- అష్ఠాదశ శక్తిపీఠాలలో అయిదోది అలంపురం జోగులాంబ అమ్మవారి ఆలయం
- సతీదేవి పై వరుస దంతాలు పడిన చోటు.
- జోగులాంబ అంటే యోగులకు, బిక్షువులకు అమ్మ.
- ఈ క్షేత్రంలో ప్రతి ఏటా మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఏడు రోజులు ఉత్సవాలు జరుగుతాయి.
- శ్రీ పంచమి సందర్భంగా అమ్మవారికి యాగశాలలో నిత్యహోమాలు, మహా పూర్ణాహుతి, కలశ ఉద్వాసన, అమ్మవారికి పంచామృత అభిషేకాలు, సహస్ర ఘటాభిషేకం, నిజరూప దర్శనం ఉంటాయి.
- శ్రీ పంచమి రోజు అమ్మవారిని దర్శిస్తే సర్వపాపాలు తొలగిపోతాయి.
- శ్రీ పంచమి రోజు మాత్రమే అమ్మవారి నిజరూప దర్శనం ఉంటుంది. అదే రోజు సాయంత్రం స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం నిర్వహిస్తారు.
పుష్యమాసానికి చివరి రోజైన అమావాస్యని చొల్లంగి అమావాస్య అని అంటారు. కాకినాడ నగరం నుంచి యానాం వెళ్ళేదారిలో జగన్నాధపురం వంతెనకు నాలుగు కిలోమీటర్ల దూరంలో చొల్లంగి గ్రామం ఉంది. అక్కడే గోదావరి నది ఏడుపాయలలో ఒక్కటైనా తులాభాగ్య సముద్రంలో కలుస్తుంది. తులాభాగ్య మహర్షి తీసుకువచ్చిన ఈ పాయ సముద్రంలో కలిసిన రోజు పుష్య అమావాస్య. సప్తసాగర యాత్ర చేసేవారు చొల్లంగి అమావాస్య నుంచి ప్రారంభిస్తారు. పుష్య అమావాస్యకు చొల్లంగి తీర్థంలో అప్పన్న ఎద్దుల్ని ఊరేగిస్తారు. గోదావరి ఏడుపాయలు సముద్రంలో కలిసే ప్రాంతాలలో స్నానం చేస్తూ పదిహేను రోజుల తరువాత వచ్చే పౌర్ణమినాడు అంతర్వేది వద్ద స్నానం చేస్తారు. మాఘ పౌర్ణమి రోజు జరిగే అంతర్వేది తీర్థం ముందే చొల్లంగి తీర్థం నిర్వహిస్తారు. బంగారులేడి రూపంలో మారీచుని తరుముకుంటూ వచ్చిన రామచంద్రమూర్తి వేసిన బాణం మారీచుడికి తగిలింది. వాడి మొండెం తూరంగిలో, తల కోరంగిలో. రాముడు బాణం రెండింటికి మధ్య చొల్లంగిలో పడింది అంటారు. ఇదే రోజు పరమశివుడు నందీశ్వరుడికి మోక్షం ప్రసాదించాడు అని చెబుతారు. చొల్లంగిలో వందయేళ్ల క్రితం నిర్మించిన శ్రీబాలా త్రిపురసుందరి దేవి సమేత ...
Comments
Post a Comment