Akasha Deepam: కార్తీక మాసంలో ఆలయాల్లో ఆకాశదీపం వెలిగించే ఆంతర్యం ఏమిటి?
ఆకాశంలో ఉయ్యాల ఊగే దీపాన్ని దామోదరునికి సమర్పిస్తున్నాను. ఈ దీపకాంతుల వలే నా ఆనంద భావనలు శాశ్వతత్వాన్ని పొందాలి అని ప్రార్థిస్తూ ఆకాశ దీపారాధన చేస్తారు. కీటకాలు, పక్షులు, అభాగినులై పుణ్యలోకాలకు చేరలేని సమస్త జీవజాలానికి ఆకాశదీప దర్శనం సద్గతులు కలిగిస్తుంది. శివాలయాల్లో ధ్వజస్తంభానికి ఆకాశదీపం కడతారు. మూడు సిబ్బెలలో దీపాలు వెలిగించి ధ్వజస్తంభం పైకి చేర్చుతారు. సాయంకాలంలో నువ్వుల నూనెతో ఆకాశ దీపారాధన చేస్తే రూప, సౌందర్య, సౌభాగ్య సంపదలు వృద్ధి చెందుతాయి.
Comments
Post a Comment