Karthika Deepam: కార్తిక దీపారాధన ప్రాశస్త్యం ఏమిటీ?

  • కార్తికంలో దీపం వెలిగించినవారు విద్యావంతులు, జ్ఞానవంతులు, ఆయుష్మంతులవుతారు. మోక్షాన్ని పొందుతారు. సాయంత్రం శివాలయంలో దీపం వెలిగిస్తే అనంతమైన పుణ్యం లభిస్తుంది. అప్రయత్నంగా అయినా.. భక్తిభావన లేకపోయినా దీపం వెలిగించినందువల్ల అనంత పుణ్యఫలం వస్తుంది. ఇదే ఫలితం విష్ణుభక్తులకు కూడా వస్తుంది. 
  • కార్తికమాసం నెల రోజులూ దీపాలు పెట్టటం సంప్రదాయం.. ఆచార విధి కూడా. 
  • ఏదైనా కారణం వల్ల 30 రోజులు దీపం పెట్టలేని వారు కనీసం శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ రోజుల్లో అయినా దీపం వెలిగిస్తే, వైకుంఠప్రాప్తి కలుగుతుంది. 
  • కార్తిక మాసంలో శనిత్రయోదశి కన్నా సోమవారం ఎక్కువ ఫలితాన్నిస్తుంది. శనిత్రయోదశి కన్నా కార్తిక పూర్ణిమ వందరెట్లు ఎక్కువ ఫలితాన్నిస్తుంది. 
  • పూర్ణిమ కన్నా బహుళ ఏకాదశి కోటి రెట్లు పుణ్యఫలితాలు అనుగ్రహిస్తుంది. బహుళ ఏకాదశి కన్నా క్షీరాబ్ది ద్వాదశి అతి విస్తారమైన. అనంతమైన ఫలితాన్నిస్తుందని భాగవతం చెబుతోంది. ఈ రోజుల్లో తప్పనిసరిగా దీపారాధన చేయాలి.

Comments

Popular posts from this blog

Magha Puranam Telugu: మాఘ పురాణం 4వ అధ్యాయం- ఓ శునకం విష్ణుమూర్తిని పూజించి చక్రవర్తిగా మారిన కథ

Yadagirigutta Brahmotsavam 2025: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - యాదగిరిగుట్ట

Jubilee hills Venkateswara Temple: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - జూబ్లీహిల్స్

Sri Raghavendra Swamy Jayanti: శ్రీ రాఘవేంద్ర స్వామి జయంతి 2025

Magha Puranam Telugu: మాఘ పురాణం 24వ అధ్యాయం - సహవాస దోషంతో అష్టకష్టాలు పడిన విప్రుని కథ

Bhojana Niyamalu: నిత్యం తినే ఆహారంలో దోషాలు

Ganagapur Datta Swamy Temple: శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయం - గాణగాపురం

Bhadrapada Masam: భాద్రపద మాసం 2024

Pournami Garuda Seva: తిరుమల పౌర్ణమి గరుడ సేవ 2024 తేదీలు

Govatsa Dwadasi: గోవత్స ద్వాదశి