Posts

Showing posts from October, 2024

Guru Dwadasi: గురు ద్వాదశి

Image
  గురు ద్వాదశి ని  ఆశ్వయుజమాసం  కృష్ణపక్షం 12వ  రోజున  జరుపుకుంటారు. ఇది మహారాష్ట్ర లో ప్రముఖంగా జరుపుకుంటారు. ఉత్తర భారతదేశం ఇది కార్తీక మాసం లో వస్తుంది.  ఇదే రోజు గోవత్స ద్వాదశిని కూడా జరుపుకుంటారు.  దత్త అవతారమైన శ్రీ పాద శ్రీ వల్లభ ఆరాధన ఉత్సవాలు జరుగుతాయి. కొన్ని ప్రాంతాలలో ఈ రోజు నుంచి దీపావళి సంబరాలు మొదలు అవుతాయి. గురుద్వాదశి దత్తాత్రేయ స్వామిని ఆరాధించే వారికీ చాల ముఖ్యమైన రోజు.  శ్రీ పాద శ్రీ వల్లభుడు కలియుగం లో మొదటి దత్త అవతారం.  ఈయన జన్మస్థలం తూర్పు గోదావరి జిల్లాలో ని పిఠాపురం.ఇది ఆంధ్రప్రదేశ్ లో వున్నది ఈయన ఆశ్వయుజ బహుళ ద్వాదశి రోజున అవతారం సమాప్తి కావించారు.  గురుద్వాదశి ని కర్ణాటకలో ని గంగాపూర్  దత్తాత్రేయ క్షేత్రం లో ఘనంగా నిర్వహిస్తారు. కొంత మంది ఈ రోజు గురుచరిత్రని పారాయణ చేస్తారు.   2024: అక్టోబరు 29.

Govatsa Dwadasi: గోవత్స ద్వాదశి

Image
  గోవత్స  ద్వాదశి అనగా మన ఆవులు లేదా గోవులు కోసం జరుపుకునే పండుగ.  ఆశ్వయుజ మాసం లో కృష్ణపక్ష ద్వాదశి రోజు ఈ పండుగ జరుపుకుంటారు  ఇది సాధారణంగా అక్టోబర్ లేదా నవంబర్ మాసాలలో వస్తుంది.  కొని చోట్ల దీనిని నందిని వ్రతం అని కూడా పిలుస్తారు. దీని తరువాత రోజు ధనత్రయోదశి దీనిని గురించి భవిష్య పురాణం లో కూడా చెప్పబడింది. ఈ రోజు ముఖ్యంగా గోవులను పూజిస్తారు. హిందూ సంప్రదాయం ప్రకారం గోవులు ఎంతో పవిత్రమైనవి, మన రోజు వారి జీవితం లో కూడా అవి ఒక  భాగంగా చాల మంది చూసుకుంటారు.  ఉత్తర భారతదేశంలో అయితే ఈ పండుగను చాల బాగా  జరుపుకుంటారు .   సంతానం లేని వారు ఈ రోజు వ్రతం  ఆచరిస్తారు. ఉత్తర భారత దేశం లో కొంత మంది వ్యాపారులు ఈ రోజు నుంచి కొత్త అకౌంట్ పుస్తకాలూ రాస్తారు. ఈ రోజు ఎవరైతే గోవును పూజిస్తారో వారికీ మంచి ఆరోగ్యం తో పాటు సుఖసంపదలు కలుగుతాయి అని భావిస్తారు.  ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురం లో శ్రీ పాద శ్రీ వల్లభ ఆరాధన ఉత్సవం జరుగుతుంది.  ఉదయాన్నే  గోవులకు స్నానం చేసి పసుపు కుంకుమతో అలంకరిస్తారు. గోవులు అంటే శ్రీ కృష్ణడుకి ఎంతో ఇష్టం కన...

Rama Ekadasi: రమా ఏకాదశి

Image
  ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని రమా ఏకాదశిగా జరుపుకుంటారు.  పద్మపురాణం ప్రకారం  రమా ఏకాదశి వ్రతం ఆచరించే వారికి శ్రీ విష్ణుమూర్తి అనుగ్రహంతో ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ ఏకాదశి వ్రతం ఆచరించేవారు ఈ రోజంతా పూర్తిగా ఉపవాసం ఉండాలి.  ముందుగా సూర్యోదయంతో నిద్ర లేచి తలారా స్నానం చేసి పూజామందిరాన్ని శుభ్రం చేసుకొని శ్రీ లక్ష్మీ నారాయణుల చిత్ర పటాలను గంధం కుంకుమలతో అలంకరించాలి. ఆవునేతితో దీపారాధన చేయాలి.  తులసి దళాలతో అర్చిస్తూ శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి.  చక్ర పొంగలి, పరమాన్నం వంటి ప్రసాదాలను నివేదించాలి. ఏకాదశి రోజు సాయంత్రం ఇంట్లో యధావిధిగా పూజ చేసుకొని సమీపంలోని విష్ణు ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోవాలి.  రాత్రి భగవంతుని కీర్తనలతో, పురాణ కాలక్షేపంతో జాగరణ చేయాలి.  పురాణాలలో వివరించిన ఏకాదశి వ్రత కథలను చదువుకోవాలి. ఈ రోజు చేసే దానధర్మాలు విశేషమైన పుణ్యాన్ని ఇస్తాయని శాస్త్రం చెబుతోంది.  ఈ రోజు అన్నదానం, వస్త్రదానం, జలదానం చేయడం వలన విశేషమైన ఫలితం ఉంటుంది.  ఏకాదశి రోజు గోసేవ చేస్తే స్వర్గ ప్రాప్తి కలుగ...

Thumburu Theertham: తుంబుర తీర్థం - తిరుమల

Image
  శ్రీవారి ఆలయానికి ఈశాన్య దిశలో 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తుంబుర తీర్థం. తిరుమల క్షేత్రంలోని పుణ్య తీర్థాలలో 'తుంబుర తీర్థం' ఒకటిగా కనిపిస్తుంది. ఈ తీర్థంలో స్నానమాచరించడం వలన, సమస్త పాపాలు తొలగిపోయి, మోక్షం కలుగుతుందని స్థల పురాణం చెబుతోంది. తుంబురు తీర్థాన్ని ఒకప్పుడు ‘గోనతీర్థం’ అని పిలిచేవారు. తుంబుర తీర్థం దట్టమైన శేషాచలం అడవుల్లో ఉంటుంది. ఇక్కడికి వెళ్లడం కష్టసాధ్యం. బ్రహ్మర్షి వశిష్ఠుడు ఈ తీర్థంలో స్నానం ఆచరించి  పాప విముక్తి పొందారని చెబుతారు. ఏటా ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు తుంబుర తీర్థానికి ముక్కోటి ఉత్సవం నిర్వహిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం.  ఈ సందర్భంగా ముక్కోటి దేవతలు తీర్థంలో స్నానం ఆచరిస్తారని నమ్మకం.   కొన్ని వేల సంవత్సరాల క్రితం తిరుమల కొండల్లో ఒక ప్రళయం వచ్చింది. అప్పుడు ఒక కొండ రెండుగా చీలిపోవడం వల్ల తుంబుర తీర్థం ఏర్పడిందని వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణంలో వైష్ణవ ఖండంలోని వేంకటాచల మహత్యం ద్వారా తెలుస్తోంది. తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఉత్తరదిశలో, సుమారు 16 కిలోమీటర్ల దూరంలో ఉంది తుంబుర తీర్థం. తుంబురుడి పేరు మీద వెలసిన ఈ త...

Vriddhachalam Temple: శ్రీ విరుత్తగిరీశ్వర స్వామి వారి ఆలయం - విరుదాలచలం

Image
  తమిళనాడులోని ఓ పుణ్యక్షేత్రం కాశీ క్షేత్రం కంటే పురాతనమైనది. అందువల్లే ఇక్కడ స్వామివారిని పూజిస్తే కాశీలో విశ్వనాధుడిని సేవించిన దానికంటే ఎక్కువ పుణ్యం వస్తుందని నమ్ముతారు. అంతేకాకుండా ఇక్కడ పుట్టినా, చనిపోయినా అప్పటి వరకూ చేసిన తప్పులు సమిసిపోయి తప్పక కైలాసానికి వెళ్తామని ప్రతీతి. అందుకే కాశీలో జీవిత చరమాంకం గడపడానికి వీలుకుదరని వారు ఇక్కడికి వచ్చి దైవ సన్నిదిలో తమ శేష జీవితాన్ని ముగిస్తారు. వృద్దాచలాన్ని వృద్ధ కాశి అని కూడా పిలుస్తారు. ఇందుకు కారణం లేకపోలేదు. కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుందని చెబుతారు. ఇక్కడి స్థల పురాణం ప్రకారం వృద్ధ కాశి అని పిలువబడే ఈ విరుదాచలంలో మరణిస్తే కాశీలో మరణించిన వారికంటే ఎక్కువ పుణ్యమే లభిస్తుందని చెబుతారు. మహిళలు తమ పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని ఈ దేవతను పూజిస్తారు కాశీలో చెప్పినట్టే ఇక్కడ కూడా చనిపోతున్నవారి శిరస్సును తన ఒడిలో ఉంచుకొని ఇక్కడ కొలువై ఉన్న వృధ్ధాంబిక తన చీర కొంగుతో విసురుతూ ఉండగా వారి చెవిలో పరమేశ్వరుడు తారక మంత్రాన్ని ఉపదేశించి వారికి మోక్షం ప్రసాదిస్తాడని చెబుతారు. అదే విధంగా పరమశివుడు నటరాజ రూపంలో నాట్యానికి ప్రసిద్ధి ఈయన చిదంబరం...

Types of Shiva Lingam: వివిధ శివలింగాలు

Image
  సాధారణంగా మనకు తెలిసినవి శిలా నిర్మితమైన లింగాలు మాత్రమే. అందులో కూడా నల్ల రాతి శివలింగాలే అధికం. కానీ మనకు తెలీని శివ లింగాలు ఇంకా అనేకం ఉన్నాయి. అందులో 30 రకాల శివలింగాలు మరీ ముఖ్యమైనవి, అపురూపమైనవి. ఆయా లింగాలు ఇచ్చే ఫలితాలు అనంతం. అందుకే వాటి గురించి తెలుసుకుందాం. రకరకాల పదార్ధాలతో రూపొందిన శివలింగాల గురించి పురాణాలు వివిధ సందర్భాల్లో వర్ణించాయి. ఏయే శివలింగాలను పూజిస్తే ఏయే ఫలితాలు కలుగుతాయి. 01. గంధలింగం రెండు భాగాలు కస్తూరి. నాలుగు భాగాలు గంధం, మూడు భాగాలు కుంకుమను కలిపి ఈ లింగాన్ని చేస్తారు. దీనిని పూజిస్తే శివ సాయిజ్యం లభిస్తుంది. 02. పుష్పలింగం నానావిధ సుగంధ పుష్పాలతో దీనిని నిర్మిస్తారు. దీనిని పూజిస్తే రాజ్యాధిపత్యం కలుగుతుంది. 03. నవనీతలింగం వెన్నతో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయి.  04. రజోమయలింగం పుప్పొడితో నిర్మించిన ఈ లింగాన్ని పూజించడం వల్ల విద్యాధరత్వం సిద్ధిస్తుంది. శివ సాయుజ్యాన్ని పొందగలం. 05. ధాన్యలింగం వలు, గోధుమలు, వరిబియ్యపు పిండితో ఈ లింగాన్ని నిర్మిస్తారు. దీనిని పూజించడం వల్ల సంపదల వృద్ధి, సంతానం కలుగుతుంది. 06. తిలిపిష్టోతల...

Ayyappa Swamy Irumudi: ఇరుముడి అంటే ఏంటి

Image
అయ్యప్ప దీక్ష చేపట్టి శబరిమల బయలుదేరే స్వాములంతా ఇరుముడితో బయలుదేరుతారు. తలపై ఇరుముడితో 18 మెట్లు ఎక్కి స్వామిని దర్శించుకుంటారు.ఇంతకీ ఇరుముడి అంటే ఏంటి కార్తిక మాసం మొదలు మకర సంక్రాంతి వరకు అయ్యప్పదీక్షల కోలాహలం కనిపిస్తుంది. దీక్ష ముగింపు సమయంలో ఇరుముడి కట్టుకుని అయ్యప్పను దర్శించుకుని వచ్చాక దీక్ష విరిమిస్తారు అయ్యప్ప దీక్ష స్వీకరించిన వాళ్లు నల్లని దుస్తులు ధరిస్తారు. అన్నిటినీ స్వీకరించే గుణం నలుపు రంగుకు ఉంటుంది. నలుపు తమో గుణానికి ప్రతీక. తనలోని తమో గుణాన్ని అదుపులోకి తీసుకురాగలిగిన దీక్షధారుడి హృదయం పరమాత్మలో విలీనం అవుతుంది. అయ్యప్ప పూజలో ప్రధానాంశం ‘శరణుఘోష’. నవవిధ భక్తి మార్గాల్లో శరణాగతి సత్వర ఫలితాన్నిస్తుందని చెబుతారు. ఇరుముడి అంటే రెండు ముడులు కలది అని అర్థం. ఆ రెండూ భక్తి, శ్రద్ధకు ప్రతీక. ఇరుముడికి కట్టే తాడు ప్రణవం. భక్తి, శ్రద్ధలను సాధనతో పొందగలిగితే.. స్వామి అనుగ్రహం లభిస్తుందని అందులో ఆంతర్యం. ఇరుముడి ఒక భాగంలో దేవుడికి సంబంధించిన సామగ్రి ఉంచుతారు. రెండో భాగంలో నీళ్లు తొలగించిన కొబ్బరికాయలో ఆవునెయ్యిని నింపి ఉంచుతారు. జీవాత్మ, పరమాత్మలను అనుసంధానం చేయడం ఇందులోని ఆం...

Bhagavadgita Life Lessons: మానవాళికి భగవద్గీత నేర్పించే 10 జీవిత పాఠాలు

Image
గీతలో అర్జునుడికి కృష్ణుడు ఎన్నో జీవిత పాఠాలను బోధిస్తాడు. ఈ జీవిత పాఠాలు క్రియ (కర్మ), జ్ఞానం (జ్ఞానం), భక్తి (భక్తి) అనే అంశాలపై ఆధారపడి ఉంటాయి. ప్రతి వ్యక్తి ఇతరుల కంటే భిన్నంగా ఉంటాడనే వాస్తవాన్ని గీత అంగీకరిస్తుంది. భగవద్గీత ఆధారంగా మనం నేర్చుకునే అంశాలు.. మన కర్తవ్యం, మన బాధ్యతలే మన ధర్మం. ఏది జరిగినా అంతా మంచికే జరుగుతుంది. మానవ శరీరం మన ఆత్మకు వస్త్రంల లాంటిది. మరణం అనేది కల్పన మాత్రమే కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు. కష్ట సమయాలు మనలోని ఉత్తమ లక్షణాలను బయటకు తెస్తాయి. నరకానికి మూడు ద్వారాలు- కోపం, కామం, దురాశ. మానవుడు నమ్మకం ద్వారా జన్మించాడు. ఇంకా అతను తాను నమ్మినట్లుగానే ఉన్నాడు. కష్టపడడం వరకే మన చేతుల్లో ఉంటుంది. కానీ దాని ఫలితం మన వశానికి అతీతంగా ఉంటుంది. సత్యం ఎప్పటికీ నాశనమవ్వదు.

Kaleswaram Temple: శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం - కాళేశ్వరం

Image
  కరీంనగర్ జిల్లా మహదేవ్ పూర్ మండలంలో గోదావరి, ప్రాణహిత నదులు అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహిస్తున్న త్రివేణీ సంగమ ప్రదేశంలో స్వయంభువుగా వెలసిన స్వామి శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి. ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి సోయగాల మధ్య అలరారుతున్న అతి పురాతనమైన ఈ ఆలయం ఒకప్పుడు అరణ్యంలో ఉండటం వల్ల రవాణా సౌకర్యం ఉండేదికాదు. అయితే 1976-82 సంవత్సరాల మధ్యకాలంలో ఆలయ జీర్ణోద్ధరణ పనులు జరగడంతో రవాణా వసతి సౌకర్యాలు మెరుగుపడ్డాయి. విశాలమైన ప్రాంగణంలో అలరారుతున్న ఈ దివ్యాలయం నాలుగు వైపుల నాలుగు నంది మూర్తులు దర్శనమిస్తాయి. ఇతర ఆలయాలకు మల్లే కాకుండా ఇక్కడ గర్భాలయంలో ఒకే పాన మట్టం మీద రెండు లింగాలు ఉండటమే కాక ముక్తీశ్వర స్వామికి రెండు నాసికా రంధ్రాలుంటాయి. ఈ రంధ్రాలలో అభిషేక జలం ఎంత పోసినప్పటికీ ఒక్కచుక్క కూడా బయటకు రాకుండా భూమార్గం గుండా ప్రవహించి, సరస్వతీ నది రూపంలో గోదావరి ప్రాణహిత నదుల సంగమంలో కలుస్తుందని ఆలయ చరిత్ర చెబుతోంది. గర్భాలయంలో ఉన్న రెండు లింగాలలో ఒకటి కాళేశ్వర లింగం కాగా, రెండవది ముక్తీశ్వర లింగంగా చెబుతారు. కాళేశ్వర లింగాన్ని యమధర్మ రాజు ప్రతిష్టించాడు. మహాశివుడు యమధర్మరాజుకిచ్చిన వరం కార...

How to Protect Health: ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే.?

Image
  ప్రతిరోజు ఉదయించే సూర్యుని ముందు నిల్చొని, ఆదిత్యహృదయం చదవాలి. శాస్త్ర పద్ధతిలో సూర్యనమస్కా రాలు కూడా చేస్తే మంచిది  వాల్మీకి రామాయణం యుద్ధ కాండలోని యాభై తొమ్మిదవ సర్గ పారాయణం చేయాలి. ఇది మనలోని అహంకారాన్ని, అంతః శత్రువులను తగ్గిస్తుంది. ఆరోగ్యాన్నస్తుంది   మన కర్మ ఫలాలను, ప్రధానంగా అనారోగ్యాలను నియంత్రించే ఆదేశాలను భగవంతుడు నరసింహ దివ్యరూపంలో సుదర్శనుల వారికి కటాక్షిస్తాడని ప్రసిద్ధి. అందువల్ల వారికి ప్రీతి కలిగించే సుదర్శన శతకం, సుదర్శనాష్టకం, నృసింహాష్టకం, లక్ష్మీనరసింహ అష్టోత్తర శతనామావళి పారాయణం అర్చన చేయడం మంచిది  అనారోగ్యాన్ని దూరం చేయడానికి ధన్వంతరి అష్టోత్తర శతనామం పారాయణం సత్ఫలితానిస్తుంది  అంటువ్యాధులు ప్రబలినప్పుడు శీతలాష్టకం చదవడం వల్ల సత్ఫలితాలుంటాయని పెద్దలు చెబుతారు.

Ayyappa Deeksha: అయ్యప్ప దీక్ష - అంతరార్ధం

Image
  కేరళ రాష్ట్రంలో ప్రారంభమైన అయ్యప్ప దీక్ష నేడు దక్షిణ భారతదేశమంతటా విస్తరించింది. అన్ని ప్రాంతాల కంటే తెలుగు రాష్ట్రాల్లోనే అయ్యప్ప దీక్ష తీసుకున్న వారు కఠిన నియమాలు ఆచ రిస్తూ దీక్షా కాలాన్ని పరిపూర్ణం గావిస్తారనే మంచి పేరుంది.అయ్యప్ప దీక్ష మతసామరస్యానికి ప్రతీక. కులం, మతం, చిన్న, పెద్దా తేడా లేకుండా ప్రతి వ్యక్తిని దైవ స్వరూపంగా భావించడమే దీక్ష పరమార్థం. దీని ద్వారా ఆధ్యాత్మిక చింతన పెరగడమే కాకుండా దురలవాట్లకు దూరమై, సంపూర్ణ ఆరోగ్యం, క్రమశిక్షణతో కూడిన జీవన విధానం అలవడుతుంది. అయ్యప్ప దీక్షతో ఆరోగ్యం… అయ్యప్ప మండల దీక్షతో ఆధ్యాత్మిక చింతన తో పాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. శాస్ర్తీ య పద్ధతుల ప్రకారం పురాతన కాలం నుంచి కొన్ని రకాలైన వ్యాధులకు ఆయుర్వేద చికిత్స చేయడానికి, యోగ సాధనకు మండల కాలం (41 రోజులు) ప్రామాణికంగా వాడుతున్నారు. చన్నీటి స్నానం, ఒక్క పూట భోజనం, దేవతా రాధన వంటి అలవాట్లు మనిషి జీవితంపై చక్క టి ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఉద యం, సాయంత్రాలలో చన్నీటి శిర స్నానాలు చేయడం వల్ల మెదడులోని సున్నిత నరాలు స్పందించి సునిశిత శక్తి, ఏకాగ్రత, ఉత్తేజం కలగడమే కాకుండా శరీరంలోని వేడి కూడ...

Shirdi Prasadalay:సాయిబాబా ప్రసాదాలయ - షిరిడి.

Image
షిరిడి లో శ్రీ సాయిబాబా వారు జీవించి ఉన్న కాలం నుంచి ఇప్పటి వరకు షిరిడిలో అన్నదానం ఒక యజ్ఞంగా సాగుతోంది. షిరిడి సాయి ప్రసాదం ఎన్నో జన్మల పుణ్యఫలం. 2007 వరకు సాయి ప్రసాదాలయ సాధారణంగానే ఉండేది.భక్తుల రద్దీ పెరగడంతో షిర్డీ సాయి సంస్థాన్ కొత్త ప్రసాదాలయ నిర్మించింది. 7 ఎకరాల భూమిలో 11 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో మహాభవనాన్ని నిర్మించారు. 2001 లో తొలిసారి సౌరశక్తితో మూడువేలమందికి కావాల్సిన భోజనం తాయారు చేసేవారు.  షిరిడి ప్రసాదాలయంలో 73కి  పైగా సౌరశక్తిని ఉత్త్పతి చేసే డిష్ లున్నాయి.ఇవి అన్నీ సూర్యగమనం ఆధారంగా కదులుతూ సౌర్యవిద్యుత్ ఉత్త్పతి చేస్తాయి. ఇలా చేయడం వల్ల సంస్థాన్ కి ఒక సంవత్సరానికి 30 లక్షల వరకు ఆదా అవుతుంది. రోజు 600 నుంచి 800 కిలోల వరకు కూరగాయల్ని ఉడికిస్తారు. అదే పర్వదినాల్లో అయితే ఈ సంఖ్య 1000 నుంచి 1200 కిలోల వరకు ఉంటుంది. రోజుకి 40 నుంచి 50  వేల మందికి సరిపడే చపాతీలు షిరిడి ప్రసాదాలయాలో తయారు అవుతున్నాయి. ఒక గంటకు రెండువేల చపాతీలు ఆధునిక యంత్రాల ద్వారా తయారు చేస్తున్నారు.ఒక రోజుకు 6  నుంచి 7  వేల కిలోల గోధుమ పిండి ఖర్చుఅవుతుంది. గంటకు 30 వేల చపాతీలు ...

Deepavali: దీపావళి నాడు ప్రధానంగా దీపాలు ఎక్కడ పెట్టాలి ?

Image
  దీపావళి రోజు తప్పనిసరిగా మహాలక్ష్మిని పూజించాలి. తరువాత దీపాలు వెలిగించి ఇంటిలో, ఇంటి పరిసరాలలో, గోశాలలో దీపాలు పెట్టాలి. తరువాత బాణాసంచా కాల్చి బంధుమిత్రులతో కలసి భుజించాలి.       

Irukalala Parameswari Temple: శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి ఆలయం - నెల్లూరు

Image
శ్రీ ఇరుకళల పరమేశ్వరి దేవాలయం నెల్లూరు పట్టణంలో మూలాపేటలో స్వర్ణాల చెరువు అని పిలువబడే నెల్లూరు చెరువు ఒడ్డున నిర్మించబడింది.. ఈ స్వర్ణాల చెరువును కాకతీయ గణపతి దేవుడు నిర్మించాడని ప్రతాపరుద్ర చరిత్ర తెలుపుతోంది. దేవాలయ మండపంలోను, స్తంభములపైన తెలుగు, తమిళ, దేవనాగరి భాషలలో ఉన్న శాసనాలు దేవాలయ నిర్మాణానికి సంబంధించిన చారిత్రకాంశాలను తెలుపుతున్నాయి. క్రీ.శ. 13 శతాబ్దంలో నెల్లూరును తెలుగుచోళరాజులు పరిపాలించారు. ఆ కాలంలో ఏర్పడిన రాజకీయ అస్థిరత వల్ల తెలుగు చోళరాజైన చోడతిక్క తమ సహాయార్థం దండెత్తి రావలసినదిగా ఓరుగళ్ళు పురాధీశ్వరుడైన కాకతీయ గణపతిదేవుని వేడుకొన్నాడు. గణపతిదేవుడు మొదటిసారిగా క్రీ.శ. 1203 సంవత్సరంలో నెల్లూరు ప్రాంతంపై దండెత్తారు. అప్పటినుండి దాదాపు క్రీ.శ. 1317 వరకు కాకతీయులు అనేకమార్లు నెల్లూరుపై దండయాత్ర జరిపారు. ఈ నేపధ్యంలో ప్రతాపరుద్రదేవ మహారాజు కాలంలో (క్రీ.శ.1314- 15) ఈ ప్రాంతానికి వచ్చిన అతని సేనానులు ముప్పడి నాయకునికి అతని కొడుకు పెద్ద రుద్రునికి పుణ్యంగా నెల్లూరు భూమికి నెలమూడు వర్షాలు కురవగా ధనకనకాలు సమృద్ధిగా ఉన్న వారి భృత్యులు నాగగణ సేవకుడైన హరిదేవుని కుమారులైన నాయగానుల...

Bhimavaram Mavulamma Temple: శ్రీ మావుళ్ళమ్మ తల్లి ఆలయం - భీమవరం

Image
శ్రీ మావుళ్ళమ్మ తల్లి 800 సంవత్సరాల క్రితం అంటే క్రీ॥ ఈ 1200 సంవత్సరంలో వెలసినట్లు తెలుస్తోంది. అయితే శ్రీ అమ్మవారి దేవాలయానికి సంబంధించిన వివరాలలో క్రీ॥ తే॥ 1880 సం॥ నుండి మాత్రమే చరిత్ర లభ్యమౌతోంది.  స్థానికుల కథనం ప్రకారం భీమవరం పట్టణంలో ప్రస్తుతం ఉన్న మోటుపల్లివారి వీధిలో అమ్మవారి గరగలు భద్రపరచటానికై నిర్మించిన భవన ప్రాంతంలో వేప, రావిచెట్లు కలిసి ఉన్నచోట్ల శ్రీ మావుళ్ళమ్మ వారు వెలిశారని తెలుస్తోంది. మామిడి చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో వెలిసిన తల్లి కనుక శుభప్రదమైన మామిడి పేరు మీదుగా 'మామిళ్ళ అమ్మ'గా, అనంతరం 'మావుళ్ళమ్మ'గా రూపాంతరం చెందిందని విజ్ఞుల అభిప్రాయం. చిన్న చిన్న ఊళ్ళవారంతా కలిసి అమ్మవారిని గ్రామదేవతగా కొలుచుటచే 'మావుళ్ళ 'అమ్మ' కాస్తా 'మావూళ్లమ్మ'గా రూపాం తరం చెందిందని మరికొందరి అభిప్రాయం. 1880 సంవత్సరం వైశాఖ మాసం రోజుల్లో భీమవరానికి చెందిన శ్రీ మారెళ్ల మాచిరాజు, గ్రంధి అప్పన్నలకు అమ్మ వారు కలలో సాక్షాత్కరించి తాను వెలసిన ప్రాంతం గురించి చెప్పి, ఆ ప్రదేశంలో ఆలయం నిర్మించవలసినదిగా ఆదేశించా రని పూర్వీకుల కథనం. ఆ ప్రకారం వారు అమ్మవారు చెప్...

Udupi Temple Annaprasadam: అన్నబ్రహ్మ క్షేత్రం - ఉడిపి

Image
ఉడుప అంటే చంద్రుడు, వెన్నల అని అర్ధం. శివునికోసం చంద్రుడు తపస్సు చేసిన ప్రదేశం ఉడుపి. కాలక్రమంలో ఉడిపి అయింది. పేరుకు తగ్గట్టు ఈ పవిత్ర క్షేత్రం స్వచ్ఛముగా వెన్నెలలో ప్రకాశించే చంద్రుడులా ఉంటుంది. శ్రీ మద్వాచార్యులు రాకతో ఈ క్షేత్ర వైభవం పతాకస్థాయికి చేరింది. ఉడిపి అన్నబ్రహ్మ క్షేత్రం అని అంటారు. తిరుమల వెంకటేశ్వర స్వామిని కాంచన బ్రహ్మ అని వ్యవహరిస్తారు. పండరీపుర పాండురంగ స్వామిని నాదబ్రహ్మగా పిలుస్తారు. ఉడిపి అన్నబ్రహ్మ క్షేత్రంలో శతాబ్దాలుగా ఉచిత అన్నదానం భక్తులకు లభిస్తుంది. ఈ భోజనశాలలో ఒక్కో బంతికి ఐదు వందల మంది వరకు భోజనం చేయవచ్చు. అలాగే ఆలయం బయట ఉన్న మరో అన్నక్షేత్ర భవనంలో మూడు అంతస్తులలో ఒక్కో భోజనశాలలో ఒక్కో బంతికి 1400 మంది వరకు ఒక్కేసారి అన్నప్రసాదాన్ని స్వీకరించే సదుపాయం ఉంది. 1915 సంవత్సరంలో అప్పటి పీఠాధిపతి ఈ ఉచిత అన్నదానాన్ని విస్తృతంగా అమలు చేసారు. ప్రతి రోజు సగటున 30 వేల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారు. మకర సంక్రాంతి, మద్వనవమి, హనుమాన్ జయంతి, శ్రీకృష్ణ అష్టమి, నవరాత్రులు, మధ్వ జయంతి, విజయదశమి, నరక చతుర్దశి, దీపావళి, గీత జయంతి వంటి పండుగలను ఈ క్షేత్రంలో అంగరంగ...

Karthika Masa Snan: కార్తీక మాసంలో స్నానానికి ఎందుకంత ప్రాధాన్యం?

Image
కార్తికంలో గోష్పాదమంత (ఆవుకాలిగిట్ట) జలంలో కూడా దేవదేవుడు ఉంటాడని విశ్వసిస్తారు భక్తులు. అందుకే కార్తికమాసంలో స్నానానికి అంత ప్రత్యేకత ఉంది.  ఈ మాసంలో సూర్యోదయానికి ముందుగా చేసే స్నానాన్ని హంసోదక స్నానం అంటారు.  శరదృతువులో సూర్యోదయానికి ముందు హంసమండలానికి సమీపంలో అగస్త్య నక్షత్రం ఉదయిస్తుంది. అటువంటి సమయంలోని నీరు స్నానపానాదులకు అమృతతుల్యంగా ఉంటుందని మహర్షి చరకుడు పేర్కొన్నాడు.  ఓషధులకు రాజు చంద్రుడు. చంద్రకిరణాలు సోకిన నీటితో సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. శరదృతువులో నదీప్రవాహంలో ఓషధుల సారం ఉంటుంది.  చీకటి ఉండగానే ఉషఃకాలంలో అంటే సూర్యోదయానికి పదిహేను నిమిషాల ముందు స్నానం చేయడం ఉత్తమం.  ఇందువల్ల మానసిక, శారీరక రుగ్మతలన్నీ నశిస్తాయి. పరిపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. ఆయుష్షు పెరుగుతుంది.

Karthika Masam: కార్తీక మాసంలో ఏమి తినాలి ? ఏ పనులు చేయాలి ? ఏ వ్రతాలు చేయాలి ?

Image
కార్తిక మాసంతో సమానమైన మాసం, కృతయుగంతో సమమైన యుగం, వేదానికి సరితూగే శాస్త్రం, గంగతో సమానమైన తీర్థం లేవని అర్థం. శివ కేశవులిద్దరికీ అత్యంత ప్రీతికరమైన మాసం ఇది. ఉపవాస నిష్టలకూ, నోములకూ, వ్రతాలకూ ఈ మాసంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రత్యేకించి శివారాధకులు అత్యంత పవిత్రమైన నెలగా పరిగణించే మాసం ఇది. ఈ నెల రోజులూ ప్రతిరోజూ సాయంవేళ దీపాలు వెలిగిస్తారు. కార్తీక మహా పురాణాన్ని పారాయణం చేస్తారు. కార్తిక సోమవారాలు, కార్తిక పౌర్ణమి పర్వదినాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ మాసంలో ప్రాతఃకాల స్నానాలకు ఎంతో విశిష్టత ఉంది. స్నానం పూర్తయిన తరువాత దీపారాధన చెయ్యాలనీ, రావిచెట్టు, తులసి, ఉసిరిక చెట్ల దగ్గర దీపాలు పెట్టడం ఉత్తమమనీ పెద్దలు చెబుతారు. మాసాలలో అసమానమైనదిగా పేరు పొందిన కార్తిక మాసంలో ఎన్నో పర్వదినాలున్నాయి.  పఠించదగిన స్తోత్రాలు వామన స్తోత్రం,  మార్కండేయకృత శివస్తోత్రం,  సుబ్రహ్మణ్యాష్టకం,  శ్రీ కృష్ణాష్టకం, సూర్య స్తుతి,  గణేశ స్తుతి, దశావతార స్తుతి,  దామోదర స్తోత్రం, అర్ధ నారీశ్వర స్తోత్రం,  లింగాష్టకం, బిల్వాష్టకం, శివషడక్షరీ స్తోత్రం శ్రీ శివ స్తోత్రం,శివాష్టక...

Not to Eat in Karthika Masam: కార్తీక మాసం లో తినకూడనివి..?

Image
 కార్తీక మాసం పవిత్రమైనది. ఈ మాసం మొత్తం ప్రతిరోజూ ఉదయం సూర్యోదయానికి ముందు ఇంటి గడపల వద్ద, తులసి చెట్టు వద్ద ఆవు నెయ్యితో దీపారాధన చేయడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి. ఈతిబాధలు తొలగిపోతాయి. కార్తీకంలో అల్పాహారం తీసుకుని, ఒంటిపూట భోజనం చేసేవారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఈ నెలంతా ఉపవాసం చేయలేనివారు కనీసం సోమవారాలు, ఏకాదశి, పౌర్ణమి, మాసశివరాత్రి దినాల్లో ఉపవాసం, దీపారాధన చేయాలి. అలాగే  ఈ మాసంలో ఉల్లి, పుట్టగొడులు, ఇంగువ, ముల్లంగి, ఆనపకాయ, మునగకాడలు, వంకాయ, గుమ్మడి, వెలగపండు, మాంసాహారం, పెసలు, సెనగలు, ఉలవలు, కందులు వాడకూడదు. కార్తీకస్నానం చేసినవారి అశ్వమేధ ఫలాన్ని పొందుతారు. కార్తీక దీపాన్ని శివలింగ సన్నిధిలో దీపారాధన చేయడం ద్వారా పాపాలు తొలగిపోతాయి. కార్తీకంలో శివాలయంలో ఆవునేతితోగాని, నువ్వులనూనెతోగాని, ఆఖరికి ఆముదంతోగానీ దీప సమర్పణ చేస్తారో, వారు అత్యంత పుణ్యవంతులౌవుతారని పురాణాలు చెప్తున్నాయి. 

Karthika Masam Danam: కార్తీక మాసంలో ఏ ఏ రోజు ఏమి దానం చేస్తే బాగుంటుంది?

Image
  కార్తీకంలో ప్రతి రోజు అమూల్యమైనదే కార్తీక మాసంలో పూజలు, వ్రతాలు ఆచరిస్తే సత్ఫలితాలు పొందుతారు. ఏ రోజు ఏమి దానం చేస్తే మంచిది. ♦ మొదటి రోజు : నెయ్యి, బంగారం. ♦ రెండవ రోజు : కలువపూలు, నూనె, ఉప్పు. ♦ మూడో రోజు : తదియ రోజున పార్వతీదేవిని పూజించాలి. ఉప్పు దానం చేయడం శుభప్రదం. ఫలితంగా శక్తి, సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. ♦ నాలుగో రోజు : కార్తీకశుద్ధ చవితి. నాగులచవితిని పురస్కరించుకుని వినాయకుడికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు చేయాలి. నూనె, పెసరపప్పు, దానం ఇవ్వాలి. సద్భుద్ది, కార్యసిద్ధి సాధ్యమవుతుంది. ♦ ఐదో రోజు : ఈ రోజును జ్ఞానపంచమి అంటారు. ఆదిశేషుని పూజించాలి. ఫలితంగా కీర్తి లభిస్తుంది. ♦ ఆరో రోజు : షష్టి రోజున బ్రహ్మచారికి ఎర్ర గళ్ళకండువా దానం చేస్తే సంతానప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తారు. ♦ ఏడో రోజు : సప్తమి రోజున దుర్గాదేవిని పూజించాలి. ఎర్రని వస్త్రంలో గోధుమలు దానం చేయాలి. దీంతో ఆయుష్సు వృద్ధి చెందుతుంది. ♦ ఎనిమిదో రోజు : అష్టమినాడు గోపూజ చేస్తే విశేష ఫలితాలు ఇస్తుంది. ముఖవర్చస్సు పెరుగుతుంది. ♦ తొమ్మిదో రోజు : నవమినాటి నుంచి మూడు రోజుల పాటు విష్ణుత...

Karthika Deepam: కార్తిక దీపారాధన ప్రాశస్త్యం ఏమిటీ?

Image
కార్తికంలో దీపం వెలిగించినవారు విద్యావంతులు, జ్ఞానవంతులు, ఆయుష్మంతులవుతారు. మోక్షాన్ని పొందుతారు. సాయంత్రం శివాలయంలో దీపం వెలిగిస్తే అనంతమైన పుణ్యం లభిస్తుంది. అప్రయత్నంగా అయినా.. భక్తిభావన లేకపోయినా దీపం వెలిగించినందువల్ల అనంత పుణ్యఫలం వస్తుంది. ఇదే ఫలితం విష్ణుభక్తులకు కూడా వస్తుంది.  కార్తికమాసం నెల రోజులూ దీపాలు పెట్టటం సంప్రదాయం.. ఆచార విధి కూడా.  ఏదైనా కారణం వల్ల 30 రోజులు దీపం పెట్టలేని వారు కనీసం శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ రోజుల్లో అయినా దీపం వెలిగిస్తే, వైకుంఠప్రాప్తి కలుగుతుంది.  కార్తిక మాసంలో శనిత్రయోదశి కన్నా సోమవారం ఎక్కువ ఫలితాన్నిస్తుంది. శనిత్రయోదశి కన్నా కార్తిక పూర్ణిమ వందరెట్లు ఎక్కువ ఫలితాన్నిస్తుంది.  పూర్ణిమ కన్నా బహుళ ఏకాదశి కోటి రెట్లు పుణ్యఫలితాలు అనుగ్రహిస్తుంది. బహుళ ఏకాదశి కన్నా క్షీరాబ్ది ద్వాదశి అతి విస్తారమైన. అనంతమైన ఫలితాన్నిస్తుందని భాగవతం చెబుతోంది. ఈ రోజుల్లో తప్పనిసరిగా దీపారాధన చేయాలి.

Fasting in Karthika Masam: కార్తీక మాసంలో ఉపవాసం ఎందుకు చేయాలి?

Image
శివభక్తులు కార్తిక సోమవారం లింగార్చన, పూజ, ఉపవాసం చేస్తే శివానుగ్రహాన్ని పొందుతారు. కార్తికంలో వచ్చే సోమవారాలన్నీ నియమంగా పాటిస్తే సోమవార వ్రతమవుతుంది. అది శివునికి ప్రీతిపాత్రం.  కార్తిక సోమవారం ఉపవాసం చేసినవారు స్త్రీలు, పురుషులు అందరూ నక్షత్ర దర్శనం చేసి భోజనం చేస్తే శివలోకానికి వెళతారు.  కార్తిక సోమవారంనాడు శక్తిమేరకు శివాభిషేకం చేయాలి. పగలంతా ఉపవాసం చేయాలి. ప్రదోషకాలంలో అంటే సాయంత్రవేళలో నక్షత్ర దర్శనం అయ్యేంతవరకు శివారాధన కొనసాగించాలి.  కార్తికమాసంలో సోమవారంనాడు భక్తవ్రతం అంటే, ఒంటిపొద్దు భోజనం చేయడం ఆచారం. పగలంతా ఉపవాసం చేసి, నక్షత్ర దర్శనం అయ్యాక విరమిస్తారు.  కార్తీకం చలికాలం కావడం చేత మానవులకు ఆహారం అరుగుదల మందంగా ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో ఆహారం తినకుండా ఉపవాసం ఉండి రాత్రి భుజించాలంటారు.  ఈ నియమాలన్నీ పాటిస్తూ శివునికి బిల్వపత్రాలతో పూజచేస్తే భక్తుల కోరికలు నెరవేరతాయి.

Bathing in Hinduism: స్నానం ఎన్ని రకాలు?

Image
ప్రాతఃకాలంలో అయిదుగంటలకు పూర్వం చేసే స్నానం ఋషి స్నానం. మిక్కిలి శ్రేష్టమైనది.  అయిదు నుంచి ఆరులోపుగా చేసేది దేవస్నానం.  ఆరు నుంచి ఏడులోపు మానవస్నానం.  ఆ తర్వాత చేసేది రాక్షస స్నానం.  అనారోగ్యం వల్లనో, మరే కారణం వల్లనో స్నానం చేయలేకపోతే నిర్మలహృదయంతో నిరంజనుణ్ణి స్మరించడం. మానస స్నానం అవుతుంది.  విష్ణుపాదోదకంతో కానీ, తులసి, మారేడు దళాలు కలిసిన జలంతో కాని సంప్రోక్షించుకుంటే ధ్యాన స్నానమవుతుంది.  ఎండా, వాన కలిసినప్పుడు. తడిస్తే అది దివ్యస్నానం.  తడివస్త్రం చేత దేహాన్ని తుడుచుకుంటే కపిలస్నానం అనిపించుకుంటుంది.  మంత్రాన్ని జపిస్తూ సంధ్యావందనం వంటి సందర్భాలలో జలాన్ని ప్రోక్షించుకుంటే మంత్రస్నానం అవుతుంది.  మహిమాన్వితమైన గాయత్రీమంత్రాన్ని జపిస్తూ నీటిని అభిమంత్రించి శిరస్సుమీద చల్లుకుంటే గాయత్రీ స్నానమవుతుంది. దీనివల్ల సకల గ్రహదోషాలు తొలగిపోతాయి.

Karthika Masam: కార్తీక మాసంలో శుద్ధ పాడ్యమి నుంచి అమావాస్య వరకు చేసే పూజలు, కలిగే పుణ్యఫలితాలు

Image
  కార్తీకమాసంలో తెల్లవారు జామునే వణికించే చలిలో చన్నీటితో లేచి తలారా స్నానం చేసి..కార్తీక దీపాలు పెడతారు మహిళలు. కార్తీక మాసం అంతా ప్రతీ రోజు ఏదోక పుణ్యకార్యాల్లోనే మునిగి ఉంటారు. శివకేశవులు దేవాలయాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. తమ కుటుంబాలు పిల్లాపాపలతో చల్లగా ఉండాలని వేడుకుంటారు. గోమాత పూజలు. ఆవునెయ్యితో కార్తీక దీపాలను తయారు చేసి దీపలక్ష్మికి పూజలు చేసి పారే నీటిలో వదులుతారు. సౌభాగ్యాలు కలిగించే తులసికోట ముందు భగవన్నామ సంకీర్తన చేస్తూ ధూప, దీప, నైవేద్యాలు సమర్పిస్తారు. అలా కార్తీకమాసం అంతా మనసంతా ఆధ్యాత్మిక పరిమళాలతో నిండిపయేలా చేయటమే ఈ మాసం ప్రత్యేకత. సాధారణ రోజుల్లో పూజలు చేసినా కార్తీకమాసం మాత్రం ప్రత్యేకమైన ఆధ్యాత్తిక భావన కలిగిస్తుంది. శ్రావణమాసంలో శుక్రవారానికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో కార్తీక మాసంలో సోమవారాలకు అంతటి విశిష్టత ఉంది. అంతేకాదు కార్తీకంలో వచ్చే దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులకు అంతటి విశిష్టత ఉంది. శ్రావణమాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రార్థిస్తే..కార్తీకమాసంలో ఆమె పతిదేవుడైన శ్రీమహావిష్ణువు పూజింటం ఈ మాసం ప్రత్యేకత. విష్ణువును తులసిదళాలతో పూజిస్తే సౌభాగ్యాలను అన...

Akasha Deepam: కార్తీక మాసంలో ఆలయాల్లో ఆకాశదీపం వెలిగించే ఆంతర్యం ఏమిటి?

ఆకాశంలో ఉయ్యాల ఊగే దీపాన్ని దామోదరునికి సమర్పిస్తున్నాను. ఈ దీపకాంతుల వలే నా ఆనంద భావనలు శాశ్వతత్వాన్ని పొందాలి అని ప్రార్థిస్తూ ఆకాశ దీపారాధన చేస్తారు. కీటకాలు, పక్షులు, అభాగినులై పుణ్యలోకాలకు చేరలేని సమస్త జీవజాలానికి ఆకాశదీప దర్శనం సద్గతులు కలిగిస్తుంది. శివాలయాల్లో ధ్వజస్తంభానికి ఆకాశదీపం కడతారు. మూడు సిబ్బెలలో దీపాలు వెలిగించి ధ్వజస్తంభం పైకి చేర్చుతారు. సాయంకాలంలో నువ్వుల నూనెతో ఆకాశ దీపారాధన చేస్తే రూప, సౌందర్య, సౌభాగ్య సంపదలు వృద్ధి చెందుతాయి.

Tiruchanur Brahmotsavam: తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాల వాహన సేవలు వాటి వైశిష్ట్యం.

Image
  తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వాహ‌న‌సేవ‌ల వైశిష్ట్యం. చిన్నశేష వాహనం : అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో మొదటి వాహనం చిన్నశేషుడు. చిన్నశేష వాహనంపై అమ్మవారు జీవకోటిని ఉద్ధరించే లోకమాతగా దర్శనమిస్తారు. శేషభూతమైన ఈ ప్రపంచం సిరులతల్లి రక్షణలో సుఖాన్ని పొందుతోంది. ఈ వాహనంపై అమ్మవారిని దర్శించిన భక్తులకు యోగసిద్ధి చేకూరుతుంది. పెద్దశేష వాహనం : శ్రీపద్మావతి మాతకు కార్తీక బ్రహ్మోత్సవాలలో రెండవ వాహనం పెద్దశేషుడు. లక్ష్మీ సహితుడైన శ్రీవారికి దాసుడిగా, సఖుడిగా, శయ్యగా, సింహాసనంగా, ఛత్రంగా సమయోచితంగా పెద్దశేషుడు సేవలందిస్తాడు. శ్రీవారి పట్టమహిషి అలిమేలు మంగకు వాహనమై తన విశేష జ్ఞానబలాలకు తోడైన దాస్యభక్తిని తెలియజేస్తున్నాడు. సర్పరాజైన శేషుని వాహన సేవను తిలకించిన వారికి యోగశక్తి కలుగుతుంది. హంస వాహనం : భారతీయ సంస్కృతిలో అనాదిగా మహావిజ్ఞాన సంపన్నులైన మహాత్ములను, యోగిపుంగవులను ”పరమహంస”లుగా పేర్కొనడం సంప్రదాయం. హంసకున్న విలక్షణ ప్రతిభ ఏమిటంటే నీరు, పాలు వేరు చేయగలగడం. యోగిపుంగవులు కూడా జ్ఞానం, అజ్ఞానం తెలిసి మెలగుతారు. అట్టి మహాయోగి పుంగవుల హ దయాలలో జ్ఞానస్వరూపిణియైన అలమేలుమంగ విహరిస్తూ ఉంటుంది. ...

Tiruchanur Brahmotsavam: శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక మాస బ్రహ్మోత్సవాలు 2024 - తిరుచానూరు

Image
శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక మాసం బ్రహ్మోత్సవాలు నవంబర్ 28 నుండి  డిసెంబరు 06 వరకు జరుగుతాయి. బ్రహ్మోత్సవ సేవ వివరాలు  2024 : నవంబర్  28 - ధ్వజారోహణం , చిన్న శేష వాహనం నవంబర్ 29 - పెద్ద శేష వాహనం, హంస వాహనం నవంబర్ 30 - ముత్యపు పందిరి వాహనం, సింహ వాహనం డిసెంబరు 01 - కల్పవృక్ష వాహనం, హనుమంత వాహనం డిసెంబరు 02 - పల్లకి ఉత్సవం,వసంతోత్సవం, గజ వాహనం డిసెంబరు 03 - సర్వ భూపాల వాహనం, బంగారు రథం, గరుడ వాహనం డిసెంబరు 04 - సూర్య ప్రభ వాహనం, చంద్ర ప్రభ వాహనం డిసెంబరు 05 - రథోత్సవం , అశ్వ వాహనం డిసెంబరు 06 - చక్ర స్నానం, పంచమి తీర్థం, ధ్వజ అవరోహణం  డిసెంబరు 07 - పుష్పయాగం.

Tiruchanoor Temple Prasadam: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి నిత్య నైవేద్యాలు

Image
  కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు. ఆ స్వామి పట్టపురాణి తిరచానూరు పద్మావతి. ఆ తల్లికి నిత్యం ప్రత్యేక పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు.  ప్రతిరోజు ఉదయం సుప్రభాత సేవలో పాలు, పండ్లు ఆరగింపు చేస్తారు.ప్రతిరోజు ముప్పూటలా పులిహోర, మిరియపు పొంగలి, చక్కరపొంగలి, దధ్యోదనాలను ఆరగింపు చేయడంతోపాటు ప్రత్యేకంగా మొదటి నివేదనలో సిరా (రవ్వకేసరి), మధ్యాహ్నం రెండో నివేదనలో లడ్డూలు, వడలను నివేదన చేస్తారు. నిత్యమూ జరిగే శ్రీపద్మావతి పరిణయోత్సవవేళలో అప్పాలు, చక్కెరపొంగలి, పులహోరలు తప్పనిసరిగా ఉంటాయి. ప్రతిరోజు సాయంత్రం వేళలో జరిగే ఊంజల్‌సేవలో సిరులతల్లికి శనగగుగ్గిళ్లు నివేదన చేస్తారు. రాత్రి ఏకాంతసేవ (పవళింపు) సమయంలో గోరువెచ్చని పాలు, పంచకజ్జాయం నివేదిస్తారు. ప్రతి గురువారం తిరుప్పావడ సేవలో పులిహోరతోపాటు ప్రత్యేకంగా జిలేబీలు నివేదిస్తారు. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం వేళ పద్మావతి తల్లికి ప్రత్యేకంగా పాయసం ఆరగింపు చేస్తారు. శుక్రవారం తోటలో ఆ మధ్యాహ్నం అభిషేకానంతరం వడపప్పు, పానకం, మిరయపు పొంగలి, పిదప అలంకరణ అయిన తర్వాత పులిహోర, దోసెలు, సుండలు నివేదిస్తారు. పద్మావతి పుట్టినరోజుకు జరిగే పదినాళ్...

Vadapalli Temple Brahmotsavam: శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2024 తేదీలు - వాడపల్లి

Image
కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం తూర్పుగోదావరి జిల్లాలో వెలసింది. ఈ ఆలయం ఏడు శనివారాలు నోముకు ప్రసిద్ధి. 2024 తేదీలు స్వామి వారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 21 నుండి వైభవంగా జరగనున్నాయి. అక్టోబర్ 21 - ధ్వజారోహణం, శేష వాహన సేవ, వాసుదేవ అలంకరణ  అక్టోబర్ 22 - మహా పుష్పయాగం, సహస్ర దీపాలంకరణ సేవ, హంస వాహన సేవ అక్టోబర్ 23 - శ్రీనివాస కళ్యాణం, కోదండరామ అలంకరణ, హనుమంత వాహన సేవ అక్టోబర్ 24 - తోమాల సేవ, సుదర్శన హోమం, యోగనరసింహ అలంకరణ, సింహ వాహన సేవ అక్టోబర్ 25 - అష్టదళపాదపద్మ ఆరాధన, మలయప్ప అలంకరణ, గరుడ వాహన సేవ అక్టోబర్ 26 - సుప్రభాత సేవ, శ్రీ కృష్ణ అలంకరణ, సూర్యప్రభ వాహన సేవ, మోహిని అలంకరణ, చంద్రప్రభ వాహన సేవ అక్టోబర్ 27 - తిరుప్పావడ సేవ, రాజాధిరాజా అలంకరణ, గజ వాహన సేవ అక్టోబర్ 28 - లక్ష కుంకుమార్చన, చూర్ణోత్సవం, కల్కి అలంకరణ, అశ్వ వాహన సేవ అక్టోబర్ 29 - పూర్ణాహుతి, చక్ర స్నానం, ఏకాంత సేవ 

Vadapalli Venkateswara Temple: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం - వాడపల్లి

Image
  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లాలోని ఆత్రేయపురం నుంచి 6 కి.మీ దూరంలో వాడపల్లి గ్రామం ఉంది. ఈ ఆలయాన్ని కోనసీమ తిరుపతి అని కూడా పిలుస్తారు. పచ్చని కోనసీమలో గోదావరి నది ఒడ్డున గౌతమి పాయ నందు వాడపల్లి గ్రామంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వెంకటేశ్వర స్వామి వారి అవతారంలో ఇక్కడ స్వయంభువుగా వెలసిన్నట్లు స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తోంది. పూర్వం సనకసనందాది మహర్షులు వైకుంఠంలో నారాయణుని దర్శించుకోడానికి వచ్చి భూలోకంలో పాపాలు, అన్యాయాలు, అక్రమాలు విపరీతంగా పెరిగి పోతున్నాయని, వాటిని తగ్గించే మార్గం చెప్పమని ప్రాధేయపడతారు. అప్పుడు ఆ నారాయణుడు ఎప్పుడెప్పుడు ధర్మం గాడి తప్పుతుందో అప్పడు తాను ధర్మ స్థాపనకు పూనుకుంటానని చెప్పారు. అలాగే కలియుగంలో అర్చా స్వరూపంతో భూలోకంలో మానవుల పాపాలను కడుగుతున్న గౌతమీ ప్రవాహమార్గంలో నౌకాపురం అను ప్రదేశంలో లక్ష్మీ సహితంగా ఒక చందన వృక్షపేటికలో చేరుకుంటానని పలుకుతాడు. ఈ విషయాలను నారదుని ద్వారా ప్రజలకు తెలియజేయమని చెప్తాడు. కొద్దిరోజులకు నౌకాపురి ప్రజలకు గౌతమీ ప్రవాహంలో కొట్టుకొస్తున్న చందన వృక్షం కనిపించగా ఒడ్డుకు తీసుకురావాలని వెళ్లిన వాళ్లకు అది మాయమై...

Tiruchanur Temple: తిరుచానూరు ఆలయంలో శ్రీ పద్మావతి అమ్మవారికి జరిగే వివిధ సేవలు

Image
  తిరుమల శ్రీవారికి లాగానే అమ్మవారికి కూడా విశేష సేవలు జరుగుతూ ఉంటాయి వాటి వివరాలు  నిత్యోత్సవం  ఇవి ప్రతిరోజు జరిగే ఉత్సవాలు  ప్రతి రోజు అమ్మవారికి సుప్రభాత సేవ, మూలమూర్తికి సహస్రనామార్చన తరువాత నివేదన జరుగుతుంది. ప్రతి రోజు నిత్యా కల్యాణోత్సవం జరుగుతుంది  ప్రతి రోజు సాయంత్రం అమ్మవారికి డోలోత్సవం జరుగుతుంది  రాత్రి ఏకాంతసేవతో సేవలు ముగుస్తాయి. వారోత్సవాలు  ప్రతి వారం జరిగే ఉత్సవాలు  ప్రతి సోమవారం అమ్మవారికి అష్టదళపాద పద్మారాధన జరుగుతుంది  గురువారం రోజు తిరుప్పావడ మూలమూర్తికి జరుగుతుంది  శుక్రవారం రోజు మూలమూర్తికి అభిషేకం జరుగుతుంది  శుక్రవారం రోజు కల్యాణోత్సవం ముందు లక్ష్మి పూజ జరుగుతుంది. శుక్రవారం రోజు తోట ఉత్సవం జరుగుతుంది అనగా కల్యాణోత్సవం తరువాత గుడికి దక్షిణ దిక్కులో వున్న శుక్రవారపు తోటకు వెళ్లిన తరువాత మధ్యాహ్నం 3 గంటలకు పసుపు, చందనం మొదలగు ద్రవ్యాలతో అభిషేకం జరుగుతుంది. శుక్రవారం రోజు ఉంజల్ సేవ తరువాత గ్రామోత్సవం జరుగుతుంది. శనివారం ఉదయం పుష్పాంజలి సేవగా పద్మాలతో మూలమూర్తికి పుష్ప అర్చన జరుగుతుంది. నక్షత్రోత్సవాలు  ప్...

Karthika Masam: కార్తీకమాసం ఈ నెలరోజులూ ఏం చేయాలి - ఏం చేయకూడదు

Image
  కృతయుగంతో సమానమైన యుగం, వేదాలకు సమానమైన శాస్త్రం, గంగకు సమానమైన నది, కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు. కార్తీక మాసం శివుడికి, మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. కార్తీక పురాణంలో కార్తీక సోమవారం,  జ్వాలాతోరణం  మహాశివుడి ప్రాముఖ్యతను తెలియజేస్తే  బలి పాడ్యమి, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి శ్రీ మహావిష్ణువు  ప్రాముఖ్యతను స్పష్టంగా తెలియజేస్తాయి. కార్తీక పురాణం లో కూడా మొదటి 15 అధ్యాయాలు ఈశ్వరుడి ప్రాముఖ్యతను, ఆఖరి 15 అధ్యాయాలు శ్రీహరి ప్రాధాన్యతను తెలియజేస్తాయి.  కార్తీక మాసంలో ముఖ్యంగా పాటించాల్సిన నియమాలు స్నానం కార్తీక మాసంలో సూర్యుడు తులా రాశిలో ఉండటం వల్ల నదిలో నదీ ప్రవాహానికి ఎదురుగా నిలబడి స్నానం ఆచరించడం వల్ల శరీరానికి శక్తి కలిగి ఆరోగ్యంగా ఉంటారు. పురాణాల పరంగా కార్తీక నెలరోజులూ సూర్యోదయానికి ముందు నదీస్నానం చేస్తే సకల పాపాలు నశిస్తాయని అంటారు. దీపం ‘దీపం జ్యోతి పరబ్రహ్మం.. దీప జ్యోతి జనార్దన.. దీపో మేహరతు పాపం.. సంధ్యాదీపం నమోస్తుతే!’.దీపమే పరబ్రహ్మం. దీపంలో లక్ష్మీ దేవి ఉందనీ.. దీపం నుంచి వచ్చే తేజస్సులో బ్రహ్మ, విష్ణు,మహేశ్వరులు ఉన్నారనీ పురాణాలు...