Posts

Showing posts from November, 2024

కార్తీక అమావాస్య విశిష్టత

కార్తిక అమావాస్య నాడు పంచ పల్లపాలతో (రావి, మర్రి, జువ్వి, మోదుగు, మేడి) అభ్యంగన స్నానమాచరించాలి. దీనిని పంచత్వక్ ఉదక స్నానం అని అంటారు.  ఆశ్వయుజ, కార్తీక అమావాస్యల నాడు స్వాతి నక్షత్రం కలిసి ఉండే అవకాశం ఉంది కావున ఆశ్వయుజ అమావాస్య నాడు చేసే అన్ని విధులు కార్తిక అమావాస్య నాడు కూడా ఆచరించాలి.  స్వాతి నక్షత్రం పాడ్యమి లేదా విదియ నాడు ఉన్నా అభ్యంగన స్నానమాచరించాలి. దారిద్ర్యాన్ని తొలగించుటకు లక్ష్మీపూజ చేయాలి. ప్రదోష సమయంలో స్నానమాచరించి దేవాలయాల్లో, ఇంటిలో, దేవతా వృక్షాల వద్ద, కూడళ్ళలో దీపాలు వెలిగించి బ్రాహ్మణులను, పెద్దలను పూజించి భోజనం చేయాలి.

Srirangam Temple: శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయం - శ్రీరంగం

Image
శ్రీ రంగనాథుడు నెలకొన్న దివ్య ఆలయం..దేశంలో ప్రసిద్ధి చెందిన వైష్ణవ ఆలయాల్లో ఒకటి. శ్రీ వైష్ణవ సంప్రదాయానికి చెందిన శ్రీ రామానుజాచార్యులు ప్రతిష్టించిన విశిష్ట ఆలయం శ్రీరంగంలో రంగనాథుడు. 108 వైష్ణవ క్షేత్రాల్లో మొదటిదైన శ్రీరంగం..విష్ణు అంశతో జన్మించిన ఆళ్వారులకు నిలయం.  తమిళనాడు రాష్టం తిరుచురాపల్లి నుంచి సుమారు 12 కి.మీ దూరంలో ఉన్న శ్రీరంగం ప్రధాన రాజగోపురం 21 అంతస్తులు. 236 అడుగుల ఎత్తులో.. ఆసియా ఖండంలోనే అతిపెద్ద రాజగోపురం ఉన్న ఆలయంగా వినతి కెక్కింది. ఇక్కడ రాజగోపురం బంగారంతో కప్పబడి ఉంటుంది. రాజగోపురంపై కనిపించే దేవతామూర్తుల శిల్పాలు భక్తిభావంతో కట్టిపడేస్తాయి. 156 ఎకరాల విస్తీర్ణంలో తూర్పు, పడమర, ఉత్తర దిశల్లో 3 రాజగోపురాలుగా విభజించారు. సప్త ప్రాకారాలుగా నిర్మించిన శ్రీరంగ నాధుడి ఆలయంలో ఏడో ప్రాకారం దగ్గర ప్రధాన రాజగోపురం ఉంటుంది. ప్రధాన రాజగోపురాన్ని దాటి లోపలకు అడుగుపెడితే ఆలయ ప్రాంగణంలో 55 ఉపాలయాలు ఉంటాయి. శ్రీరంగంలో స్వామి వేద స్వరూపం కాబట్టి ఆ గోపురం వేద ప్రణవం. ఇక్కడుంటే ఏడు ప్రాకారాలు ఏడు ఊర్థ్వలోకాలకు..ఏడో ప్రాకారం భూలోకానికి సంకేతం. ఒకప్పుడు ఊరు మొత్తం ఈ 7 ప్రాకారాల ...

Dadhichi Kund: దధీచి కుండం

ఉత్తర్​ప్రదేశ్​లోని నైమిశారణ్యం పురాణాలు పుట్టిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నైమిశారణ్యంలో ఋషులు, మునులను తపస్సు చేసుకోవాలని ఆదేశించినట్లుగా స్కాంద పురాణంలోని కార్తీక మహత్యం ద్వారా తెలుస్తోంది. ఇంతటి పావన ప్రదేశమైన నైమిశారణ్యంలో దధీచి కుండం ఉంది. ఈ దధీచి కుండంలోని నీటిని తలపై చల్లుకున్నా, స్నానం చేసినా 88 వేల నదులలో స్నానమాచరించిన ఫలితం దక్కుతుందని, సమస్త పాపాలు నశించి పుణ్యరాశి పెరుగుతుందని శాస్త్ర వచనం.  ఘనత వహించిన మన మహర్షులు మన దేశం ఇంత సుభిక్షితంగా తేజోమయంగా ఉంది అంటే దానికి కారణం ఎంతో మంది మహర్షులు ఈ గడ్డపై జన్మించటమే అని చెప్పాలి. వాళ్ళు చేసిన యాగాలు, వారు ధారపోసిన తపస్సుల ఫలితమే దేశ సుభిక్షానికి కారణం. భూమి మీద ఆధ్యాత్మికత వెల్లివిరిస్తోంది అంటే ఇంకా ఇలాంటి మహర్షుల ఆశీర్వాదాలు మన మీద ఉండబట్టే అనటంలో సందేహం లేదు. ఇలాంటి మహనీయుల గురించి తెలుసుకోవడం మన కనీస కర్తవ్యం. ఎవరీ దధీచి ? దధీచి మహర్షి అథర్వణ ఋషికి, చితికి కలిగిన సంతానం. చిన్నతనం నుంచే ఆయనకు భగవంతుని పట్ల అపారమైన భక్తి ప్రపత్తులు కలిగి ఉండటం వల్ల సరస్వతి నది ఒడ్డున ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుక...

Lord Dakshina Murthy: జగద్గురువు దక్షిణామూర్తి

Image
  శివుని జ్ఞాన స్వరూపమే దక్షిణామూర్తి స్వరూపం.  అందుకే జ్ఞానాన్ని కోరుకునే వారు దక్షిణామూర్తిని ఆశ్రయిస్తారు.  వారంలోని ఐదవ రోజు, గురువారం బృహస్పతి గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది.  ఏదైనా విద్యా ప్రయత్నాలను ప్రారంభించడానికి గురువారం శుభప్రదంగా భావిస్తారు.  అనేక శైవక్షేత్రాలలో గురువారం నాడు దక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు జరుగుతాయి.  కొన్ని ఆలయ సంప్రదాయాలు పౌర్ణమి రాత్రులలో దక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తాయి, ముఖ్యంగా గురు పూర్ణిమ రాత్రి దక్షిణామూర్తికి ఆరాధన సేవలకు తగిన సమయం. జగద్గురువు దక్షిణామూర్తి దక్షిణామూర్తి సకల జగద్గురు మూర్తి కనుక - స్వామి ఆరాధన సకల విద్యలను ప్రసాదిస్తుంది. ఐహికంగా - బుద్ధి శక్తిని వృద్ధి చేసి విద్యలను ఆనుగ్రహించే ఈ స్వామి పారమార్థికంగా తత్త్వ జ్ఞానాన్ని ప్రసాదించే దైవం. ఆది గురువు జ్ఞాన దక్షిణామూర్తి ఒక మర్రి చెట్టు కింద దక్షిణాభిముఖంగా కూర్చుని మనకు దర్శనమిస్తాడు. హిందూ గ్రంధాల ప్రకారం, ఒక వ్యక్తికి గురువు లేకుంటే, వారు దక్షిణామూర్తిని తమ గురువుగా భావించి పూజించవచ్చు. దాక్షిణ్య భావం ఏ దయవలన దుఃఖం పూర్తిగా నిర్మూలనమవుతుందో ఆ ...

Tirumala Japali Theertham: జపాలి తీర్థం - తిరుమల

Image
వ్యాస మహర్షి రచించిన స్కాందపురాణంలోని వేంకటాచల మహత్యం లో వివరించిన ప్రకారం ఏడు కొండల్లో ఓ కొండ హనుమంతుని మాతృమూర్తి పేర అంజనాద్రిగా వర్ధిల్లుతోంది. అంజనా దేవి తపస్సు చేసిన దివ్య స్థలమే అంజనాద్రి. ఆ పుణ్యమూర్తి గర్భాన హనుమ జన్మించిన ప్రదేశమే జాబాలి తీర్థం ఉన్న ప్రదేశం. హనుమాన్ జన్మించిన ప్రదేశం జాపాలిని ఒక్కసారి దర్శిస్తే ఎలాంటి క్లిష్ట సమస్యలైనా తొలగిపోతాయి. జాపాలి తీర్థం విశిష్టత జాపాలి మహర్షి కోరిక మేరకు స్వామి ఇక్కడ స్వయంభువుగా వెలిసినట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి. జాపాలి తీర్ధం చిత్తూరు జిల్లా తిరుమల కొండపైన శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధికి ఐదు కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది. స్కంద పురాణంలో, వేంకటాచల మహత్యంలో ఈ క్షేత్రం గురించి ప్రస్తావించారు. తిరుమల కొండపైన పాపనాశానానికి వెళ్లే మార్గంలో ఒక మలుపు వద్ద ఆంజనేయుని ముఖ మార్గంలో కనిపిస్తుంది. ప్రకృతి రమణీయతల మధ్య నెలకొని ఉన్న ఈ ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి తో పాటు మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంది. పురాణ గాథ జాపాలి అనే మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేసుకుంటుండగా రుద్రుడు ప్రత్యక్షమై తన రాబోయే అవతార విశేషాన్ని ముందుగానే చూపిస్తాడు. అదే హనుమ...

Karthika Puranam: కార్తీక పురాణం 22వ అధ్యాయము - పురంజయ విజయము

Image
  అత్రిమహాముని ఇట్లుపల్కెను. ఇట్లు సుశీలుని మాట విని పురం జయుడు విష్ణ్వాలయమునకుబోయి పుష్పములచేతను, ఫలములచేతను, చిగురుటాకులచేతను, దళములచేతను, షోడశోపచారపూజల చేతనుహరిని పూజించి ప్రదక్షిణ నమస్కారములను నాట్యమునుజేసి హరిమూర్తిని బంగా రముతో చేయించి ప్రదక్షిణ నమస్కారాదులచే పూజించెను. పురంజయుడు కార్తిక పూర్ణిమనాడు రాత్రి హరిని పూజించి గోవింద భృత్యుడై హరినామస్మరణజేయుచు ప్రాతఃకాలమందు తిరిగి యుద్దమునకు బయలుదేరెను. ఇట్లు పురంజయుడు రథమెక్కి ధనుర్బాణములను, కత్తిని; తూణీరములను ధరించి కంఠమందు తులసీమాలను ధరించి కవచమును ధరించి తలగుడ్డ పెట్టుకుని త్వరగా బయలుదేరి యుద్ధభూమికి వచ్చెను. వచ్చినారీటంకారధ్వనిని చేసెను. ఆ ధ్వనివిని రాజులందరు యుద్ధమునకై తిరిగి వచ్చిరి. వచ్చి సింహధ్వనులు జేయుచు బాణ వర్షములను కురిపిం చుచు పూర్వమువలె జయింతమను తలంపుతో పురంజయునిపైకి దుమికిరి. పిమ్మట పరస్పరము పిడుగులవంటి బాణములతోను, వజ్రములవంటి కత్తుల తోను, ఐరావతమువంటి ఏనుగులతోను, ఆకాశమునకు ఎగురు గుఱ్ఱములతోను, త్వరగా నడిచెడి రథములతోను, అన్యోన్యజయ కాంక్షతో భయంకరమయిన సంకులయుద్ధముచేసిరి. ఆ యుద్ధమందు రాజులందరు మదములుడిగి గుఱ్ఱములు హతముల...

Karthika Puranam: కార్తీక పురాణం 21వ అధ్యాయము - పురంజయాపజయము

Image
  ఇట్లు యుద్ధమునకు పురంజయుని జూచి యుద్ధ ప్రవీణులయిన ఆ రాజులు కోపరక్షాక్షులై శస్త్రములతోను, అస్త్రములతోను, బాణములతోను వాడియైన గుదియలతోను, ఇనుపకట్ల లాటీకఱ్ఱలతోను, హస్తాయుధములయిన గుదియలతోను, కత్తులతోను, భల్లాతకములతోను, పట్టసములతోను, రోకళ్ళతోను, శూలములతోను, తోమరముల తోను, కుంభాయుధ ములతోను, గొడ్డళ్లతోను, కఱ్ఱలతోను, ఆయుధముల విక్షేపముల తోను యుద్ధము చేసిరి. గుఱ్ఱపు రౌతులతో గుఱ్ఱపు రౌతులు, ఏనుగులు ఏనుగుల తోడను, రథికులతో రథికులు, కాల్బంటులతో కాల్బంటులు, శూరులతో శూరులును, ఆయుధములతో యుద్ధమును భటులన్యోన్యము క్రూరవాక్యములను పలుకుచు చేసిరి. ఓ అగస్త్యమునీంద్రా ! అంతలో కాంభోజ మహారాజు వస్త్రాదులను పదిలపరచి కట్టికొని కవచమును ధరించి పరాక్రమించి మంచి రథమెక్కి ధనుర్బాణములను ధరించి కోలాహలధ్వనిజేయుచు వడిగా పురంజయుని వద్దకువచ్చి మూడువందల బాణముల వేసెను. ఆ బాణములుపోయి పురంజయుని ఛత్రమును, ధ్వజమును, రథమును నరికి నవి. తరువాత కాంభోజుడు కొన్ని బాణములతో పురంజయుని కొట్టి అయిదు బాణము లతో పురంజయుని రథము యొక్క తురగములను జంపెను. తరువాత పురంజయుడు కోపించి ఇంద్రుడు వలె విక్రమించి భుజాస్పాలనము చేసి నారిబిగించి బ్రహ్మమంత్రము...

Anantapur Kodandarama Viseswara Temple: శ్రీ కోదండ రామ కాశీ విశేశ్వర స్వామి ఆలయం - అనంతపురం

అనంతపురం నగరంలో ఫస్టురోడ్డులో రైల్వేస్టేషన్ ఎదురుగా గల శ్రీ కాశీ విశ్వేశ్వర మరియు కోదండ రామాలయం చూపరులకు కనువిందు చేస్తున్నది. ఇది నగరం నడిబొడ్డులో దేదీప్యమానంగా వెలుగొందుతున్నది. కాశీవిశ్వేశ్వర శివలింగాన్ని, సీతాలక్ష్మణ మారుతి సమేత శ్రీరామచంద్రుని విగ్రహాలను 1923వ సంవత్సరములో ప్రతిష్టించారు.  శివ పంచాయతనం ఈ ఆలయం ప్రత్యేకత. మధ్య భాగంలో కాశీ విశ్వేశ్వర స్వామి నైఋతి దిశలో గణపతి, వాయువ్యంలో పార్వతీ దేవి, ఈశాన్యంలో శ్రీమహా విష్ణువు, ఆగ్నేయంలో సూర్యుడు కన్నుల పండుగగా దర్శనమిస్తారు. అయ్యప్ప స్వామి మందిరం   శ్రీశారదాదేవి, శ్రీశంకరాచార్యులు, శ్రీత్యాగరాజస్వాముల మందిరం  ఆంజనేయస్వామి మందిరం   శ్రీకృష్ణ మందిరం  వినాయక స్వామి మందిరం ఈ ప్రాంగణంలో ఉపాలయాలు  కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి దేవస్థానంలో విశేషపూజలు జరుగుతాయి. ఆశ్వయుజ మాసంలో దేవి నవరాత్రి ఉత్సవాల్లో శ్రీశారదా దేవి ఆరాధనోత్సవాలు ఆరాధన వైభవంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం పుష్యశుద్ధ పంచమినాడు త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు నిర్వహించబడతాయి.  నాగుల చవితి నాడు అశేష భక్తజన సందోహం, అశ్వత్థ నారాయణస్వామిని ద...

Isannapalli Temple: శ్రీ కాలభైరవస్వామివారి జన్మదిన ఉత్సవాలు 2024 తేదీలు - ఇసన్నపల్లి

Image
ప్రతి కార్తికమాసంలో స్వామి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు.  2024 ఉత్సవ వివరాలు నవంబర్ 20 - గణపతి పూజ, పుణ్యాహవాచనం, సంతతధారాభిషేకం, అగ్నిప్రతిష్ట, గణపతిహోమం, రుద్రహవనం, బలిహారణం. నవంబర్ 21 -  బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు  నవంబర్ 22 - లక్షదీపార్చన నవంబర్ 23 - ధ్వజారోహణ, మహాపూజ, సింధూరపూజ(మధ్యాహ్నం ఒంటి గంటకు), డోలారోహణం(మధ్యాహ్నం మూడు గంటలకు), సాయంత్రం ఎడ్ల బళ్ల ఊరేగింపు. నవంబర్ 24 - రథోత్సవం (తెల్లవారుజామున మూడు గంటలకు), అగ్నిగుండాలు (ఉదయం 6 నుంచి).

Utpanna Ekadasi: ఉత్పన్న ఏకాదశి

Image
కార్తీక బహుళ ఏకాదశిని ఉత్పత్తి లేదా ఉత్పన్న ఏకాదశి అంటారు. ఈ మాసంలో వచ్చే ఏకాదశి తిథులూ పరమ పవిత్రమైనవి.  ఏకాదశి అనే దేవత ఈ మాసంలోనే జన్మించిందని చెబుతారు.  ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలనుకునేవారు ప్రారంభమైనప్పటినుండి ఏకాదశి ఘడియలు ముగిసేవరకూ ఎలాంటి ఉడికించిన ఆహారం తీసుకోకుండా ఉండాలి.  మరి కొందరైతే కేవలం నీరు మాత్రమే తీసుకుంటారు.  ఉపవాసం వల్ల ఆరోగ్యంతోపాటు, భగవంతుని అనుగ్రహం కూడా లభిస్తుంది  ఏకాదశి దేవత జన్మించడానికి ఓ పురాణ కథనం ఉంది. పూర్వం మహా గర్విష్టి, మహా బలవంతుడైన మురాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు ఇంద్రాది దేవతలను ఓడించాడు. త్రిమూర్తులనుకూడా లెక్క చేయకుండా దేవతలను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టెవాడు. ఆ రాక్షసుని బారినుండి తమను కాపాడమంటూ దేవతలందరూ విష్ణుమూర్తిని వేడుకున్నారు. విష్ణుమూర్తి మురాసురునితో తలపడ్డాడు. ఇరువురి మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. వందల సంవత్సరాలు యుద్ధం కొనసాగుతోంది. ఓరోజు విష్ణుమూర్తి యుద్ధంలో కలిగిన అలసట తీర్చుకునేందుకు. ఓ గుహలో విశ్రాంతి తీసుకున్నాడు. ఈ విషయం మురాసురునికి తెలిసి విష్ణుమూర్తిని నిద్రలో సంహరించాలనుకున్నాడు, నిదానంగా అక్కడిక...

Karthika Puranam: కార్తీక పురాణం 20వ అధ్యాయము - అత్య్ర్యగస్త్య సంవాదము, పురంజయోపాఖ్యానము

Image
  జనకమహారాజు మరల ఇట్లడిగెను. మునీంద్రా! సర్వపాపములను నశింపజేయు నదియు, సౌభాగ్యప్రదమగు కార్తిక మహాత్మ్యమును మరియు వినవలెననుకోరిక కలదు గాన చెప్పుము. వశిష్ఠమునిపల్కెను. రాజా! వినము. కార్తిక మహాత్మ్యమును గురించి అగస్త్యమునికిని, అత్రిమహా మునితో జరిగిన సంవాదము ఉన్నది. అది చాలా ఆశ్చర్యకర మయినది దానిని నీకు చెప్పెదను. అత్రి మహాముని ఇట్లు పల్కెను. అగస్త్యమునీంద్రా! లోకత్రయోప కారము కొరకు కార్తిక మాహాత్మ్యబోధకరమైన హరికథను జెప్పెదను వినుము. అగస్త్యుడడిగెను. విష్ణ్వంశ సంభూతుడవైన యో అత్రిమునీశ్వరా! సద్ధర్మశ్రవణమున కార్తికమాసము కీర్తించబడినది. కార్తీకమాస ధర్మమును వినగోరితిని గాన చెప్పుము. అత్రిముని ఇట్లు చెప్పెను. ఓఅగస్త్యమునీంద్రా ! బాగు బాగు. నీ ప్రశ్న పాపనాశ కరము. నీవు హరికథా సందర్భమును జ్ఞాపకము చేసితివి. చెప్పెదను వినుము. కార్తిక మాసముతో సమానమైన మాసములేదు. వేదముతో సమానమైన శాస్త్రములేదు. ఆరోగ్య ముతో సమానమైన ఉల్లాసములేదు. హరితో సమానమైన దేవుడులేడు. కార్తిక మాసమందు స్నానము, దీపదానము, హరిపూజయు చేయువాడు ఇష్టార్ధమును బొందును. విష్ణుభక్తివలన కలియుగమందు వివేకము, ధనము, యశస్సు, ప్రతిష్ఠ, లక్ష్మి, విజ్ఞా...

Karthika Puranam: కార్తీక పురాణం 19వ అధ్యాయము - జ్ఞానసిద్ధకృతహరిస్తవము

Image
  జ్ఞానసిద్ధుడిట్లు స్తుతిజేసెను. వేదవేత్తలు మిమ్ము వేదవేద్యునిగాను, వేదాంతము లందు ప్రతిపాదింపబడిన వానినిగాను, గుహ్యమైనవానిగాను, నిశ్చలునిగాను, అద్వితీయ మునిగాను దెలిసికొనుచున్నారు. చంద్రసూర్య శివ బ్రహ్మాదులచేతను రాజుల చేతను స్తుతించబడు రమ్యములైన మీ పాదపద్మములకు నమస్కరించుచున్నాము. వాక్యములతో జెప్ప శక్యముగానివాడవు. శివునిచే పూజింపబడిన పాదపద్మములు కలవాడవు. సంసార భయమును దీసివేయుసమర్ధుడవు జన్మసంసార సముద్రమందున్న శివాదులచేత నిత్యము కొనియాడబడు వాడవు. చరాచర ప్రాణులచే స్తుతింపబినవాడవు. పంచమహాభూతములు చరాచర రూపములైన అన్న భూతములు నీ విభూతి విస్తారమే. శంకరునిచే సేవింపబడిన పాదాలు కలవాడా! మీరు పరముకంటే పరుడవు. నీవే యీశ్వరుడవు. ఈ చరాచరరూపమైన ప్రపంచమంతయును, దానికి కారణమైన మాయతో కూడా నీయందు తోచు చున్నది. త్రాడునందుపాము భ్రాంతివలె పూలమాల భ్రాంతివలె తోచుచున్నది అనగా లేదనిభావము. ఓకృష్ణా! నీవు ఆది మధ్యాంతములందు ప్రపంచమందంతటను ఉన్నావు. భక్ష్య, భోజ్య, చోష్య, రూపచతుర్విధాన్న రూపుడవు నీవే. యజ్ఞ స్వరూపుడవు నీవే. నీ సంబంధియు, పరమసుఖప్రదమును అయిన సచ్చిదానంద స్వరూపమును జూచిన తరువాత ఈ జగము వెన్నెలయందు సముద్రము...

Karthika Puranam: కార్తీక పురాణం 18వ అధ్యాయము -మాసత్రయే ప్రాతఃస్నానమహిమా, చాతుర్మాస్యవ్రతము, హరినారద సంవాదము

Image
  ఉద్భూతపురుషుడిట్లనెను. మునీశ్వరా ! నేననుగ్రహించబడితిని. నీ దర్శనము యొక్క అనుగ్రహము వలన జ్ఞానవంతుడనైతిని. ఓ మునివర్యా! నాకు నీవే తండ్రివి. నీవే సోదరుడవు. నీవే గురుడవు. నేను నీకు శిష్యుడను, దరిద్రుడనై మొద్దుగానున్న నాకిప్పుడు నీవు గాక గతి ఎవ్వ రయిరి. పాపవంతుడనైన నేనెక్కడ ఇట్టి సద్గతియెక్కడ? పాపములకు స్థానమైన నేనెక్కడ. పుణ్యమైనకార్తికమాసమెక్కడ? ఈ మునీశ్వరులెక్కడ, ఈ విష్ణుసన్నిధి ఎక్కడ. ప్రారబ్ద సుకృతమున్నయెడల తప్పక ఇట్లు ఫలించును గదా? నాకెద్దియో పూర్వపుణ్యమున్నది. దానిచే ఇట్లింతయు లభించెను. అయ్యా! నాయందు దయయుంచి బాగా తెలియజెప్పుము. మను ష్యులు విధిగా కర్మలెట్లు చేయుదురు? ఆ కర్మలకు ఫలమెట్లు గలుగును? వాటి ఉపదేశమెట్లు, చేయుటకు ముఖ్యకాలమెద్ది? కర్మలెవ్వి? ఏమి కోరిచేయ వలెను? ఈ విషయమంతయు వినగోరితిని గనుక చెప్పుము. నీవాక్కను వజ్రాయుధముచేత నా పాపపర్వతములు కూలినవి. అంగీరసుడు పల్కెను. ఓయీ ! నీవడిగిన ప్రశ్న చాలా బాగున్నది లోకహితము కొరకు నీవడిగితివి గనుక నీవడిగిన ప్రశ్నకు సమాధానమును జెప్పెద వినుము? అనిత్యమైన ఈ దేహమును ఆశ్రయించి ఇంద్రియకాముడై ఆత్మను మరచి దేహాదులను ఆత్మయని తలచకూడదు. ఆత్మకెప్పుడును...

Karthika Puranam: కార్తీక పురాణం 17వ అధ్యాయము - అంగీరసోక్తతత్త్వబోధ, పార్వత్యా శ్రీ శంకరోక్తజ్ఞానబోధ

Image
  అంగీరసుడిట్లనెను. ఓయీ! కర్మబంధముక్తులు, కార్య కారణములు, స్థూల, సూక్ష్మములు, ఈ జంటల సంబంధమే దేహమనబడును. నీవడిగిన యీ విషయము పూర్వమందు కైలాసపర్వతమున పార్వతికి శంకరుడు చెప్పెను. దానిని ఇప్పుడు నీకు నేను జెప్పెదను. ఇతర చింతనుమాని వినుము. నీవడిగిన ప్రశ్నకు సమాధానమును జెప్పెదను వినుము. జీవుడనగా వేరెవ్వడును లేడు. నీవే జీవుడవు. నేను యెవ్వడనంటే నేను ఆ బ్రహ్మనే అయి ఉన్నాను. ఇందుకు సందేహములేదు. దేహమేననెడి బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను గూర్చి చింతింపుము. ఉద్భూతపురుషుడిట్లడిగెను. మునీశ్వరా ! మీరు చెప్పినరీతిగా వాక్యార్ధ జ్ఞానము నాకు గలుగలేదు. కనుక అహంబ్రహ్మేతి (నేను బ్రహ్మనను) వాక్యార్థమును ఎట్లు తెలిసికొనగలను. ఈ వాక్యార్థబోధకు హేతు వయిన పదార్థజ్ఞానము నాకు తెలయలేదు. కాబట్టి విమర్శగా చెప్పగోరెదను. ఆత్మ అంతఃకరణమునకు, తద్వ్యాపారములకు సాక్షియు, చైతన్యరూపియు, ఆనందరూపియు, సత్యస్వరూపమునై వున్నది. ఇట్టి ఆత్మను నీవెందుకు తెలుసుకొనుటలేదు. సచ్చిదానందస్వరూపుడును, బుద్ధికి సాక్షియునయిన వస్తువునే ఆత్మగా తెలిసి కొనుము. ఈ దేహమే ననెడి బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను గూర్చి చింతింపుము. దేహము ఘటమువలె రూపముగల్గ...

Karthika Puranam: కార్తీక పురాణం16వ అధ్యాయము - స్తంభదీపదానమహిమా, ఉద్భూతపురుష వృత్తాంతము

Image
  వశిష్ఠుడిట్లు పలికెను. దామోదరునకు ప్రీతికరమైన ఈ కార్తిక వ్రత మును జేయనివాడు కల్పాంతము వరకు నరకమొందును. కార్తికమాసము నెలరోజులు నియమముగా తాంబూలదానము చేయువాడు జన్మాంతర మందు వాస్తవముగా భూమికి ప్రభువగును. కార్తికమాసమందు నెల రోజులు పాడ్యమి మొదలు ఒక్కొక్క ఈపమును హరి సన్నిధిలో వెలిగించిన వాడు పాపాలను పోగొట్టుకొనును. వైకుంఠమునకు బోవును. కార్తికమాసమందు పూర్ణిమనాడు సంతానమును గోరి సూర్యునుద్దే శించి స్నానముదానము చేయవలెను. అనగా అట్లు చేసిన యెడల సంతా నము గలుగునని భావము. కార్తికమాసమందు హరిసన్నిధిలో టెంకాయ దానమను దక్షిణ తాంబూల సహితముగా చేయువానికి సంతానవిచ్ఛేదము ఉండదు. రోగము ఉండదు. దుర్మరణము ఉండదు. కార్తికమాసమందు పూర్ణిమనాడు హరి ఎదుట స్తంభదీపమును బెట్టు వాడు వైకుంఠపతి యగును. కార్తికమాసమందు హరిసన్నిధిలో స్తంభదీపము అర్పణచేసిన వానికి గలిగెడి పుణ్యమును జెప్పుటకు నాతరముగాదు. కార్తిక మాసమందు పూర్ణిమ రోజున స్తంభదీపమును జూచువారిపాపములు సూర్యోదయమందు చీకట్లవలె నశించును. కార్తికమందు స్తంభమును సమర్పించనివాడు నరకమునుండి విడుదలగాడు. స్తంభదీపమును శాలిధాన్యము, వ్రీహిధాన్యము, నువ్వులు ఉంచి దీపము పెట్టవలెను. శిలతో...

Karthika Puranam: కార్తీక పురాణం 15వ అధ్యాయము - కార్తికదీపమాలార్పణ మహిమా, కర్మనిష్ట చరితము

Image
  ఓ జనకమహారాజా ! తిరిగి కార్తిక మాహాత్మ్యమును జెప్పెదను. భక్తితో వినుము. విన్నవారికి పాపములు నశించును. పుణ్యము గలుగును. కార్తికమాసమందు హరిముం దఱ నాట్యము చేయువాడు విగతపాపుడై హరిమందిర నివాసియగును. కార్తికమాసమందు ద్వాదశినాడు హరికి దీవమాలార్పణ చేయువాడు వైకుంఠమునకుబోయి సుఖించును. కార్తిక మాసమున శుక్లపక్షమందు సాయంకాలమందు హరిని పూజించువాడు స్వర్గాధిపతి యగును. కార్తికమాసమందు నెల రోజులు నియతముగా విష్ణ్వాలయమునకు దర్శనార్ధము పోవువాడు ఒక్కొక్క అడుగునకు ఒక్కొక్క అశ్వమేధయాగ ఫలమును బొందును. సందేహములేదు. కార్తికమాసమందు హరిసన్నిధికిపోయి హరిని దర్శించువాడు విష్ణు సాలోక్యముక్తిని పొందును. కార్తికమాసమందు విష్ణ్వాలయ దర్శనార్ధము వెళ్ళనివాడురౌరవ నరకమును, కాలసూత్రనరకమును పొందును. కార్తికశుద్ధ ద్వాదశి హరిబోధిని గనుక ఆ రోజున పూజచేసిన పుణ్యమునకు అంతములేదు. కార్తిక శుక్లద్వాదశినాడు బ్రాహ్మణులతో గూడి భక్తితో హరిని గంధములతోను, పుష్పములతోను, అక్షతలతోను, ధూపముతోను, దీపములతోను, ఆజ్యభక్ష్య నైవేద్యముల తోను పూజించువాని పుణ్యమునకు మితిలేదు. కార్తికశుద్ధ ద్వాదశినాడు విష్ణ్వాలయ మందుగాని, శివాలయమందుగాని లక్షదీపములను వెలి...

Karthika Puranam: కార్తీక పురాణం 14వ అధ్యాయము - మాసచతుర్దశీమాహాత్మ్యము, మాసశివరాత్రివ్రత ఫలము

Image
  కార్తిక పూర్ణిమాదినమందు వృషోత్సర్గమును (ఆబోతు, అచ్చు పోయుట) చేయువానికి జన్మాంతరీయ పాపములుకూడా నశించును. కార్తిక వ్రతము మనుష్యలోక మందు దుర్లభము సులభముగా ముక్తినిచ్చునది కార్తిక పూర్ణిమనాడు పితృప్రీతిగా వృషోత్సర్గమును జేయువానికి కోటి మాఱులు గయాశ్రాద్ధమును జేసిన ఫలముగలుగును. రాజా ! స్వర్గమందున్న పితరులు మన వంశమందెవ్వడైనను కార్తిక పూర్ణిమనాడు నల్లని గిత్తను, గిత్తదూడనులేక ఆబోతును విడుచునా, అట్లయిన మనము తృప్తిబొందుదు మని కోరుచుందురు. ధనవంతుడు గాని దరిద్రుడు గాని కార్తిక పూర్ణిమ రోజున వృషోత్సర్గ మును జేయనివాడు యమలోకమందు అంథతమిశ్రమను నరకమును బొందును. కార్తిక పూర్ణిమ రోజున వృషోత్సర్గమును జేయక గయాశ్రాద్ధ మాచరించినను, ప్రతి సంవత్సరము తద్దినము పెట్టినను, పుణ్యతీర్ధములు సేవించినను, మహాలయము పెట్టినను పితరులకు తృప్తిలేదు. వాటన్నిటికంటే కోడెదూడను అచ్చుపోయుట మిక్కిలి గొప్పది. గయాశ్రాద్ధము వృషోత్స ర్గము సమానమని విద్వాంసులు వచించిరి కాబట్టి కార్తికపూర్ణిమనాడు వృషోత్సర్గము సుఖమునిచ్చును. అనేక మాటలతో పనియేమున్నది? కార్తికమాసమందు అన్నిపుణ్య ముల కంటే అధికమైన ఫలదానము చేయువాడు దేవృణ మనుష్యఋణ పితృఋణముల న...

Vaikunta Chaturdashi: వైకుంఠ చతుర్దశి

Image
కార్తీక శుద్ధ చతుర్దశినే వైకుంఠ చతుర్దశి అంటారు. ఈ రోజున భక్తి ప్రపత్తులతో శ్రీహరిని ధ్యానించి నివేదనలు సమర్పిస్తే అపరిమితమైన పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శివ, విష్ణు ఆలయాల్లో దీపాలు పెడితే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. కార్తీక మాసమంతా దీపాలు పెట్టలేనివారు శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి ఈ మూడు రోజులైన దీపాలు వెలిగిస్తే పాపాలు హరించుకుపోతాయి. ఇతరులు పెట్టిన దీపాన్ని కొండెక్కకుండా చూసినవారి పాపాలుకూడా ఆ దీపాగ్నిలో కాలిపోతాయని పురాణ వచనం. కొండెక్కిన ఇతరుల దీపాలను వెలిగించినవారికీ ఎంతో పుణ్యం లభిస్తుంది. ఈ రోజున శ్రీహరి స్వయంగా శివుడిని పూజిస్తాడని పురాణ కథనం. అందుకే ఈ రోజును అత్యంత విశిష్టమైనదిగా భావిస్తారు. శివ కేశవులు వేరుగా కనిపిస్తున్నప్పటికి వారిద్దరూ ఒకటేనని వేదాలు చెబుతున్నాయి. కార్తీక శుద్ధ చతుర్దశినాడు శ్రీమహావిష్ణువుకు దీపాలను అర్పించినవారికి వైకుంఠంలో స్థానం లభిస్తుందని శాస్త్ర వచనం. ఈ రోజున శివాలయానికి వెళ్లి శివుడిని దర్శించుకున్నా మోక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ రోజున చేసే ప్రతి పని అక్షయమవుతుందట. అందుకని పాపాలు చేయకుండా పుణ్యాలు మాత్రమే చేయడం వలన...

Karthika Puranam: కార్తీక పురాణం 13వ అధ్యాయము - కార్తికద్వాదశీమాహాత్మ్యము, సువీరశ్రుతకీర్తి కథ

Image
  వసిష్ఠుడిట్లు చెప్పెను. జనకరాజా ! కార్తికమాసమందు చేయదగిన ధర్మములను జెప్పెదను. నీవు స్వచ్ఛమైన మనస్సుతో వినుము. ఆ ధర్మము లన్నియు ఆవశ్యకములైనవి. రాజా! కార్తికధర్మములు మా తండ్రియైన బ్రహ్మచేత నాకుజెప్పబడినవి. అవియన్నియు చేయదగినవి చేయని యెడల పాపము సంభవించును. ఇది నిజము. సంసార సముద్రము నుండి దాట గోరువారును, నరకభయముగలవారును ఈ ధర్మములను తప్పక చేయ వలెను. కార్తీకమాసమందు కన్యాదానము, ప్రాతస్నానము, శిష్టుడైన బ్రాహ్మణుని పుత్రునకు ఉపనయనము జేయించుటకు ధనమిచ్చుట విద్యాదానము, వస్త్రదానము, అన్నదానము ఇవి ముఖ్యములు. కార్తికమాసమందు ద్రవ్యహీనుడైన బ్రాహ్మణపుత్రునకు ఉపనయన మును జేయించ దక్షిణనిచ్చిన యెడల అనేక జన్మములలోని పాపములు నశించును. తన ద్రవ్యమిచ్చి ఉపనయనము చేయించినప్పుడు ఆ వటువుచే చేయబడిన గాయత్రీ జపఫలములు వలన పంచమహాపాతకములు భస్మ మగును. గాయత్రీ జపము, హరిపూజ, వేద విద్యాదానము వీటి ఫలమును జెప్పుటకు నాకు శక్యముగాదు. పదివేలు తటాకములను త్రవ్వించు పుణ్యమును, నూరు రావిచెట్లు పాతించిన పుణ్యమును, నూతులు దిగుడు బావులు నూరు బావులు త్రవ్వించిన పుణ్యమును, నూరు తోటలు వేయించిన పుణ్యమును ఒక బ్రాహ్మనున కుపనయనము చేయించిన...