Skip to main content

Sri Ghati Subramanya Temple: శ్రీ సుబ్రమణ్య స్వామి ఆలయం - ఘాటి

 

కర్ణాటక రాష్ట్రంలో మూడు ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రాలు కలవు. అవి ఆది సుబ్రహ్మణ్య క్షేత్రమైన కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం, మధ్య సుబ్రహ్మణ్య క్షేత్రమైన ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రం, అంత్య సుబ్రహ్మణ్య క్షేత్రమైన నాగలమడక సుబ్రహ్మణ్య క్షేత్రం. ఈ మూడూ కలిపితే ఒక సర్పాకారం ఏర్పడుతుంది. ఈ మూడు క్షేత్రాలను ఎవరు దర్శించి స్వామిని ఆరాధిస్తారో, వారికి ఉన్న సకల కుజ, రాహు, కేతు దోషాలు, సకల నవగ్రహ దోషాల నుంచి పరిహారం లభించి, స్వామి అనుగ్రహంతో సకల అభీష్టాలు నెరవేరుతాయని విశ్వాసం.

ఘాటి సుబ్రమణ్య క్షేత్రం బెంగుళూరు నగరానికి 60 కి.మీ దూరంలో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రానికి 600 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. ఈ ఆలయాన్ని మొదట సండూర్‌లోని కొన్ని ప్రాంతాలను పాలించిన ఘోర్‌పడే పాలకులు అభివృద్ధి చేశారు.

ఆలయ విశేషాలు

ఘాటి సుబ్రమణ్య ఆలయంలోని ముఖ్య విశేషమేమిటంటే గర్భాలయంలోని ప్రధాన దైవం కార్తికేయుడు, నరసింహ స్వామితో కలిసి కొలువై ఉంటారు. పురాణాల ప్రకారం, ఈ రెండు విగ్రహాలు భూమి నుండి ఉద్భవించాయని విశ్వాసం. స్వయంభువుగా వెలసిన ఏడు తలల నాగుపాముతో ఉన్న కార్తికేయ విగ్రహంకు వెనుక వైపున నరసింహ స్వామి విగ్రహం ఉంటుంది. కార్తికేయుని విగ్రహం తూర్పు ముఖంగా ఉండగా నరసింహుని విగ్రహం పడమర దిశగా ఉంటుంది. భక్తులు కార్తికేయుని, నరసింహ స్వామిని ఏకకాలంలో దర్శించేలా గర్భగుడిలో వెనుక భాగంలో భారీ అద్దాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు.

ఆలయ స్థల పురాణం

సుబ్రహ్మణ్యుడు ఘాటికాసురుడు అనే రాక్షసుడిని ఈ ప్రాంతంలో సంహరించాడని అందుకే ఈ ప్రాంతానికి ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రమని పేరు వచ్చిందని ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఘాటికాసురుని సంహరించిన తర్వాత సుబ్రహ్మణ్యుడు ఇక్కడే సర్ప రూపంలో తపస్సు చేసుకుంటున్నాడని అంటారు. అలాగే విష్ణుమూర్తి వాహనం అయిన గరుడుడు సర్పాలకు శత్రువు కాబట్టి గరుడుని వల్ల ఏ ఆపద రాకుండా సుబ్రహ్మణ్యుడు విష్ణువును ప్రార్ధించగా స్వామి ఇక్కడే నరసింహావతారంలో సర్పాలకు రక్షకుడుగా వెలిశాడని స్థలపురాణం చెబుతోంది.

ఘాటి సుబ్రమణ్య క్షేత్ర మహాత్యం

ఈ ఆలయంలో సంతానం లేని దంపతులు కుజ దోషం, నాగప్రతిష్ట, సర్ప దోషం వంటి పూజలు జరిపించుకోవడం ద్వారా సంతానం కలుగుతుందని విశ్వాసం. అలా సంతానం కలిగిన దంపతులు ఆలయ ప్రాంగణంలో నాగుల విగ్రహాన్ని ప్రతిష్టించడం సంప్రదాయం. ఘాటి సుబ్రమణ్య ఆలయ ప్రాంగణంలో వేలకొద్దీ నాగుల విగ్రహాలను దర్శించుకోవచ్చు.

పండుగలు

ఘాటి సుబ్రమణ్య దేవాలయంలో ప్రతి మాసంలో వచ్చే శుద్ధ షష్టి రోజు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు జరుగుతాయి. ఆషాఢ మాసంలో వచ్చే ఆడి కృత్తిక, శ్రావణ మాసంలో వచ్చే నాగుల పంచమి, కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి, ఇక మార్గశిర మాసంలో వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠి వంటి విశేష పర్వదినాల్లో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు, జాతరలు జరుగుతాయి. ఈ ఆలయంలో విశేషంగా జరుపుకునే మరో పండుగ నృసింహ జయంతి. ఈ ఉత్సవాలు చూడటానికి కర్నాటక రాష్ట్రంలోని భక్తులతో పాటు పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర. కేరళ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విశేషంగా తరలి వస్తారు.

పశువుల సంత

ఘాటి సుబ్రమణ్య క్షేత్రంలో డిసెంబర్‌ నెలలో జరిగే పశువుల సంత చాలా ప్రసిద్ధి చెందింది. ఈ సందర్భంగా పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్రతో పాటు కర్ణాటకలోని అనేక ప్రాంతాల రైతులు తమ తమ పశువులతో ఈ సంతలో పాల్గొంటారు.

ఎలా చేరుకోవచ్చు

బెంగుళూరు యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్ నుంచి ఘాటి సుబ్రమణ్య క్షేత్రాన్ని చేరుకోవడానికి అనేక బస్సులు అందుబాటులో ఉంటాయి.

Comments

Popular posts from this blog

Chollangi Amavasya: చొల్లంగి అమావాస్య

పుష్యమాసానికి చివరి రోజైన అమావాస్యని చొల్లంగి అమావాస్య అని అంటారు. కాకినాడ నగరం నుంచి యానాం వెళ్ళేదారిలో  జగన్నాధపురం వంతెనకు నాలుగు కిలోమీటర్ల దూరంలో చొల్లంగి గ్రామం ఉంది.  అక్కడే గోదావరి నది ఏడుపాయలలో ఒక్కటైనా తులాభాగ్య సముద్రంలో కలుస్తుంది. తులాభాగ్య మహర్షి తీసుకువచ్చిన  ఈ పాయ సముద్రంలో కలిసిన రోజు పుష్య అమావాస్య. సప్తసాగర యాత్ర చేసేవారు చొల్లంగి అమావాస్య నుంచి ప్రారంభిస్తారు. పుష్య అమావాస్యకు చొల్లంగి తీర్థంలో అప్పన్న ఎద్దుల్ని ఊరేగిస్తారు.  గోదావరి ఏడుపాయలు సముద్రంలో కలిసే ప్రాంతాలలో స్నానం చేస్తూ పదిహేను రోజుల తరువాత వచ్చే పౌర్ణమినాడు అంతర్వేది వద్ద స్నానం చేస్తారు.  మాఘ పౌర్ణమి రోజు జరిగే అంతర్వేది తీర్థం ముందే చొల్లంగి తీర్థం నిర్వహిస్తారు. బంగారులేడి రూపంలో మారీచుని తరుముకుంటూ వచ్చిన రామచంద్రమూర్తి వేసిన బాణం మారీచుడికి తగిలింది. వాడి మొండెం తూరంగిలో, తల కోరంగిలో. రాముడు బాణం రెండింటికి మధ్య చొల్లంగిలో పడింది అంటారు. ఇదే రోజు పరమశివుడు నందీశ్వరుడికి మోక్షం ప్రసాదించాడు అని చెబుతారు. చొల్లంగిలో వందయేళ్ల క్రితం నిర్మించిన శ్రీబాలా త్రిపురసుందరి దేవి సమేత ...

Alampur Jogulamba: అలంపూర్ జోగులాంబ బ్రహ్మోత్సవం 2025

అష్ఠాదశ శక్తిపీఠాలలో అయిదోది అలంపురం జోగులాంబ అమ్మవారి ఆలయం సతీదేవి పై వరుస దంతాలు పడిన చోటు.  జోగులాంబ అంటే యోగులకు, బిక్షువులకు అమ్మ. ఈ క్షేత్రంలో ప్రతి ఏటా మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఏడు రోజులు ఉత్సవాలు జరుగుతాయి. శ్రీ పంచమి సందర్భంగా అమ్మవారికి యాగశాలలో నిత్యహోమాలు, మహా పూర్ణాహుతి, కలశ ఉద్వాసన, అమ్మవారికి పంచామృత అభిషేకాలు, సహస్ర ఘటాభిషేకం, నిజరూప దర్శనం ఉంటాయి. శ్రీ పంచమి రోజు అమ్మవారిని దర్శిస్తే సర్వపాపాలు తొలగిపోతాయి. శ్రీ పంచమి రోజు మాత్రమే అమ్మవారి నిజరూప దర్శనం ఉంటుంది. అదే రోజు సాయంత్రం స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం నిర్వహిస్తారు.  జనవరి  30 నుండి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం  అవుతాయి.

Shattilla Ekadasi: షాట్ తిల ఏకాదశి

పుష్య మాసంలో వచ్చే బహుళ ఏకాదశినే షట్తిల ఏకాదశి అంటారు. ఈ రోజు తలస్నానం చేసేటప్పుడే నువ్వుల పిండిని ఒంటికి రాసుకుని స్నానం చేయాలి. స్నానం తరువాత తిల తర్పణం వదలాలి. తెల్ల నువ్వులతో దేవతలకు నివేదన చేయాలి. నల్ల నువ్వులతో పితృ దేవతలకి తర్పణం వదలాలి. నువ్వులు నీళ్ళలొ వేసుకుని ఆ నీరు తాగాలి. ఒక రాగి లేదా కంచు పాత్రలో నువ్వులు పోసి దానం చేయాలి. నువ్వులు దేవుడికి నివేదన చేసి, అందరికి నువ్వుల ప్రసాదం పెట్టాలి. ఏకాదశి వ్రతం అయిన తర్వాత నువ్వుల ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకుని పక్కనపెట్టి ద్వాదశి రోజున పారణ తరువాత తినాలి. షట్ అంటే ఆరు. తిల నువ్వులు. షట్తిల ఏకాదశి రోజున నువ్వులతో ఆరు విశిష్ఠ కార్యక్రమాలు నిర్వహించడం శ్రేయస్కరమని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఈ ఏకాదశికి షట్తిల ఏకాదశి అని పేరు వచ్చింది. నువ్వులతో స్నానం(తిలాస్నానం), స్నానానంతరం నువ్వులముద్ద చేసి ఆ చూర్ణాన్ని శరీరానికి పట్టించడం ఇంటిలో తిల హోమం నిర్వహించడం పితృ దేవతలకు తిల ఉదకం సమర్పించడం నువ్వులు కాని, నువ్వుల నూనె కాని దానం ఇవ్వడం చివరగా తిలాన్నం భుజించడం. (బియ్యం ఉడికే సమయంలో నువ్వులు వేస్తే అది తిలాన్నం) ఈ రోజున తిలలతో ఈ ఆరు కార్యక్...

Guru Dwadasi: గురు ద్వాదశి

  గురు ద్వాదశి ని  ఆశ్వయుజమాసం  కృష్ణపక్షం 12వ  రోజున  జరుపుకుంటారు. ఇది మహారాష్ట్ర లో ప్రముఖంగా జరుపుకుంటారు. ఉత్తర భారతదేశం ఇది కార్తీక మాసం లో వస్తుంది.  ఇదే రోజు గోవత్స ద్వాదశిని కూడా జరుపుకుంటారు.  దత్త అవతారమైన శ్రీ పాద శ్రీ వల్లభ ఆరాధన ఉత్సవాలు జరుగుతాయి. కొన్ని ప్రాంతాలలో ఈ రోజు నుంచి దీపావళి సంబరాలు మొదలు అవుతాయి. గురుద్వాదశి దత్తాత్రేయ స్వామిని ఆరాధించే వారికీ చాల ముఖ్యమైన రోజు.  శ్రీ పాద శ్రీ వల్లభుడు కలియుగం లో మొదటి దత్త అవతారం.  ఈయన జన్మస్థలం తూర్పు గోదావరి జిల్లాలో ని పిఠాపురం.ఇది ఆంధ్రప్రదేశ్ లో వున్నది ఈయన ఆశ్వయుజ బహుళ ద్వాదశి రోజున అవతారం సమాప్తి కావించారు.  గురుద్వాదశి ని కర్ణాటకలో ని గంగాపూర్  దత్తాత్రేయ క్షేత్రం లో ఘనంగా నిర్వహిస్తారు. కొంత మంది ఈ రోజు గురుచరిత్రని పారాయణ చేస్తారు.   2024: అక్టోబరు 29.

Lord Brahma Temples: బ్రహ్మ దేవుని ఆలయాలు

పుష్కర్ : రాజస్థాన్ , అజ్మీర్ బ్రహ్మ చేతిలో పద్మం పడిన చోటు, సావిత్రి, గాయత్రీ మాతలతొ వెలసిన స్వామివారు దేశంలో బ్రహ్మ దేవునికి అతి ప్రముఖ స్థలం. ప్రతి సంవత్సరం పెద్ద ఉత్సవం జరుగుతుంది. కుంభకోణం : తమిళనాడు తిరుకొండియూర్ ,తమిళనాడు పార్సె, గోవా చేబ్రోలు : గుంటూరు జిల్లాలో చతుర్ముఖ బ్రహ్మ ఆలయం , ఆంధ్రప్రదేశ్ ఖజురహో, మధ్యప్రదేశ్ సరస్వతి సమేత  చతుర్ముఖ బ్రహ్మ ఆలయం తమిళనాడు , చిదంబరం నటరాజ స్వామి ఆలయంలో కేరళ : తిరువల్లం తమిళనాడు : కొడిముడి తెలంగాణ : పిల్లలమర్రి, నల్గొండ తెలంగాణ : అలంపురం, బాల బ్రహేశ్వరాలయంలో గుజరాత్ : నాగరత, ఖేదా జిల్లా హరిద్వార్ , గంగానది తీరం త్రిపుర : అగర్తలా, చతుర్దశ దేవత మందిరంలో తెలంగాణ : ధర్మపురి, కరీంనగర్ జిల్లా తమిళనాడు : శుచింద్రం, కన్యాకుమారి గుజరాత్ : సిందార, ద్వారకా బద్రీనాథ్, బ్రహ్మ కపాలం ఆంధ్రప్రదేశ్ : శ్రీకాళహస్తిలో

Magha Month Importance: మాఘ మాసం విశిష్టత

చంద్రుడు మఘ నక్షత్రాన ఉండే మాసం మాఘమాసం. ''మఘం' అంటే యజ్ఞం యజ్ఞయాగాలు చేయడానికి ఈ మాసం శ్రేష్ఠమైనదిగా పండితులు చెబుతారు. ఈ మఘాధిపత్యాన ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగే మాసం గనుక దీనిని మాఘమాసం అంటారు. అఘం అనే పదానికి సంస్కృతంలో పాపం అని అర్థం. మాఘం అంటే పాపాలను' నశింప చేసేది అనే అర్థం ఉంది. ఈ మాసం మాధవ ప్రీతికరమని శాస్త్ర వచనం. ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి ఉదయకాలపు స్నానాలు చేయటం ఓ వ్రతంగా ఉంది. మాఘంలో వీలునుబట్టి నది, చెరువు, మడుగు, కొలను. బావుల వద్ద స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన, నువ్వులతో హోమం, నువ్వుల దానం. నువ్వుల భక్షణంలాంటివి చేయదగినవిగా పలు గ్రంథాలు చెబుతున్నాయి. మాఘమాసంలో శుద్ధ విదియనాడు బెల్లం ఉప్పు దానం చేయటం మంచిది. దీంతోపాటు పార్వతీ పూజ, లలితావ్రతం హరతృతీయ వ్రతం చేస్తుంటారు. శుద్ద చవితి రోజున ఉమా పూజ, వరదా గౌరీ పూజ, గణేశ పూజ చెయ్యడం, మొల్ల పువ్వులతో శివపూజ చెయ్యడం మంచిది. ఈ చవితినాడు చేసే తిలదానానికి గొప్ప పుణ్యఫలం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. శుద్ధ పంచమిని శ్రీపంచమి...

Pregnant Women: భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త పాటించాల్సిన ఆచారాలేంటి?

 హిందూ సంప్రదాయం ప్రకారం భార్య గర్భవతిగా ఉన్నప్పుడు తప్పనిసరిగా భర్త పాటించాల్సిన ఆచారాలు కొన్ని ఉన్నాయి.  అవేంటంటే.. భార్య కోరిన కోరికలు తీర్చాలట. అలాగే భార్య సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. ఇలా చేస్తే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాడట.భార్య గర్భవతి అయినప్పటి నుంచి బిడ్డను ప్రసవించే వరకూ పొరపాటున కూడా సముద్రయానం చేయడం కానీ.. సముద్రంలో స్నానం చేయడం వంటివి చేయకూడదట.  అలాగే కట్టెలు కొట్టడం కానీ చెట్లను నరకడం కానీ చేయకూడదట.  అలాగే భార్య గర్బవతి అయిన నాటి నుంచి కటింగ్ చేయించుకోకూడదట. భార్యకు 8 నెలలు వచ్చినప్పటి నుంచి షేవింగ్ కూడా చేసుకోకూడదు.  మృతదేహాన్ని మోయడం.. శవం వెంట నడవడం వంటివి కూడా చేయకూడదు.  గర్భిణి విదేశీ పర్యటనలు చేయడం.. భార్యను విడిచిపెట్టి భర్త కూడా దూర ప్రయాణాలు చేయకూడదు.  7 నెలలు దాటినప్పటి నుంచి తీర్థయాత్రలకు వెళ్లడం.. తలనీలాలు సమర్పించడం వంటివి చేయకూడదు.  పూర్తిగా పండని పండ్లు, విచ్చని పూలు కోయకూడదు.  భార్య గర్భిణిగా ఉన్నప్పుడు మనం చెప్పిన ఆచారాలన్నింటినీ తప్పక పాటించాలట. గ్రామాల్లో అయితే కొన్ని ఆచారాలు నేటికీ పాటిస్తున్నారు.

Bikkavolu Ganapati Temple: శ్రీ లక్ష్మి గణపతి ఆలయం - బిక్కవోలు

  ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో సామర్లకోటకు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో సామర్లకోట నుంచి అనవర్తికి వెళ్లే మార్గంలో బిక్కవోలు ఉంది. 9-10 శతాబ్దాలలో ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన చాళుక్యరాజుల రాజధాని నగరంగా బిక్కవోలు విరాజిల్లింది. ఈ సమయంలో బిక్కవోలుకు బిరుదాంకినవోలు, బిరుదాంకపురం అనే పేర్లు ఉండేవని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. బిరుదాంకినవోలు అనేది కాలక్రమంలో ప్రజల వాడుకలో మార్పు చెంది బిక్కవోలు అయింది. స్థల పురాణం పూర్వం ఈ ప్రాంతంలో ఒక మోతుబరి రైతు నివసిస్తుండేవాడు. వ్యవసాయం, పశుపాలన వంటి వృత్తులను నిర్వహిస్తూ పరోపకారం చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాదు. ఆయనకు ఆవులమంద ఒకటి ఉండేది. దానిని పశువుల కాపరి ఒకడు, ప్రతిరోజు పచ్చిక బయళ్లకు తోలుకొని పోయి మేపుకుని వస్తూ ఉండేవాడు. అందులో ఒక అవు మంద నుంచి విడిపోయి.. కొంతదూరం గడ్డి మేస్తూ వెళ్లి ఒక ఎత్తైన ప్రాంతానికి చేరుకొని పాలు జారవిడిచి తిరిగి మండలో వచ్చి కలిసేది, సాయంత్రం ఇల్లు చేరిన ఆవు ప్రతిరోజు పాలు ఇవ్వకపోవడంతో రైతుకు అనుమానం కలిగి ఆవును గమనించవలసినదిగా పశువుల కాపరికి తెలిపాడు. పశువుల కాపరి మరునాడు మేతకు ఆవులను తోలుకొని పోయి గమనించసాగ...

Govatsa Dwadasi: గోవత్స ద్వాదశి

  గోవత్స  ద్వాదశి అనగా మన ఆవులు లేదా గోవులు కోసం జరుపుకునే పండుగ.  ఆశ్వయుజ మాసం లో కృష్ణపక్ష ద్వాదశి రోజు ఈ పండుగ జరుపుకుంటారు  ఇది సాధారణంగా అక్టోబర్ లేదా నవంబర్ మాసాలలో వస్తుంది.  కొని చోట్ల దీనిని నందిని వ్రతం అని కూడా పిలుస్తారు. దీని తరువాత రోజు ధనత్రయోదశి దీనిని గురించి భవిష్య పురాణం లో కూడా చెప్పబడింది. ఈ రోజు ముఖ్యంగా గోవులను పూజిస్తారు. హిందూ సంప్రదాయం ప్రకారం గోవులు ఎంతో పవిత్రమైనవి, మన రోజు వారి జీవితం లో కూడా అవి ఒక  భాగంగా చాల మంది చూసుకుంటారు.  ఉత్తర భారతదేశంలో అయితే ఈ పండుగను చాల బాగా  జరుపుకుంటారు .   సంతానం లేని వారు ఈ రోజు వ్రతం  ఆచరిస్తారు. ఉత్తర భారత దేశం లో కొంత మంది వ్యాపారులు ఈ రోజు నుంచి కొత్త అకౌంట్ పుస్తకాలూ రాస్తారు. ఈ రోజు ఎవరైతే గోవును పూజిస్తారో వారికీ మంచి ఆరోగ్యం తో పాటు సుఖసంపదలు కలుగుతాయి అని భావిస్తారు.  ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురం లో శ్రీ పాద శ్రీ వల్లభ ఆరాధన ఉత్సవం జరుగుతుంది.  ఉదయాన్నే  గోవులకు స్నానం చేసి పసుపు కుంకుమతో అలంకరిస్తారు. గోవులు అంటే శ్రీ కృష్ణడుకి ఎంతో ఇష్టం కన...