Thumburu Theertham: తుంబుర తీర్థం - తిరుమల
- శ్రీవారి ఆలయానికి ఈశాన్య దిశలో 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తుంబుర తీర్థం.
- తిరుమల క్షేత్రంలోని పుణ్య తీర్థాలలో 'తుంబుర తీర్థం' ఒకటిగా కనిపిస్తుంది. ఈ తీర్థంలో స్నానమాచరించడం వలన, సమస్త పాపాలు తొలగిపోయి, మోక్షం కలుగుతుందని స్థల పురాణం చెబుతోంది.
- తుంబురు తీర్థాన్ని ఒకప్పుడు ‘గోనతీర్థం’ అని పిలిచేవారు.
- తుంబుర తీర్థం దట్టమైన శేషాచలం అడవుల్లో ఉంటుంది. ఇక్కడికి వెళ్లడం కష్టసాధ్యం.
- బ్రహ్మర్షి వశిష్ఠుడు ఈ తీర్థంలో స్నానం ఆచరించి పాప విముక్తి పొందారని చెబుతారు.
- ఏటా ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు తుంబుర తీర్థానికి ముక్కోటి ఉత్సవం నిర్వహిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం.
- ఈ సందర్భంగా ముక్కోటి దేవతలు తీర్థంలో స్నానం ఆచరిస్తారని నమ్మకం.
కొన్ని వేల సంవత్సరాల క్రితం తిరుమల కొండల్లో ఒక ప్రళయం వచ్చింది. అప్పుడు ఒక కొండ రెండుగా చీలిపోవడం వల్ల తుంబుర తీర్థం ఏర్పడిందని వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణంలో వైష్ణవ ఖండంలోని వేంకటాచల మహత్యం ద్వారా తెలుస్తోంది. తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఉత్తరదిశలో, సుమారు 16 కిలోమీటర్ల దూరంలో ఉంది తుంబుర తీర్థం. తుంబురుడి పేరు మీద వెలసిన ఈ తీర్థంలోనే స్వామి భక్తురాలైన తరిగొండ వెంగమాంబ తన అవసానదశను స్వామి ధ్యానంలో గడిపిందన్న నిదర్శనాలు నేటికీ అక్కడ ఉన్నాయి.
స్థల పురాణం
పూర్వం 'తుంబురుడు' అనే ఒక గంధర్వుడు మోక్షాన్ని పొందే మార్గాన్ని చెప్పమని మహర్షులను ప్రార్ధించాడు. అప్పుడు మహర్షులు తిరుమలలోని ఈ తీర్థంలో స్నానమాచరించమని గంధర్వునికి సూచించారు. మహర్షులు సూచించిన ప్రకారం ఆ గంధర్వుడు తిరుమల సమీపంలోని ఈ తీర్ధంలో స్నానం చేసి మోక్షాన్ని పొందాడట. 'తుంబురుడు' మోక్షాన్ని పొందిన తీర్థం కనుక, ఈ తీర్థానికి 'తుంబుర తీర్థం' అనే పేరు వచ్చింది. ఈ కారణంగానే తిరుమల వెళ్లిన భక్తులలో కొందరు, ఈ తీర్థానికి చేరుకుని అందులో స్నానమాచరిస్తుంటారు.
Comments
Post a Comment