించేందుకు శ్రీరామచంద్రుడు లంకకు చేరుకునే సన్నాహాల్లో ఉన్నాడు. సముద్రాన్ని దాటి వానర సైన్యం లంకకు ఎలా చేరుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారు. ఆ సమయంలో లక్ష్మణుడు అక్కడ సమీపంలోని ఆశ్రమంలో నివసిస్తున్న బకదళాభ్యుడనే ఋషి వద్దకు వెళ్ళి సహాయం కొరదామని సలహా ఇస్తాడు. అందుకు అందరూ అంగీకరించి ఆ రుషి ఆశ్రమానికి వెళతారు. తన ఆశ్రమంలో అడుగుపెట్టిన శ్రీరామచంద్రుడిని చూసి సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువే వచ్చాడని తెలుసుకున్నాడు బకదళాభ్యుడు. అయినప్పటికీ రావణుడిని జయించి విజయం సిద్ధించాలంటే విజయ ఏకాదశి రోజు ఉపవాస దీక్ష చేస్తే విజయం ప్రాప్తిస్తుందని తన బాధ్యతగా సూచన చేశాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు విజయ ఏకాదశి వ్రతం ఆచరించాడు. ఆ తర్వాత సముద్రంపై సేతువు నిర్మించి వానరులతో సహా లంకకు చేరుకుని రావణుడిని జయించి సీతాదేవిని తిరిగి తీసుకొచ్చాడు. శ్రీరామునికి విజయ ఏకాదశి వ్రతం ఫలితం వల్లే ఈ విజయం సిద్ధించిందని చెబుతారు.
2025: ఫిబ్రవరి 24.
No comments:
Post a Comment