పుష్య మాసంలో వచ్చే బహుళ ఏకాదశినే షట్తిల ఏకాదశి అంటారు. ఈ రోజు తలస్నానం చేసేటప్పుడే నువ్వుల పిండిని ఒంటికి రాసుకుని స్నానం చేయాలి. స్నానం తరువాత తిల తర్పణం వదలాలి. తెల్ల నువ్వులతో దేవతలకు నివేదన చేయాలి. నల్ల నువ్వులతో పితృ దేవతలకి తర్పణం వదలాలి. నువ్వులు నీళ్ళలొ వేసుకుని ఆ నీరు తాగాలి. ఒక రాగి లేదా కంచు పాత్రలో నువ్వులు పోసి దానం చేయాలి. నువ్వులు దేవుడికి నివేదన చేసి, అందరికి నువ్వుల ప్రసాదం పెట్టాలి. ఏకాదశి వ్రతం అయిన తర్వాత నువ్వుల ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకుని పక్కనపెట్టి ద్వాదశి రోజున పారణ తరువాత తినాలి.
షట్ అంటే ఆరు. తిల నువ్వులు. షట్తిల ఏకాదశి రోజున నువ్వులతో ఆరు విశిష్ఠ కార్యక్రమాలు నిర్వహించడం శ్రేయస్కరమని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఈ ఏకాదశికి షట్తిల ఏకాదశి అని పేరు వచ్చింది.
- నువ్వులతో స్నానం(తిలాస్నానం),
- స్నానానంతరం నువ్వులముద్ద చేసి ఆ చూర్ణాన్ని శరీరానికి పట్టించడం
- ఇంటిలో తిల హోమం నిర్వహించడం
- పితృ దేవతలకు తిల ఉదకం సమర్పించడం
- నువ్వులు కాని, నువ్వుల నూనె కాని దానం ఇవ్వడం
చివరగా తిలాన్నం భుజించడం. (బియ్యం ఉడికే సమయంలో నువ్వులు వేస్తే అది తిలాన్నం)
ఈ రోజున తిలలతో ఈ ఆరు కార్యక్రమాలు చేసినవారికి పితృ దేవతలు, శ్రీమహా విష్ణువు సంతసించి ఆశీర్వదిస్తారు. సర్వ శుభాలు చేకూరుతాయి.
2025: జనవరి 25
Comments
Post a Comment